
సాక్షి, ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఆశ్రం మెడికల్ కాలేజీలో ఆందోళనకు దిగిన మెడికోల పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించిన కానిస్టేబుల్‌పై వేటు పడింది. కానిస్టేబుల్ మోహన్‌ను వీఆర్‌కు పంపాలని ఎస్పీ రవిప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో రద్దు చేసిన క్రిస్మస్ సెలవులను వేసవి సెలవులతో కలిపి ఇవ్వాలని మెడికోలు అందోళనకు దిగారు. వేసవి సెలవులను పదిహేను రోజులకు బదులు నెలరోజులు ఇవ్వమని కాలేజీలో ఆందోళన చేస్తున్న మెడికోలను కానిస్టేబుల్ వీడియో తీయడమే గాకుండా.. వారిని లాక్కెళుతూ అనుచితంగా ప్రవర్తించారు. ఈ దారుణాన్ని అడ్డుకున్న విద్యార్థులపై కూడా దురుసుగా ప్రవర్తించాడు కానిస్టేబుల్. దీనిపై సీరియస్ అయిన ఎస్పీ... సంబంధిత కానిస్టేబుల్‌ను వీఆర్‌కు బదిలీ చేశారు.
మరోవైపు విద్యార్థినులను జుట్టుపట్టుకుని దౌర్జన్యంగా లాక్కువెళుతున్నట్లుగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. దీనిపై ఎస్పీ మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో ఇటువంటి అసత్య ప్రచారాలు చేయరాదని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment