వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ డెమొక్రాట్లకు మళ్లీ షాకిచ్చారు. ఇప్పటికే వృద్ధాప్యం రీత్యా బైడెన్ అధ్యక్ష ఎన్నికల పోటీ నుంచి తప్పుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది.
జూన్27న రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన డిబేట్‌లో బైడెన్ తడబడినప్పటి నుంచి సొంత పార్టీ డెమొక్రాట్లలోనే ఆయన అభ్యర్థిత్వంపై అసమ్మతి మొదలైంది. ఈ నేపథ్యంలో బైడెన్ తన వృద్ధాప్యాన్ని మరోసారి చాటుకునేలా వింతగా ప్రవర్తించారు. తాజాగా ఫిలడెల్ఫియాలోని ఓ చర్చిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాస్టర్ అందరినీ నిల్చోవాల్సిందిగా కోరారు.
పాస్టర్ విజ్ఞప్తి మేరకు అందరూ నిల్చున్నప్పటికీ అక్కడే ఉన్న బైడెన్ మాత్రం కూర్చొనే ఉన్నారు. ఎన్నికల ప్రచార నిధుల సేకరణ కోసం పెన్సిల్వేనియా పర్యటనకు వెళ్లినపుడు ఈ ఘటన జరిగింది. దీంతో అధ్యక్ష ఎన్నికల పోటీకి బైడెన్ సామర్థ్యం మరోసారి ప్రశ్నార్థకంలో పడినట్లయింది. ఈ ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికల తుది పోరు జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment