
సాక్షి, అమరావతి: అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవే కోసం రూ.100 కోట్లు కేటాయించామని రాష్ట్ర ఆర్అండ్‌బి శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఆయన సోమవారం ఈ అంశంపై శాసన మండలిలో మాట్లాడారు. అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవేకు అవసరమైన మేరకు మరిన్ని నిధులు కేటాయించేందుకు సిద్థంగా ఉన్నట్లు మంత్రి తెలిపారు. దీనిని అత్యంత ముఖ్యమైన హైవేగా ప్రభుత్వం భావిస్తోందని కృష్ణదాస్ వెల్లడించారు. ఈ హైవే కోసం భూమిని సేకరించాల్సి ఉందని చెప్పారు. దీని నిర్మాణం కోసం ఇప్పటికే భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చామని మంత్రి తెలిపారు. అటవీశాఖ నుంచి కూడా అనుమతులు తీసుకుంటున్నామని కృష్ణదాస్ గుర్తు చేశారు. ట్రాఫిక్ అవసరాలను బట్టి హైవే ఎన్ని లైన్లతో వుండాలనేది పరిగణలోకి తీసుకుంటున్నామని మంత్రి ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment