ముగ్గురు ముష్కరుల గుర్తింపు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని పూంఛ్ జిల్లాలో ఈ నెల 4వ తేదీన భారత వైమానిక దళం కాన్వాయ్‌పై దాడికి పాల్పడిన ముగ్గురు ముష్కరులను భద్రతా బలగాలు గుర్తించాయి. ఆ ఘటనలో విక్కీ పహాడే అనే కార్పొరల్ మృత్యువాతపడగా ఆయన సహచరులు మరో నలుగురు గాయాలపాలయ్యారు.
ఉగ్రవాదులను పాక్ ఆర్మీ మాజీ కమాండో ఇలియాస్, పాక్‌కే చెందిన ఉగ్రవాది హదూన్, లష్కరే తోయిబా కమాండర్ అబూ హమ్జా(30) అని తేలింది. కాల్పుల సమయంలో వీరివద్ద అత్యాధునిక అసాల్ట్ రైఫిళ్లయిన అమెరికా తయారీ ఎం4, రష్యా తయారీ ఏకే–47 ఉన్నట్లు తేలింది. స్థానికుల సమాచారం మేరకు ముగ్గురి పోలికలున్న చిత్రాలతో అధికారులు పోస్టర్లను విడుదల చేశారు. వీరిలో హమ్జా ఆచూకీ తెలిపిన వారికి రూ.10 లక్షల రివార్డు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment