నందిగాం: మండలంలోని నౌగాంకు చెందిన గోపాల్ పాత్రో(35) జమ్మూకాశ్మీర్‌లో ఆర్మీ హవల్దార్ క్లర్క్‌గా పనిచేస్తూ ఈ నెల 3న గుండెపోటుతో మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కుంటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పాత్రో మాధవరావు, అన్నపూర్ణల కుమారుడు గోపాల్ 2006లో ఆర్మీలో చేరి ప్రస్తుతం జమ్మూలో విధులు నిర్వహిస్తున్నారు. భార్య త్రివేణి, ఇద్దరు పిల్లలు మోక్షిత్, వేదశ్రీతో కలిసి జమ్మూలోనే నివాసం ఉంటున్నారు.
గురువారం యదావిధిగా ఇంటి నుంచి విధులకు వెళ్లారు. ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అధికారులు విషయాన్ని భార్యకు తెలియజేసి మృతదేహాన్ని స్వగ్రామమైన నౌగాంకు శనివారం తీసుకుచ్చారు. ఆర్మీ ఉన్నతాధికారులు గోపాల్ భార్యకు జాతీయ జెండా అందించి గార్డ్ ఆఫ్ హానర్ అందించారు. గోపాల్ తండ్రి మాధవరావు గతంలోనే మరణించగా, తల్లి అన్నపూర్ణ కుమారుడు మృతి చెందాడనే విషయం తెలిసి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment