'పుష్ప'.. సినిమాలో అల్లు అర్జున్ డైలాగు మాదిరిగా ఈ కాలు నాదే ఆ కాలు నాదే అంటూ కాలుపై కాలు వేసుకని దర్జాగా కూర్చోన్నారు అంతే సంగతి. ఇలా కూర్చొంటే చాల దుష్ప్రభావాలు ఎదుర్కొనక తప్పదంటున్నారు నిపుణులు. అధ్యయనాల్లో ఎన్నో సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. జాగ్రత్తగా ఉండకపోతే రానురాను పరిస్థితి కష్టమైపోతుందని హెచ్చరిస్తున్నారు. అంతేగాదు కాలు మీద కాలు వేసి కూర్చొవడం వల్ల నష్టాలు, లాభాలు రెండు ఉన్నాయని వెల్లడించారు.
శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం మనం మూడు రకాలుగా కూర్చొంటారని చెబుతున్నారు. 62 శాతం మంది తమ కాళ్లను కుడివైపు క్రాస్ చేస్తుండగా, 26 శాతం మంది ఎడమవైపుకి, ఇక 12 శాతం మంది ఎటువీలైతే అటు క్రాస్ చేస్తుంటారని అధ్యయనాల్లో పేర్కొన్నారు. అలాగే క్రాస్ చేసి కూర్చొవడంలో కూడా రెండు రకాలుగా కూర్చొంటారని అంటున్నారు వైద్యులు ఒకటి, రెండు మోకాళ్లను ఒకదానిపై ఒకటి క్రాస్ చేయడం, రెండు, చీలమండలం క్రాస్ చేసి కూర్చొవడం.
కాలుమీద కాలు వేసి కూర్చొవడం వల్ల..?
👉హిప్స్ అమరికలో తేడాలు వస్తాయి రెండింటిని పోలిస్తే ఒకటి పెద్దగా అవుతుంది. అంతేకాదు కాలు మోకాలు, హిప్ , పాదాలు వంటి కింద భాగాలకు సరఫరా అయ్యే రక్త ప్రసరణలో తేడా వస్తుంది.
👉నిజానికి చీల మండలం దగ్గర క్రాస్ చేసుకుని కూర్చోవడం కంటే మోకాలిపై మోకాలు క్రాస చేసి కూర్చొవడమే అత్యంత ప్రమాదకరం అని అధ్యయనాలు చెబుతున్నాయి.
👉ఇలా కాళ్లు క్రాస్ చేసి కూర్చోవడం వల్ల సిరల్లో రక్తప్రవాహం తగ్గి రక్తపోటు అధికమవుతుంది.
శరీరంపై ఏర్పడే దుష్ప్రభావమెంత అంటే..?
👉కాలు మీద కాలు వేసుకుని సుదీర్ఘకాలం పాటు కూర్చొంటే ..కండరాల పొడవు, పెలివిక్ బోన్స్ అమరికలో దీర్ఘకాలిక మార్పులు వస్తాయి.
👉శరీరం ముందుకు వంగిపోయే గుణం భుజాలు ముందుకు వచ్చే అవకాశం ఉంటుందని ఒక అధ్యయనంలో తేలింది.
👉అలాగే మెడ ఎముకల్లో మార్పు రావడం వల్ల తలభాగం అమరికలో కూడా మార్పులు వస్తుంటాయి. దీని వల్ల మెడ కూడా ప్రభావితమవుతుంది. ఎందుకంటే?.. ఇలా కూర్చొన్నప్పుడూ శరీరంలో ఒకవైపు.. మరోవైపుతో పోలిస్తే బలహీనంగా మారుతుంది.
👉ఇక పొత్త కడుపు కండరాల్లో మెన్నుముక కింద భాగంలో కూడా ఇదేరకమైన మార్పులు రావచ్చు. ఒకవేళ పిరుదులు, కండరాలపైనే ఎక్కువ సమయం పాటు భార పడటం వల్ల పొత్తి కడుపు కూడా తన సర్దుబాటు లక్షణాలను కోల్పోయి బలహీనంగా మారి గూని వచ్చే అవకాశాలు ఉన్నాయి.
దీని కారణంగా మన శరీరంలో భాగాలు అసాధారణమైన ఆకారంలోకి మారే ప్రమాదం కూడా ఉంది.
క్రాస్ లెగ్స్ వల్ల ఫైబులర్ నరాలుగా పిలిచే పెరోనియల నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ వ్యాధికి గురైన వ్యక్తి తన కాలి వేళ్లను ముందు భాగాన్ని సొంతంగా కదిలించలేడు. ఐతే ఇది చాలా కేసుల్లో చాలా స్వల్పకాలికమే. కొన్ని నిమిషాల తర్వాత ఇవి మళ్లీ సాధారణస్థితికి వచ్చేస్తాయి.
👉వీర్య కణాల ఉత్పత్తిపై కూడా ప్రభావం చూపుతుందని పరిశోధనల్లో రుజువైంది
సాధారణంగా శరీర ఉష్ణోగ్రతల కన్నా టెస్టికల్స్ ఉష్ణోగ్రత 2 నుంచి 6 డిగ్రీల సెల్సియస్ తక్కువగా ఉండాలి. ఇలా కూర్చొవడం వల్ల వీటి ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియల్ పెరుగుతాయి. పైగా క్రాస్ లెగ్ స్థితిలో కూర్చొన్నప్పుడూ.. ఉస్ణోగ్రతలు 3.5 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉంది.
టెస్టికల్స్‌లో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల వీర్యకణాల ఉత్పత్తి నాణ్యత తగ్గుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
ఇక మహిళలు, పురుషుల్లో శరీర నిర్మాణానికి సంబంధించి చాలా మార్పులు ఉంటాయి. పురుషులతో పోలిస్తే మహిళలే తేలికగా కాలుపై కాలు వేసుకుని కూర్చొగలుగుతారు. అందువల్లే వారికే ఈ ప్రమాదం ఎక్కువ అని పరిశోధనలు పేర్కొన్నాయి.
క్రాస్ లెగ్స్ వల్ల ప్రయోజనాలు..
- ఒక కాలు పొడువు ఉన్నవారు ఇలా కూర్చొవడం వల్ల పొత్తికడుపులో ఇరువైపు లో పొడవు సర్దుబాటు అయ్యి అమరికలు మెరుగయ్యాని 2016లో ఒక అధ్యయనంలో గుర్తించింది
- క్రాస్ లెగ్ వల్ల కండరాల పనిభారం తగ్గుతుంది. ముఖ్యమైన కండరాలు ఉపశమంనం పొంది అతిశ్రమ భారం నుంచి విముక్తి పొందవచ్చు.
చివరిగా మనం కూర్చొనే విధానం సౌకర్యంవంతంగా ఉండటం తోపాటు ఆరోగ్యవంతంగా ఉండటం చాలా ముఖ్యం. సాధ్యమైనంత వరకు కాలు మీద కాలు వేసుకుని కూర్చొకపోవడమే మంచిది. కాలుమీద కాలు వేసుకుని కూర్చొవడం వల్ల పైన చెప్పినవే గాక ఇంకా ఇతరత్ర సమస్యలకు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీని వల్ల ఊబకాయం, కదలకుండా ఒకేచోట కూర్చొనే జీవన విధానాన్ని అలవడుతుందని పరిశోధనలు పేర్కొన్నాయి. అందువల్ల చాలాసేపు ఒకేవిధానం కూర్చొకూడదు. కనీసం మధ్యమధ్యలో లేవడం తోపాటు కొద్ది దూరం నడవాలి.
Comments
Please login to add a commentAdd a comment