Sitting positions
-
కోర్టులో జడ్జి ముందు కాలు మీద కాలేసుకోవడం తప్పా?
బెంగళూరు: కోర్టు హాల్లో జడ్జి ముందు.. అదీ వాదనలు జరుగుతున్నప్పుడు ఎదురుగా ఉన్నవాళ్లంతా మర్యాదగా వ్యవహరించాల్సి ఉంటుంది. అందునా ప్రత్యేకించి.. అక్కడున్నవాళ్లను సైలెంట్‌గా ఉండాలని, జడ్జి ముందు హుందాగా వ్యవహరించాలని బంట్రోతు మధ్యమధ్యలో వారిస్తుంటాడు కూడా. అయితే.. కోర్టు హాల్లో కాలు మీద కాలేసుకుని కూర్చోవడం నిజంగా తప్పా? అలా కూర్చోవడంపై నిషేధం ఏమైనా ఉందా? అనే ప్రశ్న ఎదురైంది ఇప్పుడు. అయితే అలాంటి నిబంధనేది కోర్టు మార్గదర్శకాల్లో లేదని ఆర్టీఐ ద్వారా సమాధానం వచ్చింది. కర్ణాటక హలసూర్‌కు చెందిన నరసింహా మూర్తి అనే వ్యక్తి.. ఆర్టీఐ ద్వారా దీని గురించి వివరణ కోరారు. దీనిపై హైకోర్టు జాయింట్ రిజిస్ట్రార్ బదులిస్తూ.. కోర్టు ఆదేశాలుగానీ, మార్గదర్శకాలుగానీ, నోటిఫికేషన్లుగానీ, సూచనలుగానీ.. కాలు మీద కాలేసుకోవడం సరికాదని, దానిపై నిషేధం ఉందని ఎక్కడా పేర్కొనలేదని స్పష్టత ఇచ్చారు. పోలీస్ స్టేషన్లు, కోర్టులు, ప్రభుత్వ కార్యాలయాలు.. ఇలా ఎక్కడైనా సరే కాలు మీద కాలేసుకుని కూర్చోవడంలో తప్పేమీ లేదు. ఒకవేళ ప్రత్యేకించి మార్గదర్శకాలు ఉంటే మాత్రం అభ్యంతరాలు వ్యక్తం అవుతాయి అంతే!. గంటల తరబడి అలా కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నరసింహా మూర్తి.. ఆ ఆర్టీఐ పిటిషన్ ద్వారా వివరించే ప్రయత్నం చేశారు. -
వేల అడుగుల ఎత్తున్న.. దిగమింగుకోలేని విషాదం
మంచు పర్వతాల్లో ఎవరెస్ట్ పర్వత శిఖరం అంచున.. విషాద ఘటన చోటుచేసుకుంది. ఎవరెస్ట్‌ను అవలీలగా అధిరోహిస్తూ వచ్చిన ఓ నేపాలీ పర్వతారోహకుడు అనూహ్యరీతిలో గురువారం కన్నుమూశాడు. కూర్చున్న స్థితిలో విగతజీవుడై కనిపించాడు. అది చూసి తోటి పర్వతారోహకులు కన్నీటి పర్యంతం అయ్యారు. ఎంజిమి టెన్జీ షెర్పా(38) జీవితం వేల అడుగుల ఎత్తులో విషాదంగా ముగిసింది. ఎవరెస్ట్ పై కాస్తంత విశాలంగా ఉండే ఓ ప్రదేశాన్ని ఫుట్ బాల్ ఫీల్డ్ అని పిలుస్తారు. ఎవరెస్ట్ మొత్తమ్మీద పర్వాతారోహకులకు సురక్షితమైన ప్రదేశం అదే. అక్కడే అతను కూర్చున్న స్థితిలో విగతజీవుడై కనిపించాడు. ఇది ఇతర పర్వతారోహకుల గుండెల్ని కరిగించి వేసింది. అతడు ఎలాంటి ప్రమాదానికి గురికాలేదని, ఎత్తయిన ప్రదేశానికి చేరిన సమయంలో తీవ్ర అస్వస్థత కలగడంతోనే ప్రాణాలు విడిచాడని ఇంటర్నేషనల్ మౌంటైన్ గైడ్స్ భాగస్వామ్య సంస్థ బేయుల్ అడ్వెంచర్స్ కు చెందిన త్సెరింగ్ షేర్పా వెల్లడించారు. బహుశా ఎంజిమి షెర్పా ఎవరెస్ట్ పై క్యాంప్-2కు వివిధ రకాల సామగ్రి తీసుకెళుతుండగా, ఈ విషాదం చోటుచేసుకుని ఉంటుందని త్సెరింగ్ అంటున్నారు. అతడిని తాము చనిపోయిన స్థితిలో ఉండగా గుర్తించామని, ఆ సమయంలో అతడి వీపునకు బ్యాక్ ప్యాక్ అలాగే ఉందని తెలిపారు. నేపాల్‌కు చెందిన షెర్పాలు ఎవరెస్ట్ పర్వతారోహణలో రాటుదేలినవారిగా గుర్తింపు పొందారు. అందుకే, ఇక్కడికి వచ్చే ఇతరదేశాల పర్వతారోహకులు ఎవరెస్ట్ ను అధిరోహించే క్రమంలో ఇక్కడి షెర్పాల సాయం తీసుకుంటారు. ఈ మధ్యకాలంలో ఇది మూడో మరణంగా అధికారులు చెప్తున్నారు. -
Health Tips: ఇష్టం వచ్చినట్లు కూర్చుంటా అంటే కుదరదు..!
Best Sitting Postures: ‘సిట్ రైట్... సిట్ ప్రాపర్లీ’ ఈ మాటలు వినని బాల్యం ఉండదు. ఈ మాటలు అనిపించుకోకుండా స్కూలు జీవితం గడిచిన వాళ్లెవరూ ఉండకపోవచ్చు. తెలుగు మీడియం ప్రభుత్వ స్కూళ్లలో చదివిన వాళ్లకు వచ్చే తొలి ఇంగ్లిష్ పదం కూడా బహుశా ఇదే కావచ్చు. స్కూల్లో టీచరు చేత, ఇంట్లో అమ్మానాన్నల చేత ఎన్నిసార్లు చెప్పించుకున్నప్పటికీ తీరుగా ఒంటపట్టని లక్షణం కూడా ఇదే. తీరుగా కూర్చోవడం చేతకాక చేతులారా తెచ్చుకునే అనారోగ్యాలెన్నో. తీరుగా కూర్చోవడం చేతకాక అనడం కంటే ‘తీరుగా కూర్చోవడం పట్ల శ్రద్ధ లేక’ అనడమే కరెక్ట్. ఇప్పుడు ఎక్కువ భాగం వృత్తిఉద్యోగాలు గంటలసేపు ఒకే పట్టున కూర్చుని పని చేసేవే అయి ఉంటున్నాయి. అందుకే చేసే పనిలో కచ్చితత్వం కోసం పాటుపడినట్లే కూర్చునే భంగిమ మీద కూడా కొంచెం శ్రద్ధ పెట్టాలి. ఇలా చేద్దాం! కుర్చీలో కూర్చున్నప్పుడు భుజాలు, బట్ భాగం కుర్చీ వెనుక భాగాన్ని తాకాలి. బట్ భాగం కుర్చీని తాకని పక్షంలో కుర్చీ మార్చుకోవడం లేదా కుషన్ అమర్చుకోవడం మంచిది. అదీ కాక పోతే మెయిన్ ఫొటోలో ఉన్నట్లు చిన్న టవల్‌ను రోల్ చేసి వెన్నుకు ఆసరాగా అమర్చుకోవాలి. అరగంటకొకసారి కదిలి కూర్చున్న భంగిమకు విశ్రాంతినిచ్చి తిరిగి సరైన తీరులో కూర్చోవాలి. కథల్లో వర్ణించినట్లు విశ్రాంతిగా కుర్చీలో జారగిలపడి కూర్చోవడం అనే భంగిమలో గంటలసేపు ఉండకూడదు, దేహం సాంత్వన పొందే రెండు–మూడు నిమిషాల సేపు మాత్రమే ఉండాలి. అరగంట, ఒక గంట పనికి ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకుని పని చేస్తే ఫర్వాలేదు. కానీ ఎక్కువ గంటలు పని చేయాల్సి వస్తే ల్యాప్‌టాప్‌ను కూడా డెస్క్ మీద ఉంచి పని చేయడమే కరెక్ట్. ∙ఎక్కువ గంటలు కూర్చుని పని చేసే వాళ్లు అబ్డామినల్ స్ట్రెంగ్త్ కోసం రోజూ అరగంట పాటు ఎక్సర్సైజ్ చేయాలి. ఇందుకోసం ఒక ఫొటోలో చూపించిన పెద్ద బాల్ మీద కానీ కుర్చీలో కానీ కూర్చోవాలి. ఈ భంగిమలో పాదాల మధ్య అడుగు దూరం ఉంచాలి. గాలి వదులుతూ కుడి మోకాలిని పైకెత్తాలి, అదే సమయంలో ఎడమ చేతిని కూడా పైకెత్తాలి. మెల్లగా మామూలు స్థితికి రావాలి. రెండవ సారి అదేవిధంగా ఎడమ మోకాలు, కుడి చేత్తో చేయాలి. ఇలా కనీసం పదిసార్లు చేస్తుంటే... కూర్చున్న భంగిమలు సరిలేని కారణంగా ఎదురయ్యే అవాంఛిత ఒత్తిడుల నుంచి దేహం సాంత్వన పొందుతుంది. కడుపు కండరాలు, అంతర్గత అవయవాలు శక్తిమంతమవుతాయి. కరోనా కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ క్లాసుల రూపంలో ఆఫీసు, స్కూలు ఇంటికే వచ్చేశాయి. కిచెన్ ప్లాట్‌ఫామ్, డైనింగ్ టేబుల్, డ్రాయింగ్ రూమ్‌లోని సెంటర్ టేబుల్, బెడ్రూమ్లోని ఫోమ్ బెడ్ కూడా వర్క్‌ప్లేస్‌లుగా మారిపోయాయి. ఫలితంగా కూర్చునే భంగిమలు మారిపోయాయి. బ్యాడ్ సిట్టింగ్ పోశ్చర్స్ కారణంగా ఎదురయ్యే అనారోగ్యాలు కూడా ఎక్కువవుతున్నాయి. లైఫ్ స్టయిల్ లో వచ్చే మార్పులకు అనుగుణంగా దేహం కూడా ప్రతిస్పందిస్తుంటుంది మరి. అందుకే నిపుణులు అధ్యయనం చేసి చెప్పిన సూచనలను తెలుసుకుందాం. అమెరికాలోని క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ తాను అధ్యయనం చేసిన గుడ్ పోశ్చర్స్ గురించి కొన్ని వివరాలను వెలువరించింది. చదవండి: Health Tips: పిల్లలకు గుడ్డు, పెరుగు, బాదం, వాల్నట్స్ ఎక్కువగా తినిపిస్తున్నారా... అయితే ‘ఆ.. ఏముందిలే’ అనుకుంటే కుదరదు! ఇటీవల డాక్టర్ల దగ్గరకు వస్తున్న కేసుల్లో ఒళ్లునొప్పులు, కీళ్లనొప్పులు, వెన్ను నొప్పి, మెడ నొప్పి, తలనొప్పి ప్రధానంగా కనిపిస్తున్నాయి. కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, వెన్ను కింది భాగం (లోవర్ బ్యాక్) నొప్పి కేసులను నిశితంగా పరిశీలించినస్పైన్ స్పెషలిస్ట్‌లు నూటికి ఇరవై శాతం వరకు ఈ రకమైన వెన్ను నొప్పులకు కారణం బ్యాడ్ సిట్టింగ్ పోశ్చర్‌లేనని చెబుతున్నారు. బ్యాడ్ సిట్టింగ్ పోశ్చర్ పై సమస్యలతో సరిపెట్టదు. ఈ నొప్పుల కారణంగా అసంకల్పితంగా దేహ భంగిమలో మరికొన్ని మార్పులు చోటుచేసుకుంటాయి. భుజాలను వంచడం, నొప్పి లేని భంగిమ కోసం మెడను ముందుకు చాచినట్లు సాగదీయడం, తలను కిందికి వంచడం కూడా జరుగుతాయి. ఇవన్నీ కలిసి ఒత్తిడితో కూడిన తలనొప్పికి దారి తీస్తాయి. విశ్రాంతి కోసం పడుకున్న తర్వాత కూడా చాలా సమయం వరకు దేహం పూర్తిగా సాంత్వన పొందలేదు. పడుకున్న తర్వాత నిద్రపట్టడానికి మధ్య కనీసం రెండు గంటల సమయం జరిగిపోతుంది. దీంతో బ్యాక్‌పెయిన్‌కి నిద్రలేమి కూడా తోడవుతుంది. నిద్రలేమి ప్రభావం జీర్ణక్రియ మీద కూడా చూపిస్తుంది. తినాలనే ఆసక్తి లోపిస్తుంది. పని చేయాలనే ధ్యాస కలగదు. పని చేయడానికి కూర్చున్నప్పటికీ ఏకాగ్రత సాధ్యం కాదు. పైగా తరచుగా మర్చిపోవడం కూడా మొదలవుతుంది. పెద్దవాళ్లయితే తమకు తాముగా ‘మర్చిపోయాం’ అనుకుని సరిపెట్టుకుందారు. కానీ అదే పిల్లల విషయానికి వచ్చేటప్పటికీ ‘విన్న పాఠం ఎలా మర్చిపోయావ్? శ్రద్ధగా వినాలనే ధ్యాస ఉంటేగా’ అని మందలిస్తారు. నిజానికి ‘ఈ మర్చిపోవడం’ వెనుక పిల్లలను కూర్చోబెట్టిన భంగిమ కూడా కారణమే. అలాగే పెద్దవాళ్ల విషయానికి వస్తే... నాణ్యత లోపించకుండా క్వాలిటీ వర్క్ ఇవ్వడంలోనూ కూర్చునే భంగిమ పాత్ర కీలకమే. అందుకే సరిగ్గా కూర్చుందాం. ‘సిట్ రైట్’ అని చెప్పడానికి టీచర్ ఉండరు, స్కూలు వదిలిన తర్వాత కాలేజ్ రోజుల్లో అమ్మానాన్నలు చెబుతారు. ఉద్యోగంలోకి వచ్చినప్పటి నుంచి ఎవరికి వాళ్లే టీచర్. చదవండి: Health Tips: షుగర్, రేచీకటి ఉన్నవాళ్లు.. దగ్గు, ఆయాసంతో ఇబ్బంది పడేవాళ్లు గోంగూరను తింటే... -
వర్క్ ఫ్రమ్ హోం: ఇదీ పరిస్థితి!
Work From Home Back Pain Health Tips: కరోనా వల్ల ఉద్యోగుల్లో మెజార్టీ వాటా వర్క్ ఫ్రమ్ హోంకే పరిమితం అయ్యిందని తెలిసిందే. ముఖ్యంగా కార్పొరేట్, టెక్ కంపెనీల ఉద్యోగులంతా ఎక్కువ పని గంటలకు ఫిక్స్ కావాల్సి వస్తోంది. ఈ తరుణంలో ఉద్యోగుల గురించి ఆందోళన కలిగించే అంశం ఒకటి వెలుగు చూసింది. ప్రభుత్వం ఈమధ్య నిర్వహించిన ‘ఇండియా హెల్త్ ఆఫ్ ది నేషన్స్ స్టేట్స్: లెవెల్ డిసీజ్ బర్డెన్ ఇన్షియేటివ్’.. అధ్యయనం వర్క్ ఫ్రమ్ హోంలో ఉద్యోగుల్లో ‘డయాబెటిస్, హైపర్ టెన్షన్, ఒబెసిటి’లాంటి జబ్బులు పెరిగిపోవడం గుర్తించింది. ఒత్తిడి, టైంకి తినకపోవడం ఇందుకు కారణాలని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదే టైంలో అంటువ్యాధుల బారిన సైతం పడుతున్నారని పేర్కొంది. అయితే వీటన్నింటికంటే ప్రధానంగా.. వెన్ను నొప్పి సమస్యగా తయారవుతోందని గుర్తించింది ఈ స్టడీ. ‘వెన్నునొప్పి ఎక్కువ సమస్యగా మారుతోంది యువతలోనే’ అని ఈ స్టడీ గుర్తించింది. ముఖ్యంగా యంగ్ వర్కింగ్ పాపులేషన్(18-25ఏళ్ల లోపువాళ్లు) 25 నుంచి 31 శాతానికి పెరగడం, వాళ్లలోనే ఇది అధికంగా ఉండడం ఆందోళన కలిగించే అంశమని ఈ అధ్యయన నివేదిక అభిప్రాయపడింది. ‘‘నడుం నొప్పి, కీళ్ల సమస్యలు ఒకప్పుడు వయసు మళ్లిన వాళ్ల సమస్యల కిందే ఉండేవి. కానీ, ఇప్పుడా సినారియో మారింది. యువతకు వస్తున్నాయి. జనరేషన్లుగా మారుతున్న లైఫ్ స్టయిల్, ముఖ్యంగా సరైన పొజిషన్లో (సిట్టింగ్ పోశ్చర్స్) కూర్చోకపోవడం, వర్క్ ఫ్రమ్ హోమ్ చాలాకాలంగా సాగుతున్నా ఎలాంటి అరేంజ్మెంట్స్ చేసుకోకపోవడం వల్లే ఈ సమస్య పెరిగిపోతోంద’ని జిందాల్ నేచుర్‌క్యూర్ ఇనిస్టిట్యూట్ చీఫ్ యోగా ఆఫీసర్ డాక్టర్ రాజీవ్ రాజేశ్ చెబుతున్నారు. ‘ఇప్పుడున్న జనరేషన్ హెల్త్ ఇష్యూస్‌ను.. లైఫ్ స్టైల్లో భాగంగానే భావిస్తున్నాయి. పైగా సమస్యల్ని తగ్గించుకునే ప్రయత్నాలేవీ చేయడం లేద’ని చెబుతున్నారు రాజీవ్. కొన్ని కంపెనీలు ఆఫీస్ చెయిర్లను సమకూర్చగా, మరికొందరు వాళ్లంత వాళ్లే కొనుక్కుంటున్నారు. అందుబాటులో ఉన్న ప్లాస్టిక్ చెయిర్లు, నేల మీద కూర్చుని పీటల మీద ల్యాప్‌ట్యాప్‌లు పెట్టుకుని పని చేస్తున్నారు. ఇక మధ్య, చిన్న జీతగాళ్లు తమకు అందుబాటులో ఉన్న సౌకర్యాలతోనే పని కానిచ్చేస్తున్నారు. అడ్డదిడ్డంగా కూర్చుని-పడుకుని.. ఇలా రకరకాల పోశ్చర్స్లో వర్క్ చేయడం.. అదీ ఎక్కువ గంటలు ఒక క్రమపద్దతిని పాటించకుండా చేయడం వెన్ను నొప్పికి దారి తీస్తోంద’ని రాజీవ్ అంటున్నారు. ఇలా చేయొచ్చు కరోనాకు ముందు చాలామంది వ్యాయామాలకు దూరంగా ఉండడానికి చెప్పిన కారణం.. ‘టైం లేకపోవడం’. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోంలోనూ అదే సాకును చూపిస్తున్నారు. అందుకే వ్యాయామాలకు కొంత టైం అయినా కేటాయించాలని డాక్టర్లు చెప్తున్నారు. ఎక్కువసేపు కూర్చుని వర్క్ చేయడం వల్ల ఒత్తిడి పెరిగి తీవ్రమైన నొప్పి వస్తుంటుంది. కాబట్టి, వ్యాయామాలు, నడకలో ఏదో ఒకటి పాటించాలని చెప్తున్నారు. అదే పనిగా సిస్టమ్ ముందు కూర్చోవాల్సి వస్తే సిట్టింగ్‌లోనే కాళ్లు చేతులూ ఆడించడం, వెన్నెముకకు రిలీఫ్ ఇవ్వడంలాంటివి చిన్నచిన్న ఎక్సర్సైజులు చేయాలి. మెడ మీద ఒత్తిడి పడని విధంగా హెడ్రెస్ట్ ఇస్తుండాలి. చిన్న చిన్న మెడ ఎక్సర్సైజులు చేయాలి. వీలైతే నిపుణుల పర్యవేక్షణలో, సలహాలతో యోగా, ఎక్స్ర్సైజులు చేయొచ్చు. ► సీట్లో చాలాసేపు ఒకే భంగిమలో కూర్చొని ఉండకూడదు. అప్పుడప్పుడూ మీ పొజిషన్ కాస్త మారుస్తూ ఉండాలి. ► చెయిర్‌ను నిటారుగా ఉంచేలా చూసుకోవడం మంచిది. అయితే అలా నిటారుగా ఉండటం మీకు మరీ ఇబ్బందిగా ఉంటే కేవలం కొద్దిగా మాత్రమే వెనక్కు వాలేలా, కాస్తంత ఏటవాలుగా సీట్ ఒంచాలి. ► ఆ చెయిర్ ఒంపు ఎంత ఉండాలంటే... ఆ ఒంపు మీ నడుము మీదగానీ మీ మోకాళ్ల మీద గానీ ఒత్తిడి పడనివ్వని విధంగా ఉండాలి. ► మనిషి ఎత్తుకు అనుగుణంగా చెయిర్ ను అడ్జెస్ట్ చేసుకోవడం అవసరం. ► అన్నింటికి మించి ఇబ్బందిగా అనిపించినా ఈ పోశ్చర్స్ పాటించాల్సిందే. చిన్న చిన్న ఎక్సర్‌సైజులతో ఉపశమనం పొందాల్సిందే. లేకుంటే నడుం నొప్పి తీవ్ర సమస్యగా మారి.. ట్రీట్మెంట్, సర్జరీలకు దారితీయొచ్చు. చదవండి: బైక్ రైడింగ్‌తో నడుమునొప్పా? ఇది మీకోసమే.. -
ఆ మంత్రులకు చుక్కలు చూపిస్తున్నారు...
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే మంత్రులకు ఎన్నికల ప్రచారాల్లో కష్టాలు తప్పడం లేదు. ఓటర్లు నిలదీస్తుండడంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారట. ఏకంగా ఇద్దరు మంత్రులు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేక ఉడాయించి ఉన్నారు. రాష్ట్ర మంత్రుల్లో పదిహేను మంది వరకు మళ్లీ సీట్లను దక్కించుకుని ఉన్నారు. వీళ్లల్లో పలువురు తమ సిట్టింగ్ స్థానాల్లో పోటీ చేస్తుండగా, ఐదారుగురు స్థానాల్ని మార్చారు. ఎక్కడ సిట్టింగ్ సీట్లలో పోటీ చేస్తే ఓటమి చవి చూడాల్సి వస్తుందో అన్న భయమేనట. సీట్లు మార్చుకున్నా వదిలి పెట్టమన్నట్టుగా ఓటర్లు మంత్రులకు చుక్కలు చూపించే పనిలో పడ్డారు. ఓట్ల వేటలో ఉన్న పలువురు మంత్రులకు అనేక చోట్ల వ్యతిరేకత వ్యక్తం అవుతూ వస్తున్నది. సిట్టింగ్ సీట్ల రేసులో ఉన్న వాళ్లకు గతంలో ఇచ్చిన హామీల సెగ తగులుతుండడం గమనార్హం. చెప్పారే....చేశారా..! అని నిలదీసే వాళ్లు పెరుగుతుండడంతో ఆ మంత్రులు ఉక్కిరిబిక్కిరి అవుతోన్నారు. సోమవారం ఇద్దరు మంత్రులకు ఓటర్లు చుక్కల్నే చూపించారని చెప్పవచ్చు. ఇందుకు అద్దం పట్టే ఘటనలు చోటు చేసుకున్నాయి. పాపిరెడ్డి పట్టి నుంచి ఎన్నికల రేసులో ఉన్న మంత్రి పళనియప్పన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు చోట్ల పర్యటించగా, అన్ని చోట్ల వ్యతిరేకత తప్పలేదట! చెప్పారే...చేశారా.. అని నిలదీస్తూ, నియోజకవర్గం పరిధిలో మెడకురిచ్చి, నత్తమడం గ్రామాల వైపుగా ఆయన్ను రానివ్వకుండా, రోడ్డు అడ్డంగా చెట్లను నరికి వేయడం గమనార్హం. అటు వైపుగా వెళ్ల లేని పరిస్థితి రావడంతో పళనియప్పన్ టేక్ డైవర్షన్ తీసుకోవాల్సి వచ్చిందట. ఇక, మంత్రి మోహన్నూ ఓటర్లు వదలి పెట్టలేదు. శంకరాపురం రేసులో ఉన్న మంత్రి మోహన్‌ను ఎన్నికల ప్రచారంలో ఓటర్లు నిలదీస్తున్నారట. గతంలో ఇచ్చిన హామీల చిట్టాను వివరిస్తూ ఓటర్లు ప్రశ్నల వర్షం కురిపించడంతో కొశపాకం గ్రామం నుంచి ఉడాయించక తప్పలేదు. మధురై మేలూరు అయితే, అన్నాడీఎంకే వర్గాలు ఇటు వైపుగా రాకూడదన్నట్టుగా ఉరగన పట్టి, తంబంపట్టి, మలైపట్టి గ్రామాలకు చెందిన ప్రజలు ముందుగానే అధ్వానంగా ఉన్న రోడ్లపై నల్ల గుడ్డ చుట్టి జెండాల రూపంలో అక్కడక్కడ పెట్టి ఉండడం గమనించాల్సిన విషయమే. ఇలా మంత్రుల్ని ఓటర్లు పరుగులు పెట్టిస్తుంటే, రాష్ర్ట ఎన్నికల యంత్రాంగం ఈ మంత్రుల వ్యవహారాల్ని కనిపెట్టేందుకు ప్రత్యేకంగా 42 మంది ఎన్నికల పర్యవేక్షకుల్ని రంగంలోకి దించి ఉండడంతో జాగ్రత్తగా అడుగులు వేయడం మొదలెట్టి ఉన్నారు. ఇక, అమ్మ ఆశీస్సులతో తమకు మళ్లీ సీటు దక్కినా, ఓటర్లు కరుణిస్తారా..? అన్న బెంగ మంత్రుల్లో వెంటాడుతోన్నట్టుగా మద్దతుదారులు చెబుతున్నారు.