నిత్యం ఒకే చోట కూర్చుని పనిచేసేవారు గంటలకొద్దీ అలాగే కూర్చుని పనిచేయవద్దని చెబుతున్నారు మయో వైద్య పరిశోధక బృందం అధ్యయనవేత్తలు. రోచెస్టర్, మిన్నెసోటాకు చెందిన ఆ పరిశోధకులు చెబుతున్న దాని ప్రకారం... రెండుగంటల పాటు అదేపనిగా కూర్చొని ఉండటం వల్ల 20 నిమిషాల సేపు వ్యాయామం చేయడం వల్ల మనకు లభ్యమైనంత ఆరోగ్యాన్ని మనం నష్టపోతామని చెబుతున్నారు వారు.
అదేపనిగా ఒకేచోట కూర్చుని చేసే ఉద్యోగాలలో ఉన్న రెండువేలకు మందికి పైగా వ్యక్తుల్లో నిర్వహించిన ఫలితాలు చాలా ప్రమాదకరంగా కనిపిస్తున్నాయని వారు వెల్లడించారు. ఇలా కూర్చుని పనిచేసేవారు కనీసం రెండు గంటలకోసారి అయినా లేవకుండా ఉంటే... వారిలో గుండెజబ్బులు, ఆస్తమా, పక్షవాతం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా పెరిగిపోతాయని వారు హెచ్చరిస్తున్నారు. అలాగే మధ్యాన భోజనం తర్వాత వెంటనే సీట్‌లో కూర్చోకుండా కొద్దిసేపు తప్పనిసరిగా అటు ఇటు తిరగాలని కూడా సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment