cross
-
క్రాస్ వీల్ నుంచి పడి యువతి మృతి..
చంద్రగిరి(తిరుచానూరు): సరదాగా గడపాలని ఆటవిడుపు కోసం వచ్చిన మహిళా ప్రమాదవశాత్తు మృత్యు వాత పడగా, మరో మహిళా తీవ్ర గాయాలపాలైన ఘటన తిరుచానూ రు శిల్పారామంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు... తిరుపతి అర్బన్ మండలం సుబ్బారెడ్డి నగర్‌కు చెందిన లోకేశ్వరి(22) తన స్నేహితురాలు గౌ తమి అలియాస్ పండుతో కలసి ఆటవిడుపు కోసం తిరుచానూరు సమీపంలోని శిల్పారామానికి చేరుకుంది. సుమారు గంట పాటు శిల్పారామంలో ప లు ప్రాంతాలను సందర్శించి, ప్రశాంత వాతావరణంలో ఆహ్లాదకరంగా గడిపారు. ఈ క్రమంలో అక్కడే ఏర్పాటు చేసిన క్రాస్‌వీల్ ఎక్కారు. ఇద్దరు మహిళలు కూర్చుని తి రుగుతుండగా క్రాస్‌వీల్ ఉన్నట్టుండి విరిగి పడిపోయింది. ఈ ప్రమాదంలో లోకేశ్వరి, ఆమె స్నేహితురాలు గౌతమి గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే నిర్వాహుకులు తేరుకుని, 108కు సమాచారం అందించారు. అనంతరం క్షతగాత్రులను 108 వాహనంలో తిరుపతి రుయాకు తరలించారు. అక్కడ వైద్య పరీక్షలను ని ర్వహించిన వైద్యులు అప్పటికే లోకేశ్వరి మృతి చెందినట్లు నిర్ధారించగా, గౌతమి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం గౌతమిని తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
దూసుకొస్తున్న రైలు.. ఎదురుగా 60 ఏనుగులు.. తరువాత?
గౌహతి: అస్సాంలో తృటిలో రైలు ప్రమాదం తప్పింది. లోకో పైలట్ అప్రమత్తతతో దాదాపు 60 ఏనుగులు ప్రమాదం బారి నుంచి బయపడ్డాయి. అర్దరాత్రి ఏనుగుల గుంపు రైల్వే ట్రాక్ దాటుతోంది.. ఇంతలో ఒక రైలు అతివేగంతో అదే పట్టాల మీదుగా వస్తోంది. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)భద్రతా వ్యవస్థ లోకో పైలట్‌కు సిగ్నల్ రూపంలో ఈ విషయాన్ని తెలిపింది. వెంటనే లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేక్ వేశాడు.మీడియాకు అందిన వివరాల ప్రకారం అక్టోబర్ 16న కమ్రూప్ ఎక్స్‌ప్రెస్ నడుపుతున్న లోకో పైలట్ జెడీ దాస్, అతని సహాయకుడు ఉమేష్ కుమార్ రాత్రి 8.30 గంటలకు హవాయిపూర్- లాంసాఖాంగ్ స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్‌ను దాటుతున్న ఏనుగుల గుంపును చూశారు. ఆ రైలు గౌహతి నుంచి లుమ్డింగ్కు వెళ్తోంది. వారు ఏనుగులను చూడగానే అప్రమత్తమై ఎమర్జెన్సీ బ్రేకులు వేసి, ఏనుగుల గుంపునకు కొద్ది దూరంలో రైలును ఆపారు. దీంతో 60 ఏనుగులు ప్రమాదం బారి నుంచి బయటపడ్డాయి.ఈస్ట్ సెంట్రల్ రైల్వే తన పరిధిలోని అన్ని కారిడార్లలో ఏఐ వ్యవస్థను క్రమంగా నెలకొల్పుతోంది. రైల్వే ట్రాక్‌లోకి ప్రవేశించిన ఏనుగుల ప్రాణాలను కాపాడడంలో ఈ వ్యవస్థ విజయవతంగా పనిచేస్తోంది. తూర్పు మధ్య రైల్వే 2023లో 414 ఏనుగులను, ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ 16 వరకు 383 ఏనుగులను రక్షించింది.ఇది కూడా చదవండి: Subrahmanyan Chandrasekhar: చుక్కల్లో చంద్రుడు -
18అడుగుల ఎత్తులో ఆర్ఆర్ఆర్!
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అతిపొడవైన రింగురోడ్డుగా రికార్డుకెక్కనున్న రీజనల్ రింగ్‌రోడ్డు (ఆర్ఆర్ఆర్) మరో ఘనతను సొంతం చేసుకోనుంది. కోటగోడను తలపించేలా 18 అడుగుల రికార్డు స్థాయి ఎత్తుతో ఈ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం కానుంది. జాతీయ రహదారులు, ముఖ్యమైన రాష్ట్ర రహదారులను క్రాస్ చేసే చోట దీని ఎత్తు ఏకంగా 30 అడుగులు ఉండనుంది. ఇప్పటివరకు దేశంలో ఎక్కడా ఇంత ఎత్తులో ఎక్స్‌ప్రెస్ వేలు నిర్మాణం కాలేదు. హైదరాబాద్ చుట్టూ మణిహారంగా రూపుదిద్దుకున్న ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్ఆర్) ఎత్తు 11 అడుగులు మాత్రమే ఉంది.ఇంత ఎత్తు ఎందుకంటే..ఉత్తర భాగంలో ప్రతి అర కిలోమీటర్‌కు ఒక వంతెన ఉండనుంది. పాదచారులు దాటే అండర్ పాస్ ఎత్తు గతంలో మూడున్నర మీటర్లుగా నిర్ధారించారు. ఇటీవలే దాన్ని మార్చి 4 మీటర్లకు పెంచుతూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో కొత్తగా చేపట్టే ఎక్స్‌ప్రెస్ వేలలో చిన్న అండర్‌పాస్‌ల క్లియరెన్స్ ఎత్తు 4 మీటర్లుగా నిర్ధారించారు. కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో వరికోతలకు హార్వెస్టర్ యంత్రాల వినియోగం అధికంగా ఉంది. వాటి ఎత్తు 4.3 మీటర్లు. ఇవి రోడ్డు దాటాలంటే అంతకంటే ఎత్తుతో క్లియరెన్స్ ఉండాలి. ఇందుకోసం రీజనల్ రింగ్‌రోడ్డులో అండర్‌పాస్‌ల కనిష్ట క్లియరెన్స్‌ను 4.5 మీటర్లుగా నిర్ధారించారు. దానిమీద రోడ్డు మందం మరో మీటర్ కనిష్టంగా ఉంటుంది. దీంతో అండర్‌పాస్‌లు ఉండే ప్రాంతాల్లో రోడ్డు ఎత్తు ఐదున్నర మీటర్లుగా ఉండనుంది. అండర్‌పాస్‌లు లేనిచోట్ల దాని ఎత్తు తగ్గించే వీలుంది. కానీ ఈ రోడ్డులో ప్రతి అర కిలోమీటర్‌కు చిన్నదో, పెద్దదో ఏదో ఒక అండర్‌పాస్ ఏర్పాటు కానుంది. అందువల్ల అండర్‌పాస్ ఉన్న చోట్ల రోడ్డు ఎత్తు పెంచి ఆ తర్వాత తగ్గిస్తే వేగంగా దూసుకెళ్లే వాహనాలకు ఆ ఎత్తుపల్లాలు ప్రమాదకరంగా పరిణమిస్తాయి. దీంతో ఈ రోడ్డు మొత్తం కనీసం 18 అడుగుల ఎత్తులో ఉండేలా డిజైన్ చేశారు. ఈ రోడ్డులో 27 పెద్ద వంతెనలు సహా 309 వంతెనలు నిర్మించనుండగా వాటిలో 187 అండర్‌పాస్‌లు ఉండనున్నాయి. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులను దాటుతూ 11 ప్రాంతాల్లో ఇంటర్ ఛేంజ్‌లు నిర్మించనున్నారు. ఇంటర్‌ఛేంజ్‌ల వారీగా ఆయా డిజైన్లను ‘సాక్షి’ గతంలోనే వెలుగులోకి తెచ్చింది.ఏడాదిన్నర కిందటే పనులు మొదలవ్వాల్సి ఉన్నా..రీజనల్ రింగురోడ్డు ఉత్తర భాగం భూసేకరణ ప్రక్రియ తుది దశలో ఉంది. త్వరలో గ్రామాలవారీగా భూ పరిహారానికి సంబంధించి అవార్డులు పాస్ చేయనున్నారు. దీంతో 158 కి.మీ. నిడివి ఉండే ఈ రోడ్డు నిర్మాణానికి మార్గం సుగమం కానుంది. వాస్తవానికి ఏడాదిన్నర క్రితమే రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం కావాల్సి ఉంది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) యంత్రాంగం రోడ్డు నిర్మాణానికి వీలుగా అప్పట్లోనే డిజైన్లు సిద్ధం చేసుకుంది. కానీ ఈ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తడంతో అప్పట్లో పనులు పడకేశాయి -
ఇన్ని చిరుకప్పలు ఎక్కడి నుంచి
అమెరికాలోని కాలిఫోర్నియాలోగల స్టాక్టన్లో వేలకొద్దీ చిరుకప్పులు ఒక రోడ్డును దాటుతున్నాయి. ఇది చిరు కప్పల సామూహిక వలసగా కనిపించింది. ఒక మైలు పొడవునా విస్తరించిన ఈ రోడ్డు పొడవునా చిరు కప్పలు ఉండటాన్ని చూసినవారు తెగ ఆశ్చర్యపోతున్నారు. విమానాశ్రయం నుండి ఇంటికి కారులో వెళుతున్న ఈ ప్రాంతానికి చెందిన మేరీ హులెట్ రోడ్డుపై ఎదో కదులుతున్నట్లు కనిపించడంతో ముందునున్న కార్లు ఆగిపోవడాన్ని తాను గమనించానని తెలిపింది. రోడ్డుపై దృష్టి కేంద్రీకరించినప్పుడు కప్పల సైన్యం రహదారికి అడ్డుగా ఉందని గ్రహించానని ఆమె పేర్కొంది. ఇవి రహదారిని దాటడాన్ని గమనించానని ఒక వార్తా సంస్థకు ఆమె తెలిపింది. ఈ విధంగా కప్పల వలసలను చూసిన జీవశాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోయారు. సిల్వర్ అవెన్యూలో ఎస్ కర్వ్స్ అని పిలిచే ప్రాంతంలో ఈ చిరు కప్పలు కనిపించాయి. వైల్డ్‌లైఫ్ రిసోర్సెస్ సెంట్రల్ రీజియన్‌లోని ఉటా విభాగానికి చెందిన ఆక్వాటిక్స్ మేనేజర్ క్రిస్ క్రోకెట్ మాట్లాడుతూ ఈ కప్పలను గ్రేట్ బేసిన్ స్పాడెఫుట్ టోడ్స్ అని అంటారన్నారు. అవి చుట్టుపక్కల ఉన్న కొండలకు వలస వెళ్లాలని నిర్ణయించుకున్నాయని తెలిపారు. కాగా కొన్ని కార్లు ఆ చిరు కప్పల మీదుగా వెళ్లడంతో చాలా చిరుకప్పలు చనిపోయాయి. అయితే స్థానికులు ఈ కప్పలను కాపాడేందుకు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: హవ్వ.. గన్ను కొనడం ఇంత సులభమా? Witnesses describe seeing a 'biblical' mass migration of toads over a mile long pic.twitter.com/ii0HUn8DD4 — CNN (@CNN) July 24, 2023 -
కాలుపై కాలు వేసుకుని దర్జాగా కూర్చొన్నారో..ప్రమాదంలో పడినట్లే!
'పుష్ప'.. సినిమాలో అల్లు అర్జున్ డైలాగు మాదిరిగా ఈ కాలు నాదే ఆ కాలు నాదే అంటూ కాలుపై కాలు వేసుకని దర్జాగా కూర్చోన్నారు అంతే సంగతి. ఇలా కూర్చొంటే చాల దుష్ప్రభావాలు ఎదుర్కొనక తప్పదంటున్నారు నిపుణులు. అధ్యయనాల్లో ఎన్నో సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. జాగ్రత్తగా ఉండకపోతే రానురాను పరిస్థితి కష్టమైపోతుందని హెచ్చరిస్తున్నారు. అంతేగాదు కాలు మీద కాలు వేసి కూర్చొవడం వల్ల నష్టాలు, లాభాలు రెండు ఉన్నాయని వెల్లడించారు. శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం మనం మూడు రకాలుగా కూర్చొంటారని చెబుతున్నారు. 62 శాతం మంది తమ కాళ్లను కుడివైపు క్రాస్ చేస్తుండగా, 26 శాతం మంది ఎడమవైపుకి, ఇక 12 శాతం మంది ఎటువీలైతే అటు క్రాస్ చేస్తుంటారని అధ్యయనాల్లో పేర్కొన్నారు. అలాగే క్రాస్ చేసి కూర్చొవడంలో కూడా రెండు రకాలుగా కూర్చొంటారని అంటున్నారు వైద్యులు ఒకటి, రెండు మోకాళ్లను ఒకదానిపై ఒకటి క్రాస్ చేయడం, రెండు, చీలమండలం క్రాస్ చేసి కూర్చొవడం. కాలుమీద కాలు వేసి కూర్చొవడం వల్ల..? 👉హిప్స్ అమరికలో తేడాలు వస్తాయి రెండింటిని పోలిస్తే ఒకటి పెద్దగా అవుతుంది. అంతేకాదు కాలు మోకాలు, హిప్ , పాదాలు వంటి కింద భాగాలకు సరఫరా అయ్యే రక్త ప్రసరణలో తేడా వస్తుంది. 👉నిజానికి చీల మండలం దగ్గర క్రాస్ చేసుకుని కూర్చోవడం కంటే మోకాలిపై మోకాలు క్రాస చేసి కూర్చొవడమే అత్యంత ప్రమాదకరం అని అధ్యయనాలు చెబుతున్నాయి. 👉ఇలా కాళ్లు క్రాస్ చేసి కూర్చోవడం వల్ల సిరల్లో రక్తప్రవాహం తగ్గి రక్తపోటు అధికమవుతుంది. శరీరంపై ఏర్పడే దుష్ప్రభావమెంత అంటే..? 👉కాలు మీద కాలు వేసుకుని సుదీర్ఘకాలం పాటు కూర్చొంటే ..కండరాల పొడవు, పెలివిక్ బోన్స్ అమరికలో దీర్ఘకాలిక మార్పులు వస్తాయి. 👉శరీరం ముందుకు వంగిపోయే గుణం భుజాలు ముందుకు వచ్చే అవకాశం ఉంటుందని ఒక అధ్యయనంలో తేలింది. 👉అలాగే మెడ ఎముకల్లో మార్పు రావడం వల్ల తలభాగం అమరికలో కూడా మార్పులు వస్తుంటాయి. దీని వల్ల మెడ కూడా ప్రభావితమవుతుంది. ఎందుకంటే?.. ఇలా కూర్చొన్నప్పుడూ శరీరంలో ఒకవైపు.. మరోవైపుతో పోలిస్తే బలహీనంగా మారుతుంది. 👉ఇక పొత్త కడుపు కండరాల్లో మెన్నుముక కింద భాగంలో కూడా ఇదేరకమైన మార్పులు రావచ్చు. ఒకవేళ పిరుదులు, కండరాలపైనే ఎక్కువ సమయం పాటు భార పడటం వల్ల పొత్తి కడుపు కూడా తన సర్దుబాటు లక్షణాలను కోల్పోయి బలహీనంగా మారి గూని వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని కారణంగా మన శరీరంలో భాగాలు అసాధారణమైన ఆకారంలోకి మారే ప్రమాదం కూడా ఉంది. క్రాస్ లెగ్స్ వల్ల ఫైబులర్ నరాలుగా పిలిచే పెరోనియల నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ వ్యాధికి గురైన వ్యక్తి తన కాలి వేళ్లను ముందు భాగాన్ని సొంతంగా కదిలించలేడు. ఐతే ఇది చాలా కేసుల్లో చాలా స్వల్పకాలికమే. కొన్ని నిమిషాల తర్వాత ఇవి మళ్లీ సాధారణస్థితికి వచ్చేస్తాయి. 👉వీర్య కణాల ఉత్పత్తిపై కూడా ప్రభావం చూపుతుందని పరిశోధనల్లో రుజువైంది సాధారణంగా శరీర ఉష్ణోగ్రతల కన్నా టెస్టికల్స్ ఉష్ణోగ్రత 2 నుంచి 6 డిగ్రీల సెల్సియస్ తక్కువగా ఉండాలి. ఇలా కూర్చొవడం వల్ల వీటి ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియల్ పెరుగుతాయి. పైగా క్రాస్ లెగ్ స్థితిలో కూర్చొన్నప్పుడూ.. ఉస్ణోగ్రతలు 3.5 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉంది. టెస్టికల్స్‌లో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల వీర్యకణాల ఉత్పత్తి నాణ్యత తగ్గుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇక మహిళలు, పురుషుల్లో శరీర నిర్మాణానికి సంబంధించి చాలా మార్పులు ఉంటాయి. పురుషులతో పోలిస్తే మహిళలే తేలికగా కాలుపై కాలు వేసుకుని కూర్చొగలుగుతారు. అందువల్లే వారికే ఈ ప్రమాదం ఎక్కువ అని పరిశోధనలు పేర్కొన్నాయి. క్రాస్ లెగ్స్ వల్ల ప్రయోజనాలు.. ఒక కాలు పొడువు ఉన్నవారు ఇలా కూర్చొవడం వల్ల పొత్తికడుపులో ఇరువైపు లో పొడవు సర్దుబాటు అయ్యి అమరికలు మెరుగయ్యాని 2016లో ఒక అధ్యయనంలో గుర్తించింది క్రాస్ లెగ్ వల్ల కండరాల పనిభారం తగ్గుతుంది. ముఖ్యమైన కండరాలు ఉపశమంనం పొంది అతిశ్రమ భారం నుంచి విముక్తి పొందవచ్చు. చివరిగా మనం కూర్చొనే విధానం సౌకర్యంవంతంగా ఉండటం తోపాటు ఆరోగ్యవంతంగా ఉండటం చాలా ముఖ్యం. సాధ్యమైనంత వరకు కాలు మీద కాలు వేసుకుని కూర్చొకపోవడమే మంచిది. కాలుమీద కాలు వేసుకుని కూర్చొవడం వల్ల పైన చెప్పినవే గాక ఇంకా ఇతరత్ర సమస్యలకు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీని వల్ల ఊబకాయం, కదలకుండా ఒకేచోట కూర్చొనే జీవన విధానాన్ని అలవడుతుందని పరిశోధనలు పేర్కొన్నాయి. అందువల్ల చాలాసేపు ఒకేవిధానం కూర్చొకూడదు. కనీసం మధ్యమధ్యలో లేవడం తోపాటు కొద్ది దూరం నడవాలి. (చదవండి: అత్యంత వృద్ధుడికి.. లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్) -
రైల్వే పట్టాలు పై హడావిడి.. అంతలోనే వచ్చిన ట్రైన్
-
భారత్ బాండ్ ఈటీఎఫ్ హవా: రెండేళ్లలో అనూహ్య వృద్ధి
న్యూఢిల్లీ: భారత్ బాండ్ ఈటీఎఫ్‌ల పరిధిలోని నిర్వహణ ఆస్తులు (ఏయూఎం) రెండున్నరేళ్లలోనే రికార్డు స్థాయికి చేరాయి. రూ.50,000 కోట్ల మార్క్‌ను అధిగమించాయి. వీటి నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ఎడెల్వీజ్ మ్యూచువల్ ఫండ్ ఈ వివరాలను ప్రకటించింది. 2019 డిసెంబర్లో భారత్ బాండ్ ఈటీఎఫ్ మొదటి విడత ఇష్యూ రావడం గమనార్హం. అప్పటి నుంచి ఐదు ఇష్యూలు పూర్తయ్యాయి. వీటి మెచ్యూరిటీ 2023, 2025, 2030, 2031, 2031లో తీరనుంది. ‘‘ప్రభుత్వరంగ సంస్థల ఆర్థిక బలం, ఇన్వెస్టర్లలో వాటి పట్ల ఉన్న విశ్వాసానికి భారత్ బాండ్ ఈటీఎఫ్‌ల విజయం నిదర్శనం. మన తొలి డెట్ ఈటీఎఫ్ అద్భుత విజయం సాధించడం పట్ల సంతోషంగా ఉంది’’అని కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలో పనిచేసే దీపమ్ కార్యదర్శి తుహిన్‌కాంత పాండే తెలిపారు. ఏఏఏ రెటెడ్ కలిగిన ప్రభుత్వరంగ కంపెనీలతో కూడిన నిఫ్టీ భారత్ బాండ్ సూచీల్లో భారత్ బాండ్ ఈటీఎఫ్‌లు ఇన్వెస్ట్ చేస్తాయి. భారత్ బాండ్ ఈటీఎఫ్‌ల ఘన విజయంతో ఇతర అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీలు 2019 తర్వాత సుమారు 30 వరకు టార్గెట్ మెచ్యూరిటీ ఫండ్స్‌ను తీసుకు రావడం గమనార్హం. ప్యాసివ్ డెట్ విభాగంలో రూ.60వేల కోట్ల ఏయూఎంతో ఎడెల్వీజ్ మ్యూచువల్ ఫండ్ అగ్రగామిగా చేరుకోవడానికి భారత్ బాండ్ ఈటీఎఫ్‌లు దోహదపడ్డాయి. -
Anaconda: రోడ్డు దాటుతున్న భారీ అనకొండ.. షాకింగ్ వీడియో..
బ్రసీలియా: సాధారణంగా అడవిలోని జంతువులు, సరీసృపాలు మానవ ఆవాసాలకు వస్తున్న సంఘటనలను తరచుగా వార్తల్లో చూస్తునే ఉంటాం. కాగా, అవి.. ఆహారం కోసం, ఆవాసం కోసం దారితప్పి మానవ ఆవాసాల్లోకి ప్రవేశిస్తుంటాయి. అడవికి దగ్గరగా ఉన్న ప్రదేశాలలోని రోడ్లపై జంతువులు, పాములు రోడ్డును దాటుతూ ఒకవైపు నుంచి మరొవైపుకు వెళ్లిన సంఘటనలు కొకొల్లలు. తాజాగా, బ్రెజిల్‌లోని హైవేపై ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఒక పెద్ద అనకొండ రోడ్డును దాటుకుంటు వెళ్లింది. కాగా, మొదట దీన్నిచూసిన ప్రయాణికులు షాక్‌కు గురయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. కాగా, అసలే అది హైవే.. వాహనాల రద్దీ కూడా ఎక్కువగా ఉంది. ఉన్నట్టుండి రోడ్డు పక్కన ఉన్న చెట్ల పొదల్లోంచి ఒక పదడుగుల అనకొండ బయటకు వచ్చింది. ఆ తర్వాత.. మెల్లగా పాకుకుంటూ.. డివైడర్ ఎక్కేసింది. ఒకవైపు నుంచి మరోవైపు వెళ్లసాగింది. అనకొండ ను చూసిన ప్రయాణికులు .. తమ వాహనాలను ఆపివేసి దాన్ని తమ మొబైల్లో వీడియో తీసుకుంటున్నారు. అనకొండకు ఎవరు కూడా ఆపద తలపెట్లలేదు. వేగంగా వచ్చిన వాహనదారులు.. కార్లను రోడ్డుకు ఒకవైపు నిలిపేసి ఆ అనకొండను ఆశ్చర్యంగా చూస్తున్నారు. మరికొందరు దూరం నుంచి సెల్ఫీలు తీసుకుంటున్నారు. అయితే, అనకొండ మాత్రం మెల్లగా పాకుకుంటూ.. రోడ్డుపక్కన ఉన్న పొదల్లోకి వెళ్లి అదృష్యమయ్యింది. కాగా, ఈ వీడియోను ఒక బ్రెజిల్‌లోని ఒక వ్యక్తి అనిమల్స్ వేంచర్ అనే ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. దీనికి ఇతను ‘అనకొండ రోడ్డుదాటుతుంటే.. ప్రయాణికులు చూస్తు ఉండిపోయారు’ అని క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘ఎంత బాగా పాకుకుంటూ వెళ్తుంది..’,‘అనకొండకు.. ఆపద కల్గించనందుకు ధన్యవాదాలు..’, ‘జంతువుల మనుగడకు మనుషులు సహాయపడుతున్నందుకు థ్యాంక్స్.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. సాధారణంగా బ్రెజిల్ అడవులలో ఉండే అనకొండలు 550 పౌండ్ల బరువుని కల్లి ఉండి, 29 అడుగుల పొడవు వరకు పెరుగుతాయి. చదవండి: మహిళకు షాక్.. ఇంటిని బందెల దొడ్డి చేశాయ్! -
కశ్మీర్లో భారీ ఎన్కౌంటర్
-
కరుణామూర్తీ.. చెరగదు నీ కీర్తి..
ప్రపంచానికి కరుణ, ప్రేమ వంటి ఉదాత్త భావాలను అందించిన కరుణామయుడైన ఏసుక్రీస్తును నిరంకుశ పాలకులు శిలువ వేసిన రోజైన శుక్రవారాన్ని.. జిల్లావ్యాప్తంగా క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో ‘గుడ్ ఫ్రైడే’గా నిర్వహించు కున్నారు. ఈ సందర్భంగా వివిధ చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జీసస్ ప్రబోధించిన ఏడు ఉపదేశాలను పాస్టర్లు వివరించారు. పలుచోట్ల క్రీస్తు శిలువ యాత్రలు నిర్వహించారు. -
విద్యార్థులకు 'నది' కష్టాలు!
చెన్నైః ప్రతిరోజూ పాఠశాలకు వెళ్ళాలంటే అక్కడి విద్యార్థులకు నది కష్టాలు తప్పడంలేదు. ఎప్పుడూ మోకాల్లోతు దాటి ఉండే నీళ్ళలో బిక్కు బిక్కుమంటూ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ప్రయాణించాల్సి వస్తోంది. ఒక్కోసారి నీటి ఉధృతి పెరిగితే నడుములు దాటి కూడా నీరు ప్రవహిస్తుంటుంది. అటువంటి ప్రమాద పరిస్థితుల్లో నీటిలో నడుస్తూ స్కూలుకు వెళ్ళాల్సిన పరిస్థితి తమిళనాడు విద్యార్థులకు దినదినగండంగా మారుతోంది. ఇక వర్షాకాలంలో పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉంటుంది. ఉధృతంగా ప్రవహించే నీటి ప్రవాహాన్ని దాటి నదికి ఆవలివైపున ఉన్న స్కూలును చేరుకోవడం ప్రాణాలతో చెలగాటమే. ఏళ్ళతరబడి బ్రిడ్జి నిర్మాణంకోసం ఆ ప్రాంత వాసులు అర్జీలు పెట్టినా పట్టించుకునేవారే కరువయ్యారు. తమిళనాడు క్రిషగిరి జిల్లా బోడూరు గ్రామ ప్రాంతంలోని విద్యార్థులు స్కూలుకు వెళ్ళాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నదిని దాటేందుకు బ్రిడ్జి లేక, మోకాల్లోతు నీటిలోనే నడుచుకుంటూ వెడుతున్నారు. ఎప్పుడు ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితుల్లో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని కాలం వెళ్ళదీస్తున్నారు. బోడూరు చుట్టుపక్కల గ్రామాలనుంచి ప్రతిరోజూ సుమారు 100 మంది విద్యార్థులు పెన్నార్ నదిని దాటి స్కూలుకు వెడుతుంటారు. ఆయా గ్రామాల్లోని విద్యార్థులే కాక గర్భిణులు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు సైతం నిత్యావసరాలకోసం పక్క గ్రామానికి వెళ్ళాలంటే నదిని దాటక తప్పడం లేదు. కనీసం 3000 మంది ప్రయాణీకులు ప్రతిరోజూ ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. బోడూర్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడా నదిపై బ్రిడ్జి లేకపోవడంతో స్థానికులు నానా అవస్థలు పడుతున్నారు. స్థానిక ఉత్పత్తులను మార్కెట్ కు చేర్చాలన్నా బ్రిడ్జిని చేరుకోవాలంటే సుమారు 8 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోందని, రోగులను అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి తరలించాలన్నా నదిని దాటడం ఎంతో కష్టంగా ఉందని స్థానికులు వాపోతున్నారు. అయితే క్రిషగిరి జిల్లాలో నదిపై బ్రిడ్జి నిర్మాణానికి ఇప్పటికే ముఖ్యమంత్రి జయలలిత రూ.1.5 కోట్ల నిధులు కేటాయించారని, నిర్మాణంకోసం అధికారులకు ఆదేశాలు కూడ జారీ చేశారని పశుసంవర్థకశాఖ మంత్రి బాలకృష్ణా రెడ్డి చెప్తున్నారు. నదిపై బ్రిడ్జిలేక, నీరు ఉధృతంగా ఉన్నసమయంలో సంవత్సరంలో సుమారు 100 రోజులపాటు పాఠశాలకు హాజరుకాలేకపోతున్నామని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు మరో రెండేళ్ళలో బోర్డు పరీక్షలు రాయాల్సి ఉండగా... అధికారులు ఇచ్చే హామీలు ఎప్పుడు అమల్లోకి వస్తాయో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
81ఏళ్ళ వయసులో రికార్డు సృష్టించాడు!
పుణె: పర్వతాలను అధిరోహించడమంటే మామూలు విషయం కాదు. ఎంతో కృషి, పట్టుదలతో పాటు ఆరోగ్యం కూడా సహకరించాల్సి ఉంటుంది. అటువంటిది 81 ఏళ్ళ వృద్ధుడు రికార్డు సృష్టించాడు. హిమాచల్ ప్రదేశ్‌లో హిమాలయ పర్వతాల్లో అత్యంత ఎత్తైన రూపిన్ పాస్ క్రాస్ అధిరోహించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించాడు. పుణెకు చెందిన గోపాల్ వాసుదేవ్ లేలే వయసు 81 సంవత్సరాలు. గతేడాది సెప్టెంబర్ లో పర్వతారోహణ చేసిన వ్యక్తి కంటే పది రెట్లు ఎక్కువగా హిమాలయ పర్వతాలను అధిరోహించాడు. అంతేగాక అతి పెద్ద వయసులో 15,350 అడుగుల ఎత్తైన హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న రూపిన్ పాస్.. ఎక్కిన వ్యక్తిగా గోపాల్ వాసుదేవ్ లిమ్కా బుక్ లో తనపేరు నమోదు చేసుకున్నాడు. వర్షం, మంచు కురవడం, కొండ చెరియలు విరిగి పడటంతో పాటు...మైనస్ ఏడు డిగ్రీల్లో ఉండే చలిప్రాంతంలో ప్రయాణించి గోపాల్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే తలచిన కార్యం సిద్ధించాలంటే ముందుగా మానసిక శక్తి, ఆత్మ విశ్వాసం ఎంతో అవసరం అంటాడు గోపాల్. తానో వృద్ధుడినని, తనకు 81 సంవత్సరాల వయసు ఉందన్న విషయాన్నిఎప్పుడూ తలచుకోనని, యువకుడిలాగానే ఫీలౌతానని అంటాడు గోపాల్. 1972 నుంచి పర్వతారోహణ చేస్తున్న అతడు... ఇప్పటికీ ప్రతిరోజూ కనీసం 8 కిలోమీటర్లు వాకింగ్ చేస్తుంటాడు. శారీరక వ్యాయామంలో భాగంగా వారానికోసారి ముంబై-పుణె హైవే ప్రాంతంలో ఉన్నకొండలను కూడ ఎక్కుతుంటాడు. ఇప్పటికే కేదార్ నాథ్, కైలాష్, కాంచెన్ జుంగా, సంగ్లా లను అధిరోహించిన గోపాల్... ఈసారి సెప్టెంబర్ లో ఉత్తరాఖండ్ లోని రూప్ కుంద్ ఎక్కేందుకు కూడా సిద్ధం అవుతున్నాడు. పుణెకు చెందిన ట్రెక్కింగ్ గ్రూప్ 'ట్రెక్నిక్' లో ఏడేళ్ళ క్రితం చేరిన అతడు అప్పట్నుంచీ అందులో భాగంగా మారిపోయాడు. ఎలక్ట్రికల్ అండ్ ఆటోమొబైల్ ఇంజనీర్ గా విద్యార్హతలు సంపాదించిన గోపాల్.. 1964 లో పుణెకు చేరుకున్నాడు. కొన్నాళ్ళపాటు వివిధ ఫ్యాక్టరీల్లో పనిచేసి, అనంతరం అక్కడే తన స్వంత వ్యాపారాన్ని ప్రారంభించాడు. ప్రస్తుతం వ్యాపార బాధ్యతలను కుమారుడికి అప్పగించేసినా ప్రతిరోజూ ఒక్కసారైనా ఫ్యాక్టరీని సందర్శించి వస్తుంటాడు. అయితే పర్వతారోహణ రేస్ వంటిది కాదని, ఎత్తైన ప్రాంతాలను అధిరోహించేప్పుడు ఎంతో సావధానంగా ఉండాలని గోపాల్ సలహా ఇస్తాడు. ట్రెక్కింగ్ చేయాలంటే కొన్ని నెలల ముందునుంచే శారీరక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని, అందుకు కావలసిన ప్రిపరేషన్ ఉండాలని సూచిస్తాడు. ట్రెక్కింగ్ లో పైకి వెళ్ళే కొద్దీ ఆక్సిజన్ తక్కువై ఊపిరి కష్టమౌతుందని అంతా చెప్తుంటారని, తాను ఇప్పటికి ఎన్నోసార్లు హిమాలయాలను ఎక్కినా తనకా సమస్య ఎదురు కాలేదని చెప్తున్నాడు. ఆరోగ్యం, శరీర ధారుఢ్యం ఉన్నా ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా పర్వతారోహణ సాధ్యం కాదనే గోపాల్... ఎనభై ఏళ్ళు దాటిన వయసులోనూ బీపీ, సుగర్, ఆర్థరైటిస్ వంటి సమస్యలేవీ లేకుండా ఆరోగ్యంగా, చలాకీగా ఉంటూ.. చిన్న వయసులోనే డీలా పడిపోయే ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. -
వారిని శిలువేసి కాల్చి చంపారు
రక్కా: సిరియాలో రక్తపాతం సృష్టిస్తూ బందీలను ఎప్పటికప్పుడు వినూత్నంగా హత్య చేస్తున్న ఐఎస్ఐఎస్ టైస్టులు తాజాగా నలుగురు బందీలను శిలువేసి కాల్చి చంపారు. ఏప్రిల్ రెండవ తేదీ నుంచి మూడు రోజుల్లో నలుగురిని చంపిన ఘటనలను వీడియోతీసి మీడియాకు విడుదల చేశారు. ఈ దారుణ సంఘటనలు సిరియా రాజధాని రక్కాలో జరిగినట్లు వీడియోలో తెలిపారు. సీనియర్ ఇస్లామిక్ స్టేట్ టైస్ట్ అబూ ఇజా అల్ టునిస్ గురించి సమాచారం ఇచ్చారనే ఆరోపణలపై ఇస్లాం టైస్టులు ఇటీవల 35 మందిని అరెస్ట్ చేశారు. వారిలో నుంచి నలుగురిని శిలువేసి హత్య చేశారు. టునిస్ గత బుధవారం రష్యన్లు జరిపిన వైమానిక దాడిలో మరణించాడు. తమ ఆదేశాలను ధిక్కరించారనే ఆరోపణలపై తమ టైస్టులను కూడా హత్య చేస్తున్నారు. గత వారమే 15 మంది టైస్టులను చంపేశారు. రష్యా వైమానిక దాడుల రక్షణలో సిరియా సైన్యం గత నెల రోజులుగా ముందుకు దూసుకొస్తున్నా టైస్టుల ఆగడాలకు మాత్రం తెరపడడం లేదు. సిరియా సైన్యం తాజాగా రక్కాకు సమీపంలోని రెండు పట్టణాలను స్వాధీనం చేసుకున్నాయి. -
‘పంచుకొని’.. పెంచుకున్నారు!
‘స్వగృహ’ ఇళ్ల ధరల్లో అడ్డగోలు వ్యవహారం దీనిపై నేడు హ లెవల్ కమిటీ భేటీ సాక్షి, హైదరాబాద్: కొందరి కక్కుర్తి ఇప్పుడు స్వగృహ కొనుగోలుదారుల జేబుకు భారీగా చిల్లుపెట్టేలా చేసింది. గత ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో నేతలు, అధికారులు స్వగృహకు సం బంధం లేని ఓ జీవోను దానికి వర్తింపజేస్తూ తీసుకున్న నిర్ణయం స్వగృహ ఇళ్ల ధరలను ఒక్కసారిగా పెంచేసింది. కొనేవారు లేక తెల్ల ఏనుగులా మిగిలిన ఇళ్లను లాభాలతో సంబంధం లేకుండా రాయితీ ధరలకు టీఎన్జీవోలకు కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించటంతో ఇటీవల అధికారులు వాటి ధరలను తగ్గించారు. అప్పట్లో నేతలు, అధికారులు కూడబలుక్కుని కాంట్రాక్టర్లకు లబ్ధి కలిగించేందుకు నిర్ణయం తీసుకుని ఉండకపోతే... తాజా గా నిర్ధారించిన తగ్గింపు ధరలు కొనుగోలుదారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉండేవి. ఇదీ విషయం... నిర్మాణ సామగ్రి ధర పెరిగితే కాస్ట్ ఎస్కలేషన్‌కు అవకాశం ఉంటుంది. సిమెంటు, స్టీలుతోపాటు ఇసుక, ఇటుక, విద్యుత్తు ఉపకరణాలు, ఫ్లోరింగ్ మెటీరియల్, శానిటరీ ఫిట్టింగ్స్, రం గులు, లేబర్ చార్జీలు... ఇలా అన్నింటా దీన్ని వర్తించేలా 2009లో జీవో35 జారీ అయింది. ఇది రాజీవ్ స్వగృహకు వర్తించదని ప్రభుత్వం అప్పట్లో తేల్చిచెప్పింది. కానీ గత ప్రభుత్వం గద్దెదిగేముందు దీన్ని స్వగృహకు కూడా వర్తింపచేస్తూ హడావుడి నిర్ణయం తీసుకుంది. ఆ సమయంలో జరిగే పనులే కాకుండా, అప్పటికే పూర్తయిన వాటికి కూడా దొడ్డిదారిన దాన్ని వర్తింపజేస్తూ దాదాపు రూ.100 కోట్లు కాంట్రాక్టర్లకు ‘చెల్లించేశారు’. భారాన్నంతా కొనుగోలుదారులపై మోపేం దుకు గుట్టుచప్పుడు కాకుండా ధరలను భారీగా పెంచేశారు. 2013 డిసెంబర్ 16వ తేదీ వరకు త్రిబుల్ బెడ్రూమ్ ఇంటి ధర రూ.33 లక్షలుండగా 17వ తేదీ నుంచి రూ.43.86 లక్షలకు, సింగిల్ బెడ్రూమ్ ఇంటి ధర రూ.14 లక్షల నుంచి రూ.18.49 లక్షలకు పెరిగింది. ఇలా ప్రతి విభాగంలోనూ ధరలకు రెక్కలొచ్చాయి. టీఎన్జీవోలకు శాపం... హైదరాబాద్‌లో చేపట్టిన బండ్లగూడ ప్రాజెక్టును సరసమైన ధరలకు టీఎన్జీవోలకు విక్రయించాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయించిం ది. ఈ మేరకు అధికారులు తాజాగా వాటి ధరలు తగ్గించారు. అయితే జీవో 35ను వర్తింప చేయకముందు (2013 డిసెంబర్ 17కు ముందు) ఉన్న ధరల కంటే ఈ తగ్గింపు ధరలు దాదాపు రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు ఎక్కువగా ఉండటం గమనార్హం. కాంట్రాక్టర్లకు లబ్ధి కలిగించే నిర్ణయం తీసుకుని ఉండకపోతే బండ్లగూడ స్వగృహ ఇంటి ధరలు దాదాపు రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు తగ్గేవి. నేడుహైలెవల్ కమిటీ సమావేశం... స్వగృహపై నిర్ణయాలు తీసుకోవటానికి సీఎస్ అధ్యక్షతన ఏర్పాటైన ఐదుగురు సభ్యుల హైలెవల్ కమిటీ సోమవారం భేటీ అవుతోంది. స్వగృహ ధరలు చదరపు అడుగుకు రూ.1,800 మించకుండా చూడాలంటూ టీఎన్టీవోలు చేసిన ప్రతిపాదనపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది. స్వగృహ భూములకు విలువ కట్టకపోతే ఇది సాధ్యమనే అభిప్రాయముంది. దీనిపై చర్చించవచ్చు.