ఢిల్లీ : జమ్మూ కాశ్మీర్‌లో విషాదం చోటు చేసుకుంది. పూంచ్‌లో జిల్లాలో సైనికులతో వెళుతున్న వాహనం 350 అడుగుల లోతులో ఉన్న లోయలో పడింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు జవాన్లు మృతి చెందారు. ఎనిమిది మంది గాయపడినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.
11 మద్రాస్ లైట్ ఇన్‌ఫాంట్రీ (11 ఎంఎల్‌ఐ)కి చెందిన వాహనం నీలం హెడ్‌క్వార్టర్స్ నుండి బాల్నోయి ఘోరా పోస్ట్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న 11 ఎంఎల్‌ఐ క్విక్ రియాక్షన్ టీమ్ సంఘటన స్థలానికి చేరుకుంది. గాయపడిన జవాన్లను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
🚨 SAD NEWS! 5 soldiers lost their lives after an army vehicle met with an accident in the Poonch sector.
Rescue operations are ongoing, and the injured personnel are receiving medical care.
PRAYERS 🙏 pic.twitter.com/oltXwzFCIH— Megh Updates 🚨™ (@MeghUpdates) December 24, 2024
Comments
Please login to add a commentAdd a comment