వారిని శిలువేసి కాల్చి చంపారు | the were shot to death on the Cross in syria | Sakshi
Sakshi News home page

వారిని శిలువేసి కాల్చి చంపారు

Published Wed, Apr 6 2016 5:26 PM | Last Updated on Sun, Sep 3 2017 9:20 PM

వారిని శిలువేసి కాల్చి చంపారు

వారిని శిలువేసి కాల్చి చంపారు

రక్కా: సిరియాలో రక్తపాతం సృష్టిస్తూ బందీలను ఎప్పటికప్పుడు వినూత్నంగా హత్య చేస్తున్న ఐఎస్‌ఐఎస్ టైస్టులు తాజాగా నలుగురు బందీలను శిలువేసి కాల్చి చంపారు. ఏప్రిల్ రెండవ తేదీ నుంచి మూడు రోజుల్లో నలుగురిని చంపిన ఘటనలను వీడియోతీసి మీడియాకు విడుదల చేశారు. ఈ దారుణ సంఘటనలు సిరియా రాజధాని రక్కాలో జరిగినట్లు వీడియోలో తెలిపారు.

సీనియర్ ఇస్లామిక్ స్టేట్ టైస్ట్ అబూ ఇజా అల్ టునిస్ గురించి సమాచారం ఇచ్చారనే ఆరోపణలపై ఇస్లాం టైస్టులు ఇటీవల 35 మందిని అరెస్ట్ చేశారు. వారిలో నుంచి నలుగురిని శిలువేసి హత్య చేశారు. టునిస్ గత బుధవారం రష్యన్లు జరిపిన వైమానిక దాడిలో మరణించాడు. తమ ఆదేశాలను ధిక్కరించారనే ఆరోపణలపై తమ టైస్టులను కూడా హత్య చేస్తున్నారు. గత వారమే 15 మంది టైస్టులను చంపేశారు. రష్యా వైమానిక దాడుల రక్షణలో సిరియా సైన్యం గత నెల రోజులుగా ముందుకు దూసుకొస్తున్నా టైస్టుల ఆగడాలకు మాత్రం తెరపడడం లేదు. సిరియా సైన్యం తాజాగా రక్కాకు సమీపంలోని రెండు పట్టణాలను స్వాధీనం చేసుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement