sitting
-
గంటలకొద్దీ కూర్చోవడం వల్ల కేన్సర్ వస్తుందా..?
ప్రస్తుతం చాలావరకు డెస్క్ జాబ్లే. అందరూ కంప్యూటర్ల ముందు గంటలకొద్దీ కూర్చొని పనిచేసే ఉద్యోగాలే చేస్తున్నారు. శారీరక శ్రమ లేని ఇలాంటి ఉద్యోగాల వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కవని నిపుణులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఇలా గంటలకొద్ది కూర్చొవడం అనేది ధూమపానం సేవించినంత హానికరం అని, దీనివల్ల కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇస్తున్నారు నిపుణులు. ఇదేంటి కూర్చోవడం వల్ల కేన్సర్ వస్తుందా..?. అసలు ఈ రెండింటికి లింక్ అప్ ఏమిటి తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!.డెస్క్ జాబ్‌లు చేసేవారు, టీవీ బాగా చూసేవారు, పుస్తకాలు బాగా చదివేవారు, వీడియో గేమ్‌లు ఆడేవారు.. గంటలతరబడి కూర్చునే ఉంటారు. ఇలాంటి వాళ్లు వ్యాయామాలు చేసినా ..ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడం ఖాయమేనని చెబుతున్నారు నిపుణులు. అవి కాస్త కొలొరెక్టల్, ఊపిరితిత్తులు, ప్రోస్టేట్, అండాశయాలు లేదా ఎండోమెట్రియల్ వంటి కేన్సర్లకు దారితీసే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. ఎలా అంటే..మానవులు నిటారుగా నిలబడితేనే హృదయనాళ వ్యవస్థ, ప్రేగు కదలికలు, కీళ్లు మెరుగ్గా ఉంటాయి. అలాగే ఎముకలు దృఢంగా ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. అప్పుడే శారీరకంగా చురుకుగా ఉండటమే గాక మొత్తం శక్తిస్థాయిలు సమంగా ఉండి.. బాడీకి కావాల్సిన బలాన్ని అందిస్తాయని అన్నారు. స్థిరంగా లేదా నిశ్చలంగా ఒకే చోట కదలకుండా కూర్చొని పనిచేయడం లేదా వీడియో గేమ్‌లు ఆడటం అనేది స్థూలకాయానికి దారితీసి.. కేన్సర్ ప్రమాదాన్నిపెంచే అవకాశం ఉందని అన్నారు. నడిస్తే కేన్సర్ ప్రమాదం తగ్గుతుందా..?వ్యాయామాలు చేయడం మంచిదే గానీ అదీ ఓ క్రమపద్ధతిలో చేయాలి. పెద్దలు కనీసం ప్రతివారం సుమారు 150 నిమిషాల పాటు శారీరక శ్రమపొందేలా తీవ్రతతో కూడిన వ్యాయామాలు చేయాలని చెప్పారు. ఎక్కువ వ్యాయామాలు చేస్తున్నాం కదా అని.. రోజులో దాదాపు ఎనిమిది గంటలు కూర్చొంటే పెద్దగా ఫలితం ఉండందంటున్నారు. ఎక్కువసేపు నిశ్చలంగా కూర్చోవడం అనేది ఆరోగ్యానికి ప్రమాదమేనని నొక్కి చెబుతున్నారు నిపుణులు.ఏం చేయాలంటే..పనిప్రదేశంలో మీ వర్క్‌కి అంతరాయం కలగకుండా కూర్చోనే చేసే చిన్నచిన్న వ్యాయామాలు చేయండి. సాధ్యమైనంత వరకు మీకు కావాల్సిన ప్రతీది మీరే స్వయంగా నడిచి వెళ్లి తెచ్చుకునే యత్నం చేయండి. ఆపీస్ బాయ్‌పై ఆధారపడటం మానేయండి. కొన్ని కార్యాలయాల్లో స్టాండింగ్ , ట్రెడ్మిల్ డెస్క్‌ల వంటి సామాగ్రి ఉంటుంది. కాబట్టి వాటిని మధ్యమధ్య విరామాల్లో వినయోగించుకోండి. అలాగే ఇంటిని చక్కబెట్టే పనులను కూడా కూర్చోవడానికి బదులుగా నిలుచుని సౌకర్యవంతంగా చేసుకునే యత్నం చేయండి. సాధ్యమైనంతవరకు మెట్లు ఎక్కే ప్రయత్నం చేయండి. ఇలాంటి చిట్కాలతో అనారోగ్య సమస్యలను దరిచేరనివ్వకుండా చూసుకోండి. స్క్రీన్ సమయాన్ని కూడా తగ్గించండి..పరిశోధన ప్రకారం..25 ఏళ్ల తర్వాత టెలివిజన్ లేదా స్క్రీన్‌ని చూసే ప్రతిగంట మీ ఆయుర్దాయాన్ని సుమారు 22 నిమిషాలకు తగ్గిస్తుందని చెబుతున్నారు. ఎందువల్ల అంటే.. కూర్చొని టీవీ లేదా ఫోన్ చూస్తుంటే సమయమే తెలీదు. అదీగాక తెలియకుండానే గంటలకొద్దీ కూర్చుంటారు ఆయా వ్యక్తులు. దీన్ని అధిగమించాలంటే సింపుల్‌గా స్క్రీన్ సమయాన్ని తగ్గించుకోవడమే బెటర్ అని అంటున్నారు నిపుణులు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: నడవలేనంత అనారోగ్య సమస్యలతో వినోద్ కాంబ్లీ: ఆ వ్యాధే కారణమా..?) -
USA: డెమొక్రాట్లకు మళ్లీ షాకిచ్చిన బైడెన్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ డెమొక్రాట్లకు మళ్లీ షాకిచ్చారు. ఇప్పటికే వృద్ధాప్యం రీత్యా బైడెన్ అధ్యక్ష ఎన్నికల పోటీ నుంచి తప్పుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది. జూన్27న రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన డిబేట్లో బైడెన్ తడబడినప్పటి నుంచి సొంత పార్టీ డెమొక్రాట్లలోనే ఆయన అభ్యర్థిత్వంపై అసమ్మతి మొదలైంది. ఈ నేపథ్యంలో బైడెన్ తన వృద్ధాప్యాన్ని మరోసారి చాటుకునేలా వింతగా ప్రవర్తించారు. తాజాగా ఫిలడెల్ఫియాలోని ఓ చర్చిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాస్టర్ అందరినీ నిల్చోవాల్సిందిగా కోరారు.పాస్టర్ విజ్ఞప్తి మేరకు అందరూ నిల్చున్నప్పటికీ అక్కడే ఉన్న బైడెన్ మాత్రం కూర్చొనే ఉన్నారు. ఎన్నికల ప్రచార నిధుల సేకరణ కోసం పెన్సిల్వేనియా పర్యటనకు వెళ్లినపుడు ఈ ఘటన జరిగింది. దీంతో అధ్యక్ష ఎన్నికల పోటీకి బైడెన్ సామర్థ్యం మరోసారి ప్రశ్నార్థకంలో పడినట్లయింది. ఈ ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికల తుది పోరు జరగనుంది. -
అలాంటి మరణాలకు కాఫీతో చెక్ : ఎగిరి గంతేసే విషయం!
కదలకుండా ఒకేచోట గంటల తరబడి కూర్చోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలొస్తాయని, ప్రాణానికే ముప్పు అని గతంలో అనేక పరిశోధనలు తేల్చి చెప్పాయి. అయితే తాజా అధ్యయనం మాత్రం దీనికి ఒక పరిష్కారాన్ని సూచిస్తోంది. అదేంటో తెలిస్తే ఎగిరి గంతేస్తారు. నిజానికి ఇలాంటి అధ్యయనం చేయడం ఇదే తొలిసారి. విషయమం ఏమిటంటే.కూర్చోవడం వల్ల మరణ ప్రమాదాన్ని కాఫీ తగ్గిస్తుందట. నిశ్చల జీవనశైలి వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలకు కాఫీ ఆశ్చర్యకరమైన ఆయుధంగా ఉంటుందని కొత్త అధ్యయనం సూచిస్తుంది. కాఫీ తాగని వారితో పోలిస్తే ఎక్కువ సేపు కూర్చుని రోజూ కాఫీ తాగే వారు వివిధ కారణాల వల్ల చనిపోయే అవకాశం తక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. కూర్చోవడం వల్ల కలిగే ప్రమాదాలను కాఫీ ఎలా ఎదుర్కొంటుంది అనే అంశంపై 10 వేల మందిపై ఈ అధ్యయనం సాగింది. ఆసక్తికరంగా, ఎక్కువసేపు కూర్చొనే వ్యక్తుల్లో ఎంత కాఫీ తాగినా గుండె జబ్బులతో మరణించే ప్రమాదం తక్కువట. ఎక్కువసేపు కూర్చున్న కాఫీ తాగని వారితో పోలిస్తే ఎక్కువ కాఫీ (రోజుకు 2.5 కప్పుల కంటే ఎక్కువ) తీసుకునే వారు కూడా మొత్తం మరణాల ప్రమాదాన్ని తగ్గిందని ఈ స్టడీ ద్వారా తెలుస్తోంది. ఇదే అధ్యయనంలో మరో ఆసక్తికరమైన విషయమం ఏమిటంటే తీసుకోవాల్సిన లిమిట్ 3-5 కప్పులు. ఐదు కప్పులు దాటితే ప్రయోజనాలు తగ్గి పోతాయట. ఈ పరిశోధనలు ఆశాజనకంగా ఉన్నాయని అయితే సరైన ఆరోగ్య ప్రయోజనాల కోసం ఎంత మోతాదు తీసుకోవాలనేదానిపై మరింత పరిశోధనఅవసరం అంటున్నారు పరిశోధకులు.ఈ అధ్యయనం బీఎంసీ పబ్లిక్ హెల్త్ జర్నల్‌లో ప్రచురించబడింది.గతంలో కూడా కాఫీ ద్వారా సుదీర్ఘ, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడవపచ్చని అధ్యయనాలు చెప్పాయి. అలాగే కెఫీన్ ద్వారా టైప్ -2 మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చని పేర్కొన్నాయి. కొలొరెక్టల్ కేన్సర్‌తో బాధపడుతున్న వ్యక్తులు ప్రతిరోజూ కనీసం ఐదు కప్పులు తాగేవారు తక్కువ తాగే వారితో పోలిస్తే పునరావృతమయ్యే అవకాశం గణనీయంగా తగ్గింది. కాఫీలో కూడా యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి, ఇవి జీవక్రియను మెరుగుపరుస్తాయి వాపును తగ్గిస్తాయి. కొన్ని కాఫీ భాగాలు మెదడును క్షీణించిన వ్యాధుల నుండి కూడా రక్షిస్తాయని కూడా తెలిపాయి. -
పార్టీ ధిక్కారానికి పాల్పడితే వేటే..
సాక్షి, హైదరాబాద్: ముందు నుంచీ చెప్తున్నట్టుగానే సిట్టింగ్‌లకే పార్టీ టికెట్లు కేటాయించామని.. పార్టీ ధిక్కార చర్యలకు ఎవరు పాల్పడినా వేటు తప్పదని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ హెచ్చరించారు. ధిక్కారానికి పాల్పడేవారు ఏ స్థాయిలో ఉన్నా క్రమశిక్షణ చర్యలు సాదాసీదాగా ఉండవని, పార్టీ నుంచి పంపించేస్తామని స్పష్టం చేశారు. ఒకట్రెండు చోట్ల అసంతృప్తులుంటే.. పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు అధ్యక్షతన త్రిసభ్య కమిటీని నియమిస్తామని, ఆ కమిటీ సమస్యలను పరిష్కరిస్తుందని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమకెవరూ పోటీయే కాదని.. 95 నుంచి 105 సీట్లలో బీఆర్ఎస్ అభ్యర్థులే గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. సోమవారం తెలంగాణ భవన్ లో 115 మంది బీఆర్ఎస్ అభ్యర్థులతో జాబితాను కేసీఆర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. పార్టీలో పూర్తి స్థాయి అవగాహన, సర్దు బాట్లతోనే ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటిస్తున్నామన్నారు. పార్టీ నిర్ణయం మేరకు తాను రెండు చోట్ల పోటీ చేస్తున్నట్టు తెలిపారు. శ్రావణమాసం మంచి ముహుర్తం ధనుర్లగ్నంలో అభ్యర్థులను ప్రకటించామని.. వీరిని గెలిపించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేలా ఆశీర్వదించాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. అక్టోబర్ 16న వరంగల్‌లో సింహ గర్జన బహిరంగ సభ నిర్వహిస్తామని, అదే రోజున బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల చేస్తామని ప్రకటించారు. తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని మార్పులు తప్పనిసరి పరిస్థితుల్లో ఏడుగురు సిట్టింగ్‌లను మార్చామని సీఎం కేసీఆర్ చెప్పారు. ఎవరినైనా వదులుకోవాలంటే తమకు కూడా బాధగానే ఉంటుందన్నారు. అవకాశం రానివారు చిన్నబుచ్చుకోవాల్సిన అవసరం లేదని.. ఎమ్మెల్సీ, ఎంపీ, జెడ్పీ చైర్పర్సన్లుగా పార్టీ అవకాశాలు కలి్పస్తుందని హామీ ఇచ్చారు. పార్టీలోనే ఉండి అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. మిగిలిపోయిన 4 సీట్లలో అభ్యర్థులను రెండు మూడు రోజుల్లో ఖరారు చేస్తామని చెప్పారు. వేములవాడ అభ్యర్థి మంచివాడే అయినా ఆయన పౌరసత్వం సమస్య కోర్టుల్లో ఉందని చెప్పారు. భూపాలపల్లి నుంచి గండ్ర వెంకటరమణారెడ్డికి పోటీచేసే అవకాశం ఇస్తామని హామీ ఇచ్చినందున మధుసూదనాచారి సహకారంతో టికెట్ కేటాయించామన్నారు. తాండూరు నుంచి మహేందర్‌రెడ్డి కూడా యువకుడికి అవకాశం ఇవ్వడానికి పూర్తిగా సహకరించి ఆశీర్వదించారని చెప్పారు. వామపక్షాలతో పొత్తు మాటే రాదు బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేశాక వామపక్షాలతో పొత్తు మాటే ఉత్పన్నం కాదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 34 సీట్లు బీసీలకు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించిందని, బీఆర్ఎస్ బీసీలకు తక్కువ సీట్లు కేటాయించిందేమని మీడియా ప్రశ్నించగా.. ‘చూద్దాం.. ఎవరెన్ని సీట్లు కేటాయిస్తారో?’అని బదులిచ్చారు. మహిళలకు తక్కువ సీట్లపై స్పందిస్తూ.. పార్లమెంటు చట్టం చేస్తే ప్రతీపార్టీ కూడా మహిళలకే అవకాశాలు ఇస్తాయని, ప్రస్తుత పరిస్థితుల్లో అన్నీ ఆలోచించి టికెట్లు కేటాయించామని వివరించారు. కర్ణాటకకు, తెలంగాణకు పోలికే లేదు ఇటీవలి కర్ణాటక అసెంబ్లీ ఫలితాలకు, తెలంగాణకు పోలికే లేదని కేసీఆర్ పేర్కొన్నారు. అలవిగాని హామీలిచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయలేక చేతులెత్తేస్తోందని విమర్శించారు. బెంగళూరుకు విద్యుత్ సరఫరా చేయలేక లోడ్ షెడ్డింగ్ చేస్తున్నారన్నారు. తెలంగాణలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నా.. బీఆర్ఎస్ లక్ష రూపాయలే, అదీ విడతల వారీగా మాఫీ చేస్తామని, ప్రజలు తమనే నమ్మి గెలిపించారని చెప్పారు. జవదేకర్ ఓ పాగల్..! సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి బీజేపీ సీనియర్ నేత ప్రకాశ్ జవదేకర్ చేసిన విమర్శలను ప్రస్తావించగా.. ‘‘జవదేకర్ మాట్లాడేది ఏంది? కాళేశ్వరం గురించి తొండం తెల్వదు.. తోక తెల్వదు. ఎన్నిసార్లు చెప్పిందే చెప్తారు. ఆయనో ఓ పాగల్. బీఆర్ఎస్ను ఒకరికొకరు ఏ టీమ్, బీ టీమ్ అంటున్న కాంగ్రెస్, బీజేపీలు కూడా పాగల్ పార్టీలు..’’అని కేసీఆర్ మండిపడ్డారు. వ్యతిరేకులకు ఇళ్ల స్థలాలివ్వం: కేసీఆర్ ‘‘రాష్ట్రానికి వ్యతిరేకంగా, అభివృద్ధికి విఘాతం కలిగించేలా కథనాలు ప్రచురించే పత్రికల్లోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వం. వాళ్లను పాలు పోసి పోషించాల్సిన అవసరమేముంది? ఎవరికి ఇవ్వా లన్నది ప్రభుత్వ విచక్షణ. కీలుబోమ్మలాంటి వారు జర్నలిస్టులు ఎలా అవుతారు? వాళ్లకు ఐడియా ఉండాలి కదా.. దేశంలో ఎవరూ మాతో పోల్చుకోవడానికి కూడా సాహసం చేయని పరిస్థితులు ఉంటే.. ఇక్కడ వేతనాలు ఇవ్వడానికి డబ్బుల్లేవంటూ కథనాలు రాస్తున్నారు. ఒకే దెబ్బకు రూ.20 వేల కోట్ల రుణమాఫీ చేశాం. ఆ పత్రిక తల ఎక్కడ పెట్టుకుంటుంది? ఆర్బీఐ రాష్ట్రాన్ని బెస్ట్ స్టేట్ అంటోంది. కేంద్రం, కేంద్ర మంత్రులు తెలంగాణ అభివృద్ధిని చెబుతూ అవార్డులిస్తుంటే.. అవేవీ పట్టించుకోకుండా పనికి మాలిన రాతలు రాస్తున్నారు. ఇదేం జర్నలిజం? ఉద్యమ సమయంలోనే చెప్పా.. కొన్ని కుల పత్రికలు, గుల పత్రికలు ఉన్నాయని.. న్యూస్‌పేపర్ కాదు వ్యూస్ పేపర్, చానెల్స్ ఉన్నాయి..’’అని సీఎం ఘాటుగా స్పందించారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు అంశంపై మీడియా ప్రశ్నించగా ఇలా స్పందించారు. -
చేసే పనీ.. చేటు చేయొచ్చు.. జలుబు నుంచి క్యాన్సర్ దాకా..
ఒక వ్యక్తి రోజులో ఎక్కువ భాగం గడిపే చోటు ఏదైనా ఉందంటే అది ఉద్యోగం/ వృత్తిపరమైన విధులు నిర్వర్తించే ప్రదేశమే. ఎవరికైనా ఇది తప్పనిసరే అయినా.. ఆయా ఉద్యోగాలు/వృత్తి ప్రదేశాలకు వ్యక్తుల అనారోగ్యాలకు సంబంధం ఏర్పడుతోంది. సాధారణ జలుబు నుంచి తీవ్రమైన అనారోగ్యాలకు కారణమయ్యే దాకా.. వివిధ ఉద్యోగాలు, వృత్తుల ప్రభావం పడుతోంది. ఆరోగ్యం క్షీణించడం మొదలయ్యే వరకు కూడా చాలా మంది ఈ సమస్యను గమనించలేని పరిస్థితి ఉంటుంది. ఇటీవలికాలంలో వృత్తి వ్యాపకాల ప్రభావం గతంలో కంటే మరింత పెరిగిందని.. శారీరకంగానే కాకుండా మానసికంగానూ ఇబ్బంది పెరుగుతోందని నిపుణులు అంటున్నారు. వీటినే ఆక్యుపేషనల్ హజార్డ్స్గా చెప్తున్నారు. ఈ సమస్యలు రాకుండా ఉండటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆక్యుపేషనల్ హెల్త్‌పై అవగాహన కలిగిస్తున్న పలు సంస్థల అధ్యయనాలు ఏయే రంగాల్లో పనిచేస్తున్నవారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయన్నది తేల్చి చెప్తున్నాయి. వాటి ప్రకారం.. – సాక్షి, హైదరాబాద్ అనారోగ్య ‘గనులు’.. గనులలో పనిచేసే కార్మికులు, ఉద్యోగులకు వారు పీల్చే కలుషిత గాలి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. నెమ్మదిగా ఊపిరితిత్తులు పాడవుతాయి. ఎన్ని జాగ్రత్తలు, గట్టి టోపీలు, అగ్నిమాపక భద్రత పరికరాలు, గాగుల్స్ వంటివి వాడినా ప్రమాదం తప్పని పరిస్థితే ఉంటోందని నిపుణులు తేల్చారు. సమస్యల కర్మాగారాలు.. కర్మాగారాల్లో భారీ యంత్రాలు, ప్రమాదకరమైన పదార్థాలు ఉంటాయి. పెద్ద శబ్దాలు వెలువడతాయి. ఇవన్నీ వ్యక్తుల ఆరోగ్యానికి హానికరమే. ఫ్యాక్టరీ కారి్మకులు, మేనేజర్లు లేదా ఫ్లోర్ వర్కర్లలో వినికిడి లోపం సాధారణంగా మారుతోంది. భవన నిర్మాణం.. ఆరోగ్య ధ్వంసం.. నిర్మాణ రంగంలో ప్రతి ఒక్కరికీ, వారు కార్మికులు, ఉద్యోగులు, డిజైనర్లు ఎవరైనా సరే.. ఎక్కువసేపు అక్కడే గడిపితే ప్రమాదకరమే. సిమెంట్, మట్టి, ఇసుక ధూళి, పెయింట్లు, మరికొన్ని నిర్మాణ ఉత్పత్తులు ఊపిరితిత్తులను దెబ్బతీస్తాయి. బిపీఓలలో.. బాడీ క్లాక్‌కు బ్రేక్.. బిజినెస్ ప్రాసెస్ ఔట్ సోర్సింగ్ (బీపీఓ) సెంటర్లలో రాత్రి షిఫ్టులలో పనిచేయడం, నిరంతర రాత్రి షిఫ్టులు, తరచూ షిప్టులు మారడం వంటివి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. పగటిపూట నిద్రపోతున్నా, షిఫ్టులు మారుతున్నా శరీరంలోని జీవ గడియారం (బయోలాజికల్ క్లాక్) ప్రభావితమవుతుంది. దీర్ఘకాలిక నష్టానికి కారణమవుతోంది. రాత్రి షిఫ్టులలో పనిచేసేవారిలో హైపర్ టెన్షన్, డయాబెటిస్‌తోపాటు సెప్టిక్ అల్సర్లు, గ్యా్రస్టిక్ అల్సర్లు వస్తున్నాయి. శుభ్రత.. ఆరోగ్యానికి లేదు భద్రత.. విభిన్న రకాల ఆవరణలను శుభ్రపరిచే వారికీ ఆరోగ్యపు ముప్పు తప్పడం లేదు. టాయిలెట్, బాత్రూం, ఫ్లోర్ క్లీనర్లు వాడినప్పుడు విష వాయువులు వెలువడతాయి. అవి చాలా ప్రమాదకరం. కంప్యూటర్.. వెన్నెముక కష్టాలు.. కంప్యూటర్ స్క్రీన్ ముందు ఎక్కువ గంటలు కూర్చుని పనిచేసేవారికి వెన్ను భాగం, చేతులు, కళ్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇటీవల ఈ రకమైన కెరీర్‌ను ఎంచుకుంటున్నవారు పెరిగారు. చాలా మంది వెన్నెముక సమస్యలు, స్లిప్డ్ డిస్క్, కండరాల ఒత్తిడి వంటి సమస్యలతో బాధపడుతున్నారు. పూల డిజైనర్‌కూ డేంజర్.. అందంగా, ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ పూల డిజైనర్ వృత్తి కూడా సమస్య రేపేదే. పూల డిజైనర్ కాండం నుంచి పూలను కత్తిరించి, అందంగా అమర్చే సమయంలో వాటికి దగ్గరగా ఉంటారు. ఆ పూల మొక్కల కోసం వినియోగించే బలమైన పురుగుమందుల ప్రభావానికి లోనవుతారు. వినికిడికి.. ‘ధ్వని’ దెబ్బ.. ఎక్కువ ధ్వని వెలువడే పరిశ్రమలు, ప్రాంతాల్లో పనిచేస్తున్నవారు వినికిడి సమస్యల బారినపడుతున్నారు. దీనికి సంబంధించి మార్గదర్శకాలు కూడా ఉన్నాయి. ఏవైనా పరిశ్రమల్లో ఒక ఉద్యోగి 8గంటల పాటు 90 డెసిబుల్స్ ధ్వనిలో పనిచేయవచ్చు. 95 డెసిబుల్స్ ఉంటే 4 గంటలు, 100 డెసిబుల్స్ ఉంటే 2 గంటలు మాత్రమే పనిచేయాలి. అదే 115 డెసిబుల్స్, ఆపైన తీవ్రతతో ధ్వని ఉంటే.. ఒక్క నిమిషం కూడా ఉండొద్దు. అంతేకాదు.. ఇయర్ ప్లగ్స్, ఇయర్ కెనాల్స్ వంటివి వాడాలి. వృత్తికో వ్యాధి తప్పట్లేదు అనేక రకాల పరిశ్రమలు, రంగాలు, వృత్తులు, ఉద్యోగాలు వివిధ రకాల అనారోగ్యాలకు కారణమవుతున్నాయి. ►ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు ఊపిరితిత్తుల సమస్యలు, అతిగా నిలబడడం వల్ల వెరికోసిటీస్, వినికిడి సమస్యలు వస్తున్నాయి. ►పాఠశాలల్లో పనిచేసే టీచర్లకు ఆక్యుపేషనల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటోందని, డయాబెటిస్, హైపర్ టెన్షన్ బారినపడుతున్నారని అధ్యయనాలు తేల్చాయి. గట్టిగా మాట్లాడుతూ బోధించడం వల్ల గొంతు సమస్యలూ కనిపిస్తున్నాయని అంటున్నాయి. ► లారీలు, కంటైనర్లు వంటి భారీ వాహనాల డ్రైవర్లకు వెన్ను సమస్యలు, ఆస్టియో ఆర్థరైటిస్, వాహనాల వైబ్రేషన్ వల్ల రక్తపోటు సమస్యలు వస్తున్నాయి. కన్నార్పకుండా రోడ్లను చూస్తూ ఉండటం వల్ల కళ్లు పొడిబారుతూ దృష్టి సమస్యలు వస్తున్నట్టు గుర్తించారు. ►సిలికా పరిశ్రమలో పనిచేసేవారు ఊపిరితిత్తులకు సంబంధించిన సిలికోసిస్‌కు గురవుతారు. ఆస్బోస్టాస్ పరిశ్రమల్లో పనిచేసేవారు పలు రకాల కేన్సర్లకు, చక్కెర పరిశ్రమలో పనిచేసేవారు పెగసోసిస్ వంటివాటికి గురవుతారు. ముందు జాగ్రత్తలు పాటిస్తేనే మేలు ‘ఆక్యుపేషనల్ హజార్డ్స్’ బారిన పడకుండా ముందు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. తాము చేస్తున్న ఉద్యోగం/వృత్తి వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో గుర్తించి.. వాటి నుంచి తప్పించుకునే అంశాలను పాటించాలని స్పష్టం చేస్తున్నారు. ఉదాహరణకు కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుని పనిచేసేవారు.. మధ్యలో కాసేపు లేచి నడవడం, దూరంగా ఉన్న వస్తువులను చూడటం, వీలైతే చిన్నచిన్న వ్యాయామాలు చేయడం మంచిదన్నారు. అపరిశుభ్ర, కాలుష్య పరిస్థితుల్లో పనిచేసేవారు మాస్కులు, గ్లౌజులు వంటివి కచ్చితంగా వాడాలన్నారు. వైద్యులను సంప్రదించి ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో సలహాలు తీసుకుని పాటించాలని స్పష్టం చేస్తున్నారు. అవగాహన కల్పిస్తున్నాం.. వృత్తి, ఉద్యోగపరమైన బాధ్యతల వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. వీటి పై తరచుగా అవగాహన సద స్సులు నిర్వహిస్తున్నాం. గత వారం ట్రాఫిక్ పోలీసులకు వచ్చే సమస్యలపై సదస్సు ఏర్పాటు చేశాం. కొత్తగా పుట్టుకొస్తున్న ప్రొఫెషన్ల వల్ల కూడా కొత్త ఆరోగ్య సమస్యలు మొదలవుతున్నాయి. ఈ తరహా ఆక్యుపేషనల్ హజార్డ్స్‌కు చికిత్సలు లేవు. అందువల్ల ఆయా రంగాల్లో విధులు నిర్వర్తిస్తున్నవారు అవగాహన పెంచుకుని, జాగ్రత్తలు పాటించాలి. – డాక్టర్ విజయ్‌రావు, జాతీయ అధ్యక్షుడు, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ -
కాలుపై కాలు వేసుకుని దర్జాగా కూర్చొన్నారో..ప్రమాదంలో పడినట్లే!
'పుష్ప'.. సినిమాలో అల్లు అర్జున్ డైలాగు మాదిరిగా ఈ కాలు నాదే ఆ కాలు నాదే అంటూ కాలుపై కాలు వేసుకని దర్జాగా కూర్చోన్నారు అంతే సంగతి. ఇలా కూర్చొంటే చాల దుష్ప్రభావాలు ఎదుర్కొనక తప్పదంటున్నారు నిపుణులు. అధ్యయనాల్లో ఎన్నో సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. జాగ్రత్తగా ఉండకపోతే రానురాను పరిస్థితి కష్టమైపోతుందని హెచ్చరిస్తున్నారు. అంతేగాదు కాలు మీద కాలు వేసి కూర్చొవడం వల్ల నష్టాలు, లాభాలు రెండు ఉన్నాయని వెల్లడించారు. శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం మనం మూడు రకాలుగా కూర్చొంటారని చెబుతున్నారు. 62 శాతం మంది తమ కాళ్లను కుడివైపు క్రాస్ చేస్తుండగా, 26 శాతం మంది ఎడమవైపుకి, ఇక 12 శాతం మంది ఎటువీలైతే అటు క్రాస్ చేస్తుంటారని అధ్యయనాల్లో పేర్కొన్నారు. అలాగే క్రాస్ చేసి కూర్చొవడంలో కూడా రెండు రకాలుగా కూర్చొంటారని అంటున్నారు వైద్యులు ఒకటి, రెండు మోకాళ్లను ఒకదానిపై ఒకటి క్రాస్ చేయడం, రెండు, చీలమండలం క్రాస్ చేసి కూర్చొవడం. కాలుమీద కాలు వేసి కూర్చొవడం వల్ల..? 👉హిప్స్ అమరికలో తేడాలు వస్తాయి రెండింటిని పోలిస్తే ఒకటి పెద్దగా అవుతుంది. అంతేకాదు కాలు మోకాలు, హిప్ , పాదాలు వంటి కింద భాగాలకు సరఫరా అయ్యే రక్త ప్రసరణలో తేడా వస్తుంది. 👉నిజానికి చీల మండలం దగ్గర క్రాస్ చేసుకుని కూర్చోవడం కంటే మోకాలిపై మోకాలు క్రాస చేసి కూర్చొవడమే అత్యంత ప్రమాదకరం అని అధ్యయనాలు చెబుతున్నాయి. 👉ఇలా కాళ్లు క్రాస్ చేసి కూర్చోవడం వల్ల సిరల్లో రక్తప్రవాహం తగ్గి రక్తపోటు అధికమవుతుంది. శరీరంపై ఏర్పడే దుష్ప్రభావమెంత అంటే..? 👉కాలు మీద కాలు వేసుకుని సుదీర్ఘకాలం పాటు కూర్చొంటే ..కండరాల పొడవు, పెలివిక్ బోన్స్ అమరికలో దీర్ఘకాలిక మార్పులు వస్తాయి. 👉శరీరం ముందుకు వంగిపోయే గుణం భుజాలు ముందుకు వచ్చే అవకాశం ఉంటుందని ఒక అధ్యయనంలో తేలింది. 👉అలాగే మెడ ఎముకల్లో మార్పు రావడం వల్ల తలభాగం అమరికలో కూడా మార్పులు వస్తుంటాయి. దీని వల్ల మెడ కూడా ప్రభావితమవుతుంది. ఎందుకంటే?.. ఇలా కూర్చొన్నప్పుడూ శరీరంలో ఒకవైపు.. మరోవైపుతో పోలిస్తే బలహీనంగా మారుతుంది. 👉ఇక పొత్త కడుపు కండరాల్లో మెన్నుముక కింద భాగంలో కూడా ఇదేరకమైన మార్పులు రావచ్చు. ఒకవేళ పిరుదులు, కండరాలపైనే ఎక్కువ సమయం పాటు భార పడటం వల్ల పొత్తి కడుపు కూడా తన సర్దుబాటు లక్షణాలను కోల్పోయి బలహీనంగా మారి గూని వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని కారణంగా మన శరీరంలో భాగాలు అసాధారణమైన ఆకారంలోకి మారే ప్రమాదం కూడా ఉంది. క్రాస్ లెగ్స్ వల్ల ఫైబులర్ నరాలుగా పిలిచే పెరోనియల నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ వ్యాధికి గురైన వ్యక్తి తన కాలి వేళ్లను ముందు భాగాన్ని సొంతంగా కదిలించలేడు. ఐతే ఇది చాలా కేసుల్లో చాలా స్వల్పకాలికమే. కొన్ని నిమిషాల తర్వాత ఇవి మళ్లీ సాధారణస్థితికి వచ్చేస్తాయి. 👉వీర్య కణాల ఉత్పత్తిపై కూడా ప్రభావం చూపుతుందని పరిశోధనల్లో రుజువైంది సాధారణంగా శరీర ఉష్ణోగ్రతల కన్నా టెస్టికల్స్ ఉష్ణోగ్రత 2 నుంచి 6 డిగ్రీల సెల్సియస్ తక్కువగా ఉండాలి. ఇలా కూర్చొవడం వల్ల వీటి ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియల్ పెరుగుతాయి. పైగా క్రాస్ లెగ్ స్థితిలో కూర్చొన్నప్పుడూ.. ఉస్ణోగ్రతలు 3.5 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉంది. టెస్టికల్స్‌లో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల వీర్యకణాల ఉత్పత్తి నాణ్యత తగ్గుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇక మహిళలు, పురుషుల్లో శరీర నిర్మాణానికి సంబంధించి చాలా మార్పులు ఉంటాయి. పురుషులతో పోలిస్తే మహిళలే తేలికగా కాలుపై కాలు వేసుకుని కూర్చొగలుగుతారు. అందువల్లే వారికే ఈ ప్రమాదం ఎక్కువ అని పరిశోధనలు పేర్కొన్నాయి. క్రాస్ లెగ్స్ వల్ల ప్రయోజనాలు.. ఒక కాలు పొడువు ఉన్నవారు ఇలా కూర్చొవడం వల్ల పొత్తికడుపులో ఇరువైపు లో పొడవు సర్దుబాటు అయ్యి అమరికలు మెరుగయ్యాని 2016లో ఒక అధ్యయనంలో గుర్తించింది క్రాస్ లెగ్ వల్ల కండరాల పనిభారం తగ్గుతుంది. ముఖ్యమైన కండరాలు ఉపశమంనం పొంది అతిశ్రమ భారం నుంచి విముక్తి పొందవచ్చు. చివరిగా మనం కూర్చొనే విధానం సౌకర్యంవంతంగా ఉండటం తోపాటు ఆరోగ్యవంతంగా ఉండటం చాలా ముఖ్యం. సాధ్యమైనంత వరకు కాలు మీద కాలు వేసుకుని కూర్చొకపోవడమే మంచిది. కాలుమీద కాలు వేసుకుని కూర్చొవడం వల్ల పైన చెప్పినవే గాక ఇంకా ఇతరత్ర సమస్యలకు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీని వల్ల ఊబకాయం, కదలకుండా ఒకేచోట కూర్చొనే జీవన విధానాన్ని అలవడుతుందని పరిశోధనలు పేర్కొన్నాయి. అందువల్ల చాలాసేపు ఒకేవిధానం కూర్చొకూడదు. కనీసం మధ్యమధ్యలో లేవడం తోపాటు కొద్ది దూరం నడవాలి. (చదవండి: అత్యంత వృద్ధుడికి.. లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్) -
ఎక్కువసేపు కూర్చునే ఉంటున్నారా? సమస్యలను కొని తెచ్చుకున్నట్లే!
ఇటీవలి కాలంలో కూర్చుని పనిచేయడం ఎక్కువైంది. అందులోనూ కరోనా ప్రభావం వల్ల ఇంటి దగ్గరే ఉండి కూర్చుని పని చేయడం మరికాస్త ఎక్కువైంది. కూర్చుని పని చేస్తే ఏమైంది, చక్కగా ఒళ్లు అలవకుండా ఉంటుంది కదా అని మురిసిపోవద్దు. అలా గంటల తరబడి కదలకుండా పని చేయడం వల్ల ఎన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయో తెలుసుకుంటే దిగ్భ్రాంతి కలుగుతుంది. కేవలం కంప్యూటర్ ముందు కూర్చుని పని చేయడం ఒక్కటే కాదు, గంటలకొద్దీ డ్రైవ్ చేయడం కూడా భవిష్యత్తులో అనేక రకాల సమస్యలకు దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కూర్చునే ఉండటం వల్ల నష్టాలేమిటో తెలుసుకుంటే.. స్థిమితంగా కూర్చోలేరేమో! ►ధూమపానం, ఊబకాయం వల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో రోజుకు ఏడెనిమిది గంటలపాటు కూర్చోవడం వల్ల కూడా అలాంటి అనారోగ్య సమస్యలే ఎదుర్కోవాల్సి వస్తుందని ఎన్నో అధ్యయనాల్లో తేలింది. తక్కువగా కూర్చోవడం, పడుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరకుండా జాగ్రత్త పడవచ్చని నిపుణుల సలహా. ►నిల్చోవడం, నడవడం వంటి వాటితో పోల్చితే కూర్చోవడం వల్ల చాలా తక్కువ శక్తి ఖర్చవుతుంది. దీనివల్ల ఊబకాయం రావటం, రక్తంలో చక్కెర స్థాయి పెరిగిపోవడం, నడుము చుట్టూ అధికంగా కొవ్వు పేరుకుపోవడం, కొలెస్ట్రాల్ స్థాయుల్లో అసమతుల్యత ఏర్పడటం వంటి సమస్యలు తలెత్తుతాయి. ►సుదీర్ఘకాలం కూర్చోవడం వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది. ఎక్కువసేపు కూర్చోవడానికి, అనారోగ్య సమస్యలకు దారితీసే కారకాలకు మధ్య గల సంబంధం ఏమిటో తెలుసుకోవడానికి అనేక దఫాలుగా అధ్యయనాలు జరిగాయి. ఆ అధ్యయనాలలో ఎవరైతే కదలకుండా రోజుకు 8 గంటలకు పైగా కూర్చున్నారో వారి ఆరోగ్యానికి ప్రమాదం పొంచి ఉన్నట్టు తేలింది. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల... ►ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కాలు, పిరుదుల కండరాలు శక్తి హీనంగా తయారవుతాయి. నడవడానికి, స్థిరంగా నిలబడడానికి ఉపయోగపడే ఈ పెద్ద కండరాలు బలహీనంగా తయారైతే... వ్యాయామాలు చేసినా, కిందపడినా తీవ్రమైన గాయాలవుతాయి. ►అదేపనిగా గంటలకొద్దీ కూర్చోవడం వల్ల ఊపిరితిత్తులు, గర్భాశయం, పెద్ద పేగు క్యాన్సర్లతో సహా మరికొన్ని రకాల క్యాన్సర్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. రోజులో ఎక్కువసార్లు కండరాలను కదిలించడం వల్ల శరీరంలోని కొవ్వులు, చక్కెరలు సంపూర్ణంగా జీర్ణమవుతాయి. అదేగనక మనం రోజంతా కూర్చున్నట్లయితే, జీర వ్యవస్థ బలహీనపడి శరీరంలో కొవ్వులు, చక్కెరనిల్వలు అలాగే పేరుకుని పోతాయి. అంతేకాదు, గంటలకొద్దీ కూర్చోవడం వల్ల తొడ కండరాలు కుచించుకుపోయి జాయింట్ పెయిన్ వస్తుంది. ►ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఎన్ని వ్యాయామాలు చేసినా వాటివల్ల ఏమంతగా ఫలితం కలగదు. ►రోజంతా చురుగ్గా ఉండటం వల్ల, ఎక్కువ సేపు తిరుగుతూ ఉండటం వల్ల ఏ విధమైన అనారోగ్య సమస్యలూ దరిచేరవు. అందువల్ల కూర్చొని పనులు చేసేవారు 30 నిమిషాలకొకసారి లేచి అటు ఇటు తిరగడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ సరిగా జరుగుతుంది. నిలబడి పని చేస్తే ఆరోగ్యం మెరుగు పడుతుంది. టీవీ చూస్తున్నప్పుడు లేదా ఫోన్ మాట్లాడుతున్నప్పుడు కూడా నడవటం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు. ►ఎక్కువసేపు కూర్చుని పని చేయడం కన్నా, ఎక్కువసేపు నిల్చుని పని చేయడం కొంత మెరుగయినదే అయినా, అది కూడా పూర్తిగా క్షేమం కాదు. మధ్య మధ్యలో టీ బ్రేక్‌లు, భోజన విరామాలు తీసుకోవడం, మంచినీళ్లు తెచ్చుకోవడం మేలు చేస్తుంది. కాబట్టి ఫ్యాన్ కింద కూర్చుని పని చేసేవారి గురించి అసూయ పడకండి మరి! -
అప్పుడు కేరళలో.. ఇప్పుడు తమిళనాడులో.. ఆ హక్కు మీకు ఉంది!
కేరళ, తమిళనాడు రాష్ట్రాలు సేల్స్‌గర్ల్స్‌ను అన్నేసి గంటలు నిలబడి డ్యూటీ చేయించడాన్ని నిరోధించాయి. కేరళలో ‘రైట్ టు సిట్’ ఉద్యమం మొదలయ్యాక వచ్చిన మార్పు ఇది. దేశంలో కోట్లాది మంది స్త్రీలు సేల్స్ గర్ల్స్‌గా 8 నుంచి 12 గంటలు నిలబడి పని చేస్తున్నారు. వారికి కూచునే హక్కు ఉంది. ఆ హక్కు ప్రభుత్వాలు కల్పించాల్సి ఉంది. మాలతి (20) హైదరాబాద్ అమీర్‌పేటలో సేల్స్ గర్ల్. ఉదయం 9 గంటలకు క్లాత్ షోరూమ్‌లో డ్యూటీ ఎక్కుతుంది. తిరిగి రాత్రి 9కి డ్యూటీ దిగుతుంది. మధ్యలో అరగంట లంచ్ విరామం. మిగిలిన సమయం? అంతా నిలబడి ఉండటమే. కస్టమర్లు ఉన్నా లేకున్నా ఆమె నిలబడే ఉంటుంది. కూచోవడానికి వీల్లేదు. ఎందుకంటే కూచోవడానికి అక్కడ కుర్చీలు గానీ స్టూల్స్‌గాని ఉండవు. బద్దకానికి అలవాటు పడతారని లేదా కూచుని సుఖపడతారని షాప్ వాళ్లు వారిని కూచోకుండా స్టూల్స్ తీసేస్తారు. మాలతి నిలబడే ఉంటుంది. నిలబడి... నిలబడి... నిలబడి... ఆమెకు కూచునే హక్కు లేదా? జయవాణి (35) నెల్లూరులో ప్రయివేట్ టీచర్. క్లాస్‌రూమ్‌లో నిలబడే పాఠం చెప్పాలి. బ్లాక్‌బోర్డ్ దగ్గర కుర్చీ కానీ టేబుల్ కానీ ఉండవు. టీచర్లు తాము ఇచ్చే జీతానికి ప్రతి నిమిషం రెక్కలు ముక్కలు చేసుకోవాలనుకున్న ప్రయివేటు స్కూళ్ల యాజమాన్యాలు చాలా కాలంగా క్లాస్ రూముల్లో కుర్చీలు తీసేశాయి. పాఠం ఎగ్గొట్టి టీచర్లు విశ్రాంతి తీసుకుంటారనో కునుకు తీస్తారనో వారి అనుమానం కావొచ్చు. అయితే క్లాసుకు క్లాసుకు మధ్య గ్యాప్ ఇస్తారా? స్టాఫ్‌రూమ్‌కు వెళ్లి విశ్రాంతి తీసుకోనిస్తారా? రోజులో దాదాపు 4 నుంచి 6 క్లాసులు చెప్పాల్సి ఉంటుంది. ప్రతి క్లాసు నిలబడి చెప్పి చెప్పి జయవాణికి మోకాళ్ల నొప్పులు మొదలయ్యాయి. కాని ఏమిటి చేయడం. ఆమె నిలబడి చెప్పాల్సిందే. కూచుని పాఠం చెప్పే హక్కు ఆమెకు లేదా? నిలబడటం పనిలో ఒక భాగం కావచ్చు. కాని నిలబడి ఉండటమే పని కాబోదు. కారాదు. మనిషి కేవలం నిలబడి మాత్రమే పని చేయడు. మధ్యలో విశ్రాంతి కావాలి. కూచోవాలి. కాని కూచుని పని చేయడాన్ని దేశంలో అనధికారికంగా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్లో తొలగించి చాలాకాలం అయ్యింది. బట్టల దుకాణాలు, నగల దుకాణాలు, ఎలక్ట్రానిక్ షోరూమ్‌లో, ప్రయివేటు పాఠశాలలు... ఒకటేమిటి ప్రయివేటు రంగంలో ఎక్కడ వీలైతే అక్కడ నిలబడి పని చేయించడం ఆనవాయితీ అయ్యింది. ఇంకా దారుణం ఏమంటే కూచుని కనిపిస్తే, తోటి ఉద్యోగులతో కబుర్లు చెప్తూ కనిపిస్తే కొన్ని షాపుల్లో ‘ఫైన్’ వేస్తారు. షాపింగ్ మాల్స్‌లో సేల్స్ గర్ల్స్ చేత, సేల్స్ బాయ్స్ చేత ఎంత ఊడిగం చేస్తారో వారిని ఎలా నిలబెట్టి పని చేయిస్తారో తమిళంలో ‘షాపింగ్ మాల్’ అనే సినిమా చూపించింది. కేరళలో కదలిక దేశంలో బట్టల షోరూమ్‌లలో దాదాపు నాలుగున్నర కోట్ల మంది సేల్స్‌గర్ల్స్‌గా/సేల్స్‌మెన్‌గా ఉపాధి పొందుతున్నారని ఒక అంచనా. వీరిలో దాదాపు 70 శాతం యువతులు, స్త్రీలు ఉంటారు. వీరందరూ రోజుకు 8 నుంచి 12 గంటలు నిలబడి పని చేయాలని షోరూమ్‌ల యజమానులు అన్యాపదేశంగా సూచిస్తారు. కస్టమర్లు ఒకరి వెంట ఒకరుగా రావడం వల్లగాని లేదా స్టూల్స్ లేకపోవడం వల్లగాని వీరు కూర్చునే వీలు లేదు. నీరసం ఉన్నా, పిరియడ్స్‌లో ఉన్నా, నిలబడే శక్తి లేకున్నా వీరు నిలబడి ఉండాల్సిందే. దీని వల్ల వీరికి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అరికాళ్లు, మోకాళ్లు బాధిస్తున్నాయి. దాంతో 2018లో ‘రైట్ టు సిట్’ అని కూచునే హక్కు కోసం అక్కడ కొంతమంది సేల్స్ గర్ల్స్ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వారి డిమాండ్‌లో సబబును గ్రహించింది. 2019 జనవరిలో కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్లలో పని చోట ఉద్యోగులందరూ తప్పనిసరిగా కూచునే ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర ‘కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్’ను సవరించింది. దేశంలో ప్రయివేటు ఉద్యోగుల కూచునే హక్కుకు హామీ పలికిన తొలి రాష్ట్రంగా కేరళ గుర్తింపు పొందింది. ఇప్పుడు తమిళనాడులో మొన్నటి సెప్టెంబర్ 13న తమిళనాడు అసెంబ్లీలో కూడా ప్రయివేటు ఉద్యోగుల కూచునే హక్కుకు హామీ ఇస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ‘తమిళనాడు షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ – 1947’ను సవరించింది. ఏ షాప్ అయినా షోరూమ్ అయినా ప్రయివేటు ఉపాధి స్థలం అయినా ఉద్యోగులు కూచునే ఏర్పాటు తప్పనిసరిగా చేయాలని యజమానులను ఈ సవరణ ఆదేశిస్తుంది. కూచుంటే ఎక్కడ యజమాని తిడతాడో అని భయపడాల్సిన అవసరం ఇక మీదట లేదు. రెండు రాష్ట్రాలే... మిగిలిన దేశంలో? అయితే ఇది మొదలు మాత్రమే. దేశంలో ఇంకా ఎంతో కదలిక రావాల్సి ఉంది. ఆయా ప్రభుత్వాలు ఈ సమస్యను గుర్తించాల్సి ఉంది. ఉద్యోగిని నిలబెట్టి ఉంచడం ఆ ఉద్యోగి ఆత్మగౌరవానికి భంగం కలిగించడం. అవమానించడం. బాధించడం. అనవసర శ్రమకు, ఒత్తిడికి గురి చేయడం. గౌరవంతో కూడిన పని చేసే హక్కు, గౌరవాన్ని పొందుతూ పని చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. ‘స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం’ అని అంటాం. కాని వందలాది దుకాణాల్లో వేలాది సేల్స్ ఉమెన్, రిసెప్షనిస్ట్స్, టీచర్లు, ఇతర ప్రయివేటు ఉద్యోగులు ఎందుకు నిలుచుంటున్నారో... అంత నిలబడాల్సిన అవసరం ఏమిటో ఆలోచించాల్సి ఉంది. అవును. ‘కూచుని పని చేసే హక్కు’ ప్రతి ఒక్కరికీ ఉంది. చదవండి: Neetu Yadav And Kirti Jangra: ‘ఇంత చదువు చదివి బర్రెలు అమ్ముతావా? -
ఎక్కువ సేపు కూర్చుంటున్నారా? ఇది మీ కోసమే..
లండన్ : గంటల తరబడి కూర్చోవటం వల్ల శారీరకంగానే కాదు..మానసికంగా కూడా ప్రతికూల ప్రభావం పడుతుందని తాజా పరిశోధనలో తేలింది. అంతేకాదు! వ్యాయామం ద్వారా కలిగే లాభాలను సైతం అది హరిస్తుందని ఇంగ్లాండ్‌కు చెందిన యూనివర్శిటీ ఆఫ్ హర్డర్స్ ఫీల్డ్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనా సమయంలో చాలా మంది వర్క్ ఫ్రమ్ హోం వల్లో.. ఇతర కారణాలవల్లో ఎనిమిది గంటలకు పైగా కూర్చుని ఉంటున్నారని పేర్కొన్నారు. ఇది వారి మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతోందని తెలిపారు. వారానికి 150 నిమిషాల శారీరక శ్రమ(వ్యాయామాలు) చేసినప్పటికి ఎలాంటి లాభం ఉండదని వెల్లడించారు. దానినుంచి బయటపడాలంటే అంతకంటే ఎక్కువ సేపు వ్యాయామం చేయాల్సి ఉంటుందన్నారు. స్పోర్ట్స్ సైన్స్ ఫర్ హెల్త్ జర్నల్‌లో ఈ వివరాలను వెల్లడించారు. శాస్త్రవేత్త లియానే ఎజివెడో మాట్లాడుతూ..‘‘ మేము 300 మందిపై పరిశోధనలు జరిపారు. వీరిలో 50 శాతంమంది ఎనిమిది గంటలకంటే ఎక్కువ సేపు కూర్చుని ఉంటున్నారు. గంటల తరబడి కూర్చోవటం ఈ 50 శాతం మంది మానసిక ఆరోగ్య పరిస్థితి, సాధారణ జీవితంపై ప్రతికూల ప్రభావం చూపింది. ఒకవేళ మీరు ఎనిమిది గంటల కంటే ఎక్కువ సేపు కూర్చుని పనిచేస్తుంటే.. దాని ప్రభావం నుంచి బయట పడటానికి ఎక్కువ సేపు శారీరక శ్రమ చేయాల్సి ఉంటుంది. ప్రతి రోజు 60 నిమిషాల వ్యాయామం మంచిది, కనీసం 30 నిమిషాల కంటే తక్కువ కాకుండా వ్యాయామం చేయాలి. వ్యాయామం అంటే జిమ్‌కు పోవటం అనే కాదు.. నడక, ఇతర పనులు చేయడం కూడా వ్యాయామమే. తోట పనులు చేసే వారు మానసికంగా, శారీరకంగా బాగున్నట్లు గుర్తించాం. కూర్చునే సమయాన్ని తగ్గించటం చాలా ఉత్తమం’’ అని తెలిపారు. -
అదే పనిగా కూర్చుంటే.. ఏమవుతుందో తెలుసా?
నిత్యం ఒకే చోట కూర్చుని పనిచేసేవారు గంటలకొద్దీ అలాగే కూర్చుని పనిచేయవద్దని చెబుతున్నారు మయో వైద్య పరిశోధక బృందం అధ్యయనవేత్తలు. రోచెస్టర్, మిన్నెసోటాకు చెందిన ఆ పరిశోధకులు చెబుతున్న దాని ప్రకారం... రెండుగంటల పాటు అదేపనిగా కూర్చొని ఉండటం వల్ల 20 నిమిషాల సేపు వ్యాయామం చేయడం వల్ల మనకు లభ్యమైనంత ఆరోగ్యాన్ని మనం నష్టపోతామని చెబుతున్నారు వారు. అదేపనిగా ఒకేచోట కూర్చుని చేసే ఉద్యోగాలలో ఉన్న రెండువేలకు మందికి పైగా వ్యక్తుల్లో నిర్వహించిన ఫలితాలు చాలా ప్రమాదకరంగా కనిపిస్తున్నాయని వారు వెల్లడించారు. ఇలా కూర్చుని పనిచేసేవారు కనీసం రెండు గంటలకోసారి అయినా లేవకుండా ఉంటే... వారిలో గుండెజబ్బులు, ఆస్తమా, పక్షవాతం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా పెరిగిపోతాయని వారు హెచ్చరిస్తున్నారు. అలాగే మధ్యాన భోజనం తర్వాత వెంటనే సీట్లో కూర్చోకుండా కొద్దిసేపు తప్పనిసరిగా అటు ఇటు తిరగాలని కూడా సూచిస్తున్నారు. చదవండి: గుండెపాటు వచ్చిన మొదటి గంట తర్వాతనే -
జీన్స్ వేసుకుని అలా వద్దు.. ఎందుకో తెలుసా?
రఫ్ అండ్ టఫ్‌గా ఉపయోగించడానికి అనువైనవి కావడంతోపాటు సౌకర్యమూ ఉండటం వల్ల జీన్స్ ప్యాంట్స్ పట్ల యువతీయువకుల్లో మాత్రమే గాక ప్రజలందరిలోనూ వాటి పట్ల మక్కువ ఎక్కువ. అయితే జీన్స్ ప్యాంట్ల వల్ల కలిగే అనర్థాలపై జరిగిన అధ్యయనాల్లోని ఒక అంశం కాస్తంత ఆందోళన గొలిపేదిగా ఉంది. జీన్స్ వేసుకొని కింద కూర్చోవడం, అందునా జీన్స్ ప్యాంట్లు తొడిగి బాసిపట్లు వేయడం (సక్లముక్లం వేసి కూర్చోవడం) ఆరోగ్యానికి అంత మేలు కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. జీన్స్ ప్యాంట్ తొడుక్కొని ఇలా కూర్చోవడం వల్ల కండరాలు, నరాలు దెబ్బతింటాయనీ, ఇది మరీ విషమిస్తే ఒక్కోసారి జీన్స్ ప్యాంట్లతో బాసిపట్లు (సక్లంముక్లం) వేసుకుని కూర్చునేవారు అస్సలు నడవలేని పరిస్థితి కూడా వచ్చేందుకు అవకాశముందని హెచ్చరిస్తున్నారు. వ్యాయామం చేసే సమయంలోనూ జీన్స్ వేసుకొని ‘స్క్వాటింగ్’ అస్సలు చేయవద్దని హెచ్చరిస్తున్నారు. ఈ అంశాలన్నింటినీ ‘జర్నల్ ఆఫ్ న్యూరాలజీ, న్యూరోసర్జరీ, సైకియాట్రీ’ అనే మెడికల్ జర్నల్‌లోనూ ప్రచురితమయ్యాయి. చదవండి: స్త్రీల దుస్తులకూ వయసుంటుందా? -
హైవేపై పెద్దపులి.. ఊపిరి పీల్చుకున్న వాహనదారులు
భోపాల్: ఒళ్లు గగుర్లు పొడిచే దృశ్యం. ఓ పెద్దపులి రోడ్డుపై బైఠాయించి పెద్ద శబ్ధం చేస్తూ గర్జీస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో అనురాగ్ అనే ట్విటర్ యూజర్ సోమవారం షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ‘సియోని జిల్లాలో అడవి పులులు రోడ్డుపైకి వచ్చి గర్జించడం ప్రారంభించినప్పుడు!’ అనే క్యాప్షన్‌తో అనురాగ్ ట్వీట్ చేశాడు. ఈ వీడియోకు ఇప్పటి వరకు వేల్లో వ్యూస్ వందల్లో కామెంట్స్ వచ్చాయి. మధ్యప్రదేశ్‌లోని సియోన్ జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. (చదవండి: మూడు కళ్లతో బాబు: నిజమేనా?) सिवनी जिले में जब जंगल के राजा सड़क पर आकर दहाड़ मारने लगे! @GargiRawat @ndtvindia @ndtv @RandeepHooda @hridayeshjoshi @SrBachchan अमिताभ बच्चन #tiger @OfficeofUT #SaveBirdsServeNature #welcometoindia pic.twitter.com/DWwYvHGdRV — Anurag Dwary (@Anurag_Dwary) July 14, 2020 సియోల్ బఫర్ జోన్ సమీపంలో పెంచ్ నేషనల్ పార్క్‌కు 25 కిలోమీటర్ల దూరంలో 7వ నేషనల్ హైవేపై రాత్రి సమయంలో పెద్ద పులి బైఠాయించడంతో వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. పెద్దపులి గర్జిస్తూ కోపంగా చూస్తుంటే అక్కడి వారంతా భాయందోళనకు గురయ్యారు. అది ఎక్కడ దాడి చేస్తుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టికుని దానినే గమనిస్తు ఉండిపోయారు. ఈ క్రమంలో కాసేపటికి పులి తనదారిన అది వెళ్లిపోవడంతో అందరూ బ్రతుకు జీవుడా అంటూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ప్రాంతం పెంచ్ నేషనల్ పార్కుకు దగ్గరగా ఉండటంతో రోడ్డుపైకి తరచూ పులులు వస్తుంటాయని స్థానికులు పేర్కొన్నారు. -
ఎక్కువ గంటలు కూర్చుంటే గుండెపోటు!
సాక్షి, న్యూఢిల్లీ : మీరు ఆఫీసులో ఎక్కువ సేపు కూర్చుంటున్నారా? అయితే మీరు వెంటనే లేచి నిలబడి ఈ వార్తను చదవాల్సిందే. మీరు ప్రతి రోజు శారీరక వ్యాయామం చేస్తున్నా సరే ఆఫీసులో లేదా ఇంట్లో ఎక్కువ సేపు కూర్చుని పనిచేస్తే లేదా ఏ పనిచేయకుండా బడలికగా విశ్రాంతి తీసుకుంటే అది అకాల మరణానికి దారితీయడమే కాదు, చంపేస్తుందట. రోజుకు 60 నిమిషాల నుంచి 75 నిమిషాల వరకు వ్యాయామం చేస్తున్న వారు కూడా రోజుకు సరాసరి 12.30 గంటలపాటు పెద్దగా శారీరక శ్రమ లేకుండా కూర్చొని పనిచేస్తే లేదా ఇందులో కొన్ని గంటలు పనిచేసి, మరికొన్ని గంటలు బడలికగా విశ్రాంతి తీసుకున్నా ప్రమాదమేనట. వీరంతా గుండె జబ్బులతో అకాలంగా మరణిస్తారట. ఈ ప్రమాదం లింగ భేదం లేకుండా స్త్రీ, పురుషులకు, వయో భేదం లేకుండా పిల్లలు, యువకులు, వృద్ధులకు పొంచి ఉందని అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వారు 45 ఏళ్లు దాటిన అన్ని వయస్కుల వారిని ఎనిమిదివేల మందిని ఎంపిక చేసి వారి జీవన శైలిని, శారీరక శ్రమను, వారి శరీరంలో వస్తున్న మార్పులను నాలుగేళ్లపాటు క్షుణ్నంగా పరిశీలించారు. ఆ తర్వాత వారు శారీరక శ్రమ అవసరం, ప్రాధాన్యత గురించి ఆస్ట్రేలియాలో 2000 సంవత్సరం నుంచి 2012 సంవత్సరం మధ్యన వచ్చిన ముఖ్యమైన 36 వ్యాసాలలోని అంశాలతో తమ అధ్యయనం వివరాలను పోల్చి చూశారు. తద్వారా తమ అధ్యయనం వివరాలు వాస్తవమేనని తేల్చుకున్నారు. 45 ఏళ్లు దాటిన వారిలోనే సరైన శారీరక శ్రమలేక గుండెపోట్లు వస్తాయని భావించి ఆపై వయస్సు వారిపైనే వారు అధ్యయనం జరిపారు. శారీరక శ్రమ లేకపోతే పిల్లలకు కూడా ప్రమాదమేనని వారు ఆస్ట్రేలియా వ్యాసాల ద్వారా తెలుసుకున్నారు. రోజుకు 24 గంటల సమయం కనుక, అందులో సగకన్నా ఎక్కువ కాలం శారీరక శ్రమ ఉండాలని అమెరికా శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో తేల్చారు. అధ్యయనంలో పాల్గొన్న ఎనిమిది వేల మందిలో వారి శారీరక శ్రమను కొలవడానికి ‘యాక్సిలెరోమీటర్లు’ ఉపయోగించారు. ప్రస్తుతం బ్రిటన్ అమలు చేస్తున్న ఆరోగ్య మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఒక్కరు వారానికి 150 నిమిషాలు, అంటే రోజుకు 30 నిమిషాల చొప్పున ఐదు రోజులపాటు శారీరక వ్యాయామం తప్పనిసరిగా చేయాలని సూచిస్తున్నాయి. అయితే వారానికి 300 నిమిషాలు అంటే రోజుకు గంట చొప్పున 5 రోజులు శారీరక శ్రమ చేసినా సరిపోదని ఆస్ట్రేలియా వ్యాసాలు సూచిస్తున్నాయి. అందుకనే అమెరికా అధ్యయనకారులు రోజుకు 12.30 గంటలపాటు శారీరక శ్రమ ఉండాలంటున్నారు. శారీరక శ్రమంటే ఇక్కడ వ్యాయామమే కాదు. శారీరక కదలికలు. పనిచేసే చోట ఆఫీసయినా, ఇళ్లయినా అదే పనిగా కూర్చోకుండా మధ్య మధ్యలో లేచి నిలబడడం, నడవడం, పచార్లు కొట్టడం లాంటివి చేయాలి. మంచినీళ్లు, టీ తాగాలంటే కుర్చీ వద్దకు తెప్పించుకోకుండా వాటి వద్దకు మనమే లేచి వెళ్లడం, ఆఫీసులో నలుగురితోనో, పది మందితోనే మీటింగ్ ఉంటే కూర్చొని మాట్లాడకుండా నిలబడే మాట్లాడుకోవడం మంచిది. సమీపంలో వున్న అనుబంధ ఆఫీసుకో, మిత్రుడికో మెయిల్ పంపించకుండా స్వయంగా వెళ్లి సమాచారం అందించడం లాంటివి చేయాలి. మధ్యాహ్నం భోజనం తెచ్చుకోకపోతే వీలైనంత దూరంలో ఉన్న హోటల్‌కో, మెస్కో వెళ్లాలి. భోజనం తెచ్చుకుంటే అనంతరం కాస్త దూరం నడవాలి. ఇంట్లో మంచాలపై, సోఫాలపై ఎక్కువ సేపు కూర్చోకుండా వీలైనంత సేపు కింద నేలపై కూర్చోవాలని అధ్యయనకారులు సూచిస్తున్నారు. -
ఆ.. మూడు ముచ్చట్లు!
కాంగ్రెస్ విడుదల చేసిన రెండో జాబితా కూడా ఆ పార్టీ శ్రేణులతోపాటు మహాకూటమి భాగస్వామ్య పక్షాలను నివ్వెరపరిచింది. ఉమ్మడి జిల్లాలో తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. ఇంకా దేవరకొండ, మిర్యాలగూడ, తుంగతుర్తి స్థానాలను పెండింగ్‌లో పెట్టింది. తొలి జాబితాలో చోటు దక్కని వారు మలి జాబితాకోసం ఎదురుచూశారు. కానీ, బుధవారం ప్రకటించిన రెండో జాబితాలోనూ ఈ మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. దీంతో పాటే ఈ మూడింటిలో ఏ స్థానాన్ని ఏ పార్టీకి కేటాయిస్తున్నారో కూడా స్పష్టత లేదు. దీంతో అటు కాంగ్రెస్ పార్టీలోనే కాకుండా, ఇటు కూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, సీపీఐ, టీజేఎస్, ఇంటి పార్టీలు అయోమయంలో పడ్డాయి. సాక్షిప్రతినిధి, నల్లగొండ: మహాకూటమిలో ఆ..మూడు స్థానాలపై చర్చ జరుగుతోంది. మొదటి, రెండు జాబితాల్లో కూటమి భాగస్వామ్య పక్షాలకు కాంగ్రెస్ ఒక్క సీటు కూడా కేటాయించలేదు. కాగా, జిల్లాలో ఒక్క స్థానం కూడా కూటమికి కేటాయించే అవకాశాల్లేవన్న వార్తలు గుప్పుమంటున్నాయి. కానీ, సీపీఐ ఇప్పటికీ తమకు అవకాశం వస్తుందన్న ధీమాతో ఉన్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి ఆ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా మూడు స్థానాలను ఇప్పటికే కేటాయించగా, సీపీఐ మాత్రం మరో స్థానాన్ని అదనంగా కోరుకుంటోంది. సీపీఐ డిమాండ్‌కు కాంగ్రెస్ తలొగ్గితే జిల్లాలోని దేవరకొండను కేటాయించే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. ఈ స్థానంనుంచి గత ఎన్నికల్లో సీపీఐ పోటీచేసి గెలిచింది. ఆ ఎన్నికల్లో కూడా సీపీఐ, కాంగ్రెస్ పొత్తుపెట్టుకున్నాయి. ఒక విధంగా దేవరకొండ సీపీఐకి సిట్టింగ్ స్థానం. ఆ పార్టీ నుంచి గత ఎన్నికల్లో విజయం సాధించిన రవీంద్ర కుమార్ టీఆర్ఎస్లో చేరడంతోపాటు ఆయనిప్పుడు ఆ స్థానం నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్నారు. సిట్టింగ్ స్థానాన్ని కాకుండా సీపీఐ ఆలేరు, మునుగోడులను కోరుకుంది. ఆ రెండు చోట్లా కాంగ్రెస్ తన అభ్యర్థులను ప్రకటించింది. దీంతో అంతో ఇంతో ఆశ ఉన్నదంటే అది దేవరకొండ ఒక్కటే. మరి కాంగ్రెస్ ఈ స్థానాన్ని సీపీఐకి కేటాయింస్తుందా..? లేదా.. ఒకవేళ తామే పోటీ చేయాలని భావిస్తే టికెట్ ఎవరికి దక్కుతుందన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇక్కడినుంచి పార్టీ ఇన్చార్జ్ జగన్ లాల్ నాయక్, బిల్యానాయక్, బాలునాయక్ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. వీరిలో ఎవరికి అవకాశం దక్కుతుందన్న అంశంపై చివరకు దేవరకొండలో చిన్న చిన్న బెట్టింగులు కూడా మొదలయ్యాయి అంటే.. ఈ టికెట్‌పై ఎంతటి ఉత్కంఠ నెలకొందో అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్సా... టీజేఎస్సా ? మిర్యాలగూడ స్థానం కూడా అన్ని వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఇక్కడినుంచి సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. మరోవైపు తెలంగాణ జనసమితి (టీజేఎస్) ఆశిస్తున్న స్థానాల్లోనూ ఇది ఒకటి. రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీకి ఎనిమిది స్థానాలను ఇప్పటికే కేటాయించారు. అదనంగా తమకు మరొక స్థానం కావాలన్నది టీజేఎస్ డిమాండ్. ఆ అదనపు స్థానంగా మిర్యాలగూడ కావాలని కోరుతోంది. దీంతో ఈటికెట్పైనా ప్రతిష్టంభన ఏర్పడింది. ఒకవేళ రఘువీర్ రెడ్డికి టికెట్ ఇవ్వకుంటే ఆ అవకాశం తనకివ్వాలని అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి కోరుతున్నారు. ఇటీవలే ఆయన టీఆర్ఎస్నుంచి కాంగ్రెస్ గూటికి చేరారు. పార్టీకి చెందిన మరో సీనియర్ శంకర్ నాయక్ సైతం టికెట్‌పై ఆశ పెట్టుకున్నారు. ఈ కారణాల వల్లే మిర్యాలగూడ టికెట్‌పై ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారని అంటున్నారు. తేలని తుంగతుర్తి అభ్యర్థి.. తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించి కూటమి లొల్లి ఏమీ లేకున్నా.. ఇక్కడ ఇద్దరు కాంగ్రెస్ నేతల మధ్య నెలకొన్న పోటీ టికెట్ ప్రకటనపై ప్రభావం చూపుతోంది. గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన అద్దంకి దయాకర్ మరోమారు అవకాశం కోరుతున్నారు. పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చిన డాక్టర్ రవి కూడా ఈ స్థానాన్ని ఆశిస్తున్నారు. టికెట్ పోటీ ఇప్పుడు వీరిద్దరి మధ్యే నెలకొంది. తుంగతుర్తి నుంచి సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన ఆర్.దామోదర్‌రెడ్డికి ఈ నియోజకవర్గంపై పట్టుంది. దీంతో ఆయన మద్దతు లేకుండా అభ్యర్థి బయట పడలేడన్న అభిప్రాయం ఉంది. దామోదర్‌రెడ్డి డాక్టర్ రవికి మద్దతుగా నిలుస్తున్నారు. దీంతో అద్దంకి అభ్యర్థిత్వం పెండింగ్‌లో పడిందంటున్నారు. కూటమి పక్షాల గుస్సా మరోవైపు కూటమి భాగస్వామ్య పక్షాలు ఆగ్రహంగా ఉన్నాయి. కూటమిలోని సీపీఐ, టీడీపీ, టీజేఎస్, ఇంటి పార్టీలు కోరిన ఏ ఒక్క స్థానం ఏ పార్టీకి ఇవ్వలేదు. ఒకేసారి తొమ్మిది మంది తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ మూడు స్థానాలను మాత్రం పెండింగ్‌లో పెట్టింది. ఈ జాబితా ప్రకటన తర్వాత నివ్వెరపోవడం కూటమి పక్షాల వంతైంది. పూర్తి నిరాశలో ఉన్న టీడీపీ ఆయా స్థానాల్లో బరిలోకి దిగే ఆలోచనలో ఉంది. ఇప్పటికే ఆ పార్టీ దేవరకొండ నాయకుడు బిచ్యానాయక్ బుధవారం నామినేషన్ కూడా దాఖలు చేశారు. కోదాడలో టీడీపీ నేత బొల్లం మల్లయ్య యాదవ్ కోదాడ, హుజూర్నగర్ స్థానాల్లో కాంగ్రెస్‌ను ఓడించేందుకు శ్రమించాలని టీడీపీ శ్రేణులను కోరారు. సీపీఐ తాము మునుగోడులో పోటీ చేస్తామని ప్రకటించింది. తెలంగాణ ఇంటి పార్టీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న సూత్రప్రాయ నిర్ణయం తీసుకుంది. దీంతో జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థులకు కూటమి రెబల్స్ బెడద తప్పేలాలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
పాత కాపులే!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలకు టీఆర్ఎస్ఎల్పీలో ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటన పూర్తి భరోసా ఇచ్చింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలామంది ప్రజాప్రతినిధులు కొంతకాలంగా అభద్రతా, అపోహల మధ్య ఉన్నారు. దీనికితోడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాలు కూడా లేనిపోని ప్రచారాలకు తెరలేపాయి. ఎంపీలు, ఎమ్మెల్యేల పనితీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు విడతలుగా చేయించిన సర్వే చాలామందిలో అయోమయం, ఆందోళనకు కారణమైంది. ఇదే సమయంలో థర్డ్‌ఫ్రంట్ తెరమీదకు రావడం.. వచ్చే ఎన్నికల్లో మంత్రులను ఎంపీలుగా, కొందరు ఎంపీలను ఎమ్మెల్యేలుగా రంగంలోకి దింపుతారన్న ప్రచారం అధికార పార్టీలో గందరగోళానికి వేదికైంది. ఈ ప్రచారం చాలామంది ప్రజాప్రతినిధులను టెన్షన్‌కు గురిచేసింది. ఈ నేపథ్యంలో 2019 వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని, ఇప్పుడున్న ఎంపీలు, ఎమ్మెల్యేలకే ‘సిట్టింగ్’ స్థానాలను కేటాయిస్తామని ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో కేసీఆర్ ప్రకటించారు. దీంతో కొంతకాలంగా అభద్రతాభావంతో ఉన్న ప్రజాప్రతినిధులకు ఆయన ప్రకటన భరోసా ఇచ్చినట్లయ్యింది. సీఎం స్వయంగా చేయించిన మూడు విడతల సర్వేలో ‘గ్రాఫ్’ తగ్గిన ప్రజాప్రతినిధులూ తేరుకుంటున్నారు. ప్రచారాలు, అపోహలకు తెర.. సీఎం ప్రకటనతో ఊరట సాధారణ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న కొద్దీ జరుగుతున్న రకరకాల ప్రచారాలు అధికార పార్టీలో గందరగోళం సృష్టించాయి. వచ్చే ఎన్నికల్లో పార్టీ అధినేత కేసీఆర్ పలువురికి ఉద్వాసన పలుకుతారన్న చర్చ కూడా ఉమ్మడి జిల్లాలో ‘వైరల్’ అయ్యింది. ఈ ప్రచారాలపై అధికార పార్టీ నేతలు కొందరు వివరణ ఇచ్చుకున్న సందర్భాలూ ఉన్నాయి. ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ పార్లమెంట్‌కు వెళ్తారని, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ జిల్లాలోని ఓ ఎస్సీ రిజర్వుడ్ స్థానం నుంచి శాసనసభకు పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి ప్రభుత్వ సలహాదారు జి.వివేకానంద్ బరిలో ఉంటారని, కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ ఈసారి రాజన్న సిరిసిల్లలో ఓ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఐదుచోట్ల అభ్యర్థుల మార్పు అనివార్యమన్న ప్రచారమూ అధికారపార్టీలో నిన్నామొన్నటి వరకు ‘వైరల్’ కావడం పలువురిని ఆందోళనకు గురి చేసింది. ఇదే సమయంలో అధినేత కేసీఆర్ థర్డ్‌ఫ్రంట్‌ను తెరమీదకు తీసుకురావడం, ఉద్యమంలో తనవెంట అడుగులేసిన సీనియర్లను ఎంపీలుగా తీసుకెళ్తానని ప్రకటించడంతో జిల్లాకు చెందిన పలువురు ఇప్పుడున్న అవకాశాలు కోల్పోతారన్న చర్చ గందరగోళం సృష్టించింది. ఇదే సమయంలో రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరిపై ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ఎల్పీలో కేసీఆర్ కీలక ప్రకటనలు చేశారు. 2019 వరకు తానిక్కడే ఉంటానని, ఆ ఎన్నికల్లో అందరూ సిట్టింగ్ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలకే మళ్లీ టిక్కెట్లు ఇస్తానని చేసిన ప్రకటన అపోహలకు తెరవేసి కొండంత భరోసా ఇచ్చింది. వలస, కొత్తగా అశావహులకు నోఛాన్స్ మూడు విడతలుగా సర్వేల ఫలితాలను ప్రకటించిన గులాబీ దళపతి కేసీఆర్ ఎంపీలు, ఎమ్మెల్యేల పనితీరును వారి కళ్లకు కట్టారు. రెండు సర్వేలను సమావేశం ఏర్పాటు చేసిన ఆయన మూడో విడత సర్వే నివేదికను డిసెంబర్లో కేవలం ప్రజాప్రతినిధులకు మాత్రమే వివరించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 అసెంబ్లీ స్థానాలకు అధికార పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 12 కాగా.. శాసనసభ్యులు, శాసనసభ నియోజకవర్గాల వారిగా ఎమ్మెల్యేల పనితీరు, టీఆర్ఎస్ పార్టీ, ఇతర పార్టీల బలాబలాలను కేసీఆర్ వివరించారు. ఆ సర్వేలో హుజూరాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు 89.90 శాతంతో ఫస్ట్ ర్యాంకు రాగా.. మంత్రి కేటీఆర్ 79.60 శాతంతో రెండో స్థానంలో నిలిచారు. తొలి, రెండో సర్వేలకు పోలిస్తే ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేల్లో చాలామందికి ‘గ్రాఫ్’ తగ్గగా.. కొందరు ఫరవాలేదనిపించారు. ఇంకొందరు పాసు మార్కులకే పరిమితం అయ్యారు. మరికొందరు పాస్‌మార్కులను కొంచెం పైకి పెరిగారు. ప్రజాక్షేత్రంలో ఉండేవారికి ప్రజలు వేసిన మార్కులను కేసీఆర్ ప్రజాప్రతినిధులకు వివరించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. చాలామందికి టిక్కెట్లు ఇవ్వడం కష్టమేనన్న చర్చ జరిగింది. ఆది వారం టీఆర్ఎస్ఎల్పీ సందర్భంగా సీఎం ‘సిట్టింగు’లందరికీ టిక్కెట్లు ఇస్తామనడం ‘గ్రాఫ్’ తగ్గిన నేతలకు ఊరటనిచ్చింది. కేసీఆర్ ప్రకటన సిట్టింగ్‌లకు భరోసా ఇవ్వగా, వలస నేతలు, కొత్తగా టిక్కెట్లు ఆశించే వారికి ఈసారి ఆశాభంగమే కలగనుందన్న చర్చ సాగుతోంది. -
పోలీస్ అధికారి కుర్చీలో రాధే మా!
న్యూఢిల్లీ: వివాదాస్పద సాధ్వీ రాధే మా మళ్లీ వార్తల్లోకెక్కారు. ఢిల్లీలోని ఓ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఆమె స్టేషన్ హౌస్ అధికారి (ఎస్హెచ్ఓ) సీట్లో కూర్చున్నారు. ఆమె పక్కనే ఎస్హెచ్ఓ సంజయ్ శర్మ మెడలో ఎర్రటి శాలువాతో చేతులు కట్టుకొని నిలబడి ఉన్న ఫొటో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. స్థానిక వివేక్ విహార్ పోలీస్ స్టేషన్లో ఇది చోటుచేసుకుంది. దీనిపై స్టేషన్ అధికారి సంజయ్ శర్మను ప్రశ్నించగా.. రాధే మా రామ్‌లీలా మైదానానికి వెళ్లే మార్గంలో తమ స్టేషన్ ముందు ఆగి, స్టేషన్లో ఉన్న టాయిలెట్‌ను ఉపయోగించుకున్న తర్వాత ఆమె తన కుర్చీలో కూర్చున్నారని తెలిపారు. తన సీటు నుంచి లేవాలని రాధే మాను చేతులు జోడించి అభ్యర్థించానని, ఆ సమయంలోనే ఫొటో తీశారని ఎస్హెచ్ఓ చెప్పారు. దీనిపై ఉన్నతాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. అలాగే రామ్‌లీలా మైదానంలోని జీటీబీ పోలీస్ స్టేషన్లో పోలీసు అధికారులు భక్తి పాటలకు డ్యాన్స్ చేస్తూ ఉన్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఈ వీడియోలో రాధే మాతో పాటు ఐదుగురు పోలీస్ సిబ్బంది కూడా ఉన్నారు. ఈ ఘటనలు సెప్టెంబర్ 28, 29 తేదీల్లో జరిగాయి. ఈ వీడియోను రాధే మా ఫేస్బుక్ పేజీలో అప్లోడ్ చేశారు. ఈ వీడియోలో ఏఎస్సైలు, కానిస్టేబుళ్లు ఉన్నారు. వీరిని ప్రస్తుతం విధుల నుంచి తప్పించి హోల్డ్‌లో ఉంచామని ఉన్నతాధికారులు తెలిపారు. -
అంతసేపు కూర్చుంటే... టైంబాంబే!
ఊరికే అటూ ఇటూ పరుగెత్తకుండా నిమ్మళంగా కూర్చోరా ఒకప్పుడు బామ్మా... ఆ తర్వాత నాన్నా మనకు చెప్పిన విషయం. మా అమ్మాయికేమండీ! హ్యాపీగా వెళ్లి కడుపులో చల్లకదలకుండా ఏసీ రూములో కూర్చొని ఉద్యోగం చేస్తుంది.. ఈ మాట అమ్మ పదిమందికీ చెప్పడం ఒకప్పుడు ముచ్చటగా అనిపించేది. ఇప్పుడు ఆ కూర్చోవడమే ఆరోగ్యాన్ని కుదేలయ్యేలా చేస్తోంది. జాగ్రత్త పడండి... అదర్వైజ్... యు ఆర్ సిట్టింగ్ ఆన్ ఎ టైంబాంబ్! పనిచేసే తీరుతెన్నులు మారాయి. వృత్తులేవైనా వాటిల్లో కూర్చొని చేసేవే ఎక్కువ. కూర్చొని చేసే వృత్తులు గతంలోనూ ఉన్నాయి. కానీ ఇప్పుడు కంప్యూటర్ ఆవిర్భావం తర్వాత పని అంటే కుర్చీకి అంటిపెట్టుకోవడంగా మారిపోయింది. ఒళ్లు కదులుతూ పనిచేయాల్సిన యువత కదలకుండా కుర్చీకి అతుక్కుపోతున్నారు. ఆరోగ్యాన్ని చిత్తుచేసుకుంటున్నారు. ఆసనంపై అనర్థాల ముళ్లు కుర్చీలకు అంటిపెట్టుకుని పనిచేస్తుండటం వల్ల వచ్చే సమస్యల్లో మొదటిది స్థూలకాయం. అది అనేక ఇతర వ్యాధులకు దారితీసే ప్రాథమిక వ్యాధి. ఆ కారణంగా రక్తపు ఒత్తిడి పెరగడంతో అధిక రక్తపోటు వస్తుంది. అది డయాబెటిస్ అనే ముప్పును తెచ్చే అంశం కూడా. (అంటే రిస్క్ ఫ్యాక్టర్ అన్నమాట). దీనికి స్మోకింగ్ తోడైతే గుండెపోటు, పక్షవాతం, దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధులు వస్తాయి. ఇక అదేపనిగా కూర్చోవడం వల్ల వచ్చే సమస్య... కాలి రక్తనాళాల్లో కదలికలు తగ్గడం వల్ల అక్కడ రక్తం గడ్డకట్టే అవకాశాలుంటాయి. కాలి రక్తనాళాల కవాటాలు బలహీనం అవుతాయి. దాంతో అక్కడ గడ్డకట్టిన బ్లడ్‌క్లాట్స్ ఊపిరితిత్తుల్లోకి వెళ్తాయి. దీనిని పల్మునరీ ఎంబాలిజం అంటారు. ఇది ప్రమాదకరమైన పరిణామం. అతిగా కూర్చోవడం వల్ల నిద్రకు సంబంధించిన సమస్యలు (స్లీప్ డిజార్డర్స్) వస్తాయి. వీటిల్లో ప్రధానంగా నిద్రపట్టకుండా ఉండే రుగ్మత ఇన్సామ్నియా, మాటిమాటికీ నిద్రాభంగం అయ్యే డిస్టర్బ్డ్ స్లీప్ పాటర్న్స్, గురకతో ఆక్సిజన్ అందని స్లీప్ ఆప్నియా వంటి వ్యాధులు వస్తాయి. వీటి కారణంగా మెదడుకు, గుండెకు తగినంత రక్తం అందక అది గుండెపోటు లేదా పక్షవాతం వంటి ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీయవచ్చు. అలాగే కూర్చొని పనిచేసే కంప్యూటర్ ఆధారిత ఉద్యోగుల్లో కేవలం వేళ్లకదలికలు మాత్రమే ఉంటాయి. ఫలితంగా కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ వంటివి రావచ్చు. మణికట్టు వద్ద ఉండే ఎముకలన్నీ ఒక వృత్తాకారం ఏర్పడేలా అమరి ఉండి... వాటి మధ్య నుంచి నరాలు అరచేతిలోకి ప్రవేశిస్తాయి కాబట్టి... మణికట్టు ఎముకల అమరికను టన్నెల్‌గా పేర్కొనడం వల్ల దీన్ని కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అంటారు. ఇందులో నరాలను ఎముకలు నొక్కేచడం వల్ల అరచేతి నొప్పులు, వేళ్లకు రక్తం అందక తిమ్మిర్లు పట్టడం వంటి పరిణామాలూ రావచ్చు. అదేపనిగా కూర్చోవడం వల్ల నడుము నుంచి కాళ్ల వరకు వెళ్లే అతిపెద్ద నరం అయిన సయాటికా నొక్కుకుపోయి సయాటికా వ్యాధికి దారితీయవచ్చు. అలాగే మెడనొప్పులూ వస్తాయి. కంప్యూటర్ స్క్రీన్‌ను అదేపనిగా చూస్తుండటం వల్ల కంటిలోని తేమ తగ్గి కంటి సమస్యలు రావచ్చు. అంతేకాదు... మానసిక సమస్యలైన యాంగై్జటీ, డిప్రెషన్, ఆత్మహత్యాధోరణులు (సూయిసైడల్ టెండెన్సీస్) కనిపించవచ్చు. తేలిగ్గా మాదకద్రవ్యాలకు అలవాటు పడటం (డ్రగ్ అబ్యూజ్), స్మోకింగ్, ఆల్కహాల్‌కు అలవాటు పడటం వంటి సమస్యలు సైతం కొందరిలో కనిపిస్తాయి. ఇక సామాజిక సమస్యలూ, వైవాహిక బంధంలో ఇబ్బందులు సైతం మామూలే. అధిగమించడం ఇలా... కూర్చొని పనిచేసే ఉద్యోగాల వల్ల వచ్చే ఆరోగ్య అనర్థాలను అధిగమించడానికి అనుసరించాల్సిన సూచనలివి... మంచి పోషకాలతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం. అంటే అన్ని రకాల పోషకాలతోపాటు విటమిన్లు, మినరల్స్ సమపాళ్లలో ఉండేలా చూసుకోవాలి. ముదురు ఆకుపచ్చరంగులో ఉండే తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఆహారంలో ఎక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ►జంక్‌ఫుడ్, వేపుళ్లు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోకూడదు. ►ఆల్కహాల్‌నుంచి పూర్తిగా దూరంగా ఉండటమే మేలు. ►నిద్రపోవడానికి రెండు గంటల ముందే రాత్రిభోజనం పూర్తి చేయాలి. నిద్రకు కనీసం మూడు గంటల ముందునుంచే కాఫీ, టీ, ఆల్కహాల్ వంటి వాటికి దూరంగా ఉండాలి. ►నిద్రకు ఉపక్రమించడానికి గంట ముందు నుంచి కంప్యూటర్లు, ట్యాబ్స్, మొబైల్‌ఫోన్స్, టీవీ వంటి అన్ని ఎలక్ట్రానిక్ ఉపకరణాల ఉపయోగం నుంచి దూరంగా ఉండాలి. ►రోజూ క్రమం తప్పకుండా ధ్యానం, యోగా వంటివి చేయడం మంచిదే. ►ఇక ఆఫీస్‌లో కంప్యూటర్ ముందు పనిచేసేవారు ప్రతి రెండు గంటలకొకసారి కనీసం పది నిమిషాలు బ్రేక్ తీసుకొని అటు ఇటు నడవాలి. ►ఆఫీస్‌లో ఉండే జిమ్, రిలాక్సేషన్ రూమ్స్, యోగా హాల్స్ వంటి వాటిని స్మార్ట్‌గా ఉపయోగించుకొని దీర్ఘకాలం పాటు కూర్చొని ఉండటం వల్ల కలిగే అనర్థాలను అధిగమించవచ్చు. సామాజిక అంశాల వద్ద వస్తే... అందరితోనూ కలుపుగోలుగా ఉండటం, మిత్రులతో అరమరికలు లేకుండా హాయిగా నవ్వుతూ మాట్లాడటం, సామాజిక వేడుకల్లో పాల్గొనడం అన్ని విధాలా మంచిది. అలాగే మంచి కుటుంబ బంధాలు, పటిష్టమైన వైవాహిక బంధం చాలా ఒత్తిళ్ల నుంచి దూరం చేసి ఆరోగ్యాన్ని పెంచుతుంది. సామాజిక సేవలో పాల్గొనడం వల్ల నలుగురికి మంచి చేయడం మానసిక ఆనందాన్ని ఇస్తుంది. వీటివల్ల మన జీవితానికి సార్థకత చేకూరిన భావన కలుగుతుంది. అదేంతో మానసికతృప్తిని కలగజేస్తుంది. ఫలితంగా మనసు ఆనందంగా ఉండటం వల్ల మనిషి ఉల్లాసంగా ఉంటాడు. అది ఆరోగ్యానికి దోహదం చేసే అంశం. ఈ అన్ని కార్యకలాపాల వల్ల శారీరక దారుఢ్యం, మానసిక స్థైర్యం కలిగి మనుషులు దృఢంగా మారుతారు. వ్యాధుల పట్ల నిరోధకత పెరుగుతుంది. ఇక అన్నిటికంటే ముఖ్యంగా క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. వ్యాయామాలన్నింటి కంటే వేగంగా నడక సాగించే ‘బ్రిస్క్ వాకింగ్’ మేలు. దీన్ని రోజుకు 30 నిమిషాల పాటు ఆగకుండా కొనసాగించాలి. అయితే ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశం ఒకటుంది. నిజానికి ఇటీవల సాఫ్ట్‌వేర్‌తో శారీరక శ్రమ తగ్గడం వల్ల దాన్ని పూరించడానికి యువత జిమ్ పట్ల ఆకర్షితులు కావడం కూడా పెరుగుతోంది. ఇది మంచి పరిణామమే అయినా అతి సర్వత్ర వర్జయేత్ అనే సూక్తి వ్యాయామానికీ వర్తిస్తుంది. అతిగా వ్యామాయం చేయడం వల్ల కొన్ని సమస్యలు వస్తాయి. అతిగా వ్యాయామం చేసే వారిలో ఆ ఎక్సర్సైజ్ ఒత్తిడిని తొలుత తీసుకొనే అవయవం గుండె. అతి వ్యాయామంతో పడే ఒత్తిడిని భరించేలాగా గుండె తనను తాను తీర్చిదిద్దుకుంటుంది. అలా అన్ని కణాలకూ మరింత రక్తం అందేలా స్పందించే క్రమంలో గుండె పరిమాణం పెరుగుతుంది. దాంతో ఇలా అతిగా వ్యాయామం చేసే వారిలో అకస్మాత్తుగా గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇటీవల వ్యాయామం చేస్తూ కుప్పకూలిన కేసులు ఎక్కువగా వస్తున్నాయి. అందుకే గుండె ఆగగానే దాన్ని తిరిగి పని చేసేలా చేసే ప్రథమ చికిత్స చేయగల కార్డియో పల్మునరీ రిససియేషన్ (సీపీఆర్) నిపుణులను జిమ్‌లలో నియమించడం అవసరం. జిమ్‌లలో చేరేవారి ఆరోగ్య చరిత్ర తెలుసుకుని వారికి తగిన ఆరోగ్య పరీక్షలు చేశాకే చేర్చుకొని, వారు చేయదగ్గ వ్యాయామాలే చేయించడం తప్పనిసరి. వ్యక్తిగత క్రమశిక్షణతోనూ, మన పరిమితులను గుర్తెరగడం ద్వారా, మంచి సంతృప్త భావనతో ఎప్పుడూ సంతోషంగా, ఉల్లాసంగా ఉండటం, జీవితంలో తృప్తిని అనుభవిస్తూ, ఆస్వాదిస్తూ ఉండటం ద్వారా ఈ కూర్చొని చేసే వృత్తులతో వచ్చే అనర్థాలను చాలావరకు అధిగమించవచ్చు. నియమితవేళలు తప్పడమే అనారోగ్య హేతువు... కాలం ఎరగకుండా గంటల కొద్దీ కూర్చోవడం వల్ల ఒళ్లు ఏమాత్రం కదలకుండా ఉంటుంది. దాంతో శారీరక శ్రమ ఎంతమాత్రమూ ఉండటం లేదు. పైగా ఇటీవల షిఫ్టుల్లో పనిచేసే వృత్తుల కారణంగా తిండి, నిద్ర, వ్యాయామం... వాటి సమయ సందర్భాలూ, సామాజిక వ్యవహారాలు... వీటన్నింటిలోనూ నియమబద్ధత కొరవడింది. వేళకు భోజనాలు చేయడం వెనకబడింది. తిండి, నిద్రలు నియతి తప్పాయి. దాంతో మెదడులోని ‘బయలాజికల్ క్లాక్’లోని వేళలూ గతి తప్పాయి. ఫలితంగా ఆరోగ్యం అస్తవ్యస్తమవుతోంది. పైగా ఇటీవలి కంప్యూటర్ ఆధారిత వృత్తులో సహజంగా ఉండే ఒత్తిడికి తోడు ఇటీవల వారి ఉద్యోగాల్లోని అభద్రత... అగ్నికి తోడైన ఆజ్యంలా ఆరోగ్యాన్ని కాల్చేస్తోంది. వృత్తుల్లో లాగే... అనారోగ్యాల పరిణామక్రమమిది... వృత్తులో వచ్చిన మార్పులకు అనుగుణంగానే అనారోగ్య కారకాల్లోనూ, వ్యాధుల మార్పులోనూ ఒక అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. దాదాపు మూడు, నాలుగు దశాబ్దాల ముందు అనారోగ్యం అంటే ఏదైనా అంటువ్యాధి రావడమో, మూకుమ్మడిగా ఊళ్లకు ఊళ్లు తుడిచిపెట్టుకుపోయేలా మహమ్మారులు ప్రబలటమో జరిగేది. కానీ ఇప్పుడు అలాంటి కమ్యూనికబుల్ డిసీజ్‌ల స్థానంలో నాన్‌కమ్యూనికబుల్ డిసీజ్‌లు వచ్చి చేరాయి. ఇదీ వృత్తులకు అనుగుణంగా వ్యాధుల్లో చోటు చేసుకున్న పరిణామక్రమం. అంటే గతంలోలాగా కలరా, టీబీ, మశూచికం వంటి వ్యాధుల స్థానాలను హైబీపీ, హైకొలెస్ట్రాల్, డయాబెటిస్, గుండెపోటు, పక్షవాతం, దీర్ఘకాలిక మూత్రపిండాల జబ్బులు, ఊబకాయం వంటి ఆధునిక వ్యాధులని పిలిచే నాన్‌కమ్యూనికబుల్ వ్యాధులు సమాజంలోకి వచ్చి చేరాయి. పైగా రెండు మూడు దశాబ్దాల కిందట ఈ నాన్‌కమ్యూనికబుల్ డిసీజెస్‌తో తొలుత అరుదుగానూ, ఆ తర్వాత అడపాదడపా డాక్టర్ దగ్గరకు వచ్చేవారు. అయితే ఇటీవల ఈ జబ్బులతో వచ్చేవారి సంఖ్య చాలా ఎక్కువ. అందునా గతంలో 40 ఏళ్లకు పైబడ్డ వారిలోనే ఈ జబ్బులు కనిపించేవి. కానీ ఈ కంప్యూటర్ ఆధారిత వృత్తుల కారణంగా ఇటీవల పాతికేళ్ల నుంచి 30 ఏళ్ల యుక్తయవస్కుల్లోనూ ఈ జబ్బులు కనిపిస్తున్నాయి. మన దేశానికే కాదు... ప్రపంచానికీ నష్టం ప్రపంచవ్యాప్తంగా మరే దేశంలోనూ లేని ఒక అద్భుతమైన వనరు మన దేశానికే సొంతం. అదేమిటంటే... మన దేశంలోని 70 శాతం కంటే ఎక్కువ జనాభా 35 ఏళ్ల వయసులోపు వారే. ఇంతటి యువ జనాభా ఇక్కడ ఉన్న కారణంగా అది ప్రపంచంలోని మానవవనరుల అవసరాన్ని తీర్చుతోంది. అందుకే మన గ్లోబ్ మీద 218 దేశాలున్నా... అందులోని 185 దేశాల్లో మన దేశపు యువత ప్రపంచ మానవవనరుగా అందరికీ అందుబాటులో ఉంది. ఇది మనకు ఉన్న అద్భుత వరదాయకమైన వనరు. వరప్రదాయమైన ఈ మానవవనరును జనాభానిపుణుల పరిభాషలో ‘డెమొగ్రాఫిక్ డివిడెండ్’ అని వ్యవహరిస్తుంటారు. అయితే ఈ ‘డెమోగ్రాఫిక్ డివిడెండ్’ ప్రయోజనం మనకు దక్కకపోయే ప్రమాదం చాలా ఉంది. కారణం కూర్చొని చేసే వ్యాధులు. వాటి కారణంగా ప్రబలుతున్న నాన్ కమ్యూనికబుల్ వ్యాధులైన హైబీపీ, డయాబెటిస్, హార్ట్ఎటాక్, పక్షవాతం వంటివి. అవి అకస్మాత్తుగా మనిషిని చుట్టుముట్టేసి అతడి ఉత్పాదకతను దెబ్బతీస్తున్నాయి. అంతేకాదు... ఆర్థికభారంగా పరిణమించి కుటుంబాలను కుదేలయ్యేలా చేస్తున్నాయి. ఆ డిసీజ్ బర్డెన్ సమాజానికీ చివరకు దేశానికీ భారంగా పరిణమిస్తోంది. ఇక ఈ కూర్చొని చేసే ఉద్యోగాల కారణంగా ఇప్పుడున్న వ్యాధిగ్రస్తమైన నాన్కమ్యూనికల్ డిసీజ్‌ల భారం అదేపనిగా కొనసాగితే ‘డెమోగ్రాఫిక్ డివిడెండ్’ ప్రయోజనాలను మనం పొందేలోపే ఇప్పటి యువతరం అంతా వృద్ధాప్యదశకు చేరుకొని... ప్రస్తుత జపాన్లోలాగే మనదగ్గర కూడా వృద్ధతరం జనాభా పెరిగి పోయే ప్రమాదం ఉంది. ఇలా చూస్తే ఇది సమాజాన్నంతటినీ వ్యాధిగ్రస్తం చేసే సమస్య. ఇలాంటి వాటికి దూరంగా ఉండటం అవసరం. డాక్టర్ పి. కృష్ణంరాజు, సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
కొలువుదీరిన గణనాథులు
-
ఒళ్లో కూర్చొని సస్పెండ్ అయ్యాడు...
జమ్మూకశ్మీర్: పోలీసులు ఆకతాయిల తాట తీస్తారు అని తెలుసు. కానీ ఓ పొలీస్ అధికారే పోలీస్ స్టేషన్లో వెకిలి చేష్టలకు పాల్పడ్డాడు. ఓ మహిళా పోలీసు ఒళ్లో కూర్చొని తాపీగా ఫోటోకు ఫోజిచ్చాడు. దీంతో ఉన్నతాధికారులు ఆయనగారిపై సస్పెన్షన్ వేటు వేశారు. వివరాల్లోకి వెళ్తే.. జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి జిల్లా పోలీస్ స్టేషన్ కార్యాలయంలో ఓ మహిళా స్పెషల్ పోలీస్ ఆఫీసర్ ఒడిలో... హెడ్ కానిస్టేబుల్ జకీర్ హుస్సేన్ కులాసాగా కూర్చున్నాడు. అలా ఎందుకు కూర్చున్నాడో తెలియదు కానీ, ఈయన గారి నిర్వాకాన్ని ఎవరో ఫోటో తీసి వాట్సాప్ లో షేర్ చేశారు. పోలీస్‌స్టేషన్‌లో మహిళా పోలీస్ కుర్చీలో కూర్చొని ఉండగా ఆమె ఒడిలో మరో పోలీసు కూర్చొని ఉండడం ఈ ఫోటోలో స్పష్టంగా ఉంది. ఆ ఫోటో కాస్తా, ఆ ఫోనూ, ఈ ఫోనూ చేరి, చివరికి పోలీసు ఉన్నతాధికారుల దృష్టిలో పడింది. దీంతో హెడ్ కానిస్టేబుల్ జకీర్ హుస్సేన్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. అలాగే మహిళా స్పెషల్ ఆఫీసర్‌పై విచారణకు ఆదేశించారు. అలాగే ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నవారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి అసభ్యకర చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించమని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. -
ఎక్కువసేపు కూర్చున్నా రిస్క్ లేదట!
లండన్: గంటల తరబడి కూర్చుని ఉంటే.. ఆరోగ్యానికి ముప్పనే అభిప్రాయం ఉండేది. అయితే.. తాజా పరిశోధనలు మాత్రం.. అతిగా కూర్చోవటం వల్ల ప్రాణానికొచ్చిన ప్రమాదమేమీ లేదంటున్నాయి. లండన్‌లోని ఎక్స్టర్ వర్సిటీ విద్యార్థులు కొందరు 16 ఏళ్లపాటు 5వేల మందిపై పరిశోధనలు చేశారు. నాలుగు భిన్నమైన పద్ధతుల్లో కూర్చునే(పనిచేస్తున్నప్పుడు, విశ్రాంతి సమయంలో, టీవీ చూస్తూ, విశ్రాంతి సమయంలో టీవీ లేకుండా) వారిపై.. వ్యాయామం చేసే మరికొందరిపై పరిశోధన చేశారు. వయసు, ఆరోగ్యం, ఆహారం వంటి వాటిని పరిగణనలోకి తీసుకున్నారు. అయితే.. 16 ఏళ్లపాటు పరిశోధించినా.. ఎక్కువగా కూర్చునే వారికి.. మిగిలిన వారితో పోలిస్తే.. ఆరోగ్యం విషయంలో ముప్పు ఉన్నట్లు బయటపడలేదని.. రిస్క్ ఇద్దరికీ సమానంగానే ఉన్నట్లు పరిశోధనలో వెల్లడైందని పరిశోధకులు చెప్పారు. -
జీవితమంతా కటకటాల్లో...
వీక్షణం ఈ కుక్క బోనులో ఉందని అనుకుంటున్నారా? కాదు... జైల్లో ఉంది. ఓ చిన్న పిల్లాడిని కరిచి, దారుణంగా గాయపర్చి నందుకుగాను దానికి యావజ్జీవిత ఖైదును విధించింది అమెరికన్ కోర్టు. యావజ్జీవిత శిక్ష అంటే మనలాగా పద్నాలుగేళ్లు కాదు... జీవితమంతా జైల్లోనే ఉండాలి. ఈ ఖైదీ కుక్క పేరు మిక్కీ. నిజానికిది ఎప్పుడూ కుదురుగానే ఉండేది. కానీ హఠాత్తుగా ఏమయ్యిందో ఏమో... ఓ చిన్నపిల్లాడిని కరిచేసింది. మిక్కీ యజమానురాలు బేబీ సిట్టింగ్ చేస్తుంది. ఆమె దగ్గరకు వచ్చే పిల్లల్లో నాలుగేళ్ల కెవిన్ విన్సెంట్ ఒకడు. ఓ రోజు ఎప్పటిలానే కెవిన్ని తీసుకొచ్చి క్రష్‌లో వదిలి వెళ్లారు తల్లిదండ్రులు. ఆరోజు మిక్కీకి ఏం బుద్ధి పుట్టిందో తెలియదు గానీ... కెవిన్ని ఇష్టమొచ్చినట్టు కరిచేసింది. కంటికి, దవడకు తీవ్ర గాయాలయ్యాయి. దాంతో కెవిన్ తల్లిదండ్రులు పోలీస్ కంప్లయింట్ ఇచ్చారు. కేసును పరిశీలించిన న్యాయమూర్తి... కుక్కల కోసం ప్రత్యేకంగా కేటాయించిన ‘నో కిల్లింగ్ షెల్టర్’లో జీవితాంతం బందీగా ఉంచమని తీర్పునివ్వడంతో కటకటాల వెనక్కి వెళ్లిపోయింది మిక్కీ. కేసు మొదలైన తరువాత మిక్కీని వదిలేయమంటూ జంతు సంరక్షకులు కొందరు గొడవ చేశారు. నోరు లేని ప్రాణి తెలియక చేసిన తప్పుకు మరణశిక్ష వేయవద్దంటూ కోర్టును అభ్యర్థించారు. దాంతో న్యాయమూర్తి మిక్కీని జీవితమంతా జైల్లో ఉండమన్నారు. లేదంటే మరణశిక్ష వేసేవారట. అదీ సంగతి! -
ఏమైతదో....ఏందో!
విలీనం-పొత్తుపై టెన్షన్.. టెన్షన్ కాంగ్రెస్ నేతల్లో కలవరం గులాబీ నాయకుల్లోనూ గుబులు ఇరుపార్టీల మధ్య సీట్ల సర్దు‘పాట్లు’ కలిసే నడవాలంటున్న సిట్టింగ్‌లు సాక్షి ప్రతినిధి, వరంగల్ : తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష సాకారమైంది. ఇచ్చిన హామీని కాంగ్రెస్ అధిష్టానం నెరవేర్చడంతో ఆ పార్టీ నాయకుల్లో జోష్ పెరిగింది. ఎన్నికల పోరుకు ఇన్నాళ్లు అడ్డుగా ఉన్న ‘తెలంగాణ’... ఇప్పుడు అనుకూలంగా మారిందనే సంతోషం వారిలో నెలకొంది. ఈ క్రమంలో తెలంగాణ ఉద్యమంలో ముందున్న టీఆర్ఎస్ నేతలూ ఊపు మీదున్నారు. ప్రత్యేక రాష్ట్రం తెచ్చిన ఘనత తమదేనని... ఎన్నికల్లో తమకే సానుకూలత ఉంటుందని వీరు భావిస్తున్నారు. మొత్తంగా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో అధికార కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకుల్లో హుషారు పెరుగుతోంది. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ పయనంపై జరుగుతున్న ప్రచారం ఆ రెండు పార్టీల నేతలను కలవరానికి గురిచేస్తోంది. కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనం, వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య పొత్తు అంశాలు వారిలో ఆందోళన పెంచుతున్నారుు. వీటిలో ఏది జరిగినా... తమ రాజకీయ భవిష్యత్ ఇబ్బందుల్లో పడుతుందని ఎక్కువ మంది నేతలు టెన్షన్ పడుతున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్‌లోని సిట్టింగ్‌లు విలీనం లేదా పొత్తు... ఏదైనా ఒకటి తప్పనిసరిగా ఉండాలని కోరుకుంటున్నారు. ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్న ఇరు పార్టీల నియోజకవర్గ ఇన్చార్జీలు మాత్రం రెండు జరగకూడదని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ నేతల్లోనే... కాంగ్రెస్ ఆశావహుల్లో ఎక్కువ మందికి రాజకీయ భవిష్యత్ ఇబ్బందికరంగా తయారయ్యే అవకాశం కనిపిస్తోంది. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి జిల్లాలో ఈ పార్టీకి మంచి ఫలితాలే వచ్చాయి. 2004లో జరిగిన సాధారణ ఎన్నికల్లో తెలంగాణలో ఎక్కడా లేనన్ని సీట్లు దక్కించుకుంది. వరంగల్, హన్మకొండ లోక్‌సభ... హన్మకొండ, నర్సంపేట, చేర్యాల, పరకాల, స్టేషన్‌ఘన్‌పూర్, చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గాలను కైవసం చేసుకుంది. ప్రతికూల ఫలితాలు వచ్చిన 2008 ఉప ఎన్నికలోనూ ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే స్థానాన్ని నిలబెట్టుకుంది. 2009 సాధారణ ఎన్నికల్లో వరంగల్ పశ్చిమ స్థానంలోనే విజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో స్టేషన్‌ఘన్‌పూర్, పరకాల అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న మూడు సెగ్మెంట్లలోనూ ప్రధాన రాజకీయ ప్రత్యర్థిలుగా ఇప్పుడు కాంగ్రెస్ నాయకులే ఉన్నారు. కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనమైనా, పొత్తు కుదిరినా... సిట్టింగులకు ఢోకా ఉండదనే ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే ఈ స్థానాల్లోని కాంగ్రెస్‌లోని ముఖ్య నాయకుల రాజకీయ భవిష్యత్ ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది. టీఆర్ఎస్ ప్రాతినిథ్యం వహిస్తున్న మూడు అసెంబ్లీ స్థానాలను మినహాయిస్తే... జనగామ, వరంగల్ తూర్పు, భూపాలపల్లి, మహబూబాబాద్, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. సిట్టింగులకు ఇబ్బందులు లేని సూత్రంతో విలీనం లేదా పొత్తు... జరిగితే ఈ ఎమ్మెల్యేలకు ఇబ్బంది ఉండకపోవచ్చు. కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనమైనా, పొత్తు కుదిరినా... టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహించే అసెంబ్లీ సెగ్మెంట్ల విషయంలోనే ఎక్కువ సమస్యలు రానున్నాయి. ముఖ్యంగా నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో సర్దుబాటు ఇబ్బందులు తప్పేలాలేవు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు దొంతి మాధవరెడ్డి ఈ సెగ్మెంట్లో ఇన్చార్జ్గా ఉన్నారు. సుదీర్ఘకాలం టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా, ప్రస్తుతం జిల్లా కన్వీనర్‌గా ఉన్న పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆ పార్టీ నర్సంపేట నియోజకవర్గ ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. విలీనమైతే రెండు వర్గాలు... పొత్తు కుదిరితే రెండు పార్టీలు ఈ సీటు కోసమే పోరు సాగించే పరిస్థితి కనిపిస్తోంది. పాలకుర్తి నియోజకవర్గంలోనూ నర్సంపేట పరిస్థితే ఉండనుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావు అధికార పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్గా ఉన్నారు. టీఆర్ఎస్ ఇన్చార్జ్గా మాజీ ఎమ్మెల్యే ఎన్.సుధాకర్‌రావు కొనసాగుతున్నారు. సీటు కోసం ఇరు వర్గాలు తీవ్రంగా ప్రయత్నించే వారే కావడంతో సీటు ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. ములుగు నియోజకవర్గ టికెట్ ఎవరికి దక్కుతుంతో చివరి వరకు ఉత్కంట పరిస్థితులు నెలకొనే అవకాశాలున్నారుు. గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన పోదెం వీరయ్య కాంగ్రెస్ ఇన్చార్జ్గా ఉన్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన మాజీ మంత్రి ఎ.చందులాల్ టీఆర్ఎస్ ఇన్చార్జ్గా ఉన్నారు. రెండు పార్టీలు కలిస్తే సీటు ఎవరికి దక్కుతుందనేది అంతుపట్టకుండా ఉంది. డోర్నకల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి డీఎస్.రెడ్యానాయక్‌కు దీటైన నేతలు టీఆర్ఎస్లో లేకపోవడంతో సీటు కాంగ్రెస్ పార్టీకే దక్కే పరిస్థితి ఉంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ భవిష్యత్ పయనం ప్రభావం వరంగల్ లోక్‌సభ స్థానంపై ఎక్కువగా పడనుంది. ప్రస్తుతం కాంగ్రెస్‌కు చెందిన సిరిసిల్ల రాజయ్య ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మాజీ మంత్రి కడియం శ్రీహరి టీఆర్ఎస్ తరఫున వచ్చే ఎన్నికల్లో వరంగల్ ఎంపీగా పోటీ చేస్తారని గులాబీ అధినేత కేసీఆర్ గతంలోనే స్పష్టం చేశారు. కడియం... టీఆర్ఎస్లో చేరిన రోజే ఈ విషయం చెప్పారు. దీన్నిబట్టి టీఆర్ఎస్ తమ కోసం బలంగా పట్టుబట్టే లోక్‌సభ స్థానాల్లో వరంగల్ ప్రధానంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు శ్రీహరికి ఈ సీటు దక్కితే సిట్టింగ్ ఎంపీ రాజయ్య పరిస్థితి ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.