High way road
-
ఎన్‌హెచ్–544డీ: అనంతపురం టూ గుంటూరు లైన్ క్లియర్
అనంతపురం నుంచి గుంటూరుకు మార్గం సుగమమైంది. నాలుగు లేన్ల జాతీయ రహదారి నిర్మాణానికి అడుగులు పడ్డాయి. 417.91 కిలో మీటర్ల మేర రహదారిని రూ.9 వేల కోట్ల అంచనా వ్యయంతో నిర్మించాలని జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) నిర్ణయించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపాదనల మేరకు ‘ఎన్‌హెచ్–544డీ’ నిర్మాణానికి కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ ఆమోదం తెలిపి, టెండర్లు ఖరారు చేసింది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం నుంచి గుంటూరు వరకు ఎక్స్‌ప్రెస్ వే కోసం ఎన్హెచ్ఏఐ గతంలో ప్రతిపాదించింది. అందుకోసం భారీగా అటవీ భూములను సేకరించాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయి. అటవీ భూములను సేకరిస్తే అంతకు రెట్టింపు భూములు ప్రభుత్వం సేకరించి అటవీ శాఖకు ఇవ్వాల్సి ఉంటుంది. అటవీ భూముల కేటాయింపునకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ 2018లోనే అనుమతులు ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆ ప్రతిపాదన ఆచరణ సాధ్యం కాలేదు. దీంతో రహదారి నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు – అనంత పురం మధ్య ప్రత్యామ్నాయ రహదారి నిర్మాణ ప్రతిపాదనలు రూపొందించింది. అనంతపురం నుంచి కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని ప్రధాన పట్టణాలను అనుసంధానిస్తూ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే ప్రస్తుత ప్రభుత్వం ప్రకాశం జిల్లా గిద్దలూరు, గుంటూరు జిల్లా వినుకొండ మధ్య రహదారి నిర్మాణ పనులను వేగవంతంగా చేస్తోంది. దాన్ని సది్వనియోగం చేసుకుంటూ అనంతపురం, గుంటూరు మధ్య నాలుగు లేన్ల రహదారి నిర్మించాలని ప్రతిపాదనలు చేయగా, కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఆమోదం తెలిపింది. దీంతో అనంతపురం నుంచి గుంటూరు వరకు 417.91 కిలోమీటర్ల నాలుగు లేన్ల జాతీయ రహదారి – 544డీ నిర్మాణానికి మార్గం సుగమమైంది. జిల్లాలో 71.380 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం జరగనుంది. టెండర్లు ఖరారు = మొదటి ప్యాకేజీలో భాగంగా అనంతపురం శివారు పామురాయి నుంచి ముచ్చుకోట వరకు 39.380 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి రూ.684.30 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచారు. ఇందులో అంచనా కంటే 1.12 శాతం తక్కువకు కోట్ చేసిన ఎస్ఆర్సీ ఇన్ఫ్రా డెవలపర్స్ ఎల్–1గా నిలిచి పని దక్కించుకుంది. అంచనా కంటే 0.90 శాతం తక్కువకు కోట్ చేసిన మేఘా ఇంజినీరింగ్ సంస్థ ఎల్–2 గా నిలిచింది. = రెండో ప్యాకేజీలో ముచ్చుకోట నుంచి బుగ్గ వరకు 32 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించేందుకు రూ.738.82 కోట్ల అంచనా విలువతో టెండర్లు పిలిచారు. ఇందులో అంచనా కంటే 0.74 శాతం తక్కువకు కోట్ చేసిన మేఘా ఇంజినీరింగ్ సంస్థ ఎల్–1గా నిలిచి పనులు దక్కించుకుంది. రెండు సంవత్సరాల్లో ఈ పనులు పూర్తిచేయాల్సి ఉంది. జిల్లాలో 71 కిలోమీటర్లు అనంతపురం – గుంటూరు జాతీయ రహదారికి సంబంధించి అనంతపురం జిల్లాలో 71 కిలోమీటర్లు రోడ్డు వేయాల్సి ఉంది. దీనికి సంబంధించిన టెండర్లు ఖరారు అయ్యాయి. త్వరలోనే పనులు మొదలుపెట్టాలి. జిల్లా నుంచి మరికొన్ని జిల్లాలను కలుపుతూ సాగే ఈ రహదారి పూర్తయితే మెరుగైన రవాణా సౌకర్యం ఉంటుంది. –మధుసూదన్‌రావు, ఈఈ, ఎన్హెచ్ఏఐ -
జాతీయ రహదారిపై త్రాచు పాము హల్చల్..
-
జాతీయ రహదారిపై త్రాచు పాము హల్చల్..
సాక్షి, తూర్పుగోదావరి : జిల్లాలోని మామిడికుదురు మండలం పాశర్లపూడి సెంటర్లో ఓ పాము హల్చల్ చేసింది. జాతీయ రహదారి 216పై వచ్చిన త్రాచు పాము సుమారు గంటపాటు కదలకుండా అలాగే ఉండిపోయింది. దీనిని చూసేందుకు జనాలు అధిక సంఖ్యలో గుమిగూడారు. దీంతో రోడ్డుపై ట్రాఫిక్‌కు అంతరాయ ఏర్పడింది. అనంతరం స్థానికులు కొట్టి చంపడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. (భయంకరమైన పామును ఎలా పట్టుకున్నారో చూడండి!) -
హైవేపై పెద్దపులి.. ఊపిరి పీల్చుకున్న వాహనదారులు
భోపాల్: ఒళ్లు గగుర్లు పొడిచే దృశ్యం. ఓ పెద్దపులి రోడ్డుపై బైఠాయించి పెద్ద శబ్ధం చేస్తూ గర్జీస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో అనురాగ్ అనే ట్విటర్ యూజర్ సోమవారం షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ‘సియోని జిల్లాలో అడవి పులులు రోడ్డుపైకి వచ్చి గర్జించడం ప్రారంభించినప్పుడు!’ అనే క్యాప్షన్‌తో అనురాగ్ ట్వీట్ చేశాడు. ఈ వీడియోకు ఇప్పటి వరకు వేల్లో వ్యూస్ వందల్లో కామెంట్స్ వచ్చాయి. మధ్యప్రదేశ్‌లోని సియోన్ జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. (చదవండి: మూడు కళ్లతో బాబు: నిజమేనా?) सिवनी जिले में जब जंगल के राजा सड़क पर आकर दहाड़ मारने लगे! @GargiRawat @ndtvindia @ndtv @RandeepHooda @hridayeshjoshi @SrBachchan अमिताभ बच्चन #tiger @OfficeofUT #SaveBirdsServeNature #welcometoindia pic.twitter.com/DWwYvHGdRV — Anurag Dwary (@Anurag_Dwary) July 14, 2020 సియోల్ బఫర్ జోన్ సమీపంలో పెంచ్ నేషనల్ పార్క్‌కు 25 కిలోమీటర్ల దూరంలో 7వ నేషనల్ హైవేపై రాత్రి సమయంలో పెద్ద పులి బైఠాయించడంతో వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. పెద్దపులి గర్జిస్తూ కోపంగా చూస్తుంటే అక్కడి వారంతా భాయందోళనకు గురయ్యారు. అది ఎక్కడ దాడి చేస్తుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టికుని దానినే గమనిస్తు ఉండిపోయారు. ఈ క్రమంలో కాసేపటికి పులి తనదారిన అది వెళ్లిపోవడంతో అందరూ బ్రతుకు జీవుడా అంటూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ప్రాంతం పెంచ్ నేషనల్ పార్కుకు దగ్గరగా ఉండటంతో రోడ్డుపైకి తరచూ పులులు వస్తుంటాయని స్థానికులు పేర్కొన్నారు. -
‘అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవేకు రూ.100 కోట్లు’
సాక్షి, అమరావతి: అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవే కోసం రూ.100 కోట్లు కేటాయించామని రాష్ట్ర ఆర్అండ్బి శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఆయన సోమవారం ఈ అంశంపై శాసన మండలిలో మాట్లాడారు. అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవేకు అవసరమైన మేరకు మరిన్ని నిధులు కేటాయించేందుకు సిద్థంగా ఉన్నట్లు మంత్రి తెలిపారు. దీనిని అత్యంత ముఖ్యమైన హైవేగా ప్రభుత్వం భావిస్తోందని కృష్ణదాస్ వెల్లడించారు. ఈ హైవే కోసం భూమిని సేకరించాల్సి ఉందని చెప్పారు. దీని నిర్మాణం కోసం ఇప్పటికే భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చామని మంత్రి తెలిపారు. అటవీశాఖ నుంచి కూడా అనుమతులు తీసుకుంటున్నామని కృష్ణదాస్ గుర్తు చేశారు. ట్రాఫిక్ అవసరాలను బట్టి హైవే ఎన్ని లైన్లతో వుండాలనేది పరిగణలోకి తీసుకుంటున్నామని మంత్రి ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. -
హైవే.. సర్వే
ఖమ్మంఅర్బన్: జిల్లాకు మరో జాతీయ రహదారి రానుంది. ఖమ్మం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి వరకు ఈ రహదారి నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా ఓ ఏజెన్సీ బృందం జాతీయ రహదారి నిర్మాణం చేపట్టేందుకు ఫ్యూజిబులిటీ(సాధ్యాసాధ్యాలు) సర్వేకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే సూర్యాపేట–అశ్వారావుపేట జాతీయ రహదారి, వరంగల్ నుంచి ఖమ్మం జిల్లాను కలిపే విధంగా ఒక జాతీయ రహదారి నిర్మాణానికి సర్వే చేసి.. సూర్యాపేట–ఖమ్మం–అశ్వారావుపేట రోడ్డుకు నిధులు మంజూరు చేసి.. భూ సేకరణ చేపట్టిన విషయం విదితమే. తాజాగా మరో జాతీయ రహదారి నిర్మాణం కోసం సర్వే బృందం.. జిల్లాలోని రఘునాథపాలెం మండలం వీవీపాలెం వద్ద నూతన కలెక్టరేట్‌కు కుడివైపున ఓ ఇంజనీరింగ్ కాలేజీ రోడ్డును ఆనుకొని శనివారం సర్వే చేసింది. ఇప్పటికే ఖమ్మం మీదుగా కురవి, మహబూబాబాద్ వరకు, సూర్యాపేట మీదుగా దేవరపల్లి వరకు జాతీయ రహదారి పనులకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం విదితమే. వీటితోపాటు ఖమ్మం మీదుగా ఏపీ రాష్ట్రంలోని అమరావతిని కలుపుతూ జాతీయ రహదారి నిర్మించే చర్యల్లో భాగంగానే ఈ సర్వే చేస్తున్నట్లు తెలిసింది. మంచిర్యాల జిల్లా నుంచి వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం మీదుగా విజయవాడ సమీపంలోని గ్రామం వరకు జాతీయ రహదారి నిర్మించేందుకు ఫ్యూజిబులిటీ సర్వే చేపట్టింది. ఇల్లెందు రోడ్డులోని రఘునాథపాలెం బైపాస్ సమీపం నుంచి వైఎస్సార్ నగర్ కాలనీ సమీపంలోని వీవీపాలెం వద్ద నూతన కలెక్టరేట్ సమీపం నుంచి చింతకాని, బోనకల్ మండలాలను కలుపుతూ విజయవాడ సమీపం వరకు జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించి సర్వే చేపట్టారు. ఖమ్మం నుంచి విజయవాడ సమీపం వరకు 70 కిలో మీటర్ల రహదారి నిర్మాణానికి సర్వే చేపట్టినట్లు బృందం సభ్యులు తెలిపారు. 70 కిలో మీటర్ల పొడవు.. 300 అడుగుల వెడల్పుతో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలను అనుసంధానం చేసే విధంగా జాతీయ రోడ్డు ఉంటుందని తెలిసింది. ఇందుకోసం కోల్‌కతా రాష్ట్రానికి చెందిన జీజీ కంపెనీకి చెందిన సంస్థతో నెల రోజులుగా ఫ్యూజిబులిటీ సర్వే నిర్వహిస్తున్నారు. ఇల్లెందు రోడ్డు రఘునాథపాలెం బైపాస్ నుంచి వీవీపాలెం సమీపంలోని ఇంజనీరింగ్ కాలేజీ సమీపం నుంచి చింతకాని మండలం, బోనకల్ మండలాల మీదుగా సర్వే నిర్వహించారు. జాతీయ రహదారికి అవసరమైన మార్కింగ్ కూడా వేస్తున్నారు. ప్లాట్ల యజమానుల్లో ఆందోళన వీవీపాలెం సమీపంలోని కొత్త కలెక్టరేట్‌ను ఆనుకుని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీ మధ్యలో నుంచి జాతీయ రహదారి నిర్మాణం పేరుతో సర్వే చేస్తుండగా.. విషయం తెలుసుకున్న ప్లాట్ల యజమానులు ఆందోళన చెందుతున్నారు. ఖమ్మం నుంచి అమరావతి వరకు జాతీయ రోడ్డు నిర్మాణం కోసం సర్వే చేస్తున్నారని, సుమారు 300 అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మాణం ఉంటుందని సర్వే బృందం చెబుతోంది. అయితే కలెక్టరేట్ నిర్మాణం పేరుతో గజం రూ.4వేల నుంచి రూ.10వేల వరకు పలుకుతున్న స్థలాల్లో రోడ్డు నిర్మాణం జరిగితే భారీగా నష్టం జరుగుతుందని రియల్ వ్యాపారులు సైతం ఆందోళన చెందుతున్నారు. కాగా.. విషయం తెలుసుకున్న కొందరు ప్లాట్ల యజమానులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్కడికి చేరుకుని సర్వే బృందాన్ని రోడ్డు నిర్మాణంపై ఆరా తీసినట్లు తెలిసింది. -
జడ్చర్ల– కోదాడ..ఇక హైవే
మిర్యాలగూడ : ఆర్అండ్బీ రోడ్డుగా ఉన్న జడ్చర్ల– కోదాడ రోడ్డు ఇక జాతీయ రహదారిగా మారనున్నది. 214 కిలో మీటర్ల మేర ఉన్న రోడ్డు మరింత వెడల్పు కానున్నది. ఆర్అండ్బీ పరిధిలో ఉన్న ఈ రోడ్డు 7 మీటర్ల వెడ్పల్పులో బీటీ ఉంది. కాగా దానిని జాతీయ రహదారిగా గుర్తించడం వల్ల పది మీటర్ల వెడల్పుకు విస్తరించనున్నారు. ఈ జాతీయ రహదారి నిర్మాణానికి గాను కేంద్ర ప్రభుత్వం 1200 కోట్ల రూపాయలు విడుదల చేసింది. రోడ్డు నిర్మాణాన్ని మొత్తం ఐదు ప్యాకేజీలుగా విభజించారు. వాటిలో 510 కోట్ల రూపాయలతో రెండు ప్యాకేజీలు జడ్చర్ల – కల్వకుర్తి, కల్వకుర్తి – మల్లేపల్లి వరకు 94 కిలో మీటర్ల మేర పనులు కొనసాగుతున్నాయి. ఇటీవలనే నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో విస్తరించి ఉన్న మరో మూడు ప్యాకేజీలకు టెండర్లు పూర్తయ్యాయి. మల్లేపల్లి– అలీనగర్ (హాలియా), అలీనగర్ (హాలియా) – మిర్యాలగూడ వరకు 80 కిలోమీటర్ల వరకు 500 కోట్ల రూపాయలతో టెండర్లు ఖరారయ్యాయి. మిర్యాలగూడ – కోదాడ వరకు 40 కిలో మీటర్ల మేర మరో 200 కోట్ల రూపాయలతో టెండర్లు పూర్తయినా కాంట్రాక్టర్‌తో ఒప్పందం కావాల్సి ఉంది. ఎట్టకేలకు టెండర్ల ప్రక్రియ పూర్తి కావడం వల్ల పనులు కూడా త్వరలో చేపట్టనున్నారు. మల్లేపల్లి నుంచి హాలియా వరకు రోడ్డు వెంట ఉన్న చెట్లు, విద్యుత్ స్థంబాలు తొలగించే కార్యక్రమం ప్రారంభమైంది. ఇవీ..ప్యాకేజీలు జడ్చర్ల – కోదాడ జాతీయ రహదారి నిర్మాణానికి గాను కేంద్ర ప్రభుత్వం ఐదు ప్యాకేజీలుగా విభజించి నిర్మాణం చేస్తున్నారు. వాటిలో 94 కిలోమీటర్ల మేర జడ్చర్ల – కల్వకుర్తి, కల్వకుర్తి – మల్లేపల్లి వరకు విభజించారు. మిగతా 120 కిలోమీటర్లను మూడు ప్యాకేజీలుగా విభజించారు. వాటిలో మల్లేపల్లి– హాలియా (అలీనగర్), హాలియా – మిర్యాలగూడ, మిర్యాలగూడ – కోదాడ వరకు విభజించారు. ఒక్కొక్క ప్యాకేజీకి 40 కిలోమీటర్లు ఉండే విధంగా విభజించారు. ఫోర్వే ఉన్న చోటనే డివైడర్లు గతలో ఆర్అండ్బీ రోడ్డుగా ఉన్న జడ్చర్ల నుంచి కోదాడ రోడ్డును జాతీయ రహదారిగా గుర్తించారు. 214 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి నిర్మాణ పనులు చేపట్టనున్నారు. మొత్తం రోడ్డు వంద ఫీట్ల వెడల్పు ఉండే విధంగా నిర్మాణం చేస్తారు. దానిలో 10 మీటర్ల వెడల్పులొనే బీటీ వేస్తారు. ప్రస్తుతం ఆ రోడ్డు 7 మీటర్ల మేర బీటీ ఉండగా దానిని పది మీటర్లకు పెంచుతారు. అందుకని రోడ్డుపై డివైడర్లు ఏర్పాటు చేయరు. ప్రధాన పట్టణాలు ఉన్న చోట నాలుగులైన్ల రోడ్డు నిర్మిస్తారు. నాలుగు లైన్ల రోడ్డు నిర్మించిన చోట మాత్రమే డివైడర్లు ఏర్పాటు చేస్తారు. మిగతా రోడ్డు డివైడర్ లేకుండానే ఉంటుంది. అంతే కాకుండా ఎక్కడ కూడా బైపాస్ రోడ్డు మంజూరు కాలేదు. అందుకని ప్రస్తుతం ఉన్న ఆర్అండ్బీ రోడ్డు మీదుగానే నిర్మాణ పనులు చేపట్టనున్నారు. త్వరలో పనులు ప్రారంభం జడ్చర్ల – కోదాడ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా మల్లేపల్లి నుంచి కోదాడ వరకు 120 కిలోమీటర్లను మూడు ప్యాకేజీలుగా విభజించారు. అందుకు గాను రూ.500 కోట్లతో రెండు ప్యాకేజీలకు టెండర్లు పూర్తయ్యాయి. మరో ప్యాకేజీకి కూడా టెండర్లు చివరి దశలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాగానే పనులు ప్రారంభమవుతాయి. కొన్ని చోట్ల భూములు కోల్పోయిన వారికి కూడా నష్టపరిహారం తప్పనిసరిగా అందుతుంది. – లింగయ్య, ఏఈ, జాతీయ రహదారుల విభాగం -
‘రోడ్డు’పై సూచిక బోర్డులెక్కడ.?
తల్లాడ : నిత్యం రద్దీగా ఉండే రాష్ట్రీయ రహదారిలో సూచిక బోర్డుల ఏర్పాటులో ఆర్అండ్బీ అదికారులు తగిన శ్రద్ధ వహించడం లేదు. దీంతో నిత్యం వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రీయ రహదారిలో వివిధ పట్టణాలను, వాటి దూరాన్ని సూచించే బోర్డులు లేక వాహనదారులు తికమక పడుతున్నారు. కొన్ని చోట్ల ఏర్పాటు చేసిన బోర్డులు శిథిలావస్థకు చేరి పాడై పోయాయి. గతంలో కిలోమీటరుకు కోటి రూపాయల చొప్పున వరగంల్ నుంచి దేవరపల్లి వరకు రాష్ట్రీయ రహదారిని అభివృద్ధి చేశారు. రోడ్డును అభివృద్ది చేసిన తర్వాత ఆర్అండ్బీ అధికారులు బోర్డులను ఏర్పాటు చేశారు. అప్పట్లో ఇవి వాహనదారులకు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయి. అయితే ఏళ్లు గడవటంతో అవి గాలి, వాన, ఎండలకు దెబ్బతిన్నాయి. వాటి ఫోల్స్ కొన్నింటిని దొంగలు ఎత్తుకెళ్లారు. తల్లాడ నుంచి భద్రాచలం, కొత్తగూడెం, సత్తుపల్లి, రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, సూర్యాపేట, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వాహనాలు వెళ్తుంటాయి. భద్రాచలం, కొత్తగూడెం ప్రాంతాల నుంచి హైరరాబాద్ వైపు వెళ్లాలంటే పక్కనే సత్తుపల్లి రోడ్డు ఉంటుంది. ఇక్కడ వాహనాదారులు తికమక పడి ఒక్కోసారి సత్తుపల్లి రోడ్డులో కొద్దిదూరం వెళ్లిన తర్వాత వాహనం ఆపుకొని స్థానికులను అడిగి తెలుసుకొని మళ్లీ వారు వెళ్లాల్సిన రూటుకు పయనిస్తున్నారు. దీంతో సమయం, ఆయిల్ వృథా అవుతోంది. అలాగే ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి ఖమ్మం వైపు నుంచి భద్రాచలం వెళ్లాలంటే సత్తుపల్లి, భద్రాచలం రోడ్ల వద్ద ఎటు వెళ్లాలో తెలియక అయోమయానికి గురౌతున్నారు. సత్తుపల్లి వైపు నుంచి వచ్చే ఇతర జిల్లాలు, రాష్ట్రాల వాహనదారులు కూడా తల్లాడ రింగ్ రోడ్ సెంటర వద్ద ఆలోచించాల్సి వస్తోంది. రాష్ట్రీయ రహదారిలో నాగాపూర్, విశాఖపట్టణం, చత్తీస్ఘడ్, గుంటూరు, రాజమండ్రి, విజయవాడ, వంటి సుదూర ప్రాంతాల నుంచి లారీలు సరుకులతో రాత్రివేళ వెళ్తుంటాయి. సూచించే బోర్డులు సరిగా లేకపోవటంతో అసౌకర్యం కలుగుతోంది. -
ప్రమాదాల హైవే...
తెలంగాణ రాష్ట్ర సరిహద్దు పొందుగల నుంచి పిడుగురాళ్ళ వరకు 37 కి.మీ విస్తరించి ఉన్న అద్దంకి-నార్కెట్‌పల్లి హైవే రక్తమోడుతోంది. ప్రతి ఐదు రోజులకో ప్రమాదం చొప్పున ఈ ఐదు నెలల్లో 25 ప్రమాదాలు జరిగాయి. 28 ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. హైవేపై వాహనాలకు వేగపరిమితి లేకపోవడంతో ప్రమాదాలకు ఆస్కారం ఏర్పడుతోంది. ప్రమాదాల్లో ఎన్నో కుటుంబాల్లో యజమానులు అర్ధంతరంగా తనువు చాలించడంతో ఆ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. హైవే మీదకు వస్తే ఇంటికి తిరిగి వెళ్లేంతవరకూ మనిషి ప్రాణానికి హామీ లేకుండా పోతోంది. ప్రభుత్వం హైవేపై నిర్దిష్టమైన నియమ నిబంధనలు ప్రవేశపెట్టి వేగ నియంత్రణ చేయని పక్షంలో ఈ ప్రాంతంలో ప్రయాణికుల బతుకులకు భద్రత కరువే. దాచేపల్లి,న్యూస్‌లైన్: అద్దంకి-నార్కెట్‌పల్లి హైవే రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారింది. ఐదురోజులకొకసారి ఈ రోడ్డుపై ప్రమాదాలు జరుగుతున్నా యి. నిండుప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. కళ్లుమూసి కళ్లు తెరిచే లోపే ఘోర ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నెల ప్రారంభం నుంచి మే 30 వరకు ఐదు నెలల కాలంలో హైవేపై దాచేపల్లి మండలం పొందుగల గ్రామం నుంచి పిడుగురాళ్ల మధ్య 25కు పైగా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో 28 మంది మృ త్యువాత పడగా మరో 15మంది తీవ్రగాయాల పాలయ్యారు. హైవేలో వెళ్లే వాహనాలు అతివేగంతో వెళ్లడం వలన తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణకు హైవే ఆథారిటీ పోలీ సులు, స్థానిక పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈ రోడ్డుపై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నా యి. దాచేపల్లి మండలం పొందు గల గ్రామం నుంచి పిడుగురాళ్ల వరకు సుమారుగా 37 కిలోమీటర్ల పొడవునా హై వే రహదారి విస్తరించి ఉం ది. ఈ రహదారిపై ఈ ఏడా ది జనవరి నెల ప్రారంభం నుంచి పోలీ సుల రికార్డుల ప్రకారం పరిశీలిస్తే ప్రతి ఐదు రోజుల కొకసారి రోడ్డు ప్రమాదం జరుగుతూనే ఉంది. జనవరి నెలలో వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటోను అతివేగంతో వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఒక మహిళ మృతి చెందింది. ఆటో నిబంధనల ప్రకారం వెళ్తున్నా లారీ మితిమీరిన వేగంతో రావడం వలన ఈ ప్రమా దం సంభవించింది. ఫిబ్రవరిలో శ్రీనగర్‌లో రోడ్డు వెంట నడుస్తున్న వ్యక్తిని లారీ ఢీకొట్టింది. మార్చిలో రోడ్డుపై నడుస్తున్న వ్యక్తిని లారీ అతివేగంతో వచ్చి ఢీకొట్టింది. ఇలా చెప్పుకుంటూపోతే ఇలాంటి సం ఘటనలు ఎన్నో జరిగాయి. ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తులను, రో డ్డుపై నడిచి వెళ్తున్న వ్యక్తులను లారీలు ఢీకొనడం వంటి సంఘటనలు హైవేపై తరచుగా జరుగుతున్నాయి. ఎక్కువగా ఒక లారీని మరో లారీ ఢీకొనడం..ఆటోలను, ద్విచక్రవాహనాలను లారీలు ఢీకొనడం లాంటి సంఘటనలు జరిగి ప్రజలు మృత్యుకౌగిట్లో చిక్కుకుంటున్నారు. ప్రమాదాలకు నిలయం ఈ ప్రదేశాలు.: హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా మండలంలోని ముత్యాలంపాడు రోడ్డు వద్ద, శ్రీనగర్, దాచేపల్లి బస్టాండ్ సెంటర్, పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి వద్ద జరుగుతున్నాయి. శ్రీనగర్ గ్రామం హైవే రోడ్డును ఆనుకుని సుమారుగా కిలోమీటర్‌కు పైగా ఉంటుంది. హైవే నిర్మాణం సమయంలో గ్రామంలో పెడస్ట్రల్ అండర్ ప్రాసెస్ (పీయూపీ)ని నిర్మించేందుకు అధికారులు చర్యలు తీసుకున్న నేపథ్యంలో తమకు పీయూపీ అవసరం లేదని గ్రామస్తులు చెప్పారు. దీంతో నిర్మాణాన్ని ఆపివేసి రోడ్డును మాత్రమే నిర్మించారు. దీంతో ఇక్కడ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దాచేపల్లి బస్టాండ్ సెంటర్లో జనం రద్దీగా ఉంటుంది. ఈ ప్రాంతంలో లారీలు మితిమీరిన వేగంతో వెళ్తూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. దాచేపల్లి నుంచి ముత్యాలంపాడు రోడ్డు వద్ద కూడా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక్కడ పీయూపీ నిర్మాణం చేపట్టిన తరువాత ముత్యాలంపాడులో వెళ్లేందుకు ఇబ్బందిగా ఉందని గ్రామస్తులు చెప్పడంతో 20 మీటర్ల పీయూపీని తొలగించారు. గుంటూరు వైపు నుంచి వచ్చే వాహనాలు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో వస్తుండటం వలన ఇక్కడ కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. పీయూపీ పల్లంలో ఉండడం వలన ఇక్కడ ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారమేర్పడుతోంది. ముత్యాలంపాడు నుంచి వచ్చే వాహనాలు హైవేపై వచ్చే వాహనాలకు కనిపించకపోవడంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. బ్రాహ్మణపల్లి వద్ద కూడా రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. మితిమీరిన వేగంతో వాహనాలు.: హైవేలో వాహనాలు మితిమీరిన వేగంతో వెళ్తున్నాయి. రోడ్డులో ఎక్కడా స్పీడ్‌బ్రేకర్లు లేకపోవడం, రో డ్డు సాఫీగా ఉండడంతో వాహనాల వేగానికి అడ్డూ అదుపులేకుండా పోతోంది. లారీలు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో వె ళ్తుండగా, కారులు 100 నుంచి 120 కి.మీ వేగంతో వెళ్తున్నాయి. బస్సులు కూడా 90 కిలోమీటర్లకు తగ్గకుండా వెళ్తున్నాయి. వాహనాల వేగానికి కళ్లెం వేసి నియంత్రించినట్లయితే రోడ్డు ప్రమాదాలు కొంతవరకు తగ్గే పరిస్థితులు కన్పిస్తున్నాయి. రోడ్డు ప్రమాదాలు జరగకుండా పోలీసులు నిత్యం గస్తీ తిరుగుతూ తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.