terrarists
-
ఐఏఎఫ్ కాన్వాయ్‌పై దాడి ఘటన..
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని పూంఛ్ జిల్లాలో ఈ నెల 4వ తేదీన భారత వైమానిక దళం కాన్వాయ్‌పై దాడికి పాల్పడిన ముగ్గురు ముష్కరులను భద్రతా బలగాలు గుర్తించాయి. ఆ ఘటనలో విక్కీ పహాడే అనే కార్పొరల్ మృత్యువాతపడగా ఆయన సహచరులు మరో నలుగురు గాయాలపాలయ్యారు. ఉగ్రవాదులను పాక్ ఆర్మీ మాజీ కమాండో ఇలియాస్, పాక్‌కే చెందిన ఉగ్రవాది హదూన్, లష్కరే తోయిబా కమాండర్ అబూ హమ్జా(30) అని తేలింది. కాల్పుల సమయంలో వీరివద్ద అత్యాధునిక అసాల్ట్ రైఫిళ్లయిన అమెరికా తయారీ ఎం4, రష్యా తయారీ ఏకే–47 ఉన్నట్లు తేలింది. స్థానికుల సమాచారం మేరకు ముగ్గురి పోలికలున్న చిత్రాలతో అధికారులు పోస్టర్లను విడుదల చేశారు. వీరిలో హమ్జా ఆచూకీ తెలిపిన వారికి రూ.10 లక్షల రివార్డు ప్రకటించారు. -
హైదర్‌పురా కాల్పులపై న్యాయ విచారణ
శ్రీనగర్: కశ్మీర్‌లోని హైదర్‌పురాలో సోమవారం జరిగిన కాల్పుల ఘటనపై లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా న్యాయ విచారణకు ఆదేశించారు. విచారణాధికారిగా శ్రీనగర్ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఖుర్షీద్ అహ్మద్ షాను నియమించారు. హైదర్‌పురాలో ఓ ఇంట్లో జరిగిన ఎన్కౌంటర్లో ఒక పాక్ ఉగ్రవాది, అతడి సహాయకుడు మహ్మద్ అమీర్ మాగ్రే, ఇంటి యజమాని మహ్మద్ అల్తాఫ్ భట్, అందులో అద్దెకు ఉండే ముదాసిర్ గుల్ మృతిచెందారు. మాగ్రే, అల్తాఫ్ భట్, ముదాసిర్ గుల్కు ఉగ్రవాదులతో సంబంధం లేదని వారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మృతదేహాలను అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ, నాలుగు మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించామని పోలీసులు చెప్పారు. మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించాలంటూ నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా శ్రీనగర్‌లో ధర్నా చేశారు. బాధిత కుటుంబాలకు మద్దతుగా హురియత్ కాన్ఫరెన్స్ శుక్రవారం బంద్‌కు పిలుపునిచ్చింది. అల్లర్లు జరుగుతాయన్న అనుమానంతో పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) అధినేత మహబూబా ముఫ్తీని పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. ఆ పార్టీకి చెందిన ఇద్దరు నాయకులను అరెస్టు చేశారు. మహ్మద్ భట్, గుల్ మృతదేహాలను వెలికితీసి, కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. -
భారీ విధ్వంసానికి వ్యూహం: ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: భారీ విధ్వంసానికి వ్యూహ రచన చేసినట్లు అనుమానిస్తున్న నలుగురు ఉగ్రవాదుల్ని భారత జవాన్లు హతమార్చారు. ఈ ఘటన జమ్మూ -నాగ్రోటా టోల్ ప్లాజావద్ద జరిగింది. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం వచ్చిన తర్వాత భద్రతా దళాలు నిఘా పెట్టాయి. దీనిలో భాగంగా ఈ గురువారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులను హతమార్చారు. భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మద్య కాల్పులు గంటల తరబడి జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఒక సైనికుని మెడకు తీవ్రగాయాలయ్యాయి. అతని పరిస్థితి ఇప్పడు నిలకడగా ఉన్నట్లు తెలిసింది. బాన్ టోల్ ప్లాజా వద్ద ఉదయం 5 గంటల సమయంలో వాహనాల తనిఖీ చేస్తున్న సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరపగా భద్రతా దళాలు వాటిని తిప్పికొట్టింది. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు అటవీ ప్రాంతం వైపు పారిపోయారు. ఉగ్రవాదులు జమ్మూలోయ వైపు ప్రయాణిస్తున్న సమయంలో బాన్ టోల్ ప్లాజా వద్ద జరిగిన ఎదురు దాడిలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. భారీ ఆయుధాలు, పేలుడు పదార్ధాలు కల్గిన ట్రక్కును స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదుల వద్ద లభించిన భారీ పేలుడు పదార్థాలతో వారు విధ్వంసానికి వ్యూహ రచన చేసినట్లుగా అనుమానిస్తున్నారు. గత వారం జమ్మూ కాశ్మీర్ షోపియాన్‌లో భద్రతా దళాలు జరిపిన ఎన్కౌంటర్లో ఇద్దరు అల్-బదర్ ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల ఉనికిని తెలుసుకోవడానికి భద్రతా దళాలు జరిపిన సెర్చ్ ఆపరేషన్‌లో ఇద్దర్ని మట్టబెట్టారు. -
దేశంలో పాగాకు అల్‌కాయిదా కుట్ర
న్యూఢిల్లీ/కోల్‌కతా: భారత్‌లో వేళ్లూనుకునేందుకు నిషేధిత అల్‌కాయిదా ఉగ్ర సంస్థ పన్నిన కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) బట్టబయలు చేసింది. కీలక ప్రాంతాల్లో ఉగ్రదాడులు, కొందరు ముఖ్యులను చంపేందుకు సాగుతున్న యత్నాలను భగ్నం చేసింది. పశ్చిమ బెంగాల్, కేరళలలోని పలు ప్రాంతాల్లో దాడులు జరిపి ఈ ముఠాలోని 9 మందిని అరెస్ట్‌చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి అందిన సమాచారం మేరకు, రాష్ట్రాలు పోలీసుల సాయంతో 18, 19 తేదీల్లో కేరళ, బెంగాల్‌లలో దాడులు జరిపి 9 మందిని అరెస్ట్ చేసినట్లు ఎన్ఐఏ ప్రతినిధి తెలిపారు. ముర్షీద్ హసన్, ఇయాకుబ్ బిశ్వాస్, మొసారఫ్ హొస్సేన్ అనే వారిని కేరళలోని ఎర్నాకులంలోను, నజ్ముస్ సకిబ్, అబూ సుఫియాన్, మైనుల్ మొండల్, లియు ఈన్ అహ్మద్, అల్ మమూన్ కమల్, అటిటుర్ రహ్మాన్లను ముర్షీదాబాద్‌లో అరెస్ట్‌చేశారు. ఈ ముఠాకు హసన్ నేతృత్వం వహిస్తున్నాడని చెప్పారు. కేరళలో పట్టుబడిన వారూ బెంగాల్ వాసులే. 11న అల్‌కాయిదా మాడ్యూల్‌పై కేసు నమోదు చేసిన ఎన్ఐఏ, ఇతర దర్యాప్తు సంస్థలతో ఉమ్మడిగా ఈ ఆపరేషన్‌ను చేపట్టింది. అరెస్టయిన వారంతా సామాజిక మాధ్యమాల ద్వారా పాకిస్తాన్‌లోని అల్ కాయిదా ఉగ్రవాదుల బోధనల ప్రభావానికి లోనయ్యారు. ఢిల్లీ సహా దేశంలోని కీలకప్రాంతాల్లో ఉగ్ర దాడులు జరిపి భారీగా ప్రాణనష్టం కలిగించేందుకు, ప్రముఖులను చంపేందుకు పథకం వేశారు. ఇందుకు అవసరమైన డబ్బుతోపాటు ఆయుధాలు..ఆటోమేటిక్ రైఫిళ్లు, పిస్టళ్లు, పేలుడు పదార్థాల కోసం కశ్మీర్‌తోపాటు ఢిల్లీ వెళ్లాలని ఈ ముఠా పథకం వేసింది. అంతేకాకుండా, కశ్మీర్ సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో అల్‌కాయిదా నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నించింది. టపాసులను ఐఈడీ(ఇంప్రోవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్)గా మార్చేందుకు ఈ ముఠా ప్రయత్నిం చిందని సోదాల సందర్భంగా స్వాధీనం చేసుకున్న స్విచ్చులు, బ్యాటరీలను బట్టి తేలిందని ఎన్ఐఏ ప్రతినిధి తెలిపారు. దాడుల్లో జిహాదీ సాహిత్యం, కొన్ని ఆయుధాలు, దేశవాళీ తయారీ తుపాకులు, స్థానికంగా రూపొందించిన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, పేలుడు పదార్థాల తయారీని తెలిపే సమాచారం, డిజిటల్ పరికరాలు లభించాయి. ఆరుగురికి 24 వరకు రిమాండ్ పశ్చిమబెంగాల్లో అరెస్టు చేసిన అల్‌కాయిదా ముఠాలోని ఆరుగురు సభ్యులకు కోల్‌కతాలోని స్పెషల్ ఎన్ఐఏ కోర్టు ఈ నెల 24వ తేదీ వరకు రిమాండ్ విధించింది. వీరిపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఎన్ఐఏ తెలిపింది. బాంబుల తయారీ కేంద్రం బెంగాల్: గవర్నర్ ధన్కర్ పశ్చిమ బెంగాల్‌కు చెందిన అల్‌కాయిదా ఉగ్ర ముఠా సభ్యులను ఎన్ఐఏ అరెస్టు చేయడంపై రాష్ట్ర గవర్నర్ ధన్కర్ ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. బాంబుల తయారీకి రాష్ట్రం కేంద్రంగా మారిందని ధన్కర్ ఆరోపించారు. శాంతి, భద్రతలు దారుణంగా క్షీణించాయన్నారు. మమతా బెనర్జీ ప్రభుత్వం, డీజీపీ ఇందుకు బాధ్యత వహించకతప్పదని పేర్కొన్నారు. -
సరిహద్దులో 230 మంది ఉగ్రవాదులు
న్యూఢిల్లీ: భారత జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో విధ్వంసం సృష్టించేందుకు పాకిస్తాన్ కుట్ర పన్నుతోందని తెలిపారు. ఇందులోభాగంగా సరిహద్దులో 230 మంది ఉగ్రవాదులను పాక్ సిద్ధం చేసిందనీ, వీరిలో కొందరు ఇప్పటికే కశ్మీర్లోకి ప్రవేశించి ఉండొచ్చని వ్యాఖ్యానించారు. కశ్మీర్లో పరిస్థితులు సాధారణ స్థితికి రావడం, లోయ నుంచి రోజుకు 750 ట్రక్కుల ఆపిల్స్ ఎగుమతి కావడంపై పాక్ లోని ఉగ్రమూకలు రగిలిపోతున్నారని దోవల్ వెల్లడించారు. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీరీ యువతకు గొప్ప భవిష్యత్, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. కశ్మీర్లో ఉగ్రవాదాన్ని ఎగదోయడమే పాక్ వద్దున్న ఏకైక అస్త్రమని విమర్శించారు. ఢిల్లీలో శనివారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన దోవల్.. పాక్ వ్యవహారశైలిపై తీవ్రంగా మండిపడ్డారు. టవర్లు ఏర్పాటుచేసిన పాక్.. కశ్మీర్ వద్ద సరిహద్దులో 20 కి.మీ విస్తీర్ణంలో పాక్ ప్రత్యేకంగా కమ్యూనికేషన్ టవర్లను ఏర్పాటు చేసిందని ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ తెలిపారు. ‘‘ఈ టవర్ల సాయంతో కశ్మీర్‌లోని ఉగ్రవాదులతో పాక్‌లోని వారి హ్యాండ్లర్లు సంప్రదింపులు జరుపుతున్నారు. వీరి సంభాషణల్ని మన నిపుణులు గుర్తించారు. ఈ సందర్భంగా పాకిస్తానీ హ్యాండ్లర్ మండిపడుతూ..‘అసలు అన్ని ఆపిల్ ట్రక్కులు రాకపోకలు ఎలా సాగిస్తున్నాయ్? వాటిని మీరు ఆపలేరా? చేతకాకుంటే ఒప్పుకోండి. మీకు తుపాకులకు బదులుగా గాజులు పంపుతాం’ అని రెచ్చగొట్టేలా పంజాబీలో పాక్ యాసలో మాట్లాడాడు. ఇది జరిగిన తర్వాత ఇద్దరు ఉగ్రవాదులు గత శుక్రవారం సోపోర్‌లోని దంగపురా ప్రాంతంలో ప్రముఖ ఆపిల్ వ్యాపారి హమీదుల్లా రాథర్ ఇంటికెళ్లారు. హమీదుల్లా నమాజ్‌కు వెళ్లడంతో ఆగ్రహంతో ఆయన కుటుంబసభ్యులపై పిస్టళ్లతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో హమీదుల్లా కుమారుడు ఇర్షాద్(25), రెండున్నరేళ్ల మనవరాలు అస్మాలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో చిన్నారి అస్మా ఆరోగ్యం విషమంగా ఉండటంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించాం’’ అని దోవల్ వెల్లడించారు. ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దుచేయడాన్ని మెజారిటీ కశ్మీరీలు మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. ఆర్టికల్ 370 ప్రత్యేక హక్కు ఎంతమాత్రం కాదనీ, అతి ప్రత్యేకమైన వివక్షని వ్యాఖ్యానించారు. కశ్మీర్లో ప్రస్తుతం 10 పోలీస్స్టేషన్ల పరిధిలోనే నిషేధాజ్ఞలు అమలవుతున్నాయనీ, ఉగ్రవాదులు సంప్రదింపులు జరపకుండా ఉండేందుకే ఇంటర్నెట్, ఇతర కమ్యూనికేషన్ వ్యవస్థలను స్తంభింపజేశామన్నారు. -
ఆ నలుగురు
న్యూఢిల్లీ: జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ మహమ్మద్ సయీద్, ముంబై ఉగ్రవాద దాడుల నిందితుడు జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీ, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంలను వ్యక్తిగత హోదాలో ఉగ్రవాదులుగా కేంద్ర హోంశాఖ ప్రకటించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నియంత్రణ) సవరణ చట్టం(యూఏపీఏ)–1967కు కీలక సవరణలకు పార్లమెంటు ఆమోదం తెలిపిన ఒక నెలలోనే ఈ నలుగురిని కొత్త చట్టం కింద ఉగ్రవాదులుగా ప్రకటించినట్లు కేంద్ర హోంశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. ఇప్పటివరకు యూఏపీఏ కింద చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన సంస్థలనే ఉగ్రవాదులుగా ప్రకటించేవారు. కానీ కొత్తగా అమల్లోకి వచ్చిన ఈ చట్టం ప్రకారం వ్యక్తుల్ని సైతం ఉగ్రవాదులుగా ప్రకటించే వెసులుబాటు ఉంది. ఈ చట్టం కింద ఉగ్రవాదుల్ని ప్రకటించడం ఇదే మొదటిసారి. ఇప్పటికే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వీరిని అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ముద్రవేసి వారిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. -
నేవీలో హై అలర్ట్
కోయంబత్తూర్/కొచ్చి: భారతీయ నేవీలో హై అలర్ట్ ప్రకటించారు. లష్కరే తోయిబాకు చెందిన ఆరుగురు ముష్కరులు తమిళనాడులోకి చొరబడ్డారన్న ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు శుక్రవారం ప్రారంభించిన నిఘా రెండో రోజూ కొనసాగింది. ‘ఇంటెలిజెన్స్ నుంచి అందిన సమా చారం మేరకు నేవీ.. సముద్రాలు, తీర ప్రాంతాల్లో హై అలర్ట్‌ను విధించింది’అని రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ఆరుగురు ముష్కరులు శ్రీలం క నుంచి సముద్ర మార్గం ద్వారా రాష్ట్రంలోకి చొర బడి వివిధ నగరాలకు వెళ్లినట్లు సమాచారం అందడంతో తమిళనాడులో కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. కోయంబత్తూర్ నగరాన్ని ఇతర రాష్ట్రాలతో కలిపే రోడ్లు, రహదారుల్లో వెళ్లే వాహనాలను ఆర్మీ బలగాలు నిశితంగా తనిఖీలు చేస్తున్నాయని పోలీసులు వెల్లడించారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఎయిర్‌పోర్టుల్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పా రు. గుజరాత్ తీరంలో పాక్ పడవలు గుజరాత్‌లోని కచ్ జిల్లాకు సమీపంలో గల హరామి నాలా ప్రాంతంలో పాక్‌కు చెందిన 2 మత్స్యకారుల పడవలను సరిహద్దు భద్రతాసిబ్బంది శనివారం గుర్తించారు. అవి అనుమానాస్పదంగా ఉండటంతో తనిఖీలు చేపట్టారు. -
పాక్ ‘బ్యాట్’ సైనికుల హతం
శ్రీనగర్: నియంత్రణ రేఖ వెంబడి భారత్ సైనిక పోస్టులపైకి దాడికి దిగి, చొరబడేందుకు పాక్ సైన్యం చేసిన ప్రయత్నాన్ని భారత బలగాలు సమర్థంగా తిప్పికొట్టాయి. ఈ సందర్భంగా భారత సైన్యం జరిపిన కాల్పుల్లో పాక్ బోర్డర్ యాక్షన్ టీం(బీఏటీ)లోని ఐదు నుంచి ఏడుగురు మృతి చెందారని సైన్యం తెలిపింది. జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లా కేరన్ సెక్టార్లో జూలై 31వ తేదీ అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకుందని సైన్యం అధికార ప్రతినిధి కల్నల్ రాజేశ్ కాలియా తెలిపారు. వీరిలో పాక్ కమాండోలతోపాటు ఉగ్రవాదులు కూడా ఉన్నారన్నారు. ఈ ఘటన అనంతరం పాక్ భారీగా సైన్యాన్ని మోహరించిందన్నారు. కశ్మీర్ లోయలో ప్రశాంత వాతావరణాన్ని, అమర్నాథ్ యాత్రను భగ్నం చేసేందుకు పాక్ బలగాలు గత 36 గంటల్లో పలు ప్రయత్నాలు చేశాయని, అప్రమత్తమైన సైన్యం దీటుగా బదులిచ్చిందని కల్నల్ కాలియా చెప్పారు. అదేవిధంగా, శనివారం జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో జైషే మొహమ్మద్‌కు చెందిన నలుగురు కరుడు గట్టిన ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు ఆయన వెల్లడించారు. వారి నుంచి పాక్‌లో తయారైన స్నైపర్ రైఫిల్, ఐఈడీ మందుపాతరను స్వాధీనం చేసుకున్నామన్నా రు. బీఏటీలో సాధారణంగా పాక్ ఆర్మీకి చెందిన స్పెషల్ సర్వీస్ గ్రూప్‌తోపాటు ఉగ్రవాదులు ఉంటారని ఆయన వివరించారు. నలుగురు జైషే ఉగ్రవాదుల హతం జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా, షోపియాన్ జిల్లాల్లో భద్రతా దళాలతో జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో నలుగురు జైషే మొహమ్మద్ (జేఎం) ఉగ్రవాదులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. గత 36 గంటల్లో ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా సోపోర్ పట్టణంలో ఇద్దరు జైషే ఉగ్రవాదులు హతమవ్వగా, మరో ఇద్దరు దక్షిణ కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో శుక్రవారం ప్రారంభమైన ఆపరేషన్‌లో హతమైనట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. బారాముల్లా జిల్లా సోపోర్‌లోని వార్పోరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లుగా లభించిన సమాచారం మేరకు భద్రతా దళాలు శనివారం ఉదయం గాలింపు చర్యలు ప్రారంభించాయి. ఈ క్రమంలో భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ప్రతిగా భద్రతా దళాలు కూడా కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని తెలిపారు. వారిలో ఒకరు బండిపోరాకు చెందిన ఉమర్ షాబాజ్‌గా గుర్తించారు. మరొకరి గుర్తింపు లభించలేదు. ఘటనా స్థలంనుంచి మందుగుండు సామగ్రి, తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, షోపియాన్‌లోని పండూషన్ ప్రాంతంలో శుక్రవారం ప్రారంభమైన మరో ఆపరేషన్‌లో జైషే ఉగ్రవాదులు మంజూర్ భట్, జీనత్ ఇస్లాం నైకూలు హతమయ్యారని ఆ అధికారి తెలిపారు. నైకూ పాకిస్తాన్ జాతీయుడని, జైషే మహమ్మద్ జిల్లా కమాండర్‌గా వ్యవహరిస్తున్నాడని వెల్లడించారు. -
ప్రతి మతంలోనూ ఉగ్రవాదులున్నారు
సాక్షి, చెన్నై: ప్రతి మతంలోనూ ఉగ్రవాదులు ఉన్నారనీ, తాము పవిత్రులమని ఎవ్వరూ చెప్పుకోలేరని మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధ్యక్షుడు కమల్‌హాసన్ శుక్రవారం అన్నారు. అరెస్టుకు తాను భయపడటం లేదనీ, కానీ తనను అరెస్టు చేస్తే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయని ఆయన పేర్కొన్నారు. గాంధీజీని హత్య చేసిన నాథూరాం గాడ్సేనుద్దేశిస్తూ కమల్ దేశంలో తొలి తీవ్రవాది హిందువేననడం వివాదమైంది. శుక్రవారం కోయంబత్తూరులోని సులూరులో కమల్ ప్రచారం చేయాల్సి ఉండగా, ఆదివారం నాటి వ్యాఖ్యల కారణంగా ఆయనకు ప్రచారానికి అనుమతి లభించలేదు. దీంతో కమల్ ట్విట్టర్ ద్వారా ప్రజలను ఓట్లు అడిగారు. తాను ఆ వ్యాఖ్యలు చేయడం అరవకురిచ్చిలోనే తొలిసారి కాదనీ, లోక్‌సభ ప్రచారం సమయంలో చెన్నైలోనే ఇదే మాట అన్నా అప్పుడు ఎవ్వరూ పట్టించుకోలేదని కమల్ చెప్పారు. -
‘విశ్వాస’ ఘాతుకం
న్యూఢిల్లీ: దాయాది దేశాల ప్రజల్లో పరస్పరం విశ్వాసం నెలకొల్పాలన్న సదుద్దేశంతో వాస్తవాధీన రేఖ వెంబడి వాణిజ్యానికి భారత్ ఇచ్చిన అవకాశాన్ని ఉగ్రవాదులు దుర్వినియోగం చేస్తున్నారు. వాస్తవాధీన రేఖకు ఇరువైపుల ఉన్న భారత వ్యతిరేక శక్తులు(హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి నిషేధిత ఉగ్రవాద సంస్థలకు చెందిన వ్యక్తులు) ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని అక్రమ వ్యాపార లావాదేవీలతో విపరీతంగా లాభాలు ఆర్జిస్తున్నారు. ఆ సొమ్ము నంతా భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే ఉగ్రవాద మూకలకు అందిస్తున్నాయి. ఆ సొమ్ముతో ఉగ్రవాదులు ఆయుధాలు, పేలుడు పదార్ధాలు సేకరించి భారత్‌పై దాడులకు పాల్పడుతున్నాయి. అంతేకాకుండా ఈ దారి గుండా మాదక ద్రవ్యాలు, నకిలీ కరెన్సీ కూడా భారత దేశంలోకి పెద్ద ఎత్తున వచ్చి పడుతోంది. ఈ విషయం గుర్తించిన భారత దేశం సరిహద్దు వాణిజ్యాన్ని నిషేధించింది. పకడ్బందీగా.... సరిహద్దు ఆవల నుంచి వివిధ పదార్ధాలు, వస్తువులను ఈ మార్గం గుండా భారత దేశానికి రవాణా చేస్తారు. ఆ సమయంలో సరుకు అసలు ధర కంటే బాగా తక్కువ ధరను ఇన్వాయిస్లో చూపిస్తారు. మన దేశంలో వ్యాపారులు ఆ సరుకులను మార్కెట్ ధరకు అమ్మి అత్యధిక లాభాలు సంపాదిస్తున్నారు. ఇలా వచ్చిన అధిక లాభాలను ఉగ్రవాదులకు అందజేస్తున్నారు. ఉగ్రవాద, వేర్పాటువాద సంస్థలతో సంబంధాలు ఉన్న వారు సరిహద్దుకు ఇరువైపుల వ్యాపారాల పేరుతో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని భద్రతా దళ అధికారులు చెబుతున్నారు. వీరే కాకుండా సరిహద్దు దాటి పాక్‌లో ప్రవేశించి అక్కడి ఉగ్ర సంస్థల్లో చేరిన భారతీయులు కొందరు మన దేశంలో ఉన్న వారి బంధు, మిత్రులతో వ్యాపార సంస్థలు పెట్టించి వారి ద్వారా కూడా ఉగ్రవాదులకు నిధులు అందజేస్తున్నారని వారు వివరించారు. ఈ దారి గుండా జమ్ము,కశ్మీర్లోకి చేరిన మాదక ద్రవ్యాలు, నకిలీ కరెన్సీ, ఆయుధాలు ఇక్కడి ఉగ్రవాద, వేర్పాటు వాదులకు అందుతున్నాయని, ఇతర రాష్ట్రాలకు కూడా సరఫరా అవుతున్నాయని వారు తెలిపారు. ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం చేస్తున్నారన్న ఆరోపణపై అరెస్టు చేసిన జహూ అహ్మద్ వతాలి అనే వ్యాపారి ఎల్వోసీ ట్రేడర్స్ అసోసియేషన్‌కు అధ్యక్షుడని తేలింది. జహూకు చెందిన కోట్ల రూపాయల ఆస్తుల్ని ఈడీ జప్తు చేసింది. 12 మందిని అరెస్టు చేశారు. వేల కోట్ల వాణిజ్యం భారత ప్రభుత్వం 2008లో వాస్తవాధీన రేఖ వెంబడి రెండు చోట్ల వాణిజ్యానికి అనుమతి ఇచ్చింది. అప్పటి నుంచి ఈ దారిలో రూ. 6,900 కోట్ల లావాదేవీలు జరిగాయి. మన దేశం నుంచి అరటిపళ్లు, ఎంబ్రాయిడరీ వస్తువులు, చింతపండు, ఎర్రమిర్చి వంటివి ఎగుమతి అవుతోంటే, కాలిఫోర్నియా బాదంపప్పు, ఎండు ఖర్జూరం, డ్రై ఫ్రూట్స్, మామిడి వంటివి దిగుమతి అవుతున్నాయి. 21 రకాల వస్తువులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వీటిలో కాలిఫోర్నియా బాదం పప్పు వల్లే వ్యాపారులు అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. ఈ మార్గంలో అక్రమ వ్యాపారాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని, పరిస్థితిని సమీక్షించి వాణిజ్యాన్ని మళ్లీ అనుమతించాలా వద్దా అన్నది నిర్ణయిస్తామని అధికారులు చెప్పారు. -
ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత
శ్రీనగర్/జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదుల్ని భద్రతాబలగాలు హతమార్చాయి. బారాముల్లా జిల్లాలోని కలంతరా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘావర్గాలు సమాచారం అందించాయి. దీంతో ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టిన బలగాలు కార్డన్ సెర్చ్ ప్రారంభించాయి. అయితే వీరి కదలికల్ని గుర్తించిన ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ పరారయ్యేందుకు యత్నించారు. దీంతో భద్రతాబలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఈ ఘటనలో ఓ ఆఫీసర్ సహా ముగ్గురు ఆర్మీ అధికారులు గాయపడ్డారు. వీరిని బదామీబాగ్లోని 92 కంటోన్మెంట్ ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్న ఉగ్రవాదుల కోసం ఆపరేషన్ కొనసాగుతోందని రక్షణశాఖ అధికార ప్రతినిధి కల్నల్ రాజేశ్ కాలియా తెలిపారు. పాక్ కాల్పుల్లో జవాన్ మృతి.. దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో నియంత్రణరేఖ(ఎల్వోసీ) వెంట భారత పోస్టులు లక్ష్యంగా బుల్లెట్లు, మోర్టార్ల వర్షం కురిపించింది. ఈ ఘటనలో భారత ఆర్మీకి చెందిన యశ్ పాల్(24) వీరమరణం చెందారు. యశ్ స్వస్థలం జమ్మూకశ్మీర్ లోని ఉధమ్‌పూర్ జిల్లా మంతాలయ్ గ్రామమని ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పాక్ కాల్పులను భారత్ దీటుగా తిప్పికొట్టిందని వ్యాఖ్యానించారు. గురువారం మధ్యాహ్నం 2.45 గంటలకు పాక్ రేంజర్లు భారత పోస్టులపై విచక్షణారహితంగా కాల్పులు ప్రారంబించారనీ, రాత్రివరకూ అవి కొనసాగుతూనే ఉన్నాయని వెల్లడించారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకూ పాక్ 110 సార్లు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిందని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్ లో ఉగ్రమూకల చెరలో బందీగా ఒకరిని సైనికులు రక్షించారు. బందిపొరా జిల్లా హాజిన్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. ఈ సందర్భంగా స్థానికుల సాయంతో ఉగ్రవాదుల చెరలో ఉన్న ఓ బందీని రక్షించగలిగాయి. -
కశ్మీర్లో 56 గంటల ఎన్కౌంటర్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య శుక్రవారం ప్రారంభమైన భీకర ఎన్కౌంటర్ 56 గంటల తర్వాత ముగిసింది. ఉగ్రవాదులు వ్యూహాత్మకంగా బాగా జనసమ్మర్దమున్న ప్రాంతంలో నక్కడంతో భద్రతాసిబ్బందికి ఉగ్రమూకల ఏరివేత సవాలుగా మారింది. ఈ కాల్పుల్లో ఐదుగురు భద్రతాసిబ్బంది ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు ఉగ్రవాదుల్ని బలగాలు హతమార్చాయి. ఈ ఘటనలో ఓ పౌరుడు సైతం బుల్లెట్ గాయాలతో చనిపోయాడు. ఈ విషయమై జమ్మూకశ్మీర్ పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. లష్కరే తోయిబా సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదుల్ని భద్రతాబలగాలు మట్టుబెట్టాయని తెలిపారు. వీరిలో ఒకరు పాకిస్తానీ కాగా, మరొకరి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య శుక్రవారం ప్రారంభమైన ఎన్కౌంటర్లో ఓ సీఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్, జవాన్, ఇద్దరు పోలీసులు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. ఉగ్రమూకల కాల్పుల్లో గాయపడిన జవాన్ శ్యామ్ నారాయణ్‌సింగ్ యాదవ్ ఆదివారం కన్నుమూశారన్నారు. ఎన్కౌంటర్ సందర్భంగా వసీం అహ్మద్ మీర్ అనే పౌరుడు చనిపోయాడన్నారు. కుప్వారాలోని బాబాగుంద్ ప్రాంతంలో లష్కరే ఉగ్రవాదులు దాక్కోవడంతో ఆపరేషన్ చేపట్టడం బలగాలకు సవాలుగా మారింది. రద్దీగా, చుట్టూ జనావాసాలు ఉండటంతో అధికారులు తొలుత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. -
ఇంటిగుట్టు పాక్‌కు చేటు
తన సైనిక ప్రయోజనాలను, లక్ష్యాలను నెరవేర్చుతున్నంత కాలం ఉగ్రవాద సంస్థలపై పాక్ ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవడం జరగని పని. కానీ ఉపఖండం మొత్తంలో యుద్ధ ఆర్థిక వ్యవస్థను బలవంతంగా మోపడం ద్వారా పాకిస్తాన్ భూభాగం కల్లోల పరిస్థితులను ఎదుర్కొనాల్సి వస్తోందన్న వాస్తవాన్ని ఆ దేశం గుర్తించాల్సి ఉంది. పాక్ భూభాగంలో 2007 నుంచి తాలిబాన్లు ఉగ్రవాద క్యాంపెయిన్‌ను కొనసాగిస్తున్నారు. ప్రజలనే కాదు.. పాక్ సైనిక బలగాలను కూడా తాలిబాన్లు వదలడం లేదు. తమ దేశంలోనూ, ఉపఖండంలోనూ నిజంగా శాంతిని పాక్ విధాన నిర్ణేతలు కోరుకుంటున్నట్లయితే తమ భూభాగంలో ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలను అనుమతించరాదు. భారత వైమానిక బలగం తన భూభాగంలో ఏకపక్ష సైనిక చర్యకు పాల్పడిన ఘటన పాకిస్తాన్‌ని మరోసారి దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటన వెనువెంటనే రెండు భిన్నమైన వాదనలకు, ప్రకటనలకు తావిచ్చింది. పాకిస్తాన్ భూభాగంలోనుంచి ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వర్తిస్తున్న జైషే మహమ్మద్ సంస్థ శిక్షణా శిబిరాలను ధ్వంసం చేసినట్లు భారత్ ప్రకటించింది. కానీ తన భూభాగంలోనికి ప్రవేశించిన భారత్ యుద్ధ విమానాలను పాకిస్తానీ ఎయిర్ ఫోర్స్ విమానాలు వెంటాడగా తప్పించుకునే ప్రయత్నంలో భారత్ యుద్ధవిమానాలు ఖాళీ స్థలాల్లో బాంబులు జారవిడిచాయని, ఈ దాడిలో తమవైపు ఏ నష్టమూ జరగలేదని పాక్ ప్రకటించుకుంది. జమ్ము–కశ్మీర్‌లోని పుల్వామా సెక్టార్లో జైషే మహమ్మద్ సంస్థకు చెందిన ఆత్మాహుతి దళసభ్యుడి ఘాతుక చర్యలో 40మంది భారతీయ సైనికులు చనిపోయిన ఘటన తర్వాత ఈ వరుస పరిణామాలు సంభవించాయి. వైమానిక దాడులు చెబుతున్న వాస్తవం? భారత్–పాకిస్తాన్‌లు రెండూ తమ తమ యుద్ధతంత్రాన్ని అమలు చేస్తున్న క్రమంలో ఈ సమాచార యుగంలో కూడా పాకిస్తాన్ భూభాగంలో భారత వైమానిక దాడులకు సంబంధించిన సంపూర్ణ వాస్తవాన్ని తెలుసుకోవడం కష్టంగానే ఉంటోంది. ఇరుదేశాలూ తమకు అనుకూలమైన ప్రకటనలు చేశాయి. కానీ క్షేత్రస్థాయి నివేదికలు మూడో అభిప్రాయాన్ని సూచిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు సోషల్ మీడియాలో విçస్తృతంగా సమాచారం పంచుకున్నారు. వైమానిక దాడులు జరిగిన ప్రాంతంలో పనిచేస్తున్న అంతర్జాతీయ వార్తా సంస్థల ప్రతినిధులు వీరిని ప్రత్యక్షంగా ఇంటర్వ్యూ చేసిన దాన్ని బట్టి చూస్తే, దాడి జరిగిన ప్రాంతంలో పలు గృహాలు ధ్వంసమయ్యాయని, ప్రజలు గాయపడ్డారని తెలుస్తోంది. ఆ ప్రాంతంలో జైషే మహమ్మద్ నిర్వహిస్తున్న మత పాఠశాలను భారత్ యుద్ధ విమానాలు లక్ష్యంగా చేసుకున్నాయని కూడా కొంతమంది తేల్చి చెప్పారు. ఈ బహుముఖ ప్రకటనల మధ్యనే వాస్తవం దాగి ఉంది. భారత వైమానిక బలగాలు పాక్ భూభాగంలోకి ప్రవేశించడం వాస్తవం. అలాగే అవి పాక్ భూభాగంపై బాంబులు జారవిడిచాయనటంలోను ఎలాంటి సందేహం లేదు. కానీ అవి లక్ష్యంమీద దాడి చేశాయా లేదా అనే విషయంపైనే ఇరు పక్షాలూ విభేదిస్తున్నాయి. అందుకే యుద్ధంలో మొదట బలయ్యేది సత్యమే అనే పాత నానుడిని ఈ కొత్త ఘటన కూడా సరికొత్తగా స్పష్టం చేస్తోంది. ఉగ్రవాదుల అడ్డాగా పాకిస్తాన్ పాక్ అంగీకరించినా, అంగీకరించకపోయినా అది ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉందని ప్రపంచానికి బోధపడింది. కశ్మీర్‌పై దృష్టి సారించిన జైషే మహమ్మద్, లష్కరే తోయిబా వంటి సంస్థలే కాకుండా అప్ఘానిస్తాన్‌ని లక్ష్యంగా చేసుకున్న హక్కాని నెట్వర్క్, ఇరాన్‌పై గురిపెట్టిన సున్నీ మిలిటెంట్ గ్రూపులకు కూడా పాకిస్తాన్ అసలైన అడ్డాగా ఉందని తేలిపోయింది. ఇరాన్ భూభాగంలో పాక్ కేంద్రంగా పనిచేస్తున్న మిలిటెంట్ సంస్థలు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్స్‌కి చెందిన పాతికమందికి పైగా సైని కులను చంపేసిన తర్వాత ఇరాన్ పాలకులు పాక్ పాత్ర గురించి నిందించిన విషయం తెలిసిందే. ఇటీవలే పాక్ భావల్పూర్లోని ఒక మత పాఠశాలపై చర్య తీసుకుంది. తర్వాత అధికారిక ప్రకటనలో ఆ పాఠశాల జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్నట్లు ప్రకటించింది. అదేవిధంగా మరొక ప్రకటనలో జమాత్ ఉద్ దవా, ఫలేహ్ ఇ ఇన్సానియత్ ఫౌండేషన్లపై మళ్లీ నిషేధం విధిస్తున్నట్లు ప్రకటన జారీ చేసింది. ఈ రెండు సంస్థలూ లష్కరే తోయిబా ముసుగు సంస్థలుగా పేరొందాయి. 2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడిలో 150 మందికి పైగా ప్రజలను చంపేసిన ఘట నకు సూత్రధారి లష్కరే తోయిబానే అన్నది మర్చిపోరాదు. ఇది పూర్తిగా పాకిస్తాన్ భూభాగంనుంచే నాటి దాడులకు పథక రచన చేసి, అమలు చేసిందని కూడా బట్టబయలైంది. మతపరమైన విద్యాసంస్థల ముసుగులో ఉన్న ఇవి చారిటీ సంస్థలు కావనీ వీటన్నింటికీ ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉందని వీటిపై దాడి చేసిన తర్వాత పాక్ ప్రభుత్వం గుర్తించింది కాబట్టే ఆ తర్వాత వాటిపై పెద్దగా చర్యలు తీసుకోకుండా ఉండిపోయింది. అలాంటి సంస్థలు ఇతరత్రా నిర్వహిస్తున్న ఇదే రకమైన కార్యకలాపాలను పాక్ ప్రభుత్వం ఎందుకు నిషేధించడం లేదు, వాటిని ఎందుకు తన నియంత్రణలోకి తీసుకోలేదు అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. దీనికి సమాధానాన్ని కూడా ఒక పాక్ పత్రిక తన పరిశోధనాత్మకమైన కథనంలో పొందుపర్చింది. ఇలాంటి సంస్థలపై నిషేధం విధించడం మాటవరసకు మాత్రమే జరిగిందని, అవి తమ తమ ప్రాంతాల్లో తమ కార్యకలాపాలను ఇప్పటికీ స్వేచ్ఛగా కొనసాగిస్తున్నాయని ఆ కథనం తేల్చి చెప్పింది. పాక్ ప్రభుత్వం వాస్తవంగా చేపట్టే ఇలాంటి నిషేధాలను, అణచివేత చర్యలను మీరు ఎలా ఎదుర్కొంటారని అడిగిన ప్రశ్నకు ఈ సంస్థల నిర్వాహకుల్లో ఒకరు తేలిగ్గా సమాధానమిచ్చారు. ‘ఆ ఏముందీ, మా సంస్థ పేర్లు మార్చుకుంటాం. అంతే.. మళ్లీ పనిచేస్తాం’. ఉగ్రవాద సంస్థలపై నిర్దిష్ట చర్యలేవి? దీనికి సమాధానం సింపుల్. ఎందుకంటే పాకిస్తాన్ సైన్యం యుద్ధ ఆర్థిక వ్యవస్థ నుంచి ప్రయోజనాలు పొందుతోంది. ఈ ప్రాంతంలో కొన్ని మిలిటెంట్ సంస్థలు మంద్రస్థాయి సైనిక ఘర్షణలను సృష్టించడాన్ని కొనసాగిస్తున్నాయి. పైగా పాక్ ప్రభుత్వం వెచ్చిస్తున్న వ్యయంలో సింహభాగాన్ని గుంజుకోవడం ద్వారా పాక్ సైన్యం ఎక్కువగా లబ్ధి పొందుతోంది. స్వదేశంలో ఆధిపత్య స్థానాన్ని చలాయిం చడం ద్వారా రాజకీయంగానూ పాక్ సైన్యం లబ్ధి పొందుతోంది. అంతకుమించి సరిహద్దుల్లో బలమైన శత్రువుతో వ్యవహరిస్తున్నందున తన చర్యలపై ఎవరూ ఇబ్బందికరమైన ప్రశ్నలను సంధించలేని సానుకూల పరిస్థితివల్ల పాక్ సైన్యం వ్యూహాత్మకంగా కూడా లబ్ధి పొందుతుండటం వాస్తవం. సైనిక ప్రయోజనాల కోసం, పుల్వామాలో భారత సైనికబలగాల కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి వంటి ముందస్తు లక్ష్యాలను నెరవేర్చుతున్నంత కాలం ఉగ్రవాద సంస్థలపై పాక్ ప్రభుత్వం, సైన్యం తగు చర్యలు తీసుకునే ప్రసక్తే కనిపించదు. కానీ ఈ మొత్తం ప్రాంతంలో యుద్ధ ఆర్థిక వ్యవస్థను బలవంతంగా మోపడం ద్వారా పాక్ భూభాగం కల్లోల పరి స్థితులను ఎదుర్కొనాల్సి వస్తోందన్న వాస్తవాన్ని పాక్ గుర్తించాల్సి ఉంది. దీనికి సాక్ష్యాధారాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. పాక్ భూభాగంలో 2007 నుంచి తాలిబాన్లు ఉగ్రవాద క్యాంపెయిన్‌ను కొనసాగిస్తున్నారు. ఇటీవల తాలిబాన్లు పాక్ భూభాగంలో వేలాదిమంది అమాయకుల్ని చంపేశారు. చివరకు పాక్ సైనిక బలగాలను కూడా తాలిబాన్లు వదలడం లేదు. దీంతో పాక్‌పై ప్రపంచంలోనే ప్రమాదకరమైన దేశాల్లో ఒకటిగా ముద్రపడిపోయింది. శాంతి కావాలంటే ఉగ్రచర్యలు ఆపాల్సిందే! తమ దేశంలోనూ, ఉపఖండంలోనూ నిజంగా శాంతిని పాకిస్తాన్ విధాన నిర్ణేతలు కోరుకుంటున్నట్లయితే తమ భూభాగంలో ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలను అనుమతించకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ స్వదేశంలో పాకిస్తాన్ భద్రతా విధానంతో ముడిపడి ఉన్న మౌలిక సమస్యను గుర్తించి తదనుగుణంగా వ్యవహరించడానికి బదులుగా పాకిస్తాన్ సైనిక ప్రతినిధి ఒకరు భారత వైమానిక బలగం దాడుల తర్వాత ప్రెస్ కాన్ఫరెన్సులో మాట్లాడుతూ పాక్ ప్రతిస్పందనను భారత్ ఎదురు చూడాలని, అణు దాడి జరిపే అవకాశాలను కూడా పాక్ సైన్యం చర్చిస్తోందని ప్రకటన చేశారు. పాక్ నేషనల్ కమాండ్ అథారిటీ సమావేశానికి పిలుపిచ్చామని కూడా ఆ ప్రతినిధి సెలవిచ్చారు. వాస్తవానికి ప్రస్తుత పరిస్థితుల్లో అది పూర్తి బాధ్యతారహితమైన చర్య. ఉపఖండం ఏ స్థాయిలోనూ అణు దుస్సాహసిక చర్యలను భరించలేదు. ఎందుకంటే అణుదాడులు మొదలుకావడమంటేనే ఇరుదేశాల సరిహద్దుల్లోమాత్రమే కాకుండా స్వదేశంలోనూ, అనేక ఇతర దేశాల్లోనూ దాని ప్రభావం తప్పకుండా ఉంటుంది. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య ఏర్పడిన తీవ్ర ప్రతిష్టంభనను మరింత ముందుకు తీసుకుపోవడానికి బదులుగా పాకిస్తాన్ తప్పకుండా కాస్త వెనుకడుగు వేసి ముందుగా తన ఇంటిని చక్కదిద్దుకోవాలి. ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న ముష్కర సంస్థలపై నిర్ణయాత్మక చర్యలను ఇప్పటికైనా చేపట్టకపోతే పాకిస్తాన్ సార్వభౌమాధికారం మళ్లీ మళ్లీ సవాళ్లను ఎదుర్కొంటూనే ఉంటుంది. ప్రాంతీయ, అంతర్జాతీయ శక్తుల నుంచే కాదు.. దేశ న్యాయ చట్టాలను బహిరంగంగా ఉల్లం ఘిస్తున్న అంతర్గత ఉగ్రవాదుల వల్ల కూడా పాక్ పెను ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యాసకర్త : తాహా సిద్దిఖి ,పాక్‌కి చెందిన ప్రవాస జర్నలిస్ట్ -
కశ్మీర్లో భారీ ఎన్కౌంటర్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులకు చావుదెబ్బ తగిలింది. పుల్వామా జిల్లాలోని అవంతిపొరా ప్రాంతంలో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో భద్రతాబలగాలు అల్‌కాయిదా అనుబంధ సంస్థ అన్సర్ ఘజ్వతుల్ హింద్(ఏజీయూహెచ్)కు చెందిన ఆరుగురు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాయి. ఈ ఎన్కౌంటర్లో చనిపోయినవారిలో ఏజీయూహెచ్ అధినేత జకీర్ ముసా సన్నిహితుడు, సంస్థ డిప్యూటీ చీఫ్ సొలిహా మొహమ్మద్ అఖూన్ ఉన్నాడు. ఈ విషయమై కశ్మీర్ రేంజ్ పోలీస్ ఐజీ స్వయంప్రకాశ్ పానీ మీడియాతో మాట్లాడుతూ..‘ఉగ్రవాదులు పుల్వామాలోని అవంతిపొరా ప్రాంతంలో నక్కినట్లు నిఘా వర్గాల నుంచి పక్కా సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన బలగాలు ఇక్కడి ఆరంపొరా అనే గ్రామాన్ని చుట్టుముట్టి గాలింపు ప్రారంభించాయి. ఇంతలోనే భద్రతాబలగాల కదలికల్ని పసిగట్టిన ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ అక్కడి నుంచి పరారయ్యేందుకు యత్నించారు. ఈ సందర్భంగా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు ఏజీయూహెచ్ ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. మృతులను సోలిహా మొహమ్మద్, ఫైజల్ అహ్మద్, నదీమ్ సోఫీ, రసీక్ మిర్, రౌఫ్ మిర్, ఉమర్ రమ్జాన్‌గా గుర్తించాం. మృతుల్లో ఏజీయూహెచ్‌లో నంబర్ 2గా ఉన్న సోలిహా మొహమ్మద్ ఉన్నాడు. ఈ ఎన్కౌంటర్లో జవాన్లు ఎవరూ గాయపడలేదు’ అని తెలిపారు. మృతదేహాలను సంబంధీకులకు అప్పగించామని వెల్లడించారు. ఘటనాస్థలి నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. -
ప్రతీకారం తీర్చుకున్న బలగాలు
శ్రీనగర్/న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ పోలీస్ కానిస్టేబుల్ మొహమ్మద్ సలీమ్ షాను కిరాతకంగా హత్యచేసిన ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు ఆదివారం మట్టుబెట్టాయి. దీంతో ఉగ్రమూకలపై ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. కుల్గామ్ జిల్లాలోని ముతల్హమాకు చెందిన కానిస్టేబుల్ సలీమ్ షా సెలవుపై శుక్రవారం ఇంటికి రాగా, అతన్ని కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు తీవ్రంగా హింసించి చంపారు. మరుసటి రోజు రెడ్వానీ పయీన్ గ్రామంలోని ఓ నర్సరీ సమీపంలో సలీమ్ మృతదేహం లభ్యమైంది. ఉగ్రవాదుల ఆచూకీపై నిఘా వర్గాల నుంచి పక్కా సమాచారం అందుకున్న భద్రతా బలగాలు రెడ్వానీ ప్రాంతాన్ని చుట్టుముట్టి గాలింపు చేపట్టాయి. ఈ కదలికల్ని గుర్తించిన ఉగ్రవాదులు వారిపై విచక్షణా రహితంగా కాల్పులు ప్రారంభించగా, వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ విషయమై జమ్మూకశ్మీర్ పోలీస్ అధికార ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఆపరేషన్‌లో భద్రతాబలగాలకు ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని తెలిపారు. ఉగ్రవాదుల్ని పాకిస్తాన్‌కు చెందిన మువావియా, కుల్గామ్‌కు చెందిన సోహైల్ అహ్మద్ దార్, రెహాన్లుగా గుర్తించామన్నారు. వీరంతా లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్ర సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు పోలీస్ రికార్డుల్లో ఉందన్నారు. ఘటనాస్థలంలో రెండు ఏకే–47 తుపాకులు, మందుగుండు సామగ్రి, నిషేధిత సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. మరోవైపు జమ్మూకశ్మీర్‌లోని హీరానగర్ సెక్టార్‌లోకి పాక్ నుంచి అక్రమంగా ప్రవేశించడానికి యత్నించిన ఓ పాకిస్తానీ పౌరుడి(24)ని బీఎస్ఎఫ్ ఆదివారం కాల్చిచంపింది. ఇతడు పాక్‌లో శిక్షణ పొందిన ఉగ్రవాదుల్ని కశ్మీర్లోకి తీసుకొచ్చేందుకు గైడ్‌గా పనిచేస్తున్నట్లు భావిస్తున్నారు. ఉగ్రదాడులు తగ్గుముఖం.. జమ్మూకశ్మీర్‌లో గవర్నర్ పాలన విధించినప్పటి నుంచి ఉగ్రదాడులు గణనీయంగా తగ్గాయని కేంద్ర హోంశాఖ విడుదల చేసిన గణాంకాల్లో వెల్లడయింది. ఉగ్రదాడులు తగ్గినప్పటికీ రాళ్లు విసిరే ఘటనలు మాత్రం రాష్ట్రంలో స్వల్పంగా పెరిగాయి. -
షరీఫ్ పేల్చిన బాంబు!
అందరికీ తెలిసిన కథే. తొమ్మిదేళ్లక్రితం అమెరికా పోలీసులకు పట్టుబడ్డ ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీ చెప్పిన సంగతే. ముంబై మహా నగరంపై 2008 నవంబర్‌లో ఉగ్రవాదులు విరుచుకుపడి 166మందిని పొట్టనబెట్టుకున్న ఉదంతం వెనక పాకిస్తాన్ ప్రమేయం ఉన్నదని ప్రపంచ దేశా లన్నిటికీ అర్ధమైన విషయమే. అయిదు రోజులక్రితం పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా పరోక్షంగా అదే చెప్పారు. ఎన్నాళ్లు పాక్ గడ్డపై ఉగ్రవాద ముఠాలను పెంచి పోషిస్తూ పొరుగుదేశంపై దాడులకు పంపుతామని ఆయన ప్రశ్నించారు. అంతే...అక్కడ వ్యవస్థలన్నీ వణికిపోతున్నాయి. సొంత పార్టీ పాకిస్తాన్ ముస్లింలీగ్ (పీఎంఎల్)–ఎన్తో సహా అన్నివైపుల నుంచీ ఒత్తిళ్లు రావడంతో షరీఫ్ స్వరం మార్చి తన మాటల్ని మీడియా వక్రీకరించిందంటూ సంజాయిషీ ఇచ్చుకున్నారు. పాకిస్తాన్ సైన్యం ప్రధాని షహీద్ ఖాకాన్ అబ్బాసీని హడావుడిపెట్టి జాతీయ భద్రతా మండలి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయించింది. ఆయన ఆరోపణల్ని తీవ్రంగా ఖండించింది. షరీఫ్ అపార్ధం చేసుకుని ఉండొచ్చు లేదా ఆయనకు దురభిప్రాయాలు ఏర్పడి ఉండొచ్చునని అభిప్రాయపడింది. జాతీయ భద్రతా మండలి షరీఫ్ మాటల్ని ఖండించ లేదని, మీడియా వక్రీకరించిందని మాత్రమే అభిప్రాయపడిందని పీఎంఎల్–ఎన్ చెబుతోంది. నవాజ్ షరీఫ్ తన మాటల్లో ఎక్కడా సైన్యం గురించి నేరుగా మాట్లాడలేదు. ఉగ్రవాద సంస్థలకు సైన్యం తోడ్పాటునిస్తున్నదని చెప్పలేదు. అయినా ‘గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు’ పాక్ సైన్యానికి కంగారు ఎక్కువైంది. బహుశా తనకూ, సైన్యానికీ మధ్య విభేదాలు రాకుండా ఉంటే షరీఫ్ ఇంత బాహాటంగా పాక్ తప్పిదాన్ని అంగీకరించేవారు కాదేమో! ఆయన ప్రధానిగా ఉండగా ముంబై దాడుల ప్రస్తావన వస్తే తమకేమీ సంబంధం లేదనే చెప్పేవారు. పైగా ఆ దాడులపై పాక్‌లో సాగుతున్న విచారణకు భారత్ సహకరించడం లేదని ఆరోపించారు. తనను ప్రధాని పదవి నుంచి తప్పించడానికి, ఆ తర్వాత అనర్హత వేటు వేయడానికి సైన్యం లోపాయికారీగా సుప్రీంకోర్టుపై ఒత్తిడి తెచ్చిన తీరు చూశాక ఆయన ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు. ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఆయన తాజా వ్యాఖ్యలు చేశారు. ప్రధానిగా పని చేశారు కాబట్టి ఆయనకు మొదటి నుంచీ సైన్యం వేస్తున్న వేషాలన్నీ తెలుసు. లష్కరే తొయిబా, జైషే మహమ్మద్, హక్కానీ నెట్వర్క్ వంటి ఉగ్రవాద ముఠాలకు డబ్బులిచ్చి, ఆయుధాలిచ్చి, శిక్షణ ఇచ్చి మన దేశంపైకి ఉసిగొల్పుతున్న తీరు గురించిన సమస్త సమాచారమూ ఆయన వద్ద ఉంటుంది. కారణాలేమైనా కావొచ్చుగానీ షరీఫ్‌కూ, సైన్యానికీ మొదటినుంచీ పడటం లేదు. ఆయన రెండోసారి ప్రధాని అయ్యాక 1999లో అప్పటి సైనిక దళాల చీఫ్ జనరల్ పర్వేజ్ ముషార్రఫ్ తిరుగుబాటు చేసి ఆయన్ను పదవీచ్యుతుణ్ణి చేశారు. ఆ తర్వాత ఖైదు చేయించారు. రాజకీయాలకు స్వస్తి చెప్పి సౌదీ అరేబియా వెళ్లిపోతానని హామీ ఇచ్చాకే ఆయనకు విముక్తి లభించింది. 2013లో షరీఫ్ తిరిగి ప్రధాని కాగానే ముషార్రఫ్ పాలనాకాలంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించారు. 1999నాటి సైనిక కుట్ర గురించి కూడా విచారించి అందుకు ఆయన్ను శిక్షించాలని పట్టుబట్టారు. ఇదంతా సైన్యానికి నచ్చలేదు. పాకిస్తాన్లో మూడు అధికార కేంద్రాలుంటాయి. అవి సమాంతరంగా, స్వతంత్రంగా పని చేస్తుంటాయి. అందులో మొదటిది పౌర ప్రభుత్వం. రెండోది సైన్యం. మూడోది సుప్రీంకోర్టు. ఏ దేశంలోనైనా సైన్యం పౌర ప్రభుత్వం చెప్పుచేతల్లో ఉంటుంది. అది తీసుకునే నిర్ణయాలకూ, రూపొందించే విధానాలకూ కట్టుబడి ఉంటుంది. కానీ పాకిస్తాన్లో దీనికి విరుద్ధంగా జరుగు తుంది. సైన్యం స్వతంత్రంగా వ్యవహరించాలనుకుంటుంది. ప్రజలెన్నుకున్న పౌర ప్రభుత్వాన్ని బేఖాతరు చేస్తుంది. అదును దొరికితే దాన్ని చాప చుట్టి తానే ఏలాలని చూస్తుంది. పాకిస్తాన్ అవతరణ నాటినుంచి ఆ దేశంలో ఎక్కువకాలం సైనిక పాలనే నడిచింది. పదేళ్లుగా సైన్యం ఇలాంటి కుట్రలకు దూరంగా ఉన్నా తెరవెనకనుంచి పౌర ప్రభుత్వాలను శాసించే ధోరణి మానుకోలేదు. మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్(పీటీఐ) వంటి పార్టీల ద్వారా పౌర ప్రభుత్వాన్ని ఇబ్బందులపాలు చేయాలని చూస్తూనే ఉంది. నాలు గేళ్లక్రితం నవాజ్ షరీఫ్‌ను గద్దె దించడమే లక్ష్యమంటూ పార్లమెంటును ముట్టడించిన ఇమ్రాన్ ఖాన్‌కు సైన్యమే అండదండలిచ్చింది. ఆయనకు జనంలో అంతగా ఆదరణ లేకపోవడంతో ఆ ముట్టడి కార్యక్రమం నవ్వులపాలైంది. ఈలోగా 2016లో పనామా పత్రాలు వెల్లడై అందులో నవాజ్ షరీఫ్ కుటుంబసభ్యుల పేర్లున్నాయని తెలిశాక సైన్యం ఆయన అడ్డు తొలగించుకునే పని మొదలుబెట్టింది. సుప్రీంకోర్టును ప్రభావితం చేసి ఆయనపై విచారణ తంతు నడిపించి ప్రధాని పదవి నుంచి తప్పుకునేలా చేసింది. ఆ తర్వాత రాజకీయాలకే ఆయన అనర్హుడంటూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. ఈ పరిణామాల పర్యవసానంగానే నవాజ్ షరీఫ్ గళం విప్పారు. పరోక్షంగా సైన్యం సాగిస్తున్న కుట్రలను ప్రపంచానికి వెల్లడించారు. పాకిస్తాన్లో సాగుతున్న అంతర్గత కుమ్ములాటల మాట అలా ఉంచి ఉగ్రవాదానికి అక్కడి సైన్యం అందిస్తున్న తోడ్పాటుపై అమెరికా మాత్రమే కాదు... చైనా, సౌదీ అరేబియా వంటి సన్నిహిత దేశాలు సైతం అసహనంతో ఉన్నాయి. ఉగ్రవాద ముఠాలను కట్టడి చేయకపోతే ఆర్థిక ఆంక్షలు విధిస్తామని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆయన్ను ప్రసన్నం చేసుకుని ఈ గండం నుంచి గట్టెక్కుదామని ప్రయత్నిస్తుండగా షరీఫ్ ఉన్నట్టుండి ఈ బాంబు పేల్చడంతో సైన్యానికి దిక్కుతోచడం లేదు. అందుకే ఈ ఉలికిపాటు. ఏ ఉద్దేశంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినా ఉగ్రవాద ముఠాలకు తోడ్పాటునిస్తున్న ధోరణులపై సాక్షాత్తూ మాజీ ప్రధానే మాట్లాడటం ఒక రకంగా మంచిదే. ప్రపంచం నలుమూలలనుంచీ పాక్‌పైఒత్తిళ్లు పెరుగుతాయి. సైన్యం కుటిల ధోరణులకు కళ్లెం పడేందుకు ఇది దోహదపడుతుంది. ఆ దేశంలో పౌర ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తే అది మనకు కూడా మేలు కలిగిస్తుంది. ఇరు దేశాల మధ్యా సామరస్య సంబంధాలు ఏర్పడతాయి. ఉగ్రవాద ముఠాల కార్యకలాపాలకు అడ్డుకట్ట పడుతుంది. -
ఎన్ఎస్జీ పేరు వింటే ఉగ్రవాదులకు దడ
సాక్షి, రంగారెడ్డి జిల్లా : జాతీయ భద్రతా దళాల(ఎన్ఎస్జీ) పేరు వింటే ఉగ్రవాదుల గుండెల్లో గుబులు పుడుతుందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. దేశంపై కన్నెత్తి చూసే టెర్రరిస్టులకు ఎన్ఎస్జీ సుదర్శన చక్రంలా కనిపిస్తుందని అన్నారు. అన్ని బలగాల్లోకెల్లా ఎన్ఎస్జీ కమాండోలు అత్యుత్తమమని కొనియాడారు. దేశాన్ని సురక్షితంగా ఉంచడంలో వాటిపాత్ర చాలా గొప్పదని ప్రశంసించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వినోబానగర్‌లో రూ.157.84 కోట్ల వ్యయంతో 200 ఎకరాల్లో నిర్మించిన 28వ స్పెషల్ కంపోజిట్ గ్రూప్(ఎస్సీజీ) భవన సముదాయాన్ని మంగళవారం రాజ్‌నాథ్‌సింగ్ ప్రారంభించారు. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ఎన్ఎస్జీ డైరెక్టర్ జనరల్ సుదీప్ లక్టాకియా, రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఉగ్రవాదం ప్రపంచ నలుమూలలకు పాకిందని, సామాజిక మాధ్యమాల్లోనూ కొత్త సవాళ్లను విసురుతోందని రాజ్‌నాథ్ అన్నారు. ఈ తరహా సవాళ్లను సైతం అధిగమించేందుకు సాంకేతిక సామర్థ్యాలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. దేశంలో విధ్వంసాలు సృష్టించేందుకు పొరుగు దేశం ప్రయత్నిస్తోందని పాకిస్తాన్‌ను ఉద్దేశించి అన్నారు. 2008లో ముంబైలో టెర్రరిస్టులు చేసిన దాడుల నేపథ్యంలో బలగాలు ప్రతిచర్యకు దిగే సమయాన్ని వీలైనంతగా తగ్గించాలన్న ఉద్దేశంతో ఎస్సీజీ రీజినల్ హబ్‌లను ఏర్పాటు చేయాలని కేంద్రం భావించిందన్నారు. అందులో భాగంగానే హైదరాబాద్‌తో పాటు ముంబై, చెన్నై, కోల్‌కతాలో స్థాపించినట్లు వివరించారు. ముంబై, అక్షరధామం, పఠాన్‌కోట్ దాడులు తీవ్ర నష్టం కలిగించాయని, అలాంటి ఘటనలను భారతీయులు మర్చిపోలేరని చెప్పారు. ప్రముఖులకు రక్షణ కల్పించడంతోపాటు ప్రతిష్టాత్మక జాతీయ, అంతర్జాతీయ సదస్సులను విజయవంతంగా నిర్వహించడంలో ఎన్ఎస్జీల పాత్రను అభినందించారు. ఆ దళాలు చేపట్టే ఎటువంటి కార్యక్రమాల్లోనైనా పాల్గొనడాన్ని గౌరవప్రదంగా భావిస్తున్నట్లు చెప్పారు. దేశంలో ఎలాంటి భద్రతా బలగాలైనా ఎన్ఎస్జీ తరహాలో ధైర్యసాహసాలు, నైపుణ్యాలను కలిగి ఉండాలన్నారు. వచ్చే సంవత్సరంలో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించేందుకు సిద్ధమవుతున్న 16 మంది సభ్యులతో కూడిన ఎన్ఎస్జీ బృందానికి ఆయన అభినందనలు తెలిపారు. ఉగ్రమూకలను మట్టుబెట్టడంలో ఎన్ఎస్జీలు కీలకంగా పనిచేస్తున్నాయని ఎన్ఎస్జీ డీజీ సుదీప్ లక్టాకియా అన్నారు. ఎన్ఎస్జీలు తన శక్తియుక్తులను ఇనుమడింప చేసుకొనే ప్రయత్నాల్లో భాగంగా ఫ్రాన్స్, యూఎస్ఏలతో కలసి విన్యాసాలను నిర్వహించిందని తెలిపారు. ధైర్యానికి, త్యాగానికి, నైపుణ్యాలకు ఎన్ఎస్జీలు ప్రతీకలని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఎస్సీజీ ఏర్పాటవడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. అంతకుముందు స్పెషల్ కంపోజిట్ కాంప్లెక్స్‌లో శిక్షణలో భాగంగా నేర్చుకున్న విన్యాసాలను ఎన్ఎస్జీ బ్లాక్‌క్యాట్ కమాండోలు ప్రదర్శించారు. కేంద్ర హోంమంత్రి తదితరులు వీటిని వీక్షించి కమాండోల ధైర్యసాహసాలను ప్రశంసించారు. -
జమ్మూలో ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్మూ కాశ్మీర్ : జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లా డోరులో ఉగ్రవాదులకు భద్రతాదళాలకు మధ్య శనివారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతిచెందారు. ఈ విషయాన్ని ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో షిష్టార్గం గ్రామాన్ని భద్రతా దళాల అధికారులు చుట్టుముట్టారని తెలిపారు. దీంతో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయన్నారు. -
కశ్మీర్లో భారీ ఎన్కౌంటర్
-
కశ్మీర్లో భారీ ఎన్కౌంటర్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో బుధవారం ఐదుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. జమ్మూకశ్మీర్ పోలీస్ విభాగంలో స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్(ఎస్‌వోజీ)కు చెందిన మొహమ్మద్ యూసుఫ్, దీపక్ పండిట్లతో పాటు ఆర్మీలోని 160వ బెటాలియన్‌కు చెందిన మొహమ్మద్ అష్రఫ్, నాయక్ రంజిత్ సింగ్, మరో జవాన్ ఉగ్రవాదుల కాల్పుల్లో చనిపోయినట్లు ఆ రాష్ట్ర డీజీపీ ఎస్పీ వైద్ తెలిపారు. ఈ కాల్పుల్లో మరో ఇద్దరు భద్రతా సిబ్బంది తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించారు. ఉగ్రవాదుల ఏరివేతలో భద్రతా బలగాలతో పాటు పారా కమెండోలు కూడా పాల్గొన్నారన్నారు. బుధవారం రాత్రివరకూ సాగిన ఈ ఎన్కౌంటర్లో ఐదుగురు ఉగ్రవాదుల్ని హతమార్చామనీ, వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. మృతులంతా విదేశీయులేనని ఆయన స్పష్టం చేశారు. ఘటనాస్థలం నుంచి ఏకే–47 తుపాకులతో పాటు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నియంత్రణ రేఖ(ఎల్వోసీ) దాటి కుప్వారాలోని హల్మత్పొరా ప్రాంతానికి మంగళవారం చేరుకున్న ఉగ్రవాదులు అక్కడ మద్దతుదారులతో కలసి విందులో పాల్గొన్నారన్నారు. అనంతరం వీరు కుప్వారా పట్టణానికి బయలుదేరుతుండగా పోలీస్ గస్తీ బృందం ఎదురుపడిందన్నారు. దీంతో ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరుపుతూ పరారయ్యేందుకు యత్నించారని వెల్లడించారు. అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులు జరుపుతూ ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారన్నారు. -
వారంతా ఐసీస్‌లో శిక్షణ పొందుతున్నారు
న్యూఢిల్లీ: దేశంలో ఉగ్రకార్యకలపాలను ప్రోత్సహించేందుకు సిక్కు యువత పాకిస్తాన్లో ఐసీస్ సౌకర్యాలతో శిక్షణ పొందుతున్నట్టు కేంద్రహోం మంత్రిత్వశాఖ సీనియర్ బీజేపీ నేత మురళీ మనోహర్ జోషితో కూడిన పార్లమెంటరీ కమిటీకి ఓ నివేదికను సమర్పించింది. కెనడా, ఇతర దేశాల్లో నివసిస్తున్న సిక్కు మతానికి చెందిన యువతకు భారత్ పట్ల వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ, హానికర సంఘటనలకు ప్రేరణపొందేలా చేస్తున్నారని నివేదికలో పేర్కొన్నారు. ఇంటర్నెట్ మరియు సోషల్ మీడియా దుర్వినియోగంతో యవత అత్యధికంగా త్రీవవాద గ్రూపులకు దగ్గరవుతుందన్నారు. సిక్కు మిలిటెంట్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేసుకుంటున్నట్లు తెలిపారు. ఐసీస్ కనుసన్నల్లో శిక్షణ పొందుతున్న కమాండర్స్ పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలతో కలిసి భారత్‌లో ఉగ్ర కార్యకలపాలకు ప్రయత్నిస్తున్నారని నివేదికలో ప్రస్తావించారు. నిరుద్యోగులు, స్మగ్లర్లు, జైల్లో ఉన్న సిక్కు నేరస్తులను చేరదీసి పాకిస్తాన్లో ఐసిస్ సౌకర్యాలతో శిక్షణ ఇస్తున్నట్టు హోం మంత్రిత్వశాఖ నివేదికలో పేర్కొంది. దేశంలో గత కొద్ది రోజులుగా వామపక్ష తీవ్రవాదం పెరిగిపోతుందని, దీనివల్ల దేశ అంతర్గత భద్రతకు ముప్పుందని తెలిపంది. 2004లో ఏర్పడిన సీపీఐ మావోయిస్ట్ అత్యంత శక్తి వంతమైన వామపక్ష తీవ్రవాద సంస్థగా పేర్కొంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా, జైషే మహ్మాద్, ఇండియన్ ముజాహిద్దీన్, సిమీ లాంటి ఉగ్రవాద సంస్థల కదలికలపై భద్రతాధళాలు దృష్టిసారించాయి. -
ఇద్దరు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ లో జరిగిన ఎన్కౌంటర్లో భారత రక్షణ దళాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు. ఎప్పుడూ సాధారణ ప్రజలను, భారత సైన్యాన్ని టార్గెట్ చేసే ఉగ్రవాదులు ఈ సారి ఏకంగా స్థానిక బీజేపీ నాయకుడు మహ్మద్ అన్వర్‌పైకి కాల్పులకు తెగపడ్డారు. బారాముల్లాలోని ఖాన్మోహ్‌లో జరిగిన ఈ ఘటనలో రక్షణ దళాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపెట్టారు. కాగా అన్వర్‌పైకి కాల్పులు జరిపిన వెంటనే అక్కడ ఉన్న రక్షణ సిబ్బంది వేగంగా స్పందించడంతో సైన్యానికి, ఉగ్రవాదుల మధ్య బీకర కాల్పులు జరిగాయి. కాల్పుల్లో అన్వర్, అతని సెక్యూరిటి స్వల్ప గాయలతో బయటపడగా, రక్షణ దళాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు. ఎన్కౌంటర్ ముగిసిన అనంతరం ఉగ్రవాదుల మృతదేహాలను, వారి వద్దనున్న ఆయుధాలను, పేలుడు సామాగ్రీని అధికారులు స్వాధీనపరుచునున్నారు. బారాముల్లా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఉండటంతో శుక్రవారం బారాముల్లా- బన్నిహాల్ మధ్య రైల్వే సేవలను రద్దుచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎన్కౌంటర్ జరిగిన స్థానిక గ్రామంలో నాలుగు ఇళ్లు ధ్వంసంకాగా , ఆస్తి నష్టం కూడా జరిగిందని ఆర్మీ అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల కదలికలు ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశించింది. -
ఆర్మీ x కశ్మీర్ సర్కార్
శ్రీనగర్: ఉగ్రవాదులను తుదముట్టించేందుకు జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాల్లో ఆదివారం రాత్రి ఆర్మీ చేపట్టిన ఆపరేషన్‌లో ఆరుగురు హతమయ్యారు. ఇందులో ఇద్దరు లష్కరే మిలిటెంట్లతోపాటు వారితో ఉన్న నలుగురినీ ఆర్మీ అంతమొందించింది. అయితే ఆ నలుగురూ ఉగ్రవాదులేనని ఆర్మీ స్పష్టం చేయగా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వారు పౌరులేనంటోంది. ఆదివారం రాత్రి దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్‌లోని పహ్నూ ప్రాంతంలో పెట్రోలింగ్ విధుల్లో ఉన్న జవాన్లు వేగంగా వెళ్తున్న రెండు ద్విచక్ర వాహనాలను ఆపే ప్రయత్నం చేశారు. దీంతో ఆ రెండు వాహనాలనుంచి హఠాత్తుగా కాల్పులు ప్రారంభమయ్యాయి. దీంతో జవాన్లు ఆత్మరక్షణ కోసం కాల్పులు ప్రారంభించారు. జవాన్లు అప్రపమత్తమై కాల్పులు ప్రారంభించటంతో.. లష్కరే ఉగ్రవాది ఆమిన్ మాలిక్, ఆషిక్ సహా ఆరుగురు హతమయ్యారు. ఆర్మీ చేతుల్లో జైషే ఉగ్రవాది హతం ఉగ్రసంస్థ జైషే మహ్మద్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ సంస్థ కీలక నేతగా (ఆత్మాహుతి దాడులకు ప్రణాళికలు రూపొందిస్తూ) ముఫ్తీ వకాస్ భారత బలగాలు, జమ్మూకశ్మీర్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో హతమయ్యాడు. ఫిబ్రవరి 10న సంజువాన్ ఆర్మీ క్యాంప్‌పై ఉగ్రదాడిలో వకాస్ సూత్రధారి అని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. సోమవారం అవంతీపూర్ జిల్లా హత్వార్లోని ఓ ఇంట్లో ముఫ్తీ వకాస్ ఉన్నాడన్న సమాచారంతో ఆ ఇంటిని చుట్టుముట్టిన బలగాలు 20 నిమిషాల్లో ఆపరేషన్ పూర్తిచేశాయి. -
ఆత్మాహుతి దాడి:18 మంది మృతి
-
ఆత్మాహుతి దాడి.. 18 మంది మృతి
మొగదిషు: సోమాలియా రాజధాని మొగదిషులో ఉగ్రవాదులు శుక్రవారం కారుబాంబులతో ఆత్మాహుతి దాడికి పాల్పడి 18 మంది ప్రాణాలు తీశారు. పేలుడు పదార్థాలతో నిండిన వాహనం మొగదిషులో తిరుగుతోందని సోమాలియా హోం మంత్రి గురువారమే హెచ్చరించారు. అయినా భద్రతా దళాలు పేలుళ్లను అడ్డుకోలేకపోయాయి. సోమాలియా నిఘా విభాగం ప్రధాన కార్యాలయం వద్ద తొలి ఆత్మాహుతి దాడి జరిగింది. ఆ తర్వాత పార్లమెంటు సమీపంలో రెండో దాడి చోటుచేసుకుంది.