ఆంకిలోజింగ్ స్పాండిలోసిస్
ఇది దీర్ఘకాలికంగా బాధించే సమస్య. ఇది ముఖ్యంగా కీళ్ళు, వెన్నెముక, తుంటి భాగంలో రావచ్చు. ముఖ్యంగా 18-30 ఏళ్ల యుక్తవయసులో వారికి ఈ సమస్య తలెత్తినప్పుడు కీళ్లు, మెడ బిగుసుకుపోతాయి. ఈ వ్యాధి పురుషుల్లో 3:1 నిష్పత్తిలో కనిపిస్తోంది. 40% కేసులలో కళ్లు ఎర్రబడటం, ఫొటోఫోబియా వంటి లక్షణాలు ఉంటాయి. దీనినే రుమటాయిడ్ స్పాండిలైటిస్ అంటారు. వెన్నెముకకు సోకే ఆర్థరైటిస్‌లో ఇదో రకం. దీనివల్ల వెన్నుపూసల మధ్య వాపు ఏర్పడుతుంది.
ఇది ఆటోఇమ్యూన్ వ్యాధి .అనగా సాధారణంగా మీ శరీరాన్ని ఇన్‌ఫెక్షన్‌ల నుంచి రక్షించే ఇమ్యూనిటీ వ్యవస్థ మీ శరీరంలోని కణజాలాన్ని నాశనం చేస్తుంది. ఇది పురుషులలో సాధారణంగా ఎక్కువ తీవ్రతతో వస్తుంది. ఇది జన్యుపరంగా వస్తుంది. నడుమునొప్పి, కీళ్లు బిగుసుకుపోవడం ముందుగా కన్పించే లక్షణాలు. ఈ సమస్య ఎక్కువగా లేట్ అడాల్సెన్‌స లేదా ఎర్లీ అడల్ట్‌హుడ్‌లో మొదలవుతుంది. కొన్ని రోజులు గడిచాక వెన్నుపూసలు కలసిపోయి కదిలికను తగ్గిస్తుంది. ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయడం సాధ్యం కాదు కానీ మందుల ద్వారా నొప్పి, వాపు, ఇతర లక్షణాలను తగ్గించవచ్చు. వ్యాయామం కూడా ఉపయోగపడుతుంది.
ఆంకిలోజింగ్ స్పాండిలైటిస్‌కు కారణం ఏమిటి ?
సరైన కారణం తెలియదు, కానీ జన్యువులు ముఖ్యపాత్ర పోషిస్తాయి. చాలామందిలో జన్యు వు ఉత్పత్తి చేసే జెనెటిక్ మార్కర్ ఉంటుంది. దీనిని ‘ప్రొటీన్ హెచ్‌ఎల్‌ఏ-బీ27’ అంటారు. యూరోపియన్ యాన్సెస్ట్రీ జనాభాలో ఆంకిలోజింగ్ స్పాండిలైటిస్ కలిగిన వారిలో 95% మందిలో ఈ మార్కర్‌ను గుర్తించారు. దీనితో పాటు వాతావరణ కారకాలు, బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ వంటివి కూడా ఆంకిలోజింగ్ స్పాండిలైటిస్ రావడాన్ని ప్రేరేపిస్తాయి. మామూలు జనాభాలో 8% మందిలో ఇది సాధారణ జన్యువు. ఈ జన్యువు కలిగిన వారిలో 2% మందిలో మాత్రమే స్పాండిలైటిస్ వచ్చే అవకాశం ఉంది.
మా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా స్పాండిలైటిస్‌తో బాధపడుతున్నట్లయితే, నాకు హెచ్‌ఎల్‌ఏ-బీ27 పాజిటివ్ వచ్చినట్లయితే ఎంతవరకు నాకు స్పాండిలైటిస్ వచ్చే అవకాశం వుంది?
మీ ఇంట్లో ఎవరికైనా స్పాండిలైటిస్ వుండి మీకు హెచ్‌ఎల్‌ఏ-బి27 జన్యువు ఉన్నట్లయితే మీ వయస్సు 40 సంవత్సరాల లోపు ఉన్నట్లయితే మీకు స్పాండిలైటిస్ వచ్చే అవకాశం 20% ఎక్కువ. మీరు 40 సంవత్సరాలకు పైబడిన వయసు ఉన్నట్లయితే, స్పాండిలైటిస్ వచ్చే అవకాశం చాలా తక్కువ. మీకు ఆంకిలోజింగ్ స్పాండిలైటిస్ ఉన్నట్లయితే అది మీ పిల్ల్లలకు చేరే అవకాశం చాలా తక్కువ. తల్లిదండ్రులలో హెచ్‌ఎల్‌ఏ-బీ27 జన్యువు ఇన్‌హెరిటెడ్‌గా ఉంటే అది 50% మంది పిల్లలకి వచ్చే అవకాశం వుంది.
ఆంకిలోజింగ్ స్పాండిలైటిస్ ఎలా నిర్ధారిస్తారు ?
ఫిజికల్ పరీక్షతోపాటు ఎక్స్‌రేలు, వారి మెడికల్ హిస్టరీ, ఇంట్లో ఎవరికైనా ఈ వ్యాధి ఉందా, హెచ్‌ఎ-బి27 జన్యువు కొరకు రక్తపరీక్షల వంటి ఫలితాలపై ఆధారపడి వ్యాధిని నిర్ధారిస్తారు.
దీనిని పూర్తిగా నయం చేయవచ్చునా?
ప్రస్తుతానికి ఉన్న మందులతో ఆంకిలోజింగ్ స్పాండిలైటిస్‌ను పూర్తిగా నయం చేయలేరు. కాని మందుల ద్వారా చికిత్స చేసి లక్షణాలను తగ్గిస్తారు మరియు నొప్పిని మేనేజ్ చేస్తారు. కొన్ని నూతన బయలాజిక్ మందులు వ్యాధి వ్యాపించే వేగాన్ని తగ్గిస్తాయి లేదా ఆపివేస్తాయని కొన్ని పరిశోధనలలో తేలింది. సాధారణంగా చికిత్సలో మందులు, ఎక్స్‌ర్‌సైజు మరియు ఫిజియో థెరపీ, మంచి పాశ్చర్‌ను అలవాటు చేయించడం ఉంటాయి.
వాడదగిన హోమియో మందులు: కాల్కేరియా ఫాస్, ఆరమ్, సైలీషియా, ఫాస్పరస్, ఫాస్పరిక్ ఆసిడ్, నేట్రమ్ కార్‌బ, లైకోపోడియం, పల్సటిల్లా, నక్స్‌వామికా