
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐపీఎస్ అధికారి అంజనీకుమార్‌పై కేంద్ర ఎన్నికల సంఘం సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. అయితే, అంజనీకుమార్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న సీఈసీ.. సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్టు తెలిపింది.
కాగా, అంజనీకుమార్ తన సస్పెన్షన్‌పై సీఈసీని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల కౌంటింగ్ రోజున తాను ఉద్దేశపూర్వకంగా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించలేదని తెలిపారు. ఎన్నికల రోజున సీఎం రేవంత్ రెడ్డి పిలిస్తేనే తాను ఆయన ఇంటికి వెళ్లినట్టు అంజనీకుమార్ స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కావని ఆయన చెప్పారు. దీంతో, ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న సీఈసీ.. సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్టు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది.
#JustIn | Election Commission of India revokes suspension of Telangana DGP Anjani Kumar.
— NDTV (@ndtv) December 12, 2023
He was suspended for meeting Telangana Chief Minister Revanth Reddy while votes for the assembly polls were being counted. pic.twitter.com/7Sk6xSdLkQ