భారత్‌లోనూ 3డీ బాడీపార్ట్స్‌ | India enters age of 3D printed body parts | Sakshi
Sakshi News home page

భారత్‌లోనూ 3డీ బాడీపార్ట్స్‌

Published Mon, Feb 27 2017 2:47 AM | Last Updated on Wed, Apr 3 2019 5:44 PM

భారత్‌లోనూ 3డీ బాడీపార్ట్స్‌ - Sakshi

భారత్‌లోనూ 3డీ బాడీపార్ట్స్‌

తొలి శస్త్రచికిత్స విజయవంతం
గుర్గావ్‌:
3డీ సాంకేతికతతో ప్రింట్‌ చేసిన శరీర భాగాలు త్వరలో భారత్‌లోనూ అందుబాటులోకి రానున్నాయి. వైద్య రంగంలో ఇది పెను మార్పులను తీసుకురానుందని డాక్టర్లు చెబుతున్నారు. ఇప్పటికే ఈ సాంకేతికతతో ఒక శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక టీచర్‌కు వెన్నెముకలోని మూడు వెన్నుపూసలు పాడవగా, 3డీ ప్రింటింగ్‌ సాంకేతికతను ఉపయోగించి టైటానియం ఇంప్లాంట్‌లను రూపొందించి ఆమె వెన్నెముకలో వైద్యులు అమర్చగలిగారు.

ఈ నెల మొదట్లో నోయిడాలోని మెడ్‌సిటీలో ఈ శస్త్రచికిత్స జరిగింది. సర్జరీ చేసిన నాలుగు రోజులకే ఆమె నడవగలిగిందనీ, సాధారణ పద్ధతిలో అయితే ఆమె కాలి నుంచి ఎముకను సేకరించి వెన్నెముకలో అమర్చాల్సి రావడంతోపాటు ఆరు నెలలపాటు ఆమె మంచానికే పరిమితం కావాల్సి వచ్చేదని వైద్యులు తెలిపారు. ఈ తరహా శస్త్రచికిత్స భారత్‌లో మొదటిదనీ, ప్రపంచంలో మూడవదని సర్జరీ చేసిన వైద్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement