
భోపాల్: ఒళ్లు గగుర్లు పొడిచే దృశ్యం. ఓ పెద్దపులి రోడ్డుపై బైఠాయించి పెద్ద శబ్ధం చేస్తూ గర్జీస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో అనురాగ్ అనే ట్విటర్ యూజర్ సోమవారం షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ‘సియోని జిల్లాలో అడవి పులులు రోడ్డుపైకి వచ్చి గర్జించడం ప్రారంభించినప్పుడు!’ అనే క్యాప్షన్‌తో అనురాగ్ ట్వీట్ చేశాడు. ఈ వీడియోకు ఇప్పటి వరకు వేల్లో వ్యూస్ వందల్లో కామెంట్స్ వచ్చాయి. మధ్యప్రదేశ్‌లోని సియోన్ జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. (చదవండి: మూడు కళ్లతో బాబు: నిజమేనా?)
सिवनी जिले में जब जंगल के राजा सड़क पर आकर दहाड़ मारने लगे! @GargiRawat @ndtvindia @ndtv @RandeepHooda @hridayeshjoshi @SrBachchan अमिताभ बच्चन #tiger @OfficeofUT #SaveBirdsServeNature #welcometoindia pic.twitter.com/DWwYvHGdRV
— Anurag Dwary (@Anurag_Dwary) July 14, 2020
సియోల్ బఫర్ జోన్ సమీపంలో పెంచ్ నేషనల్ పార్క్‌కు 25 కిలోమీటర్ల దూరంలో 7వ నేషనల్ హైవేపై రాత్రి సమయంలో పెద్ద పులి బైఠాయించడంతో వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. పెద్దపులి గర్జిస్తూ కోపంగా చూస్తుంటే అక్కడి వారంతా భాయందోళనకు గురయ్యారు. అది ఎక్కడ దాడి చేస్తుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టికుని దానినే గమనిస్తు ఉండిపోయారు. ఈ క్రమంలో కాసేపటికి పులి తనదారిన అది వెళ్లిపోవడంతో అందరూ బ్రతుకు జీవుడా అంటూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ప్రాంతం పెంచ్ నేషనల్ పార్కుకు దగ్గరగా ఉండటంతో రోడ్డుపైకి తరచూ పులులు వస్తుంటాయని స్థానికులు పేర్కొన్నారు.