జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో బుధవారం ఐదుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. జమ్మూకశ్మీర్ పోలీస్ విభాగంలో స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్(ఎస్‌వోజీ)కు చెందిన మొహమ్మద్ యూసుఫ్, దీపక్ పండిట్‌లతో పాటు ఆర్మీలోని 160వ బెటాలియన్‌కు చెందిన మొహమ్మద్ అష్రఫ్, నాయక్ రంజిత్ సింగ్, మరో జవాన్ ఉగ్రవాదుల కాల్పుల్లో చనిపోయినట్లు ఆ రాష్ట్ర డీజీపీ ఎస్పీ వైద్ తెలిపారు.