తెలంగాణలో ఐపీఎస్‌ల బదిలీలు జరిగాయి. పోలీస్ బాస్(డీజీపీ) మహేందర్ రెడ్డి పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో ఐపీఎస్‌ల బదిలీల ప్రక్రియ అనివార్యమైంది. దీంతో, తెలంగాణ కొత్త డీజీపీ ఎవరు వస్తారనే ఊహాగానాలకు తెరదించుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ఇన్‌చార్జ్ డీజీపీగా ఐపీఎస్ అంజనీ కుమార్‌ను నియమించింది ప్రభుత్వం.
అయితే, అంజనీ కుమార్.. బీహార్ రాజధాని పట్నాలోని సెయింట్ జేవియర్ స్కూల్లో, ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకున్నారు. 1990 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అంజనీ కుమార్.. ప్రస్తుతం ఏసీబీ డీజీగా ఉన్నారు. 2021 డిసెంబరు 24న ఏసీబీ డీజీ అయ్యారు. అంతకుముందు హైదరాబాద్ నగర కమిషనర్‌గా పని చేశారు. ఐక్యరాజ్య సమితి శాంతి మెడల్ (పీస్ మెడల్) రెండుసార్లు అందుకున్నారు. ఐక్యరాజ్య సమితి తరఫున 1998-99లో బోస్నియా దేశంలో పనిచేశారు. ఐపీఎస్ ట్రైనింగ్‌లో మంచి ప్రతిభ కనబరిచి రెండు కప్పులు గెలుచుకున్నారు. రాష్ట్రపతి పోలీస్ మెడల్, ప్రెసిడెంట్ పోలీస్ మెడల్, నక్సల్ ప్రాంతంలో పనితీరుకు గానూ ఇంటర్నల్ సెక్యూరిటీ మెడల్ అందుకున్నారు. హైదరాబాద్ నగర పోలీసు చరిత్రపై విస్తృత పరిశోధన చేశారు.
అంజనీ కుమార్ నిర్వర్తించిన పోస్టులు ఇవే..
- జనగామ ఏఎస్పీగా పనిచేశారు.
- కౌంటర్ ఇంటిలిజెన్స్ సెల్ చీఫ్‌గా పనిచేశారు.
- ఉమ్మడి రాష్ట్రంలో గ్రేహౌండ్స్ చీఫ్‌గా పనిచేశారు.
- నిజామాబాద్ డీఐజీగా పనిచేశారు
- వరంగల్ ఐజీగా పనిచేశారు.
- హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ అదనపు కమిషనర్‌గా పనిచేశారు.
- తెలంగాణ లా అండ్ ఆర్డర్ అదనపు డీజీగా చేశారు.
- 2018 మార్చి 12న హైదరాబాద్ కమిషనర్‌గా చేరారు.
- 2021 డిసెంబరు 25న ఏసీబీగా డీజీగా నియమితులయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment