ఎక్కువసేపు కూర్చున్నా రిస్క్ లేదట!
లండన్: గంటల తరబడి కూర్చుని ఉంటే.. ఆరోగ్యానికి ముప్పనే అభిప్రాయం ఉండేది. అయితే.. తాజా పరిశోధనలు మాత్రం.. అతిగా కూర్చోవటం వల్ల ప్రాణానికొచ్చిన ప్రమాదమేమీ లేదంటున్నాయి. లండన్‌లోని ఎక్స్‌టర్ వర్సిటీ విద్యార్థులు కొందరు 16 ఏళ్లపాటు 5వేల మందిపై పరిశోధనలు చేశారు. నాలుగు భిన్నమైన పద్ధతుల్లో కూర్చునే(పనిచేస్తున్నప్పుడు, విశ్రాంతి సమయంలో, టీవీ చూస్తూ, విశ్రాంతి సమయంలో టీవీ లేకుండా) వారిపై.. వ్యాయామం చేసే మరికొందరిపై పరిశోధన చేశారు.
వయసు, ఆరోగ్యం, ఆహారం వంటి వాటిని పరిగణనలోకి తీసుకున్నారు. అయితే.. 16 ఏళ్లపాటు పరిశోధించినా.. ఎక్కువగా కూర్చునే వారికి.. మిగిలిన వారితో పోలిస్తే.. ఆరోగ్యం విషయంలో ముప్పు ఉన్నట్లు బయటపడలేదని.. రిస్క్ ఇద్దరికీ సమానంగానే ఉన్నట్లు పరిశోధనలో వెల్లడైందని పరిశోధకులు చెప్పారు.