
ఇటీవల డాక్టర్‌ల దగ్గరకు వస్తున్న కేసుల్లో ఒళ్లు నొప్పులు, కీళ్లనొప్పులు, వెన్నునొప్పి, మెడ నొప్పి, తలనొప్పి ప్రధానంగా కనిపిస్తున్నాయి. కండరాల నొప్పులు, కీళ్లనొప్పులు, వెన్ను కింది భాగం (లోవర్ బ్యాక్) నొప్పికేసులను నిశితంగా పరిశీలించిన స్పైన్ స్పెషలిస్ట్‌లు నూటికి ఇరవై శాతం వరకు ఈ రకమైన వెన్నునొప్పులకు బ్యాడ్ సిట్టింగ్ కోశ్చర్‌లే కారణమని చెబుతున్నారు. నాణ్యత లోపించకుండా క్వాలిటీ వర్క్ ఇవ్వడంలోనూ కూర్చునే భంగిమ పాత్ర కీలకమే. అందుకే సరిగ్గా కూర్చుందాం.
ఇలా కూర్చోవాలి
కుర్చీలో కూర్చున్నప్పుడు భుజాలు, బట్ భాగం కుర్చీ వెనుక భాగాన్ని తాకాలి. బట్ భాగం కుర్చీని తాకని పక్షంలో కుర్చీ మార్చుకోవడం లేదా కుషన్ అమర్చుకోవడం మంచిది. అరగంటకొకసారి కదిలి కూర్చున్న భంగిమకు విశ్రాంతినిచ్చి తిరిగి సరైన తీరులో కూర్చోవాలి. కథల్లో వర్ణించినట్లు విశ్రాంతిగా కుర్చీలో జారగిలపడి కూర్చోవడం అనే భంగిమలో గంటలసేపు ఉండకూడదు, దేహం సాంత్వన పొందే రెండు–మూడు నిమిషాల సేపు మాత్రమే ఉండాలి.
అరగంట, గంట పనికి ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకుని పని చేస్తే ఫర్వాలేదు. కానీ ఎక్కువ గంటలు పని చేయాల్సి వస్తే ల్యాప్‌టాప్‌ను కూడా డెస్క్ మీద ఉంచి పని చేయడమే కరెక్ట్. ఎక్కువ గంటలు కూర్చుని పనిచేసే వాళ్లు అబ్డామినల్ స్ట్రెంగ్త్ కోసం రోజూ అరగంట పాటు ఎక్సర్‌సైజ్ చేయాలి. ఇందుకోసం పెద్ద బాల్ మీద కానీ కుర్చీలో కానీ కూర్చోవాలి.
ఈ భంగిమలో పాదాల మధ్య అడుగు దూరం ఉంచాలి. గాలి వదులుతూ కుడి మోకాలిని ఫొటోలు చూపినట్లు పైకెత్తాలి, అదే సమయంలో ఎడమ చేతిని కూడా పైకెత్తాలి. మెల్లగా మామూలు స్థితికి రావాలి. రెండవసారి అదేవిధంగా ఎడమ మోకాలు, కుడిచేత్తో చేయాలి.
ఇలా కనీసం పదిసార్లు చేస్తుంటే... కూర్చున్న భంగిమలు సరిలేని కారణంగా ఎదురయ్యే అవాంఛిత ఒత్తిడుల నుంచి దేహం సాంత్వన పొందుతుంది. కడుపు కండరాలు, అంతర్గత అవయవాలు శక్తిమంతమవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment