
స్టార్ హీరోయిన్ సమంత కొంతకాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో ఆమె ఆరోగ్యంపై రకరకాల రూమర్స్ తెరపైకి వచ్చాయి. కానీ ఇంతవరకు సామ్ ఆ వార్తలపై స్పందించలేదు. కానీ తొలిసారిగా సమంత తన ఆరోగ్యంపై మాట్లాడింది. తాను అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు పేర్కొన్న సామ్ చికిత్స తీసుకుంటున్న ఓ ఫోటోను షేర్ చేసింది.
''యశోద ట్రైలర్‌కి మీ రెస్పాన్స్ చూసి చాలా సంతోషమనిపించింది. మీ అందరి ప్రేమ, అనుబంధమే లైఫ్ నాకు ఇస్తున్న సవాళ్లను ఎదుర్కొనేలా చేస్తుంది. కొన్ని నెలల నుంచి ‘మయోసిటిస్’ Myositis( కండరాల బలహీనత) అనే వ్యాధితో బాధపడుతున్నాను. ఈ విషయాన్ని పూర్తిగా రికవర్ అయ్యాక మీతో చెబుదాం అనుకున్నాను. కానీ నేను అనుకున్నదానికంటే ఎక్కువ సమయం పడుతుంది. మనం ఎప్పుడూ స్ట్రాంగ్‌గా ముందుకు వెళ్లలేమని రియలైజ్ అయ్యాను.
నేను త్వరలోనే కోలుకుంటానని డాక్టర్స్ కాన్ఫిడెన్స్‌గా చెబుతున్నారు. ఫిజికల్‌గా, ఎమోషనల్‌గా నాకు మంచి రోజులు, అలాగే చెడు రోజులు ఉన్నాయి. నేను ఇదంతా హ్యాండిల్ చేయలేనేమో అని అనుకున్నసందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఎలాగో ఆ క్షణాలు గడిచిపోయాయి. నేను పూర్తిగా కోలుకునే రోజు దగ్గరలోనే ఉందని ఆశిస్తున్నాను లవ్ యూ'' అంటూ ఎమోషనల్ పోస్టును షేర్ చేసింది సామ్. ఈ పోస్ట్ చూసిన వారు 'గెట్ వెల్ సూన్ సామ్' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment