ఒళ్లో కూర్చొని సస్పెండ్ అయ్యాడు... | Police seen in pictures sitting on lady cop’s lap, suspended | Sakshi
Sakshi News home page

ఒళ్లో కూర్చొని సస్పెండ్ అయ్యాడు...

Published Fri, Nov 20 2015 8:09 PM | Last Updated on Tue, Aug 21 2018 5:52 PM

ఒళ్లో కూర్చొని సస్పెండ్ అయ్యాడు... - Sakshi

ఒళ్లో కూర్చొని సస్పెండ్ అయ్యాడు...

జమ్మూకశ్మీర్: పోలీసులు ఆకతాయిల తాట తీస్తారు అని తెలుసు. కానీ ఓ పొలీస్ అధికారే పోలీస్ స్టేషన్లో వెకిలి చేష్టలకు పాల్పడ్డాడు. ఓ మహిళా పోలీసు ఒళ్లో కూర్చొని తాపీగా ఫోటోకు ఫోజిచ్చాడు. దీంతో ఉన్నతాధికారులు ఆయనగారిపై సస్పెన్షన్ వేటు వేశారు.

వివరాల్లోకి వెళ్తే.. జమ్మూకశ్మీర్లోని  రాజౌరి జిల్లా  పోలీస్ స్టేషన్  కార్యాలయంలో ఓ మహిళా స్పెషల్ పోలీస్ ఆఫీసర్  ఒడిలో... హెడ్ కానిస్టేబుల్ జకీర్ హుస్సేన్ కులాసాగా కూర్చున్నాడు. అలా  ఎందుకు కూర్చున్నాడో  తెలియదు కానీ, ఈయన గారి  నిర్వాకాన్ని ఎవరో ఫోటో తీసి వాట్సాప్ లో షేర్ చేశారు.

పోలీస్స్టేషన్లో మహిళా పోలీస్ కుర్చీలో కూర్చొని ఉండగా  ఆమె ఒడిలో  మరో పోలీసు కూర్చొని ఉండడం ఈ ఫోటోలో స్పష్టంగా ఉంది. ఆ ఫోటో కాస్తా, ఆ ఫోనూ, ఈ ఫోనూ చేరి, చివరికి  పోలీసు ఉన్నతాధికారుల దృష్టిలో పడింది. దీంతో  హెడ్ కానిస్టేబుల్ జకీర్ హుస్సేన్ను అధికారులు సస్పెండ్ చేశారు. అలాగే  మహిళా స్పెషల్ ఆఫీసర్పై విచారణకు ఆదేశించారు. అలాగే ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నవారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి  అసభ్యకర చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించమని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement