ట్రంప్‌కు షాక్‌ మీద షాక్‌ : యూట్యూబ్‌ కొరడా | YouTube suspends Trump account, barring uploads and comments | Sakshi
Sakshi News home page

ట్రంప్‌కు షాక్‌ మీద షాక్‌ : యూట్యూబ్‌ కొరడా

Published Wed, Jan 13 2021 11:28 AM | Last Updated on Wed, Jan 13 2021 8:28 PM

YouTube suspends Trump account, barring uploads and comments - Sakshi

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరో షాక్‌ తగిలింది.  ట్రంప్‌  సోషల్‌ మీడియా ఖాతాలపై వేటు వేస్తున్న  సంస్థల్లో తాజాగా యూ ట్యూబ్‌ కూడా చేరింది. ట్రంప్ ఛానల్‌లో అప్‌లోడ్ చేసిన కంటెంట్‌ను హింసను రెచ్చగొడుతున్నట్టుగా ఉందని ఆరోపణల​ నేపథ్యంలో యూట్యూబ్ కొరడా ఝళిపించింది. ట్రంప్ ఛానెల్‌ను కనీసం ఒక వారం సస్పెండ్  చేస్తున్నట్టు తాజాగా ప్రకటించింది.  తమ ప్లాట్‌ఫాం విధానాలను ఉల్లంఘించినందుకుగాను  నిబంధనల ప్రకారం ఈ సస్పెన్షన్‌ మరికొంత కాలం పొడిగించే అవకాశం ఉందని కూడా మంగళవారం సాయంత్రం  వెల్లడించింది. కనీసం ఏడు రోజుల పాటు కొత్త కంటెంట్‌ను అప్‌లోడ్ చేయలేరు. అలాగే ఈ వీడియోపై వ్యాఖ్యలను నిరవధికంగా నిలిపివేస్తున్నట్టు కూడా తెలిపింది. ట్రంప్‌ ఛానల్‌  తాజా కంటెంట్‌ను జాగ్రత్తగా సమీక్షించిన తరువాత, హింసకు ప్రేరేపిస్తుందన్న ఆందోళనల దృష్ట్యా , తాజాగా అప్‌లోడ్ చేసిన క్రొత్త కంటెంట్‌ను తొలగించామని, తమ విధానాలను ఉల్లంఘించినందుకు ఈ చర్య తీసుకున్నామని యూట్యూబ్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. (ట్రంప్‌ బ్యాన్‌ : ట్విటర్‌ నష్టం ఎంతో తెలుసా? )

గూగుల్‌కు చెందిన వీడియో షేరింగ్ ఫ్లాట్‌ఫామ్ నుంచి ట్రంప్ ఛానల్‌ను తొలగించాలని, కఠిన చర్యలు తీసుకోవాలని సామాజిక సంఘాలు మంగళవారం డిమాండ్ చేశాయి. లేదంటే వాణిజ్య ప్రకటనలను నిలిపివేసేలా ప్రచారం చేపడతామని హెచ్చరించాయి. స్టాప్‌ హేట్ ఫర్ ప్రాఫిట్ ఉద్యమ సంస్థ ఈ వార్నింగ్ ఇచ్చింది. కాగా క్యాపిటల్ హిల్ దాడి ఘటన తర్వాత సోషల్ మీడియా సంస్థలన్నీ ట్రంప్‌ను బ్లాక్ చేస్తున్నాయి.  ట్విటర్‌ అకౌంట్‌ను  శాశ్వతంగా, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లను తాత్కాకాలింక​ంగా  బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు ట్రంప్‌కు చెందిన 70వేలమంది ట్విటర్‌ ఖాతాలను నిలిపివేసింది. ట్రంప్ ఛానల్‌కు సుమారు 2.77 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు ఉన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement