suspenstion
-
DGP Anjani Kumar: డీజీపీ అంజనీకుమార్‌పై సస్పెన్షన్ ఎత్తివేత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐపీఎస్ అధికారి అంజనీకుమార్‌పై కేంద్ర ఎన్నికల సంఘం సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. అయితే, అంజనీకుమార్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న సీఈసీ.. సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్టు తెలిపింది. కాగా, అంజనీకుమార్ తన సస్పెన్షన్‌పై సీఈసీని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల కౌంటింగ్ రోజున తాను ఉద్దేశపూర్వకంగా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించలేదని తెలిపారు. ఎన్నికల రోజున సీఎం రేవంత్ రెడ్డి పిలిస్తేనే తాను ఆయన ఇంటికి వెళ్లినట్టు అంజనీకుమార్ స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కావని ఆయన చెప్పారు. దీంతో, ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న సీఈసీ.. సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్టు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. #JustIn | Election Commission of India revokes suspension of Telangana DGP Anjani Kumar. He was suspended for meeting Telangana Chief Minister Revanth Reddy while votes for the assembly polls were being counted. pic.twitter.com/7Sk6xSdLkQ — NDTV (@ndtv) December 12, 2023 -
ట్రంప్‌కు షాక్ మీద షాక్ : యూట్యూబ్ కొరడా
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరో షాక్ తగిలింది. ట్రంప్ సోషల్ మీడియా ఖాతాలపై వేటు వేస్తున్న సంస్థల్లో తాజాగా యూ ట్యూబ్ కూడా చేరింది. ట్రంప్ ఛానల్లో అప్లోడ్ చేసిన కంటెంట్‌ను హింసను రెచ్చగొడుతున్నట్టుగా ఉందని ఆరోపణల నేపథ్యంలో యూట్యూబ్ కొరడా ఝళిపించింది. ట్రంప్ ఛానెల్‌ను కనీసం ఒక వారం సస్పెండ్ చేస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. తమ ప్లాట్‌ఫాం విధానాలను ఉల్లంఘించినందుకుగాను నిబంధనల ప్రకారం ఈ సస్పెన్షన్ మరికొంత కాలం పొడిగించే అవకాశం ఉందని కూడా మంగళవారం సాయంత్రం వెల్లడించింది. కనీసం ఏడు రోజుల పాటు కొత్త కంటెంట్‌ను అప్లోడ్ చేయలేరు. అలాగే ఈ వీడియోపై వ్యాఖ్యలను నిరవధికంగా నిలిపివేస్తున్నట్టు కూడా తెలిపింది. ట్రంప్ ఛానల్ తాజా కంటెంట్‌ను జాగ్రత్తగా సమీక్షించిన తరువాత, హింసకు ప్రేరేపిస్తుందన్న ఆందోళనల దృష్ట్యా , తాజాగా అప్లోడ్ చేసిన క్రొత్త కంటెంట్‌ను తొలగించామని, తమ విధానాలను ఉల్లంఘించినందుకు ఈ చర్య తీసుకున్నామని యూట్యూబ్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. (ట్రంప్ బ్యాన్ : ట్విటర్ నష్టం ఎంతో తెలుసా? ) గూగుల్‌కు చెందిన వీడియో షేరింగ్ ఫ్లాట్‌ఫామ్ నుంచి ట్రంప్ ఛానల్‌ను తొలగించాలని, కఠిన చర్యలు తీసుకోవాలని సామాజిక సంఘాలు మంగళవారం డిమాండ్ చేశాయి. లేదంటే వాణిజ్య ప్రకటనలను నిలిపివేసేలా ప్రచారం చేపడతామని హెచ్చరించాయి. స్టాప్ హేట్ ఫర్ ప్రాఫిట్ ఉద్యమ సంస్థ ఈ వార్నింగ్ ఇచ్చింది. కాగా క్యాపిటల్ హిల్ దాడి ఘటన తర్వాత సోషల్ మీడియా సంస్థలన్నీ ట్రంప్‌ను బ్లాక్ చేస్తున్నాయి. ట్విటర్ అకౌంట్‌ను శాశ్వతంగా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లను తాత్కాకాలింకంగా బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు ట్రంప్‌కు చెందిన 70వేలమంది ట్విటర్ ఖాతాలను నిలిపివేసింది. ట్రంప్ ఛానల్‌కు సుమారు 2.77 మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉన్నారు -
ఎయిరిండియాకు మరోసారి కరోనా సెగ
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా సంక్షోభం కాలంలో వందేభారత్ మిషన్ కింద విదేశీ ప్రయాణికులను చేరవేస్తున్న ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ సేవలకు మరోసారి కరోనా సెగ తగిలింది. ఎయిరిండియా విమానంలో దుబాయ్ వెళ్లిన ఒక ప్రయాణీకుడికి కోవిడ్-19కు పాజిటివ్ రావడంతో దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ సీరియస్ గా స్పందించింది. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ కార్యకలాపాలను15 రోజులపాటు నిషేధించింది. ఈ సస్పెన్షన్ సెప్టెంబర్ 18 నుండి అక్టోబర్ 2 వరకు కొనసాగుతుందని ప్రకటించింది. సెప్టెంబర్ 4న జైపూర్ నుండి దుబాయ్ వచ్చిన ప్రయాణీకుడికి కరోనా నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని దుబాయ్ అధారిటీ తన సస్పెన్షన్ నోటీసులో పేర్కొంది. ఇలా వైరస్ సోకిన ప్రయాణీకుడిని గుర్తించకపోవడం ఇది రెండవసారని ఎయిరిండియాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సెప్టెంబరు 2వ తేదీన జైపూర్ లోని ఒక డయాగ్నిస్టిక్ సెంటర్ ద్వారా అతనికి పాజిటివ్ రిపోర్టు వచ్చిందని, అయినా నిర్లక్ష్యంగా వ్యవహించారని పేర్కొంది. తద్వారా విమానంలో ఉన్న ఇతర ప్రయాణీకులను ప్రమాదంలో పడేసారనీ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రాంతీయ మేనేజరుకు రాసిన లేఖలో ఆరోపించింది. కరోనా మహమ్మారి కాలంలో ఇరు దేశాల మధ్య కుదరిన ఒప్పందాన్ని ఉల్లంఘించారని మండిపడింది. -
ఐటీ షేర్లకు ట్రంప్ షాక్ : రికవరీ
సాక్షి, ముంబై: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వర్క్ వీసాలపై సంచలన నిర్ణయం తీసుకోవడంతో మంగళవారం నాటి మార్కెట్లో ఐటీ షేర్లకు అమ్మకాల సెగ తాకింది. 2020, డిసెంబర్ 31వరకు హెచ్1బీ, హెచ్ 2బీ, తదితర వర్క్ వీసాల జారీని ట్రంప్ సర్కార్ నిలిపివేయడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంటు దెబ్బతింది. దీంతో టాప్ ఐటీ షేర్లతో పాటు మిగిలిన ఐటీ షేర్లలో కూడా అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ప్రధానంగా ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్‌సిఎల్ టెక్ భారీగా నష్టాలను నమోదు చేశాయి. ఇన్ఫోసిస్ షేర్ ధర 1శాతం పైగా కోల్పోయి 692 రూపాయల వద్ద, హెచ్ఎస్ఎల్ దాదాపు 1 శాతం తగ్గి 564 రూపాయలకు చేరుకుంది. టీసీఎస్ షేర్ అంతకుముందు ముగింపు 2028 రూపాయలతో పోలిస్తే 2010 వద్ద ట్రేడ్ అయింది. టెక్ మహీంద్రా షేర్ ధర 0.92 శాతం క్షీణించి 543.50 రూపాయలకు చేరుకుంది. అయితే దీని ప్రభావం తాత్కాలికమేనని, భారతీయ ఐటీ ఉద్యోగులు లేకుండా అమెరికా ఐటీ పరిశ్రమ మనుగడ కష్టమని ఐటీ నిపుణులు భరోసా ఇవ్వడంతో తిరిగి అదే స్థాయిలో రీబౌండ్ అయ్యాయి. దీంతో మిడ్ సెషన్ తరువాత కోలుకుని ప్రస్తుతం లాభాలతో కొనసాగుతుండటం విశేషం. అటు సెన్సెక్స్ 351 పాయింట్ల లాభంతో 35263 వద్ద, నిఫ్టీ 108 పాయింట్లు ఎగిసి 10421 వద్ద కొనసాగుతున్నాయి. (ట్రిపుల్ సెంచరీ లాభాలతో సెన్సెక్స్) ఐటీ నిపుణులు, విశ్లేషకులు ఏమన్నారు ట్రంప్ సర్కార్ నిర్ణయం భారతీయ ఐటీ కంపెనీల కంటే అమెరికా కంపెనీలనే ఎక్కువగా ప్రభావితం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 2019లో హెచ్ 1బీ వీసాలు పొందిన మొదటి పది కంపెనీల్లో ఏడు అమెరికా కంపెనీలే ఉన్నాయని ఒక నివేదిక ద్వారా తెలుస్తోంది. అంతేకాదు హెచ్1బీ వీసాలపై ఆధారపడటం ఐటీ పరిశ్రమలో గణనీయంగా తగ్గిందని వెడ్ బుష్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ అనలిస్ట్ మోషే కత్రి చెప్పారు. దురదృష్టవశాత్తు అమెరికాలో ఎన్నికల సంవత్సరంలో ఇదొక ఎత్తుగడ అని వ్యాఖ్యానించారు. ఇమ్మిగ్రేషన్ సవాళ్లకు భారత ఐటీ పరిశ్రమ ఇప్పటికే తనను తాను సిద్ధం చేసుకుందని టెక్ మహీంద్రా సీఎండీ సీపీ గుర్నాని చెప్పారు. ట్రంప్ ప్రకటనపై నిరాశను వ్యక్తం చేసిన గూగుల్, అల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్, అటు అమెరికా ఆర్థిక విజయానికి, టెక్ రంగలో గ్లోబల్ లీడర్‌గా నిలిచేందుకు, ఇటు గూగుల్ సంస్థకూ వలసదారులు ఎంతో దోహదపడ్డారని పేర్కొన్నారు. అందరికీ అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తాం, వలసదారులకు అండగా వుంటామని భరోసా ఇస్తూ ట్వీట్ చేశారు. Immigration has contributed immensely to America’s economic success, making it a global leader in tech, and also Google the company it is today. Disappointed by today’s proclamation - we’ll continue to stand with immigrants and work to expand opportunity for all. — Sundar Pichai (@sundarpichai) June 22, 2020 మరోవైపు వరుసగా రెండో రోజూ రూపాయి లాభాలతో ప్రారంభమైంది. డాలర్‌తో పోలిస్తే 16 పైసలు బలపడి 75.86 వద్ద ట్రేడ్ అయింది. చివరకు 37 పైసలు ఎగిసి 75.66 వద్ద ముగిసింది. నిన్న (సోమవారం) 76.02 వద్ద ముగిసింది. -
ఆశ్రం వ్యవహారం: కానిస్టేబుల్‌పై వేటు
సాక్షి, ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఆశ్రం మెడికల్ కాలేజీలో ఆందోళనకు దిగిన మెడికోల పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించిన కానిస్టేబుల్‌పై వేటు పడింది. కానిస్టేబుల్ మోహన్‌ను వీఆర్‌కు పంపాలని ఎస్పీ రవిప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో రద్దు చేసిన క్రిస్మస్ సెలవులను వేసవి సెలవులతో కలిపి ఇవ్వాలని మెడికోలు అందోళనకు దిగారు. వేసవి సెలవులను పదిహేను రోజులకు బదులు నెలరోజులు ఇవ్వమని కాలేజీలో ఆందోళన చేస్తున్న మెడికోలను కానిస్టేబుల్ వీడియో తీయడమే గాకుండా.. వారిని లాక్కెళుతూ అనుచితంగా ప్రవర్తించారు. ఈ దారుణాన్ని అడ్డుకున్న విద్యార్థులపై కూడా దురుసుగా ప్రవర్తించాడు కానిస్టేబుల్. దీనిపై సీరియస్ అయిన ఎస్పీ... సంబంధిత కానిస్టేబుల్‌ను వీఆర్‌కు బదిలీ చేశారు. మరోవైపు విద్యార్థినులను జుట్టుపట్టుకుని దౌర్జన్యంగా లాక్కువెళుతున్నట్లుగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. దీనిపై ఎస్పీ మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో ఇటువంటి అసత్య ప్రచారాలు చేయరాదని సూచించారు. -
ఆశ్రం వ్యవహారం: కానిస్టేబుల్‌పై వేటు
-
ఒళ్లో కూర్చొని సస్పెండ్ అయ్యాడు...
జమ్మూకశ్మీర్: పోలీసులు ఆకతాయిల తాట తీస్తారు అని తెలుసు. కానీ ఓ పొలీస్ అధికారే పోలీస్ స్టేషన్లో వెకిలి చేష్టలకు పాల్పడ్డాడు. ఓ మహిళా పోలీసు ఒళ్లో కూర్చొని తాపీగా ఫోటోకు ఫోజిచ్చాడు. దీంతో ఉన్నతాధికారులు ఆయనగారిపై సస్పెన్షన్ వేటు వేశారు. వివరాల్లోకి వెళ్తే.. జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి జిల్లా పోలీస్ స్టేషన్ కార్యాలయంలో ఓ మహిళా స్పెషల్ పోలీస్ ఆఫీసర్ ఒడిలో... హెడ్ కానిస్టేబుల్ జకీర్ హుస్సేన్ కులాసాగా కూర్చున్నాడు. అలా ఎందుకు కూర్చున్నాడో తెలియదు కానీ, ఈయన గారి నిర్వాకాన్ని ఎవరో ఫోటో తీసి వాట్సాప్ లో షేర్ చేశారు. పోలీస్‌స్టేషన్‌లో మహిళా పోలీస్ కుర్చీలో కూర్చొని ఉండగా ఆమె ఒడిలో మరో పోలీసు కూర్చొని ఉండడం ఈ ఫోటోలో స్పష్టంగా ఉంది. ఆ ఫోటో కాస్తా, ఆ ఫోనూ, ఈ ఫోనూ చేరి, చివరికి పోలీసు ఉన్నతాధికారుల దృష్టిలో పడింది. దీంతో హెడ్ కానిస్టేబుల్ జకీర్ హుస్సేన్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. అలాగే మహిళా స్పెషల్ ఆఫీసర్‌పై విచారణకు ఆదేశించారు. అలాగే ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నవారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి అసభ్యకర చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించమని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.