
చిన్నారి దానీష్
కళ్యాణదుర్గం రూరల్: దీపావళి పండుగ రోజున 12 నెలల చిన్నారి ప్రాణం కాపాడి ఆ కుటుంబంలో నిజమైన దీపావళి వెలుగులు నింపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. అనంతపురం జిల్లా కుందుర్పి మండల కేంద్రానికి చెందిన కె.అన్వర్‌బాషా కుమారుడు దానీష్ శనివారం ఇంట్లో ఆడుకుంటూ వేరుశనగ విత్తనం మింగాడు. అది కాస్తా ఊపిరితిత్తుల్లోకి చేరడంతో శ్వాస ఆడక తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు విషయాన్ని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్ దృష్టికి తీసుకెళ్లారు.
ఆమె ఈ విషయాన్ని సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన సీఎం.. చిన్నారికి అవసరమైన వైద్యసేవలు అందించాలని హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రి యాజమాన్యాన్ని ఆదేశించారు. దీంతో అక్కడి వైద్యులు శస్త్రచికిత్స చేసి చిన్నారి ప్రాణాలను కాపాడారు. రూ.2 లక్షలు విడుదల చేసి తన కుమారుడి ప్రాణాలు కాపాడిన సీఎం వైఎస్ జగన్, ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్‌కు రుణపడి ఉంటామని అన్వర్‌బాషా దంపతులు ‘సాక్షి’తో చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment