spine
-
సిట్ రైట్: సరిగ్గా కూర్చుందాం ఇలా..!
ఇటీవల డాక్టర్ల దగ్గరకు వస్తున్న కేసుల్లో ఒళ్లు నొప్పులు, కీళ్లనొప్పులు, వెన్నునొప్పి, మెడ నొప్పి, తలనొప్పి ప్రధానంగా కనిపిస్తున్నాయి. కండరాల నొప్పులు, కీళ్లనొప్పులు, వెన్ను కింది భాగం (లోవర్ బ్యాక్) నొప్పికేసులను నిశితంగా పరిశీలించిన స్పైన్ స్పెషలిస్ట్‌లు నూటికి ఇరవై శాతం వరకు ఈ రకమైన వెన్నునొప్పులకు బ్యాడ్ సిట్టింగ్ కోశ్చర్లే కారణమని చెబుతున్నారు. నాణ్యత లోపించకుండా క్వాలిటీ వర్క్ ఇవ్వడంలోనూ కూర్చునే భంగిమ పాత్ర కీలకమే. అందుకే సరిగ్గా కూర్చుందాం. ఇలా కూర్చోవాలికుర్చీలో కూర్చున్నప్పుడు భుజాలు, బట్ భాగం కుర్చీ వెనుక భాగాన్ని తాకాలి. బట్ భాగం కుర్చీని తాకని పక్షంలో కుర్చీ మార్చుకోవడం లేదా కుషన్ అమర్చుకోవడం మంచిది. అరగంటకొకసారి కదిలి కూర్చున్న భంగిమకు విశ్రాంతినిచ్చి తిరిగి సరైన తీరులో కూర్చోవాలి. కథల్లో వర్ణించినట్లు విశ్రాంతిగా కుర్చీలో జారగిలపడి కూర్చోవడం అనే భంగిమలో గంటలసేపు ఉండకూడదు, దేహం సాంత్వన పొందే రెండు–మూడు నిమిషాల సేపు మాత్రమే ఉండాలి. అరగంట, గంట పనికి ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకుని పని చేస్తే ఫర్వాలేదు. కానీ ఎక్కువ గంటలు పని చేయాల్సి వస్తే ల్యాప్‌టాప్‌ను కూడా డెస్క్ మీద ఉంచి పని చేయడమే కరెక్ట్. ఎక్కువ గంటలు కూర్చుని పనిచేసే వాళ్లు అబ్డామినల్ స్ట్రెంగ్త్ కోసం రోజూ అరగంట పాటు ఎక్సర్సైజ్ చేయాలి. ఇందుకోసం పెద్ద బాల్ మీద కానీ కుర్చీలో కానీ కూర్చోవాలి. ఈ భంగిమలో పాదాల మధ్య అడుగు దూరం ఉంచాలి. గాలి వదులుతూ కుడి మోకాలిని ఫొటోలు చూపినట్లు పైకెత్తాలి, అదే సమయంలో ఎడమ చేతిని కూడా పైకెత్తాలి. మెల్లగా మామూలు స్థితికి రావాలి. రెండవసారి అదేవిధంగా ఎడమ మోకాలు, కుడిచేత్తో చేయాలి. ఇలా కనీసం పదిసార్లు చేస్తుంటే... కూర్చున్న భంగిమలు సరిలేని కారణంగా ఎదురయ్యే అవాంఛిత ఒత్తిడుల నుంచి దేహం సాంత్వన పొందుతుంది. కడుపు కండరాలు, అంతర్గత అవయవాలు శక్తిమంతమవుతాయి. -
మంచు మనోజ్ కడుపు, వెన్నెముకలో గాయాలు
-
వర్కౌట్ సెషన్లో రకుల్‌కి వెన్ను గాయం..అలా జరగకూడదంటే..!
బాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్‌కి అక్టోబర్ 5న తీవ్రమైన వర్కవుట్ సెషన్లో వెన్నుకి గాయమయ్యింది. ఆమె జిమ్‌లో బ్యాక్బ్రేస్ని ధరించకుండా 80 కిలోల డెడ్లిఫ్ట్ని నిర్వహించి వెన్ను నొప్పి బారిన పడింది. అయినా లెక్క చేయక ఆ తర్వాత కూడా వర్కౌట్ సెషన్‌ని కొనసాగించింది. దీంతో ఆమె వెన్నుకి తీవ్ర గాయమయ్యింది. నొప్పి తీవ్రంగా ఉండటంతో పూర్తి బెడ్ రెస్ట్ తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకుంది. నిజానికి ఈ డెడ్‌లిఫ్ట్ వర్కౌట్స్‌ని ఒత్తిడిని నివారించడానికి, వెన్ను కండరాలను బలోపేతం చేయడానికి ఎక్కువగా చేస్తుంటారు. అయితే ఇవి చేసేటప్పుడూ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఫిట్నెస్ నిపుణుల ఆధ్వర్యంలో వారి సూచనలు సలహాలతో చేయాలి. ఇక్కడ రకుల్లా గాయాల బారిన పడకుండా వెనుక కండరాలను బలోపేతం చేసే కొన్ని ప్రభావవంతమైన వ్యాయామాలు ఏంటో సవివరంగా చూద్దామా..!వార్మ్-అప్వార్మప్తో వ్యాయామాన్ని ప్రారంభించడం చాలా అవసరం. 5 నుంచి 10 నిమిషాల మితమైన కార్డియోతో ప్రారంభించండి, ఆపై ఫోర్స్‌గా చేసే వ్యాయామాలకు సిద్ధమయ్యేలా కొన్ని స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయండిరెసిస్టెన్స్ బ్యాండ్ పుల్-అపార్ట్చాలా మంది వ్యక్తులు రెసిస్టెన్స్ బ్యాండ్ పుల్-అపార్ట్ వ్యాయామాలతో తమ బ్యాక్ వర్కౌట్‌ను ప్రారంభిస్తారు. ఈ వ్యాయామం చాలా ప్రభావవంతమైనది. సుమారు 15 నుంచి 20 చొప్పున 1 లేదా 2 సెట్లను పూర్తి చేసేలా మంచి రిసిస్టెన్స్ బ్యాండ్‌ను ఎంచుకోవాలి. లాట్ పుల్డౌన్ఈ వ్యాయామాన్ని రెసిస్టెన్స్ బ్యాండ్‌తో లేదా జిమ్‌లో మెషీన్ సాయంతో పూర్తి చేయవచ్చు. ఈ వ్యాయామం వెనుక డెల్టాయిడ్లు, రోంబాయిడ్స్, కండరపుష్టి, ముంజేతులతో పాటు మధ్య, దిగువ వెనుక కండరాలను లక్ష్యంగా చేసుకుంటుంది. బలమైన వెన్ను కండరాలు కావాలనుకునే వారికి ఇది ముఖ్యమైన వ్యాయామం.క్వాడ్రూప్డ్ సింగిల్ ఆర్మ్ డంబెల్ రోకదలిక ఎగువన ఓవర్-రోయింగ్ కదలిక దిగువన ఎక్కువగా సాగదీయడం వంటి అనేక సమస్యలను పరిష్కరిస్తుంది. ఏదైనా ఇతర రోయింగ్ కదలికలను పూర్తి చేయడానికి ఈ వ్యాయామాన్ని సిఫార్సు చేస్తారు నిపుణులు.(చదవండి: అత్యంత అరుదైన వ్యాధి నెమలైన్ మయోపతి) -
వ్యవసాయ రంగ అభివృద్ధికి వెన్నెముక నాబార్డ్
సాక్షి, అమరావతి: దేశంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి నాబార్డు వెన్నెముకగా నిలుస్తోందని గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ అన్నారు. విజయవాడలో మంగళవారం నాబార్డు ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన గవర్నర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో సహకార పరపతి సంఘాల ద్వారా రైతులకు సులభంగా రుణ సౌకర్యం అందుబాటులోకి తేవడం నాబార్డు సాధించిన అతి పెద్ద విజయమన్నారు. వ్యవసాయ పరపతి స్వరూపాన్ని సమూలంగా మార్చేసి రైతులకు ప్రయోజనకారిగా నిలిచిందని చెప్పారు. నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ ఎం.ఆర్.గోపాల్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ.2.86 లక్షల కోట్ల పరపతి సౌకర్యం కల్పించాలని నిర్ణయించామన్నారు. 1982లో కేవలం రూ.4,500 కోట్ల మూలధనంతో ఏర్పడిన నాబార్డు 2022–23 నాటికి రూ.8.01 లక్షల కోట్ల స్థాయికి చేరుకుందని వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన స్టాల్స్‌ను గవర్నర్ సందర్శించి నాబార్డు కార్యకలాపాలపై రూపొందించిన బుక్‌లెట్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్, సహకారశాఖ ముఖ్యకార్యదర్శి చిరంజీవి చౌదరి, ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్ భాస్కర్ పాల్గొన్నారు. -
ఒక ఇంజెక్షన్‌తో వెన్నెముక గాయాలు పరార్!
సాక్షి, హైదరాబాద్: ప్రమాదం వల్లో.. ఇంకో కారణం చేతో వెన్నెముకకు దెబ్బతగిలిందను కోండి... గాయం తీవ్రతను బట్టి.. జీవితాంతం కదల్లేని పరిస్థితి తలెత్తే ప్రమాదముంది. వైద్యం అభివృద్ధి చెందిందని మనం ఎంత అనుకున్నా ఇలాంటి సమస్యలకు మాత్రం ఇప్పటికీ పరిష్కారం లేదు. కానీ ప్రయత్నాలైతే బోలెడు. ఈ క్రమంలోనే నార్త్ వెస్టర్న్ యూనివర్శిటీ శాస్త్రవ్తేతలు వెన్నెముక గాయాల కారణంగా చచ్చుబడిపోయిన వారిని మళ్లీ నడిపించగల అద్భుత ఔషధం ఒకదాన్ని సిద్ధం చేశారు. ఈ ఔషధాన్ని ఇంజెక్షన్ రూపంలో ఎక్కించిన తరువాత పక్షవాతంతో ఉన్న ఎలుకలు నాలుగు వారాల్లో మళ్లీ చురుకుగా కదలగలిగాయి. వెన్నెముకలోని న్యూరాన్లు మన మెదడు, కండరాల మధ్య సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు ఉపయోగపడుతూంటా యన్నది తెలిసిందే. గాయాలు లేదా వ్యాధుల కారణంగా ఈ న్యూరాన్లు దెబ్బతింటే మన కదలికలు దెబ్బతింటాయి. కేంద్ర నాడీ వ్యవస్థకు తనను తాను మరమ్మతు చేసుకునే శక్తి లేకపోవడం పరిస్థితిని మరింత జటిలం చేస్తుంది. అయితే తాము సిద్ధం చేసిన ఔషధం ఐదు రకాలుగా పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త జైదా ఇవరేజ్ తెలిపారు. మార్పులు చేసిన రెండు పెప్టైడ్‌లతో ఈ ఔషధం తయారైందని, ఒక పెప్టైడ్ ఆక్సాన్ల పునరుద్ధరణకు సంకేతాలు ఇస్తే రెండోది రక్తనాళాలు, ఆక్సాన్ల చుట్టూ ఉండే మెయిలీన్ పొర వృద్ధికి సాయపడతాయని వివరించారు. ఒకే ఒక్క ఇంజెక్షన్ ఇచ్చిన తరువాత నాలుగు వారాలకు ఎలుకలు మళ్లీ నడవగలిగాయన్నారు. మిగిలిన చికిత్సా పద్ధతుల మాదిరిగా ఇది ఖరీదైన వ్యవహారం కాకపోవడం ఇంకో విశేషం. మానవ కణాలపై కూడా తాము ఈ మందును ప్రయోగించి మంచి ఫలితాలే పొందామని చెప్పారు ప్రమాదాలు జరిగిన వెంటనే వెన్నెముక గాయాలైన వారు పక్షవాతానికి గురి కాకుండా నివారించేందుకు ఈ మందును ఉపయోగించే అవకాశం ఉంది. -
వీల్ చెయిర్..విల్ చెయిర్
పట్టుదలతో ఏదైనా మార్చుకోవచ్చు అని తన జీవితాన్ని ఉదాహరణగా చూపుతుంది దీపా మాలిక్. దేశంలో పారా ఒలింపిక్ పతకం సాధించిన మొట్టమొదటి మహిళ గా ఘనత సాధించింది. హర్యానాలో పుట్టి పెరిగిన దీప వెన్నెముకలో ఏర్పడిన కణితి కారణంగా చక్రాల కుర్చీకి పరిమితమైంది. అనేక సవాళ్లను ఎదుర్కొని పతకాలు, పురస్కారాలు అందుకుంది. తన సమస్యలతో ఇప్పటికీ పోరాడుతూనే ఆ శక్తిని కుటుంబానికీ ఇస్తూ తనలాంటి వారిలో స్ఫూర్తిని నింపుతోంది. పద్మశ్రీ, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, అర్జున అవార్డు, ఆసియా పారా గేమ్స్‌లో 4 పతకాలు, యమునా నది మీదుగా ఈత కొట్టడం ఇవన్నీ సాధించడానికి ఒక జీవితం సరిపోదేమో అనిపిస్తుంది. కానీ, వాటన్నింటినీ సాధించి, ఓడిస్తున్న జీవితం తో పోరాడి గెలిచి చూపించింది. శక్తి పుంజం దీపా మాలిక్ తన చక్రాల కుర్చీలో కూర్చోగానే ఆ కుర్చీకే శక్తి వస్తుందేమో అనిపిస్తుంది. విధికి లొంగని శక్తి పుంజం అక్కడా ప్రకాశిస్తున్నట్టుగా ఉంటుంది. ‘భగవంతుడు ఇచ్చిన శరీరాన్ని ఎప్పుడూ ఫుల్‌గా ఛార్జ్ చేసి ఉంచండి. పరుగు, ఆట, గెంతడం.. వంటి వాటితో మీలో శక్తిని నింపండి’ అని మహిళలకు చెబుతుంది. దీపా బాల్యమంతా జైపూర్ లో గడిచింది. పెళ్లై ఇద్దరు కూతుళ్లకు తల్లి ఆమె. వారిద్దరూ చదువుకుంటున్నారు. ఆత్మవిశ్వాసాన్ని తగ్గించలేదు దీపా తన కుటుంబానికి వెన్నెముక. జూన్ 3, 1999న వెన్నెముక లో కణితి ఉన్నట్టు వైద్య పరీక్షలో తేలింది. నడుస్తున్న జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు తిరిగింది. కణితి ఆపరేషన్ తర్వాత, పక్షవాతం బారిన పడింది. కొన్నాళ్లు మంచానికే పరిమితమైన దీప తనకు తాను శక్తిని కూడగట్టుకుంది. రెండు యుద్ధాలను జయించిన వేళ కార్గిల్ యుద్ధ మేఘాలు శివార్లలో ఉరుముతున్న కాలం. ఈ యుద్ధంలో దీప భర్త విక్రమ్ కూడా దేశం కోసం పోరాడుతున్నాడు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు సభ్యులు యుద్ధం చేస్తున్నప్పుడు ఇది చాలా కష్టమైన సమయం, ఒకటి దేశ శివార్లలో, మరొకటి శరీర శివార్లలో. ఈ సమయం దీప కుటుంబానికి చాలా సవాల్‌గా మారింది. కానీ చివరికి దీప కుటుంబం రెండు యుద్ధాలను గెలిచింది. ఒక వైపు భారత్ కార్గిల్ యుద్ధంలో విజయం సాధించింది. దీపకు మూడు వెన్నెముక కణితి శస్త్రచికిత్సలు విజయవంతమయ్యాయి. కానీ, పక్షవాతం రావడంతో మంచానికే పరిమితం అయ్యింది. దీంతో కొన్నిసార్లు దీప విచారంగా ఉండేది. ‘ఆ సమయంలో మా నాన్న ‘చీకటిని శపించడంలో అర్థం లేదు, నువ్వే దీపం కావాలి. అందుకే నీకా పేరు పెట్టాను’ అని చెప్పడంతో ఓ కొత్త శక్తి ఆవరించినట్టు అనిపించింది. అప్పటి నుంచి నాకు నేనుగా నిలదొక్కుకోవడానికి ఎంత ప్రయత్నం చేశానో మాటల్లో చెప్పలేను’ అని వివరించిన దీపా మాలిక్ చేతల్లో తన విజయాన్ని ప్రపంచానికి చాటింది. ఇప్పటికీ చాటుతూనే ఉంది. -
మెడ నొప్పి చేతులకూ పాకుతోంది!
నా వయసు 58 ఏళ్లు. నేను కొంతకాలంగా తీవ్రమైన మెడనొప్పితో బాధపడుతున్నాను. ఆ నొప్పి చేతులకూ పాకుతోంది. చేతులు బలహీనంగా అనిపిస్తున్నాయి. హోమియో చికిత్స ద్వారా నా సమస్యకు పూర్తి పరిష్కారం లభిస్తుందా? మెడ భాగంలోని వెన్నెముక డిస్కులు, ఫేసెట్ జాయింట్స్‌లోని మృదులాస్థి క్షీణతకు గురికావడాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. గతంలో పెద్దవారిలో కనిపించినా, జీవనశైలిలో మార్పులు రావడం వల్ల ఇప్పుడిది చిన్న వయసు వారిలోనూ ఎక్కువగా కనిపిస్తుంది. కారణాలు: ►వయసు పెరగడం, వ్యాయామం లేకపోవడం ►క్షీణతకు గురైన ఎముకలు అదనంగా పెరగడం ►డిస్కులు జారిపోవడం లేదా చీలికలకు గురికావడం ►వృత్తిరీత్యా అధిక బరువులు మోయడం ►ఎక్కువ సమయం పాటు మెడను అసాధారణ భంగిమలో ఉంచడం ఎక్కువసేపు కంప్యూటర్‌పై పనిచేయడం, ఎక్కువ సమయం మెడను వంచి ఫోన్లలో మాట్లాడటం ►ఎల్తైన దిండ్లు వాడటం ►మెడకు దెబ్బతగలడం ►మెడకు శస్త్రచికిత్స జరిగి ఉండటం ►తీవ్రమైన మానసిక ఒత్తిడి, అధిక బరువు, పొగతాగే అలవాటు, జన్యుపరమైన కారణాలతో ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. లక్షణాలు: ►సాధారణం నుంచి తీవ్రస్థాయి మెడనొప్పి ►నొప్పి మెడ నుంచి భుజాలకు, చేతులకు, వేళ్లకు పాకడం ►మెడ బిగుసుకుపోవడం ►తలనొప్పి, తల వెనక భాగంలో మొదలై నుదురు వరకు వ్యాపించడం ►నరాలపై ఒత్తిడి పడి, చేతులలో సూదులు గుచ్చినట్లుగా అనిపించడం, చేతులు మొద్దుబారడం, సత్తువ కోల్పోవడం ►చిన్న బరువునూ ఎత్తలేకపోవడం ►నడకలో నిలకడ కోల్పోవడం వంటి లక్షణాలు గమనించవచ్చు. హోమియో చికిత్స: జెనెటిక్ కాన్స్టి ట్యూషన్ చికిత్స విధానం ద్వారా రోగి మానసిక, శరీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స అందించడం వల్ల మెడనొప్పిని పూర్తిగా నయం చేయవచ్చు. వెన్నెముకను దృఢంగా చేయడం ద్వారా సర్వైకల్ స్పాండిలోసిస్ సమస్యను సంపూర్ణంగా నయం చేయవచ్చు. డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ సోరియాసిస్నుంచి విముక్తి ఎలా? నా వయసు 39 ఏళ్లు. చాలా రోజుల నుంచి సోరియాసిస్‌తో బాధపడుతున్నాను. ఎన్ని మందులు వాడినా సమస్య పూర్తిగా తగ్గడం లేదు. మళ్లీ మళ్లీ వస్తోంది. దీనికి హోమియోపతిలో చికిత్స ఉందా? సోరియాసిస్ అనేది ఒక దీర్ఘకాలిక ఆటో ఇమ్యూన్ సమస్య. ఇది చర్మ సమస్యే అయినా ఇది మన రోగనిరోధక శక్తి మనకు ప్రతికూలంగా పనిచేయడం వల్ల వచ్చే సమస్యగా పరిగణించాలి. ఈ వ్యాధి వచ్చిన వారిలో చర్మకణాలు అత్యంత వేగంగా వృద్ధిచెందడంతో పాటు ఆ కణాలు అనేక పొరలుగా ఏర్పడి, అవి వెండిరంగు పొలుసులుగా రాలిపోతుంటాయి. తర్వాత చర్మంపై రక్తంతో కూడిన చిన్న చిన్న దద్దుర్ల వంటివీ ఏర్పడతాయి. దురద కూడా ఎక్కువ. చిరాకుగా ఉంటుంది. సోరియాసిస్ వ్యాధి ఎక్కువగా మోచేతులు, మోకాళ్లు, తల, వీపు, అరచేతులు, అరికాళ్లు, ఉదరం, మెడ, నుదురు, చెవులు మొదలైన ప్రాంతాల్లో వ్యాపిస్తుంది. సోరియాసిస్‌తో బాధపడుతున్న 15శాతం మందిలో ఆర్థరైటిస్ లక్షణాలు కూడా కనిపిస్తాయి. దీనినే ‘సోరియాటిక్ ఆర్థరైటిస్’ అంటారు. కారణాలు: ►వంశపారంపర్యం ►మానసిక ఒత్తిడి, ఆందోళన ►శరీరంలోని రోగనిరోధక వ్యవస్థలో ఏర్పడే అస్తవ్యస్తత ►దీర్ఘకాలికంగా కొన్ని రకాల మందులు ఎక్కువగా వాడటం. లక్షణాలు: ►చర్మం ఎర్రబారడం ►తీవ్రమైన దురద ►జుట్టు రాలిపోవడం ►కీళ్లనొప్పులు ►చర్మం పొడిబారినప్పుడు పగుళ్లు ఏర్పడి రక్తస్రావమూ అవుతుంది. నిర్ధారణ పరీక్షలు: స్కిన్ బయాప్సీ, ఈఎస్ఆర్, సీబీపీ, ఎక్స్–రే పరీక్షలు. చికిత్స: సోరియాసిస్ నివారణ/చికిత్సలకు హోమియోలో సమర్థమైన మార్గాలు ఉన్నాయి. అయితే సోరియాసిస్‌ను వెంటనే గుర్తించి చికిత్స తీసుకోవడం అవసరం. లక్షణాలను బట్టి ఈ సమస్య నుంచి విముక్తి కోసం సాధారణంగా ఆర్సినికం ఆల్బమ్, సల్ఫర్, కాలీకార్బ్, సొరినమ్, పెట్రోలియం మొదలైన మందులతో చికిత్స చేస్తారు. అయితే ఈ మందులను అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో వాడాలి. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ యానల్ ఫిషర్కుచికిత్సఉందా? నా వయసు 68 ఏళ్లు. మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి వస్తోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే యానల్ ఫిషర్ అని చెప్పి ఆపరేషన్ చేయాలన్నారు. నాకు ఆపరేషన్ అంటే భయం. హోమియోలో ఆపరేషన్ లేకుండా దీనికి చికిత్స ఉందా? మలద్వారం దగ్గర ఏర్పడే చీలికను ఫిషర్ అంటారు. మనం తీసుకునే ఆహారంలో పీచుపదార్థాల పాళ్లు తగ్గడం వల్ల మలబద్దకం వస్తుంది. దాంతో మలవిసర్జన సాఫీగా జరగదు. అలాంటి సమయంలో మలవిసర్జన కోసం విపరీతంగా ముక్కడం వల్ల మలద్వారం వద్ద పగుళ్లు ఏర్పడతాయి. ఇలా ఏర్పడే పగుళ్లను ఫిషర్ అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు మల విసర్జన సమయంలో నొప్పితో పాటు రక్తస్రావం జరుగుతుంది. ఇది వేసవికాలంలో ఎక్కువ ఉంటుంది. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనవిధానం వల్ల ఈమధ్యకాలంలో ఇలాంటి సమస్యలు మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మలబద్దకం వల్ల రోగి ఎక్కువగా ముక్కాల్సి రావడంతో మలద్వారంతో పాటు దాని చుట్టుపక్కల ఉండే అవయవాలన్నీ తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. క్రమేపీ అక్కడి ప్రాంతంలో కూడా వాపు రావడం, రక్తనాళాలు చిట్లడం మలంతో పాటు రక్తం పడటం జరుగుతుంది. ఫిషర్ సంవత్సరాల తరబడి బాధిస్తుంటుంది. ఆపరేషన్ చేయించుకున్నా మళ్లీ సమస్య తిరగబెట్టడం మామూలే. ఇది రోగులను మరింత ఆందోళనకు గురి చేస్తుంది. కారణాలు: ►దీర్ఘకాలిక మలబద్దకం ►ఎక్కువకాలం విరేచనాలు ►వంశపారంపర్యం ►అతిగా మద్యం తీసుకోవడం ►ఫాస్ట్ఫుడ్స్, వేపుళ్లు ఎక్కువగా తినడం ►మాంసాహారం తరచుగా తినడం వల్ల ఫిషర్ సమస్య వస్తుంది. లక్షణాలు: ►తీవ్రమైన నొప్పి, మంట ►చురుకుగా ఉండలేరు ►చిరాకు, కోపం ►విరేచనంలో రక్తం పడుతుంటుంది ►కొందరిలో మలవిసర్జన అనంతరం మరో రెండు గంటల పాటు నొప్పి, మంట. చికిత్స: ఫిషర్ సమస్యను నయం చేయడానికి హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. వాటితో ఆపరేషన్ అవసరం లేకుండానే చాలావరకు నయం చేయవచ్చు. రోగి మానసిక, శారీరక తత్వాన్ని, ఆరోగ్య చరిత్ర వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని హోమియో మందులను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడితే తప్పక మంచి ఫలితం ఉంటుంది. డాక్టర్ టి.కిరణ్‌కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ -
వెన్నెముక గాయానికి చికిత్స!
వెన్నెముకకు గాయమైతే శరీరం సగభాగం చచ్చుబడిపోవడం మొదలుకొని అనేక సమస్యలు ఎదురవుతాయి. వీటికి ఇప్పటివరకూ సమర్థమైన చికిత్స లేనేలేదు. వెన్నెముక నాడులు తమంతట తాము మరమ్మతులు చేసుకునేలా ప్రేరేపించడం ద్వారా ఈ సమస్యలను అధిగమించచవచ్చునని శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించగా.. ఇటీవలి కాలంలో ఎలుకలు.. కోతుల్లో జరిగిన ప్రయోగాలూ సత్ఫలితాలే ఇచ్చాయి. ఈ నేపథ్యంలో చైనా శాస్త్రవేత్తలు కొందరు తీవ్రమైన వెన్నెముక గాయాలతో బాధపడుతున్న కోతులను తాము సరిచేయగలిగామని ప్రకటించారు. కోతులకు, మనుషులకు జన్యు సారూప్యత ఎక్కువగా ఉన్నందున ఈ చికిత్స విధానం మానవుల్లోనూ సక్రమంగా పనిచేస్తుందని అంచనా వేస్తున్నట్లు ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఒకరు చెప్పారు. రొయ్యల్లాంటి జీవుల నుంచి తీసిన ఒక రసాయనాన్ని వెన్నెముక గాయాలున్న కోతులకు అందించినప్పుడు వాటి కేంద్ర నాడీ వ్యవస్థలో మార్పులు చోటు చేసుకున్నట్లు తెలిపారు. వెన్నెముకలో ప్రతి సెంటీమీటర్‌కు కొంత చొప్పున ఈ రసాయనాన్ని చేర్చామని... దీని లోపల ఉండే న్యూరోట్రోపిక్ మందు ఎన్టీ3 ఆ ప్రాంతంలో దీర్ఘకాలం పాటు నెమ్మదిగా విడుదలవుతూ వచ్చిందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఒకరు చెప్పారు. రసాయనం, మందు రెండూ చుట్టుపక్కల ప్రాంతాల్లో మంట/వాపు కలిగిస్తున్న కణాల పెరుగుదలను అడ్డుకుంటూనే.. నాడీ సంబంధిత మూలకణాలు పెరిగేలా చేశాయని ఫలితంగా అక్కడ ఏర్పడ్డ న్యూరాన్ల నెట్వర్క్ మళ్లీ సంకేతాలు పంపడం మొదలుపెట్టడంతో కోతుల్లో కదలికలు కనిపించాయని వివరించారు. -
హెల్మెట్‌తో వెన్నెముకకు రక్ష
వాషింగ్టన్: ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడం వల్ల వెన్నెముక మెడ పైభాగానికి (సర్వైకల్ స్పైన్) గాయం కాకుండా తప్పించుకోవచ్చని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ప్రమాద సమయంలో వెన్నెముకకు గాయం కాకుండా హెల్మెట్ కాపాడలేదని.. పైగా హెల్మెట్ వల్ల కొన్నిసార్లు వెన్నెముకకు గాయమయ్యే ప్రమాదం కూడా ఉందని అనేకమంది భావిస్తారు. అయితే ఇది కేవలం అపోహ మాత్రమేనని పరిశోధకులు అంటున్నారు. అమెరికాలోని యూని వర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ హాస్పిటల్స్‌కు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనాన్ని చేపట్టారు. దీనిలో భాగంగా 2010–15 మధ్య విస్కాన్సిన్ ఆస్పత్రిలో నమోదైన 1,061 మంది వాహన ప్రమాద బాధితుల మెడికల్ రిపోర్టులను పరిశీలించారు. వీరిలో 323 మంది ప్రమాద సమయంలో హెల్మెట్ ధరించగా.. 738 మంది హెల్మెట్ ధరించలేదు. హెల్మెట్ లేని వారిలో ఈ తరహా గాయాలయ్యే అవకాశం 10.8% ఉండగా.. ధరించిన వారిలో 4.6%గా ఉందన్నారు. -
భారత్‌లోనూ 3డీ బాడీపార్ట్స్
తొలి శస్త్రచికిత్స విజయవంతం గుర్గావ్: 3డీ సాంకేతికతతో ప్రింట్ చేసిన శరీర భాగాలు త్వరలో భారత్‌లోనూ అందుబాటులోకి రానున్నాయి. వైద్య రంగంలో ఇది పెను మార్పులను తీసుకురానుందని డాక్టర్లు చెబుతున్నారు. ఇప్పటికే ఈ సాంకేతికతతో ఒక శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక టీచర్‌కు వెన్నెముకలోని మూడు వెన్నుపూసలు పాడవగా, 3డీ ప్రింటింగ్ సాంకేతికతను ఉపయోగించి టైటానియం ఇంప్లాంట్లను రూపొందించి ఆమె వెన్నెముకలో వైద్యులు అమర్చగలిగారు. ఈ నెల మొదట్లో నోయిడాలోని మెడ్‌సిటీలో ఈ శస్త్రచికిత్స జరిగింది. సర్జరీ చేసిన నాలుగు రోజులకే ఆమె నడవగలిగిందనీ, సాధారణ పద్ధతిలో అయితే ఆమె కాలి నుంచి ఎముకను సేకరించి వెన్నెముకలో అమర్చాల్సి రావడంతోపాటు ఆరు నెలలపాటు ఆమె మంచానికే పరిమితం కావాల్సి వచ్చేదని వైద్యులు తెలిపారు. ఈ తరహా శస్త్రచికిత్స భారత్‌లో మొదటిదనీ, ప్రపంచంలో మూడవదని సర్జరీ చేసిన వైద్యులు తెలిపారు. -
మనసుకు రిలీఫ్
1 ప్రసారిత మార్జాలాసన వజ్రాసనంలో కూర్చున్న తరువాత (రెండు కాళ్ళు మడిచి కాలి మడమల మీద కూర్చోవాలి) అర చేతులు రెండూ ముందు వైపు నేల మీద ఉంచి మోకాళ్లు కింద ఉంచి నడుమును పూర్తిగా రిలాక్స్ చేయాలి. దీనిని మార్జాలాసనమని అంటారు. మార్జాలం అంటే పిల్లి. జంతుజాలములన్నింటిలో పిల్లికి చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉండే వెన్నెముక ఉంది. ఈ ఆసనం చేయడం వల్ల వెన్నెముకకు మంచి రిలాక్సేషన్ వస్తుంది కనుక దీనిని మార్జాలాసనమని అన్నారు. ఈ స్థితిలో ఉండి శ్వాస తీసుకుంటూ ఎడమచేతిని ముందుకు, కుడికాలును వెనుకకు ఒకే సరళ రేఖలో ఉండేటట్లుగా సాగదీస్తూ ఉండి 3 లేదా 5 శ్వాసల తరువాత శ్వాస వదులుతూ కుడిమోకాలు క్రిందకు, ఎడమచేయి క్రిందకు తీసుకురావాలి. మళ్ళీ సీటు నడుము భాగాలను రిలాక్స్ చేస్తూ కొంచెం విశ్రాంతి తీసుకున్న తరువాత ఇదే ఆసనం రెండవవైపు కూడా చేయాలి. ఆపోజిట్ చేతిని, కాలుని స్ట్రెచ్ చేయడం వల్ల బ్యాలన్స్ చేయడంతో ఎక్కువ ఇబ్బంది ఉండదు. గమనిక: ఎవరికైనా మోకాలు సమస్య ఉన్నట్లయితే టర్కీ టవల్ని కానీ పలచ్చడి దిండును కాని మోకాళ్ల కింద పెట్టుకోవచ్చు. ఉపయోగాలు: నడుము, సీటు, వెన్నెముక భాగాలు ముఖ్యంగా లోయర్ బ్యాక్ ఔ1 నుంచి ఔ5 వరకు ఎటువంటి సమస్య ఉన్నా చక్కటి ఉపశమనం కలుగుతుంది. వెన్నెముక ఫ్లెక్సిబుల్‌గా అవుతుంది. వీపు భాగంలో కండరాలలో ఉన్న బిగుత్వంపోతుంది. కండరాలను సడలించినప్పుడు ఆక్సీజన్ కంజప్షన్ కెపాసిటీ పెరుగుతుంది. 2 అర్ధ అధోముఖ శ్వాసాసన మార్జాలాసనములోలాగానే మోకాళ్ళ మీద ఉండి మోకాలు నుండి సీటు వరకూ (నడుము వరకూ) 90 డిగ్రీల కోణంలో ఉంచి వీపును ముందుకు బాగా స్ట్రెచ్ చేస్తూ, నుదురు లేదా గడ్డమును నేల మీద ఉంచి చేతులు రెండూ ముందుకు బాగా స్ట్రెచ్ చేస్తూ శ్వాసను సాధారణ స్థితిలో ఉంచి కనీసం 5 లేదా 10 శ్వాసల వరకూ అదే ఆసనంలో ఉండేటట్లయితే, డోర్సల్ స్పైన్‌కి, డెల్టాయిడ్ ట్రెపీజియస్ కండరాలకు మంచిగా టోనింగ్ జరిగి అప్పర్ బ్యాక్‌కి పూర్తిగా రిలీఫ్ దొరుకుతుంది. ఉపయోగాలు: మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. స్ట్రెస్, కొద్దిపాటి డిప్రెషన్ నుండి రిలీఫ్ కలుగుతుంది. మెనోపాజ్ లక్షణాలను దూరంగా ఉంచడానికి, స్త్రీలకు రుతుక్రమంలో ఉండే అసౌకర్యానికి పరిష్కారంగానూ, తలనొప్పి, ఇన్సోమ్నియా, అధికరక్తపోటుకు ఆస్తమా వంటి సమస్యలకు ఉపయోగకారిగా పనిచేస్తుంది. 3 శశాంకాసన పైన చెప్పిన అర్థ అధోముఖశ్వాసాసనంలో నుండి నెమ్మదిగా సీటు భాగాన్ని క్రిందకు క్రమక్రమంగా దించి మడమల మీద కూర్చొనే విధంగా ప్రయత్నించాలి. పొట్ట ఛాతీ భాగాలు తొడలపైన ఉంచి శ్వాస వదులుతూ నుదురుని నేలకు వీలైనంత దగ్గరలోకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేయాలి. నుదురు నేలకు దగ్గరగా తీసుకువెళ్ళకపోయినా ఫరవాలేదు. కానీ వెనుక మడమల మీద సీటును ఉంచే ప్రయత్నం చేస్తూ మోకాళ్లు రెండూ కలిసి ఉంచే ప్రయత్నం చేయవలెను. చేతులను ముందుకు బాగా స్ట్రెచ్ చేస్తూ ఉంచాలి. ఉపయోగాలు: స్ట్రెచ్ మేనేజ్మెంట్కి రికమండ్ చేయబడిన ఆసనం ఇది. మెదడుకి రక్తసరఫరా పెరగడం వలన పార్కిన్సన్, బ్రెయిన్ ఎటక్సియా అల్జీమర్స్ వంటి సమస్యలకు కొంతవరకూ పరిష్కారం లభిస్తుంది. యాంగ్జైటీ, డిప్రెషన్ కోపం తగ్గి మనసు ప్రశాంతంగా మారుతుంది. పొట్ట దగ్గర అవయవాలకు టోనింగ్ జరగడం వలన జీర్ణవ్యవస్థ బాగుగా పనిచేస్తుంది. ఈ స్థితిలో శ్వాస చాలా వేగంగా ఉంటుంది. శ్వాసలు చిన్నవిగా ఉంటాయి. అందువలనే దీనికి శశాంకాసన అనే పేరు వచ్చింది. ఈ ఆసనాలు అన్నీ వెన్నెముక నడుము భాగాలకు పూర్తిగా ఉపశమనం ఇవ్వడానికి మనసుకు ఆందోళన తగ్గించి ప్రశాంతతను చేకూర్చడానికి ఉపకరించేవే! ఎ.ఎల్.వి కుమార్ ట్రెడిషనల్ యోగా ఫౌండేషన్ -
బ్యాక్ బ్యాలెన్స్
1. గోముఖాసన కాళ్లు రెండు ముందుకు సాగదీసి (స్టెచ్ చేసి) కూర్చొని కుడికాలుని మడిచి కుడిపాదం ఎడమ పిరుదు (హిప్) క్రిందకు తీసుకురావాలి. లేదా కుడిపాదం మీద కూర్చోని ఎడమ కాలుని మడిచి కుడికాలుపై నుండి తీసుకువచ్చి కుడి మోకాలు పైన ఎడమ మోకాలు ఉండేట్లు చూసుకోవాలి. ఒక వేళ ఈ స్థితికి రాలేక పోతే రెండు చేతులు భూమి మీద ముందువైపు ఉంచి, సీటు భాగాన్ని పూర్తిగా పైకి లేపాలి. ముందు వైపు ఒక మోకాలు మీదకు రెండో మోకాలు వచ్చే విధంగా ఫ్రీ చేసుకొని మళ్లీ సీటు భాగం భూమి మీదకు తీసుకురావాలి. అప్పుడు ఎడమ చెయ్యి కింద నుండి వెనుకకు, కుడి చెయ్యి పై నుండి వెనుకకు తీసుకువెళ్లాలి. అలాగే కుడి చెయ్యి పై నుండి వెనుకకు తీసుకువెళ్లి కుడి చెయ్యి కుడి చెవికి పక్కన తాకుతూ కుడి మోచేయి ఆకాశం వైపునకు చూపిస్తూ వెనుక రెండు చేతి వేళ్లను ఇంటర్‌లాక్ చేయాలి. తేలిగ్గా ఇంటర్‌లాక్ చేయగలిగినట్లయితే ఎడమ చేతి మణికట్టును కుడి చేతితో పట్టుకునే ప్రయత్నం చేయాలి. శ్వాస వదులుతూ చేతులు రిలీజ్ చేసి ఈ సారి ఎడమ చెయ్యి పై నుంచి, కుడి చెయ్యి కింద నుండి వెనుకకు తీసుకెళ్లి మళ్లీ వేళ్లు ఇంటర్‌లాక్ చేసే ప్రయత్నం చేయాలి. శ్వాస తీసుకుంటూ కాలును మార్చి ఎడమ పాదం కుడి సీటు కిందకు కుడికాలు ఎడమకాలు పైకి కుడి మోకాలు మీదకు ఎడమ మోకాలు ఉంచి రెండువైపులా చేయాలి. వెనుక చేతి వేళ్లను ఇంటర్‌లాక్ చేయలేనివారు తాడు గానీ, టవల్ గానీ ఉపయోగించవచ్చు. చేతులు రెండూ వెనుక సమాంతర రేఖలోకి తీసుకురావడం, మోచేతులు భూమికి ఆకాశానికి చూస్తూ స్ట్రెయిట్ లైన్లో ఉండటం, మోకాలు మీద మోకాలు ఉండటం ముఖ్యం. ఉపయోగాలు: ఛాతి, ఊపిరితిత్తులు విశాలమై శ్వాసకోశ వ్యవస్థ మెరుగుపడుతుంది. సర్వికల్ స్పాండిలైటిస్‌కి పరిష్కారం. మూత్రపిండాలు, అడ్రినల్ గ్రంధి, ఛాతీ కండరాల టోనింగ్ వల్ల వెన్నెముక బలోపేతం. 2. మరీచాసన సుఖాసనంలో కూర్చొని రెండు కాళ్లు ముందుకు సాగదీయాలి, ఎడమకాలుని మడిచి దాన్ని పైకి, శరీరాన్ని కుడివైపుకి, నడుమును కుడివైపునకు తిప్పుతూ కుడికాలు పాదంతో సహా ముందుకు స్ట్రెచ్ చేయాలి. ఎడమచేతిని ఎడమ మోకాలి చుట్టూ పోనిచ్చి దాని మణికట్టును కుడి చేతితో వెనుక నుండి పట్టుకుని, నడుమును కుడివైపు బాగా వంచి శ్వాస తీసుకుంటూ కుడి భుజం నుండి వెనుకకు చూసే యత్నం చేయాలి. శ్వాస వదులుతూ తిరిగి వెనుకకు సాధారణ స్థితికి తీసుకురావాలి. ఇదే విధంగా రెండవ కాలుతో రెండవ వైపు కూడా చేయాలి. శరీరాన్ని నిటారుగా ఉంచి నడుమును ట్విస్ట్ చేయడం చాలా ప్రధానం. ఫొటోలో చూపినట్టు చేయలేనివారు తాడు లేదా టవల్‌ను ఉపయోగించి చేయాలి. కుర్చీలో కూర్చొని కాళ్లను క్రిందకు ఉంచి కుర్చీని సపోర్టుగా తీసుకుని, కుర్చీ వెనక పట్టుకుంటూ నడుమును ట్విస్ట్ చేయవచ్చు. కంప్యూటర్ మీద వర్క్ చేసేవారు నడుము వెన్నెముక స్ట్రెయిన్‌కు ఇది పరిష్కారం ఉపయోగాలు: నడుము కుడి ఎడమకు ట్విస్ట్ చేయడం వలన కాలేయం, పాంక్రియాటిస్, పొట్ట భాగాలకు టోనింగ్. జీర్ణశక్తికి మంచిది. డయాబెటిస్ పేషెంట్లు చేయవలసిన ఆసనం. వెన్నెముక క్రింది లాక్సిజియల్, సాక్రల్, లంబార్ స్పైన్‌కి చాలా మంచిది. నడుము పక్కన కొవ్వు కరిగిస్తుంది. ముద్రలు...బంధనాలు...కుండలిని గురించి తెలుసుకుందాం... ముద్రలు: వ్యాకోచ - సంకోచం కలిగియుండుటమే ముద్ర. దీనిలో ఆసనం, ప్రాణాయామం, ధ్యానం ఇమిడి ఉంటాయి. గ్రంథుల పనితీరును, డార్మెంట్ సైకిక్ పవర్ సెంటర్‌ని ఉత్తేజపరచడానికి ముద్రలు పనికివస్తాయి. ఉదాహరణకు అశ్వినీముద్ర కోసం పద్మాసనంలో కూర్చోవాలి. చేతులు రెండు మోకాళ్ల మీద భూమివైపుకి అరచేతులు ఉంచి మోకాళ్లను సపోర్ట్‌గా ఉపయోగిస్తూ మూలబంధంలో అనగా గుదము దగ్గర కండరాలను, గుదమును లోపలకు లాగి (సంకోచం) మళ్లీ బయటకు ఫ్రీగా వదిలి (వ్యాకోచం) ఈ విధంగా వ్యాకోచ సంకోచ సమయంలో శ్వాస వదిలి.. ఆపి ఉంచి.. సాధారణ స్థితికి వచ్చేటప్పుడు శ్వాస తీసుకుంటూ రిలాక్స్ అవ్వాలి. ఉపయోగాలు: రెక్టమ్ గుదముకు పెద్ద ప్రేవు చివరి (సిగ్మాయిడ్ కోలన్) భాగాలకు సంబంధించిన పైల్స్, ఫిస్టులా, ఫిసర్ వంటి వ్యాధుల నివారణకు, పరిష్కారానికి ఉపయోగపడుతుంది. గమనిక: ఇందులో ఆసనం - పద్మాసనం. ప్రాణాయామం - శ్వాసను వదిలి బంధించి చేయడం,తరువాత శ్వాస తీసుకుంటూ ధ్యానం చేయడం. ధ్యానం - చాలా ఏకాగ్రతమైన మనసుతో చేసినప్పుడే గుద కండరాల మీద పట్టు దొరుకుతుంది. ఇటువంటి ముద్రలు ఘెరండ సహిత ప్రకారం 26, శివసంహిత ప్రకారం 11, మొత్తం 37 ముద్రలు ఉన్నాయి. బంధనాలు: బంధనం అనగా కండరాలను లాక్ చేసి ఉంచడం. ఇక్కడ వ్యాకోచ-సంకోచాలు ఉండవు. శ్వాస వదిలి కండరాలను బంధించి ఉంచడమే ముద్ర. ఇన్వాలంటరీ మజిల్స్‌ను కూడా బంధనం చేయవచ్చు. శరీరంలోని వ్యవస్థల మీద నియంత్రణ సాధించి వాటి పనితీరును మెరుగు పరచవచ్చు. ఉదాహరణకు త్రిమింధనం: మూలబంధ్, ఉడ్యాన బంధ్, జలందర్ బంధ్. మూల బంధ్ అంటే గుద కండరాలను బంధించడం. ఉడ్యాన బంధ్ అంటే పొట్టకండరాలను బంధించడం. జలందర్ బంధ్ అనగా గడ్డం చాతీమీదకు ఆనించి బంధించడం. పద్మాసనంలో కూర్చొని శ్వాస వదిలి ఈ 3 బంధనాలను ఉపయోగించి 15 లేదా 30 సెకన్ల తరువాత శ్వాసతీసుకుంటూ వెనుకకు యధాస్థితికి రావాలి. ఉపయోగాలు: మూలబంధ్ మలవిసర్జన వ్యవస్థకు, ఉడ్యానబంధ్ జీర్ణవ్యవస్థకు, జలందర్ బంధ్, థైరాయిడ్ పారాథైరాయిడ్ గ్రంథులకు మంచిది. హఠయోగాలో చివరి భాగమైన కుండలిని గురించి వచ్చేవారం.... -
పేస్‌మేకర్ ఎందుకు అమర్చుతారు..?
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 30 ఏళ్లు. నేను ఏడాది నుంచి మెడనొప్పి, నడుము నొప్పితో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే స్పాండిలోసిస్ అన్నారు. మందులు వాడుతుంటే తగ్గినట్టే తగ్గి మళ్లీ నొప్పి వస్తోంది. హోమియోలో శాశ్వత చికిత్స ఉంటే తెలపండి. - నారాయణ స్వామి, నిజామాబాద్ స్పాండిలోసిస్ వెన్నెముకకు సంబంధించిన సమస్య. ఇది ఒక రకమైన ఆర్థరైటిస్. ఇది మెడ భాగంలో వస్తే సర్వైకల్ స్పాండిలోసిస్ అనీ, నడుము భాగంలో వస్తే లంబార్ స్పాండిలోసిస్ అని అంటారు. కారణాలు : కాళ్లు, చేతులలో ఉన్నట్లు వెన్నులో కూడా జాయింట్స్ ఉంటాయి. ఈ జాయింట్స్‌లో అరుగుదల వల్ల నొప్పి రావచ్చు. జాయింట్స్ వాటర్ తగ్గడం వల్ల కూడా నొప్పి రావచ్చు. స్పైన్ దెబ్బతిని వెన్ను నొప్పి రావడాన్ని స్పాండిలోసిస్ అంటారు. వెన్నుపూసల మధ్య నరాలు వెళ్లడానికి దారి ఉంటుంది. ఈ దారి సన్నబడితే నరాల మీద ఒత్తిడి పడి నొప్పి వస్తుంది. లక్షణాలు : సర్వైకల్ స్పాండిలోసిస్ - మెడనొప్పి, తలనొప్పి, తల అటు ఇటు తిప్పడం కష్టం కావడం, మెడ బిగుసుకుపోయినట్లుగా ఉండటం, నొప్పి మెడ నుంచి భుజాలు, చేతుల వరకు ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. లంబార్ స్పాండిలోసిస్ : నడుము నొప్పితో పాటు కొన్నిసార్లు మెడనొప్పి కూడా ఉంటుంది. ఒకవైపు కాలు నుంచి పాదం వరకు నొప్పి వ్యాపిస్తుంటుంది. దీన్నే సయాటికా నొప్పి అని అంటారు. నరాలు ఒత్తిడికి గురై నడవడానికి ఇబ్బంది పడటం వంటి సమస్యలూ కనిపిస్తాయి. నిర్ధారణ : లక్షణాలను బట్టి వ్యాధిని తెలుసుకోవడంతో పాటు, ఎక్స్-రే, ఎమ్మారై, సీటీ స్కాన్లూ నిర్ధారణకు ఉపయోగపడతాయి. నివారణ : స్పైన్‌కు సంబంధించిన వ్యాయామాలు చేయడం, మంచి పోషకాహారం తీసుకోవడం, క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే పదార్థాలు తినడం వంటి జాగ్రత్తలు పాటించాలి. ఉన్నట్టుండి ఒక్కసారిగా కూర్చోవడం, నిల్చోవడం చేయకూడదు. దూరప్రాంతాలకు నడవడం సరికాదు.హోమియోలో కాన్స్టిట్యూషనల్ చికిత్సతో క్రమేపీ రోగనిరోధక శక్తి పెంచడం ద్వారా వ్యాధిని క్రమక్రమంగా తగ్గిస్తూ, పూర్తిగా నయం చేయడం సాధ్యమవుతుంది. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి సీనియర్ డాక్టర్ పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్ కార్డియాలజీ కౌన్సెలింగ్ నా వయసు 65 ఏళ్లు. నాకు గత ఏడాది ఛాతీలో నొప్పి రావడంతో యాంజియోగ్రామ్ చేసి ఒక స్టెంట్‌ను వేశారు. ఇప్పుడు శ్వాసలో తీవ్రమైన ఇబ్బందితో పాటు ఛాతీలో నొప్పి రావడంతో మళ్లీ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాను. ఇప్పుడు డాక్టర్ నన్ను పరీక్షించి, గుండెలో విద్యుత్ సమస్య ఏర్పడిందనీ, దాన్ని సరిచేయడానికి పేస్‌మేకర్‌ను అమర్చాలని చెబుతున్నారు. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. - కె. ప్రకాశ్‌రావు, జగ్గయ్యపేట గుండె జబ్బు అనగానే మనకు ఒకటే అంశం గుర్తుకు వస్తుంది. అదే గుండెపోటు. కానీ నిజానికి గుండెకు సంబంధించి ఇతర చాలా రకాల సమస్యలు వస్తుంటాయి. అందులో ఒకటి గుండెకు సరఫరా అయ్యే కరెంటు. గుండె ద్వారా శరీరానికి ఇతర భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తూ ఉంటుంది. కాబట్టి గుండె పంపుగా పని చేయడానికి శక్తి కావాలి. ఇందుకు గుండె పై భాగంలో ఉండే గదుల్లో కుడివైపున సైనో ఏట్రియల్ (ఎస్ఎ) నోడ్, ఏట్రియో వెంట్రిక్యులార్ (ఏవి) నోడ్ అనే కేంద్రాలుంటాయి. వీటి నుంచి గుండెకు విద్యుత్ ప్రేరణలు అందుతుంటాయి. ఈ విద్యుత్ ప్రేరణల వల్ల గుండె ఒక క్రమపద్ధతిలో స్పందించడం వల్ల రక్తనాళాల్లోకి రక్తం పంప్ అవుతుంది. అయితే కొన్ని సందర్భాలలో ఈ విద్యుత్ ప్రేరణల్లో మార్పులు వచ్చి గుండె లయ దెబ్బతింటుంది. దాంతో ఒక్కోసారి గుండె కొట్టుకునే వేగం తగ్గుతుంది. ఒక్కోసారి దీన్నే వైద్య పరిభాషలో ట్యాకి కార్డియా అంటారు. గుండె వేగం తగ్గినప్పుడు ఛాతీ పైభాగంలో చర్మం క్రింద పేస్‌మేకర్‌ను అమర్చి గుండె వేగాన్ని సరిదిద్దుతారు. గుండె వేగం పెరిగినప్పుడు బీటా బ్లాకర్స్ అనే మందులు ఉపయోగించి గుండె లయను క్రమబద్ధీకరిస్తారు. గుండె లయ తప్పకుండా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి... డయాబెటిస్‌ను అదుపులో పెట్టుకోవాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి బరువు పెరగకుండా చూసుకోవాలి రక్తపోటును అదుపులో ఉంచుకోవాలి కొలెస్ట్రాల్ పాళ్లు అదుపులోనే ఉండేలా చూసుకోవాలి మన జీవనశైలి, ఆహారపు అలవాట్లు సక్రమంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్టర్ అనుజ్ కపాడియా సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ పీడియాట్రిక్ కౌన్సెలింగ్ మా పాపకు మూడు నెలలు. ఈమధ్య తరచూ ఏడుస్తోంది. డాక్టర్‌కి చూపిస్తే కడుపు నొప్పి వల్ల ఏడుస్తుండవచ్చు అని కొన్ని మందులు ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి. దయచేసి మా పాప సమస్యకు తగిన పరిష్కారం చూపండి. - అంజలి, కొత్తగూడెం పిల్లలు ఆగకుండా ఏడవడానికి అనేక కారణాలు ఉంటాయి. చిన్న సమస్య మొదలుకొని ప్రమాదకరమైన జబ్బుల వరకూ పిల్లలు ఏడుపు ద్వారానే వ్యక్తపరుస్తారు.ఆకలిగా ఉన్నా, చెవి నొప్పి ఉన్నా సరే ఏడ్వడం ద్వారానే వాటిని తెలియబరుస్తుంటారు. పిల్లల ఏడుపుకు కొన్ని కారణాలు: ఆకలి వేసినప్పుడు, భయపడినప్పుడు, దాహం వేసినప్పుడు, డయపర్ తడిగా అయినప్పుడు, వాతావరణం వారికి చల్లగా లేదా వేడిగా ఉన్నప్పుడు, పెద్ద పెద్ద శబ్దాలు అవుతున్నప్పుడు, కాంతి ఎక్కువైనా, పొగలు కమ్ముకున్నా, ఏవైనా నొప్పులు ఉన్నప్పుడు, పళ్ళు వస్తున్నప్పుడు, ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు, కడుపు నొప్పి (ఇన్‌ఫ్యాంటైల్ కోలిక్), జ్వరం, జలుబు, చెవినొప్పి, మెదడువాపు జ్వరం, గుండె సమస్యలు, కొన్ని జన్యుపరమైన సమస్యలు వంటి తీవ్రమైన సమస్యలను కూడా పిల్లలు ఏడుపు ద్వారానే వ్యక్తం చేస్తారు. ఒకటి నుంచి ఆర్నెల్ల వయసులో ఉన్న పిల్లలు ఎక్కువగా ఏడవటానికి ముఖ్యంగా కడుపుకు సంబంధించిన రుగ్మతలు, చెవి నొప్పి, జలుబు వంటివి కారణాలు. మీ పాప విషయంలో ఏడుపు బహుశా కడుపునొప్పి (ఇన్ఫెన్టైల్ కోలిక్) కారణం అనిపిస్తుంది. ఈ సమస్య సాధారణంగా ఆరువారాల నుంచి మూడు నెలలలోపు పిల్లల్లో వస్తుంటుంది. ఈ వయసు పిల్లలు కడుపునొప్పితో ఏడుస్తుండటం తరచూ చూస్తుంటాం. ఇది ముఖ్యంగా పేగులకు సంబంధించిన నొప్పి. ఇది చాలా సాధారణమైన సమస్య. ఇలాంటి పిల్లల్లో ఏడుపుకు ఫలానా అంటూ నిర్దిష్టంగా కారణం అని చెప్పలేకపోయినా... ఆకలి, గాలి ఎక్కువగా మింగడం, ఓవర్ ఫీడింగ్, పాలలో చక్కెర ఎక్కువ కావడం వంటి కొన్ని కారణాలని చెప్పుకోవచ్చు. ఇటువంటి పిల్లలను ఎత్తుకోవడం (అప్ రైట్ పొజీషన్), లేదా వాళ్లను పొట్టమీద పడుకోబెట్టడం, తేన్పు వచ్చేలా చేయడం (ఎఫెక్టివ్ బర్పింగ్)తో ఏడుపు మాన్పవచ్చు. చికిత్స : కొందరికి యాంటీస్పాస్మోడిక్‌తో పాటు మైల్డ్ సెడేషన్ ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉంటుంది. యాంటీస్పాస్మోడిక్, మైల్డ్ సెడేషన్ అనే రెండు మందులు ఏడుపు చాలా తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వాలి. చిన్న పిల్లలు మరీ ఎక్కువగా ఏడుస్తుంటే తప్పకుండా మీ పిల్లల డాక్టర్‌కు చూపించి తగిన చికిత్స తీసుకోవాలి. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
ప్రణతోస్మి దివాకరం
సూర్య నమస్కారాలు వెన్నెముక మొత్తాన్ని చైతన్యవంతం చేసి, భావోద్వేగాలను అదుపులో ఉంచే శక్తి సూర్య నమస్కారాలకు ఉంది. వీటిని శ్వాసమీద ధ్యాస ఉంచి చేయాలి. సరిగ్గా సాధన చేస్తే హృద్రోగ సమస్యలు దరిచేరవు. వీటిని నిదానంగా ప్రారంభించి-వేగవంతం చేసి- తిరిగి నిదానంగా పూర్వస్థితిలోకి రావాలి. నేరుగా వేగం పెంచితే కీళ్లు పట్టేసే ప్రమాదముంది. ఈ ఆసనాలు వేసేటప్పుడు అవి శరీరంలోని ఏ భాగం మీద పనిచేస్తాయో అక్కడే మనసును కేంద్రీకరించాలి. అందరూ ఈ ఆసనాలన్నీ చేయవచ్చు. నడుం నొప్పి ఉన్నవాళ్లు కూడా చేయవచ్చు. ఏ వయసు వారైనా ఈ ఆసనాలను నిత్యం చేయవచ్చు. అయితే శాస్త్రీయంగా సాధన చేయడం అవసరం. ప్రాతఃకాలంలో వాతావరణంలో పాజిటివ్ డ్యూరో ట్రాన్స్‌మీటర్స్ ఉంటాయి. మనసును కేంద్రీకరించడానికి అది సరైన సమయం. జీవనశైలి ప్రకారం కుదరకుంటే ఏ సమయంలోనైనా చేయవచ్చు. కాని ఆహారం తీసుకున్న 4 గంటల తర్వాతే చేయాలి. కడుపు నిండా నీళ్లు తాగినట్లయితే కనీసం అరగంట విరామం ఇవ్వాలి. 1. ప్రణామాసనం: తూర్పుదిక్కుకు అభిముఖంగా నిల్చొని సూర్యుడికి నమస్కారం చేస్తున్నట్టుగా ఉంటుందీ ఆసనం. శ్వాస, రక్తప్రసరణ వ్యవస్థకు మంచిది. ప్రారంభంలో 4 - 5 సాధారణ శ్వాసలు తీసుకొని వదలాలి. దీనిలో ప్రయత్నపూర్వకంగా శ్వాస తీసుకోవాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. 2. హస్త ఉత్థానాసనం: మోకాళ్లను కొద్దిగా ముందుకు వంచుతూ, చేతులను తల మీదుగా తీసుకుంటూ భుజాల వెనక్కి వెళ్లేలా ఉదరభాగాన్ని ముందుకు తీసుకోవాలి. ఈ భంగిమలో వెన్నెముక మీద బరువు పడకుండా చూసుకోవాలి. ఒత్తిడి లేకుండా నెమ్మదిగా గాలి పీల్చుతూ, వదులుతూండాలి. ఈ ఆసనం వల్ల వెన్ను, మెడ కండరాలు, నాడీ వ్యవస్థ చైతన్యవంతం అవుతాయి. 3. పాదహస్తాసనం: కాళ్లను నిటారుగా ఉంచి, గాలి వదులుతూ నిదానంగా ముందుకు వంగాలి. వెన్నెముక మీద ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. తల మోకాలుకు ఆనేలా వీలయినంత వంగాలి. దీని వల్ల మూత్ర వ్యవస్థ, ప్రత్యుత్పతి వ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. 4. అశ్వ సంచాలాసనం: గాలి నెమ్మదిగా పీల్చుకుంటూ చేతులను నేలకు ఆనించి, కుడికాలిని వెనక్కు తీసుకెళ్లి, ఛాతీని, తలని పెకైత్తాలి. హైపోథాలమస్ (మెదడులో భావోద్వేగానికి సంబంధించిన ఒక భాగం) మీద ఈ ఆసనం బాగా పనిచేస్తుంది. ధ్యాసను కనుబొమల మధ్యనే ఉంచాలి. దృష్టిని కుడికాలి బొటన వేలి నుంచి కనుబొమల దాకా తీసుకురావాలి. కుడివైపు భాగానికి చేస్తున్నాం కాబట్టి ఆ వైపు అంతా చైతన్యవంతం అవుతుంది. 5. చతురంగాసనం: గాలిని వదిలేస్తూ ఎడమకాలిని కుడికాలికి జత చేయాలి. నడుం మీద బరువు పడకుండా చూసుకోవాలి. పొట్ట, ఛాతీ. ఇలా నెమ్మదిగా గొంత ుదాకా మనసును తీసుకురావాలి. ఇది నాడీ వ్యవస్థ మీద, ఉదరం మీద పనిచేస్తుంది. 6. అష్టాంగ నమనాసనం: శరీరంలో 8 భాగాలు నేలను తాకుతాయి కాబట్టి దీనికీ పేరు. గాలి తీసుకుని, వదిలేస్తూ నెమ్మదిగా మోకాలిని, ఛాతీని, గడ్డాన్ని నేలకు ఆన్చాలి. మెడనొప్పి ఉన్నవాళ్లు నుదురును నేలకు ఆనించాలి. నడుం భాగం పైకి ఎత్తిపెట్టి ఉంచాలి, నేలకు ఆనకూడదు. ఇది జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. 7. భుజంగాసనం: నెమ్మదిగా గాలి పీలుస్తూ చేతులు నేలకు ఆన్చి ఛాతీ, తలను పెకైత్తాలి. ఇది పునరుత్పత్తి, మూత్రవిసర్జన, రక్తప్రసరణ వ్యవస్థలపైనా, థైరాయిడ్ గ్రంథి మీద పనిచేస్తుంది. నడుమును బలోపేతం చేస్తుంది. 8. పర్వతాసనం లేదా అథోముఖ శ్వానాసనం: ఒత్తిడికి లోనైన వెన్నెముక విశ్రాంతి పొందేలా చేస్తుంది. నాడీ వ్యవస్థ మీద పనిచేసే ఈ ఆసనం నడుం నొప్పికి ఔషధం అని చెప్పవచ్చు. ఈ ఆసనం వేసే సమయంలో నిదానంగా గాలిని వదులుతూ నడుమును పెకైత్తి, గాలిని లోపలికి తీసుకుంటూ యథాస్థానానికి రావాలి. 9. అశ్వసంచాలనాసనం: (నాలుగో ఆసనంలో కుడివైపు చేశాం) ఇప్పుడు ఈ ఆసనంలో ఎడమ వైపు చేయాలి. రెండు మోకాళ్లను నేలకు ఆన్చి నెమ్మదిగా ఎడమ కాలును వెనక్కు తీసుకుంటూ ఛాతీని, తలను పెకైత్తాలి. 10. పాదహస్తాసనం: (3వ ఆసనం లాంటిదే) ఎడమకాలుని కుడికాలికి జత చేసి నడుమును పెకైత్తాలి. 11. హస్త ఉత్థానాసనం: నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ మోకాళ్లకు కొద్దిగా ముందుకు వంచి, చేతులను భుజాల వెనక్కి తీసుకె ళ్లాలి. శరీరాన్ని సాధ్యమైనంత వరకు స్ట్రెచ్ చేయాలి. 12. ప్రణామాసనం: నిటారుగా నిల్చొనే స్థితికి వచ్చి, నెమ్మదిగా గాలిని వదిలేస్తూ రెండు చేతులను నమస్కార భంగిమలో హృదయస్థానం పైకి తీసుకురావాలి. -
నిలబడడం కోసం చావడానికైనా రెడీ
-
తొలగిన తల అతికించారు
లండన్: బ్రిటన్‌లో భారతీయ సంతతి న్యూరో వైద్యుడు అత్యంత అరుదైన శస్త్ర చికిత్స చేసి రికార్డు సృష్టించారు. యాక్సిడెంట్లో వెన్నెముక నుంచి విడిపోయిన తలభాగాన్ని తిరిగి విజయవంతంగా అమర్చి ప్రాణాలు నిలబెట్టారు. దీంతో ఆ బ్రిటన్ యువకుడి తల్లిదండ్రులంతా ఆ వైద్యుడికి ఆనందపరవశంతో కృతజ్ఞతలు తెలిపారు. న్యూకాజిల్ పట్టణానికి చెందిన టోని కోవాన్ అనే యువకుడు గత సెప్టెంబర్ 9న కారు ప్రమాదానికి గురయ్యాడు. వేగంగా వెళ్లి ఓ టెలిఫోన్ స్థంబానికి కారు గుద్దుకోవడంతో ఒక్కసారిగా అతడి గుండె ఆగిపోయింది. ఆ వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స చేయగా ప్రాణమైతే నిలిచిందిగానీ, వెన్నుకు మాత్రం తీవ్రగాయమైంది. తల భాగం మొత్తం వెన్నుపూస నుంచి పక్కకు జరిగింది. ఈ కేసును ప్రత్యేకంగా పరిశీలించిన అనంత్ కామత్ అనే భారతీయ సంతతి వైద్యుడు ఆపరేషన్‌కు ముందుకొచ్చి విజయవంతంగా అతడి తలభాగానికి వెన్నెముకకు మెటల్ ప్లేట్ అమర్చి బోల్టులు కూడా బిగించి అరుదైన చికిత్స పూర్తి చేశాడు. దీంతో టోనీ కోవాన్ పూర్తిగా కోలుకొని అతి త్వరలోనే తన ఇంటికెళ్లి సాధారణ వ్యక్తిలా జీవించబోతున్నాడు. -
ఆంకిలోజింగ్ స్పాండిలోసిస్
ఇది దీర్ఘకాలికంగా బాధించే సమస్య. ఇది ముఖ్యంగా కీళ్ళు, వెన్నెముక, తుంటి భాగంలో రావచ్చు. ముఖ్యంగా 18-30 ఏళ్ల యుక్తవయసులో వారికి ఈ సమస్య తలెత్తినప్పుడు కీళ్లు, మెడ బిగుసుకుపోతాయి. ఈ వ్యాధి పురుషుల్లో 3:1 నిష్పత్తిలో కనిపిస్తోంది. 40% కేసులలో కళ్లు ఎర్రబడటం, ఫొటోఫోబియా వంటి లక్షణాలు ఉంటాయి. దీనినే రుమటాయిడ్ స్పాండిలైటిస్ అంటారు. వెన్నెముకకు సోకే ఆర్థరైటిస్‌లో ఇదో రకం. దీనివల్ల వెన్నుపూసల మధ్య వాపు ఏర్పడుతుంది. ఇది ఆటోఇమ్యూన్ వ్యాధి .అనగా సాధారణంగా మీ శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించే ఇమ్యూనిటీ వ్యవస్థ మీ శరీరంలోని కణజాలాన్ని నాశనం చేస్తుంది. ఇది పురుషులలో సాధారణంగా ఎక్కువ తీవ్రతతో వస్తుంది. ఇది జన్యుపరంగా వస్తుంది. నడుమునొప్పి, కీళ్లు బిగుసుకుపోవడం ముందుగా కన్పించే లక్షణాలు. ఈ సమస్య ఎక్కువగా లేట్ అడాల్సెన్స లేదా ఎర్లీ అడల్ట్హుడ్లో మొదలవుతుంది. కొన్ని రోజులు గడిచాక వెన్నుపూసలు కలసిపోయి కదిలికను తగ్గిస్తుంది. ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయడం సాధ్యం కాదు కానీ మందుల ద్వారా నొప్పి, వాపు, ఇతర లక్షణాలను తగ్గించవచ్చు. వ్యాయామం కూడా ఉపయోగపడుతుంది. ఆంకిలోజింగ్ స్పాండిలైటిస్‌కు కారణం ఏమిటి ? సరైన కారణం తెలియదు, కానీ జన్యువులు ముఖ్యపాత్ర పోషిస్తాయి. చాలామందిలో జన్యు వు ఉత్పత్తి చేసే జెనెటిక్ మార్కర్ ఉంటుంది. దీనిని ‘ప్రొటీన్ హెచ్ఎల్ఏ-బీ27’ అంటారు. యూరోపియన్ యాన్సెస్ట్రీ జనాభాలో ఆంకిలోజింగ్ స్పాండిలైటిస్ కలిగిన వారిలో 95% మందిలో ఈ మార్కర్‌ను గుర్తించారు. దీనితో పాటు వాతావరణ కారకాలు, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వంటివి కూడా ఆంకిలోజింగ్ స్పాండిలైటిస్ రావడాన్ని ప్రేరేపిస్తాయి. మామూలు జనాభాలో 8% మందిలో ఇది సాధారణ జన్యువు. ఈ జన్యువు కలిగిన వారిలో 2% మందిలో మాత్రమే స్పాండిలైటిస్ వచ్చే అవకాశం ఉంది. మా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా స్పాండిలైటిస్‌తో బాధపడుతున్నట్లయితే, నాకు హెచ్ఎల్ఏ-బీ27 పాజిటివ్ వచ్చినట్లయితే ఎంతవరకు నాకు స్పాండిలైటిస్ వచ్చే అవకాశం వుంది? మీ ఇంట్లో ఎవరికైనా స్పాండిలైటిస్ వుండి మీకు హెచ్ఎల్ఏ-బి27 జన్యువు ఉన్నట్లయితే మీ వయస్సు 40 సంవత్సరాల లోపు ఉన్నట్లయితే మీకు స్పాండిలైటిస్ వచ్చే అవకాశం 20% ఎక్కువ. మీరు 40 సంవత్సరాలకు పైబడిన వయసు ఉన్నట్లయితే, స్పాండిలైటిస్ వచ్చే అవకాశం చాలా తక్కువ. మీకు ఆంకిలోజింగ్ స్పాండిలైటిస్ ఉన్నట్లయితే అది మీ పిల్ల్లలకు చేరే అవకాశం చాలా తక్కువ. తల్లిదండ్రులలో హెచ్ఎల్ఏ-బీ27 జన్యువు ఇన్హెరిటెడ్గా ఉంటే అది 50% మంది పిల్లలకి వచ్చే అవకాశం వుంది. ఆంకిలోజింగ్ స్పాండిలైటిస్ ఎలా నిర్ధారిస్తారు ? ఫిజికల్ పరీక్షతోపాటు ఎక్స్‌రేలు, వారి మెడికల్ హిస్టరీ, ఇంట్లో ఎవరికైనా ఈ వ్యాధి ఉందా, హెచ్ఎ-బి27 జన్యువు కొరకు రక్తపరీక్షల వంటి ఫలితాలపై ఆధారపడి వ్యాధిని నిర్ధారిస్తారు. దీనిని పూర్తిగా నయం చేయవచ్చునా? ప్రస్తుతానికి ఉన్న మందులతో ఆంకిలోజింగ్ స్పాండిలైటిస్‌ను పూర్తిగా నయం చేయలేరు. కాని మందుల ద్వారా చికిత్స చేసి లక్షణాలను తగ్గిస్తారు మరియు నొప్పిని మేనేజ్ చేస్తారు. కొన్ని నూతన బయలాజిక్ మందులు వ్యాధి వ్యాపించే వేగాన్ని తగ్గిస్తాయి లేదా ఆపివేస్తాయని కొన్ని పరిశోధనలలో తేలింది. సాధారణంగా చికిత్సలో మందులు, ఎక్స్ర్సైజు మరియు ఫిజియో థెరపీ, మంచి పాశ్చర్ను అలవాటు చేయించడం ఉంటాయి. వాడదగిన హోమియో మందులు: కాల్కేరియా ఫాస్, ఆరమ్, సైలీషియా, ఫాస్పరస్, ఫాస్పరిక్ ఆసిడ్, నేట్రమ్ కార్బ, లైకోపోడియం, పల్సటిల్లా, నక్స్‌వామికా -
సమకోణాసనం
ఈ ఆసనం వేసినప్పుడు దేహం సమానమైన కోణాకృతిలో ఉంటుంది. ఎలా చేయాలంటే..? రెండు కాళ్లు బారజాపి వెన్నెముకను నిటారుగా ఉంచి రెండు అరచేతులు తొడల మీద బోర్లించి సమస్థితిలో కూర్చోవాలి. ఇప్పుడు రెండుకాళ్లను రెండవ ఫొటోలో ఉన్నట్లు ఇరువైపులా పక్కలకు చాపాలి. మోకాళ్లను వంచకూడదు. ఇప్పుడు మూడవ ఫొటోలో ఉన్నట్లు రెండు అరచేతులను నమస్కార ముద్రలో ఉంచాలి. ఈ స్థితిలో వెన్నెముక నిటారు గా ఉండాలి. దృష్టి ఎదురుగా ఒక బిందువుపై కేంద్రీకరించాలి. ఈ స్థితిలో శ్వాస సాధారణంగా ఉండాలి. ఏకాగ్రత శ్వాస మీద లేదా ఆసన స్థితి మీద ఉండాలి. ఇలా ఉండగలిగినంత సేపు ఉన్న తరవాత యథాస్థితికి రావాలి. ఈ ఆసనాన్ని రోజు కు మూడు నుంచి ఐదుసార్లు సాధన చేయాలి. ఈ ఆసనాన్ని ఏ సమయంలోనైనా సాధన చేయవచ్చు. ఉపయోగాలు సుఖప్రసవం కావడానికి దోహదపడే ఈ ఆసనాన్ని గర్భం ధరించిన నాటి నుంచి తొమ్మిది నెలలు నిండేవరకు కూడా సాధన చేయవచ్చు. రుతుక్రమ సంబంధమైన సమస్యలు, రజస్వల సమస్యలు తొలగిపోతాయి. పురుషులలో స్వప్న దోషాలు, మూత్రదోషాలు పోతాయి. వీర్యశక్తి పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. చిత్తం స్థిరంగా ఉంటుంది. కాళ్లకు రక్తప్రసరణ కావలసినంత జరుగుతుంది. మోకాళ్ల నొప్పులు తొలగిపోతాయి. తొడలలోని కొవ్వు కరుగుతుంది. వెన్నెముక సరళరతమవుతుంది. నిగ్రహశక్తి పెరుగుతుంది. కటిప్రదేశంలోని కండరాలు, భాగాలు బలంగా ఉంటాయి. జాగ్రత్తలు! మోకాళ్ల నొప్పులు ఎక్కువగా ఉన్నవాళ్లు కాళ్లను మరీ ఎక్కువ ఒత్తిడి చేయకుండా సౌకర్యంగా ఉన్నంత వరకే చాపి సాధన చేయాలి. మోడల్ : ఎస్. దుర్గాహర్షిత, నేషనల్ యోగా చాంపియన్ ఫొటోలు: శివ మల్లాల బీరెల్లి చంద్రారెడ్డి యోగా గురువు సప్తరుషి యోగవిద్యాకేంద్రం హైదరాబాద్ -
యశస్విని విస్తరణ
సాక్షి,బెంగళూరు : రాష్ట్రంలో గుర్తింపు పొందిన సహకార సంఘాల్లోని సభ్యులకు ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించే ‘యశస్విని’ పథకం పరిధిని విస్తరింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన వెలువరించింది. ఇకపై యశస్విని పథకం పరిధిలోకి గుండె, వెన్ను, కీళ్ల శస్త్ర చికిత్సలనూ చేర్చుతున్నట్లు అందులో పేర్కొంది. అంతేకాకుండా కేన్సర్‌కు రేడియేషన్ థెరపీనీ చేర్చింది. దీని వల్ల ఇకపై బ్రెస్ట్, గర్భకోశం, సెర్విక్స్, ఆహారనాళం, రిక్టల్, ప్రోటెస్ట్ కేన్సర్లకు రేడియేషన్ థెరపీను పొందడానికి వీలవుతుంది. అదేవిధంగా గర్భిణి నుంచి బిడ్డకు హెచ్ఐవీ సోకకుండా నిరోధించడానికి అందించే ప్రివెన్షన్ ఆఫ్ పేరెంట్ టూ చైల్డ్ ట్రాన్స్మిషన్ (పీపీటీసీటీ)...హెచ్ఐవీ సోకిన మహిళకు అందించే లోయర్ సెగ్మెంట్ కేసెరీయన్ సెక్షన్ (ఎల్ఎస్పీఎస్) చికిత్సను కొత్తగా యశ స్విని పరిధిలోకి చేరుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సదుపాయం అక్టోబర్ 1 నుంచే అమల్లోకి వస్తుందని పేర్కొంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని 30.36 లక్షల మంది సభ్యులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుత ప్రభుత్వం 13 విభాగాల్లో 805 రకాల శస్త్రచికిత్సలను ఈ పథకం కింద సర్కార్ అందిస్తోంది. కాగా, 2012-13 ఏడాదిలో యశస్విని పథకం కింద 1.10 లక్షల మంది ఔట్పేషంట్లకు చికిత్స అందించగా, 83,802 మందికి వివిధ రకాల శస్త్ర చికిత్సలు నిర్వహించారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని 492 ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందడానికి అవకాశం ఉంది. -
అనారోగ్యానికి ఆనవాళ్లు... మూత్రపిండాల్లో రాళ్ళు
మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్ళకు సరైన చికిత్స కనుక అందించకపోతే వాటి పనితీరు మందగించి మూత్రపిండాల వ్యాధికి కారణమవుతాయి. దానితో మూత్రపిండాల వడపోత సామర్థ్యం తగ్గి రోగి ఆరోగ్యం ఇంకా దిగజారుతుంది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకుండా హోమియో చికిత్సను అందిస్తే కిడ్నీరాళ్ల సమస్యను నివారించవచ్చు. కిడ్నీలో రాళ్ళు ఏర్పడడానికి కారణాలు: ఈ సమస్య స్త్రీ, పురుష, వయోపరిమితితో నిమిత్తం లేకుండా రావచ్చు. శారీరకశ్రమ తక్కువగా ఉండడం. రోజూ తగినంత నీళ్ళు తాగకపోవడం, గౌట్ రకం కీళ్ళవ్యాధి, వంశపారంపర్యత, స్థూలకాయం, శరీరంలో రాళ్ళు ఏర్పడే లక్షణం ఉండడం, చలికాలం, మద్యపానం ముఖ్యకారణాలు. సికెడి (దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి), పుట్టుక నుండి ఒకటే కిడ్నీ ఉండడం లేదా చిన్న కిడ్నీలు ఉండడం, పిసికెడి (పాలిసిస్టిక్ కిడ్నీ డిసీస్) లాంటి కిడ్నీ వ్యాధులతో బాధపడేవారు తక్కుగా నీళ్ళు తాగాల్సి ఉంటుంది. అందువల్ల వీరిలో కూడా కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. లక్షణాలు: మూత్రపిండాలు నడుము భాగంలో వెన్నెముకకు ఇరువైపులా ఉంటాయి. అందువల్ల నొప్పి ఈ ప్రాంతంలో మొదలై పొత్తికడుపు వరకు పాకుతుంది. మూత్రవిసర్జన సమయంలో నొప్పి తీవ్రత పెరుగుతుంది. మూత్రవిసర్జన తరచు చేయాల్సి రావడం, మూత్రం తక్కువ పరిమాణంలో, మంటగా రావడం, మూత్రం పసుపురంగు లేదా ఎరుపురంగులో రావడం, కడుపులో నొప్పి, వికారం, ఆకలి తగ్గిపోవడం, మలవిసర్జనకు వెళ్ళాల్సి వచ్చినట్లుండటం, తరచుగా వాంతులు అవడం, జ్వరం రావడం. రాళ్ళు ఏర్పడే ప్రదేశాలు: 1. మూత్రపిండాలు- వీటిల్లో ఒకటి కంటే ఎక్కువ రాళ్ళ పెద్ద పరిమాణంలో ఉన్నప్పుడు కిడ్నీ పనితీరుపై ప్రభావం ఏర్పడుతుంది. 2. మూత్రనాళాలు- వీటిలోని రాళ్ళు మూత్రనాళాలను మూసివేయడం ద్వారా కిడ్నీలో మూత్రం నిండిపోయి వాపు వస్తుంది. సమస్య ముదిరితే కిడ్నీలకు ఇన్ఫెక్షన్ సోకడం లేదా వాటి పనితీరు తగ్గడం 3. మూత్రాశయంలోని రాళ్ళు మూత్రవిసర్జనకు అడ్డురావడం వల్ల మూత్రం చుక్కలు చుక్కలుగా ఎరుపురంగులో తీవ్రమైన నొప్పి, మంటతో ఉంటుంది. 4. కొందరిలో కుడివైపు, కొందరిలో ఎడమవైపు, మరికొందరిలో రెండువైపులా స్టోన్స్ తయారవవచ్చు. ఒకటి లేదా అంత కంటే ఎక్కువరాళ్ళు ఏర్పడవచ్చు. వీటి పరిమాణం ఒకటి నుంచి 15 మి.మీ. వరుకు ఉండే అవకాశం ఉంది. వీటిని పరిగణనలోకి తీసుకుంటూ చికిత్స అందించడం ద్వారా మంచి ఫలితాలను అందించవచ్చు. నిర్థారణ పరీక్షలు: సిబిపి, సియుఇ, ఇఎస్ఆర్, స్కాన్ అబ్డామెన్, ఎక్స్‌రే-కెయుబి, ఐఐపి, యూరియా, క్రియాటిన్ మొదలగు పరీక్షల ద్వారా రాయి పరిమాణం, అది ఏర్పడిన ప్రదేశం, మిగతా మూత్రవిసర్జన వ్యవస్థపై స్టోన్స్ ప్రభావాన్ని తెలుసుకోవడం ద్వారా సరియైన చికిత్స అందించగలం. నివారణ మార్గాలు: రోజు శారీరక వ్యాయామం, నడక ఉండడం, నాలుగు నుంచి ఐదు లీటర్ల మంచినీళ్ళు తాగడం, మద్యపానానికి దూరంగా ఉండడం, ఆక్సలేట్ ఎక్కువగా ఉండే పాలకూర, టమోటా, సోయాబీన్, చాక్లెట్లను వీలైనంతగా తగ్గించడం ద్వారా స్టోన్స్ సమస్య రాకుండా, పెరగకుండా నివారించవచ్చు. చిన్నపిల్లలు, ఎదిగే వయసు పిల్లలు తరచూ ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే వారిలో ఆకలి తగ్గి, జీర్ణక్రియ మందగించడం, తద్వారా వారి శారీరక, మానసిక ఎదుగుదల దెబ్బతింటుంది. సమస్యను తొలిదశలో గుర్తించి, సమూలంగా వ్యాధిని నిర్మూలించే చికిత్స తీసుకోవడం ఉత్తమ మార్గం. హోమియో చికిత్స: హోమియో వైద్య విధానంలో రాళ్ళను ఆపరేషన్ అవసరం లేకుండా కరిగించడమే కాకుండా, అవి మళ్ళీ తయారవకుండా చేయగలిగే చికిత్స అందుబాటులో ఉంది. హోమియో మందులకు ఎటువంటి దుష్ర్పభావాలు ఉండకపోవడం వల్ల అన్ని వయసుల వారికి ఇది మంచి విధానం, నిపుణులైన హోమోయోకేర్ వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడితే ఆపరేషన్ అవసరం లేకుండా సమస్యను సమూలంగా, శాశ్వతంగా నివారించవచ్చు. డాక్టర్ ఎం. శ్రీకాంత్, సి.ఎం.డి., హోమియోకేర్ ఇంటర్నేషనల్