Autoimmune Disease
-
చిలీని వణికిస్తున్న వింత వైరస్! అల్లాడుతున్న జనం, లక్షణాలివే
శాంటియాగో: గిలాన్ బరే (జీబీఎస్) అని పిలిచే అరుదైన సిండ్రోమ్ ఒకటి దక్షిణ అమెరికా దేశం చిలీని నిలువునా వణికిస్తోంది. ఈ వింత వ్యాధి బారిన పడి జనం అల్లాడుతున్నారు. అసలేం చేయాలో ప్రభుత్వానికే పాలుపోవడం లేదు. చివరికి దేశవ్యాప్తంగా ఏకంగా మూడు నెలల పాటు ఎమర్జెన్సీ విధించాల్సి రావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది... ఏమిటీ జీబీ సిండ్రోమ్? ఒంట్లోని వ్యాధి నిరోధక శక్తే నరాల వ్యవస్థను శత్రువుగా భావించి దాడికి దిగే అత్యంత అరుదైన (ఆటో ఇమ్యూన్) సిండ్రోమ్ ఇది. నరాలపై ఈ దాడి చివరికి ఒంట్లోని కండరాల వ్యవస్థ మొత్తాన్నీ పూర్తిగా నిర్విర్యం చేస్తుంది. దాంతో విపరీతమైన నిస్సత్తువ, అవయవాలు మొద్దుబారడం వంటి దుర్లక్షణాలు వేధిస్తాయి. ఇది సాధారణంగా కాళ్లలో మొదలై నెమ్మదిగా పైకి పాకుతూ ఒళ్లంతా ఆక్రమిస్తుంది. జీబీఎస్ బాగా ముదిరితే పక్షావాతానికి కూడా దారి తీస్తుందని జిన్ హువా వార్తా సంస్థ పేర్కొంది. పెద్దవాళ్లకు, ముఖ్యంగా మగవాళ్లకు ఇది ఎక్కువగా సంక్రమిస్తుంది. అయితే అన్ని వయసులవారికీ దీనితో రిస్కే! కరోనాతోనూ వస్తుంది...! జీబీ సిండ్రోమ్ ఎందుకు వస్తుందన్న దానిపై ఇప్పటికైతే స్పష్టత లేదు. తరచూ ఇన్ఫెక్షన్లు, ముఖ్యంగా కాంపిలోబాక్టర్ జెజునీ బ్యాక్టీరియా ఈ సిండ్రోమ్‌కు కారణంగా మారుతున్నట్టు మాత్రం తేలింది. అయితే ఇన్ఫ్లుయెంజా, సైటోమెగలూ, ఎప్‌స్టెయిన్ బర్తో పాటు కోవిడ్ వైరస్ కూడా జీబీఎస్‌కు దారి తీసే ప్రమాదం పుష్కలంగా ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తుండటం కలవరానికి గురి చేస్తోంది! గుర్తించడమెలా? ప్రధానంగా రోగ లక్షణాలు, నరాల పరీక్ష ద్వారా జీబీఎస్ ఉనికి బయట పడుతుంది. ముఖ్యంగా స్పైనల్ టాప్, ఎలక్ట్రోమియోగ్రఫీ వంటివి దీన్ని కచి్చతంగా పట్టిస్తాయి. ఇవీ లక్షణాలు... జీబీఎస్ తాలూకు అత్యంత ప్రధాన లక్షణం విపరీతమైన నీరసమని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరొలాజికల్ డిజార్డర్స్ అండ్ స్ట్రోక్ వెల్లడించింది. తొలి దశలో మెట్లెక్కుతుంటేనో, నడుస్తుంటేనో కూడా విపరీతమైన నీరసం రావడాన్ని దీని తొలి లక్షణంగా భావించవచ్చు. తర్వాతి దశలో శ్వాసప్రక్రియను నియంత్రించే కండరాలు బాగా బలహీనపడతాయి. ఎంతలా అంటే, మెషీన్ సాయంతో ఊపిరి తీసుకోవాల్సి కూడా రావచ్చు! ఈ లక్షణాలు తలెత్తిన రెండే రెండు వారాల్లో సమస్య బాగా ముదిరి రోగిని కదల్లేని స్థితికి చేరుకుంటాడు! నరాలు బాగా దెబ్బ తింటాయి గనుక నరాల వ్యవస్థ నుంచి మెదడుకు అస్తవ్యస్త సంకేతాలు అందుతుంటాయి. దాంతో చర్మం లోపల పురుగులు పాకుతున్నట్టు చెప్పలేని బాధ సలుపుతుంటుంది. ఇతర లక్షణాలు ♦ చూపు తగ్గడం, కంటి కండరాలు దెబ్బ తినడం..మాట్లాడటం, నమలడం, మింగడం కష్టంగా మారడం ♦ చేతులు, అరికాళ్లలో సూదులతో గుచ్చుతున్నట్టు విపరీతమైన బాధ ♦ విపరీతమైన ఒళ్లు నొప్పులు, ముఖ్యంగా రాత్రిపూట ♦ శారీరక, మానసిక సమన్వయ లోపం, నిలకడలేమి ♦ హృదయస్పందన, రక్తపోటు విపరీతంగా పెరిగిపోవడం ♦ జీర్ణాశయ, పిత్తాశయ సంబంధిత సమస్యలు చికిత్స ఉందా? జీబీఎస్‌కు ఇప్పటికైతే ఇదమిత్థంగా చికిత్స అంటూ ఏమీ లేదు. సమస్య తీవ్రతను తగ్గించి, త్వరగా కోలుకునేందుకు సాయపడే మార్గాలు మాత్రమే ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి. దీనికి ప్రధానంగా వాడుతున్న చికిత్స ఇంట్రావీనస్ ఇమ్యునోగ్లోబులిన్ (ఐవీఐజీ). నరాలపై దాడికి దిగకుండా రోగ నిరోధక శక్తిని ఇది నియంత్రిస్తుంది. - సాక్షి, నేషనల్ డెస్క్ -
అరుదైన వ్యాధితో చికిత్స తీసుకుంటున్న సమంత.. ఎమోషనల్ పోస్ట్
స్టార్ హీరోయిన్ సమంత కొంతకాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో ఆమె ఆరోగ్యంపై రకరకాల రూమర్స్ తెరపైకి వచ్చాయి. కానీ ఇంతవరకు సామ్ ఆ వార్తలపై స్పందించలేదు. కానీ తొలిసారిగా సమంత తన ఆరోగ్యంపై మాట్లాడింది. తాను అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు పేర్కొన్న సామ్ చికిత్స తీసుకుంటున్న ఓ ఫోటోను షేర్ చేసింది. ''యశోద ట్రైలర్‌కి మీ రెస్పాన్స్ చూసి చాలా సంతోషమనిపించింది. మీ అందరి ప్రేమ, అనుబంధమే లైఫ్ నాకు ఇస్తున్న సవాళ్లను ఎదుర్కొనేలా చేస్తుంది. కొన్ని నెలల నుంచి ‘మయోసిటిస్’ Myositis( కండరాల బలహీనత) అనే వ్యాధితో బాధపడుతున్నాను. ఈ విషయాన్ని పూర్తిగా రికవర్ అయ్యాక మీతో చెబుదాం అనుకున్నాను. కానీ నేను అనుకున్నదానికంటే ఎక్కువ సమయం పడుతుంది. మనం ఎప్పుడూ స్ట్రాంగ్‌గా ముందుకు వెళ్లలేమని రియలైజ్ అయ్యాను. నేను త్వరలోనే కోలుకుంటానని డాక్టర్స్ కాన్ఫిడెన్స్‌గా చెబుతున్నారు. ఫిజికల్‌గా, ఎమోషనల్‌గా నాకు మంచి రోజులు, అలాగే చెడు రోజులు ఉన్నాయి. నేను ఇదంతా హ్యాండిల్ చేయలేనేమో అని అనుకున్నసందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఎలాగో ఆ క్షణాలు గడిచిపోయాయి. నేను పూర్తిగా కోలుకునే రోజు దగ్గరలోనే ఉందని ఆశిస్తున్నాను లవ్ యూ'' అంటూ ఎమోషనల్ పోస్టును షేర్ చేసింది సామ్. ఈ పోస్ట్ చూసిన వారు 'గెట్ వెల్ సూన్ సామ్' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
కలవరపరిచే కీళ్లనొప్పి.. రుమటాయిడ్ ఆర్థరైటిస్
హోమియో కౌన్సెలింగ్ నాకు కీళ్లలో విపరీతమైన నొప్పిగా ఉంది. ఏమాత్రం కదిలినా నొపి తీవ్రమవుతోంది. కీళ్ల కదలికలు చాలా కష్టంగా ఉన్నాయి. ప్రత్యేకంగా ఉదయం వేళలో ఈ నొప్పి మరీ ఎక్కువగా ఉంది. నా సమస్యకు హోమియోలో పరిష్కారం ఉందా? దయచేసి వివరంగా చెప్పండి. – నరసింహారావు, వరంగల్ మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. ఇది ఒక ఆటోఇమ్యూన్ వ్యాధి. అంటే మన శరీర భద్రతావ్యవస్థ మనపైనే ప్రతికూలంగా పనిచేయడం వల్ల వస్తుంది. ఈ వ్యాధి చిన్న ఎముకలు, కీళ్లు, మెడ ఎముకలు వంటి చోట్ల వచ్చే అవకాశం ఉంది. కీళ్ల చుట్టూ ఉండే పొరలో వాపు వచ్చి అక్కడి కణాలు పెద్దగా మారి, అక్కడ స్రవించే ద్రవపదార్థాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. దానివల్ల ఎముకలు దెబ్బతిని, కీళ్లు బిగపట్టినట్లు అవుతుంది. దాంతో కదలికలు కష్టంగా మారతాయి. లక్షణాలు ►కీళ్ల వాపు, నొప్పి, కదలికలు కష్టంగా మారతాయి. ►ఉదయం లేచిన వెంటనే కీళ్లు బిగబట్టినట్లుగా ఉండి, నొప్పి ఎక్కువగా వస్తుంది. ►కీళ్లు దెబ్బతినడం వల్ల చేతి వేళ్లు కొంకరపోవడం, స్వాన్నెక్ డిఫార్మిటీ, జడ్ థంబ్ డిఫార్మిటీ వంటి లక్షణాలు కనిపిస్తాయి. ►మడమ, చేతి ఎముకలపై చిన్న గడ్డలు రావచ్చు. ►నీరసం, అలసట, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇతర లక్షణాలు ►వ్యాధి తీవ్రస్థాయికి చేరినప్పుడు కీళ్లనే కాకుండా ఊపిరితిత్తుల్లో నీరు పట్టడం, ఊపిరితిత్తులు గట్టిపడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ►మూత్రపిండంలోని నెఫ్రాన్స్ పొరులు వాచి మూత్ర సమస్యలు రావచ్చు. ► గుండె పొరల వాపు, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం, గుండెపోటు వంటి సమస్యలు రావచ్చు. ►కంటి పొరల వాపు, కాలేయం వాపు, రక్తహీనత, నరాల సమస్యలు వంటివి వచ్చే అవకాశం ఉంది. వ్యాధి నిర్ధారణ పరీక్షలు : ► రక్తపరీక్షలు (సీబీపీ), ఈఎస్ఆర్ ►ఎమ్మారై జాయింట్స్ ►కీళ్ల ఎక్స్–రే (దీనితో వ్యాధి తీవ్రతను తెలుసుకోవచ్చు) ►రుమటాయిడ్ ఫ్యాక్టర్ ►క్రియాటివ్ ప్రోటీన్ ’ రీనల్ ఫంక్షన్ టెస్ట్ ’ లివర్ ఫంక్షన్ టెస్ట్ ’ ఏసీపీఏ టెస్ట్‌తో మన శరీరంలో ఈ వ్యాధి వచ్చే అవకాశాలను తెలుసుకోవచ్చు. హోమియో చికిత్స ఈ సమస్యకు హోమియోలో కాల్చికమ్, ఆర్సినికమ్ ఆల్బమ్, లైకోపోడియమ్, రోడోడెండ్రాన్ వాడదగిన మందులు. అయితే లక్షణాలను బట్టి నేట్రమ్ ఆర్స్, డల్కమెరా, కాలిఅయోడ్, నాట్రమ్మూర్, ఆసిడ్ బెంజ్, రస్టాక్స్ వంటి మందులు కూడా ఉపశమనానికి బాగా ఉపయోగపడతాయి. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డిఎండీ (హోమియో) స్టార్ హోమియోపతిహైదరాబాద్ -
ఆంకిలోజింగ్ స్పాండిలోసిస్
ఇది దీర్ఘకాలికంగా బాధించే సమస్య. ఇది ముఖ్యంగా కీళ్ళు, వెన్నెముక, తుంటి భాగంలో రావచ్చు. ముఖ్యంగా 18-30 ఏళ్ల యుక్తవయసులో వారికి ఈ సమస్య తలెత్తినప్పుడు కీళ్లు, మెడ బిగుసుకుపోతాయి. ఈ వ్యాధి పురుషుల్లో 3:1 నిష్పత్తిలో కనిపిస్తోంది. 40% కేసులలో కళ్లు ఎర్రబడటం, ఫొటోఫోబియా వంటి లక్షణాలు ఉంటాయి. దీనినే రుమటాయిడ్ స్పాండిలైటిస్ అంటారు. వెన్నెముకకు సోకే ఆర్థరైటిస్‌లో ఇదో రకం. దీనివల్ల వెన్నుపూసల మధ్య వాపు ఏర్పడుతుంది. ఇది ఆటోఇమ్యూన్ వ్యాధి .అనగా సాధారణంగా మీ శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించే ఇమ్యూనిటీ వ్యవస్థ మీ శరీరంలోని కణజాలాన్ని నాశనం చేస్తుంది. ఇది పురుషులలో సాధారణంగా ఎక్కువ తీవ్రతతో వస్తుంది. ఇది జన్యుపరంగా వస్తుంది. నడుమునొప్పి, కీళ్లు బిగుసుకుపోవడం ముందుగా కన్పించే లక్షణాలు. ఈ సమస్య ఎక్కువగా లేట్ అడాల్సెన్స లేదా ఎర్లీ అడల్ట్హుడ్లో మొదలవుతుంది. కొన్ని రోజులు గడిచాక వెన్నుపూసలు కలసిపోయి కదిలికను తగ్గిస్తుంది. ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయడం సాధ్యం కాదు కానీ మందుల ద్వారా నొప్పి, వాపు, ఇతర లక్షణాలను తగ్గించవచ్చు. వ్యాయామం కూడా ఉపయోగపడుతుంది. ఆంకిలోజింగ్ స్పాండిలైటిస్‌కు కారణం ఏమిటి ? సరైన కారణం తెలియదు, కానీ జన్యువులు ముఖ్యపాత్ర పోషిస్తాయి. చాలామందిలో జన్యు వు ఉత్పత్తి చేసే జెనెటిక్ మార్కర్ ఉంటుంది. దీనిని ‘ప్రొటీన్ హెచ్ఎల్ఏ-బీ27’ అంటారు. యూరోపియన్ యాన్సెస్ట్రీ జనాభాలో ఆంకిలోజింగ్ స్పాండిలైటిస్ కలిగిన వారిలో 95% మందిలో ఈ మార్కర్‌ను గుర్తించారు. దీనితో పాటు వాతావరణ కారకాలు, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వంటివి కూడా ఆంకిలోజింగ్ స్పాండిలైటిస్ రావడాన్ని ప్రేరేపిస్తాయి. మామూలు జనాభాలో 8% మందిలో ఇది సాధారణ జన్యువు. ఈ జన్యువు కలిగిన వారిలో 2% మందిలో మాత్రమే స్పాండిలైటిస్ వచ్చే అవకాశం ఉంది. మా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా స్పాండిలైటిస్‌తో బాధపడుతున్నట్లయితే, నాకు హెచ్ఎల్ఏ-బీ27 పాజిటివ్ వచ్చినట్లయితే ఎంతవరకు నాకు స్పాండిలైటిస్ వచ్చే అవకాశం వుంది? మీ ఇంట్లో ఎవరికైనా స్పాండిలైటిస్ వుండి మీకు హెచ్ఎల్ఏ-బి27 జన్యువు ఉన్నట్లయితే మీ వయస్సు 40 సంవత్సరాల లోపు ఉన్నట్లయితే మీకు స్పాండిలైటిస్ వచ్చే అవకాశం 20% ఎక్కువ. మీరు 40 సంవత్సరాలకు పైబడిన వయసు ఉన్నట్లయితే, స్పాండిలైటిస్ వచ్చే అవకాశం చాలా తక్కువ. మీకు ఆంకిలోజింగ్ స్పాండిలైటిస్ ఉన్నట్లయితే అది మీ పిల్ల్లలకు చేరే అవకాశం చాలా తక్కువ. తల్లిదండ్రులలో హెచ్ఎల్ఏ-బీ27 జన్యువు ఇన్హెరిటెడ్గా ఉంటే అది 50% మంది పిల్లలకి వచ్చే అవకాశం వుంది. ఆంకిలోజింగ్ స్పాండిలైటిస్ ఎలా నిర్ధారిస్తారు ? ఫిజికల్ పరీక్షతోపాటు ఎక్స్‌రేలు, వారి మెడికల్ హిస్టరీ, ఇంట్లో ఎవరికైనా ఈ వ్యాధి ఉందా, హెచ్ఎ-బి27 జన్యువు కొరకు రక్తపరీక్షల వంటి ఫలితాలపై ఆధారపడి వ్యాధిని నిర్ధారిస్తారు. దీనిని పూర్తిగా నయం చేయవచ్చునా? ప్రస్తుతానికి ఉన్న మందులతో ఆంకిలోజింగ్ స్పాండిలైటిస్‌ను పూర్తిగా నయం చేయలేరు. కాని మందుల ద్వారా చికిత్స చేసి లక్షణాలను తగ్గిస్తారు మరియు నొప్పిని మేనేజ్ చేస్తారు. కొన్ని నూతన బయలాజిక్ మందులు వ్యాధి వ్యాపించే వేగాన్ని తగ్గిస్తాయి లేదా ఆపివేస్తాయని కొన్ని పరిశోధనలలో తేలింది. సాధారణంగా చికిత్సలో మందులు, ఎక్స్ర్సైజు మరియు ఫిజియో థెరపీ, మంచి పాశ్చర్ను అలవాటు చేయించడం ఉంటాయి. వాడదగిన హోమియో మందులు: కాల్కేరియా ఫాస్, ఆరమ్, సైలీషియా, ఫాస్పరస్, ఫాస్పరిక్ ఆసిడ్, నేట్రమ్ కార్బ, లైకోపోడియం, పల్సటిల్లా, నక్స్‌వామికా