Raqqa
-
ఐఎస్‌పై కుర్దిష్ మహిళల వీరోచిత పోరాటం..
డమస్కస్ : సిరియాలో నాలుగేళ్లపాటు తిష్టవేసి అనాగరికంగా, ఆటవికంగా పాలన సాగించిన ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులను ఓడించినట్లు సైనిక వర్గాలు ఇటీవల ప్రకటించగానే టెర్రరిస్టులకు వ్యతిరేకంగా విరోచితంగా పోరాడిన కుర్దిష్ మహిళా యోధులు వీధి వీధి తిరుగుతూ ఆనందోత్సవాలను చాటుకున్నారు. టెర్రరిస్టుల ఆధీనంలో ఉన్న రక్కాను తిరిగి స్వాధీనం చేసుకోవడంలో వీరు కీలక పాత్ర పోషించారు. టెర్రరిస్టులు మహిళలను బానిసలుకన్నా అధ్వాన్నంగా చూడడమేకాకుండా వారిని, ముఖ్యంగా యాజిదీ మైనారిటీ మహిళలను సెక్స్ బానిసలుగా చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని కుర్దీష్ మహిళలు ఈ పోరాటంలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. వారిలో 30 మంది మహిళా యోధులు అమరులయ్యారు. తాము ఏ దేశంలో టెర్రరిజం ఏ మూలన ఉన్నా దానికి వ్యతిరేకంగా పోరాడుతామని ఈ సందర్భంగా మహిళాయోధులు శపథం చేశారు. ఈ సందర్భంగా మహిళలను తమ ఆలోచనలను మీడియాతో పంచుకున్నారు. వారిలో శాందా అఫ్రీన్ మాట్లాడుతూ ‘ నాయకుడు అబ్దుల్లా ఒకాలన్ మహిళల స్వేచ్ఛపై దష్టి పెట్టారు. అందుకనే మేము కూడా మహిళల స్వేచ్ఛ కోసం, మానసికంగా ప్రజల విముక్తి కోసం పోరాటం జరిపాం. మా పోరాటం ఒక్క ఐఎస్ఐఎస్కు వ్యతిరేకంగానే కాదు. అన్ని రకాల దుష్ట శక్తులపై మా పోరాటం కొనసాగుతుంది. ఒక్కోసారి మహిళల నుంచి కూడా చెడు ఎదురుకావచ్చు. అలాంటి ఆస్కారం లేకుండా వారు విద్యావంతులు కావాలి. మంచి సిద్ధాంతాన్ని అలవర్చుకోవాలి’ అని చెప్పారు. అబ్దుల్లా ఒకాలన్ కుర్దిస్ధాన్ వర్కర్స్ పార్టీ వ్యవస్థాపకుడు. ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఆయన పార్టీని కూడా టర్కీ, అమెరికా, యూరోపియన్ యూనియన్ కూడా టెర్రరిస్టు పార్టీగా గుర్తిస్తోంది. అయితే ఆయన్ని ఆదర్శంగా తీసుకున్న కుర్దిష్ మహిళా యోధులు మాత్రం ఒకాలన్ చిత్రంగల జెండాను ఎగరేస్తూ వారం క్రితం వీధుల్లో తిరిగారు. ఐఎస్ఐఎస్కు వ్యతిరేకంగా మూడేళ్ల క్రితం యుద్ధం ప్రారంభమైనప్పుడు అవ్రిమ్ డిఫ్రామ్ 17 ఏళ్ల అమ్మాయి. తమ పోరాటంలో ఎంతో మంది మరణించారని, ప్రతి మరణం కూడా తమను మరింత కతనిశ్చయంతో పోరాడేలా చేసిందని ఆమె చెప్పారు. అణచివేత నుంచి ప్రజలను విముక్తం చేసే వరకు, తమ నాయకుడు ఒకాలన్ను విడుదల చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆమె చెప్పారు. 24 ఏళ్ల వులత్ రోమిన్ గత ఏడాదిన్నరగా ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులను వ్యతిరేకంగా పోరాటం జరుపుతున్నారు. ఆమె రక్కా, తబ్కా, హల్హోల్లో పోరాటం జరిపారు. ‘కుర్దిష్ ప్రజల స్వేచ్ఛ కోసం, ముఖ్యంగా మహిళల స్వేచ్ఛ కోసం నేను పోరాటం జరుపుతున్నాను. ప్రజలకు జరిగే ప్రతి అన్యాయంపైనా పోరాటం చేస్తాను’ అని ఆమె చెప్పారు. ఇక సోజ్దార్ డెరిక్ ఆరేళ్లుగా ఐఎస్ఐఎస్ టెర్రిరిస్టులను వ్యతిరేకండా పోరాటం చేస్తున్నారు. ‘మా మహిళలను, మా మాతభూమిపై కొనసాగిస్తున్న అణచివేతకు వ్యతిరేకంగా నేను పోరాడుతున్నాను. మహిళలను సెక్స్ బానిసలుగా, ఉప మానువులుగా చూస్తున్న టెర్రరిస్టులకు వ్యతిరేకంగా పోరాడుతున్నాను’ అని ఆమె వ్యాఖ్యానించారు. -
వారిని శిలువేసి కాల్చి చంపారు
రక్కా: సిరియాలో రక్తపాతం సృష్టిస్తూ బందీలను ఎప్పటికప్పుడు వినూత్నంగా హత్య చేస్తున్న ఐఎస్ఐఎస్ టైస్టులు తాజాగా నలుగురు బందీలను శిలువేసి కాల్చి చంపారు. ఏప్రిల్ రెండవ తేదీ నుంచి మూడు రోజుల్లో నలుగురిని చంపిన ఘటనలను వీడియోతీసి మీడియాకు విడుదల చేశారు. ఈ దారుణ సంఘటనలు సిరియా రాజధాని రక్కాలో జరిగినట్లు వీడియోలో తెలిపారు. సీనియర్ ఇస్లామిక్ స్టేట్ టైస్ట్ అబూ ఇజా అల్ టునిస్ గురించి సమాచారం ఇచ్చారనే ఆరోపణలపై ఇస్లాం టైస్టులు ఇటీవల 35 మందిని అరెస్ట్ చేశారు. వారిలో నుంచి నలుగురిని శిలువేసి హత్య చేశారు. టునిస్ గత బుధవారం రష్యన్లు జరిపిన వైమానిక దాడిలో మరణించాడు. తమ ఆదేశాలను ధిక్కరించారనే ఆరోపణలపై తమ టైస్టులను కూడా హత్య చేస్తున్నారు. గత వారమే 15 మంది టైస్టులను చంపేశారు. రష్యా వైమానిక దాడుల రక్షణలో సిరియా సైన్యం గత నెల రోజులుగా ముందుకు దూసుకొస్తున్నా టైస్టుల ఆగడాలకు మాత్రం తెరపడడం లేదు. సిరియా సైన్యం తాజాగా రక్కాకు సమీపంలోని రెండు పట్టణాలను స్వాధీనం చేసుకున్నాయి. -
'అమెరికా దాడులతో జీతాలు సగానికి కోసేశారు'
అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాల వరుస దాడులతో అతలాకుతలమవుతున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ సిరియాలో తన ఫైటర్ల జీతాలను అమాంతం కోత పెట్టింది. ప్రస్తుతం నెలకొన్న అసాధారణ పరిస్థితుల నేపథ్యంలో ముజాహిద్దీన్ల జీతాలను 50శాతం వరకు తగ్గించింది. ఆపరేషన్ 'టైడల్ వేవ్ 2' పేరిట అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు సిరియాలోని ఐఎస్ఐఎస్ ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు కొనసాగిస్తున్నాయి. ప్రధానంగా ఐఎస్ఐఎస్ చమురు బావులు, చమురు సరఫరా లైన్లు, నగదు దుకాణాలు లక్ష్యంగా దాని ఆర్థిక వనరులను దెబ్బతీయడమే ధ్యేయంగా ఈ దాడులు జరుపుతున్నాయి. వ్యూహాత్మకంగా కొనసాగుతున్న ఈ దాడుల ప్రభావం ఐఎస్ఐఎస్ మీద గణనీయంగా ఉన్నట్టు ఆ గ్రూపు తాజాగా విడుదల చేసిన ఓ పత్రం చాటుతోంది. 'ఇస్లామిక్ స్టేట్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న అసాధారణ పరిస్థితుల నేపథ్యంలో ముజాహిద్దీన్లందరికీ చెల్లిస్తున్న జీతాల్ని సగానికి తగ్గిస్తున్నాం. ఎలాంటి హోదాలో ఉన్నవారికైనా ఈ నిర్ణయం నుంచి మినహాయింపు ఉండదు' అని సిరియా రఖ్కాలోని ఐఎస్ కోశాగార విభాగం 'బేత్ మాల్ అల్ ముస్లిమీన్' ఈ పత్రంలో పేర్కొంది. -
ఐఎస్ వద్దందని అమ్మనే చంపేశాడు
ఎవరికోసమో, ఎందుకోసమో అర్థంకాని పోరాటం వద్దంది. మిగిలిన పేగు బంధం నువ్వొక్కడివే.. ఎక్కడికైనాపోయి బతుకుదాం రమ్మంది. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. తాగింది తల్లిపాలే అయినా మతం మత్తులో నిలువెల్లా కలుషితమైన ఆ కొడుకు.. మాతృమూర్తినే అంతం చేశాడు. ఐఎస్ ది తప్పుడు మార్గం అన్నందుకు సొంత తల్లిని బహిరంగంగా కాల్చేశాడు. సిరియాలోని రక్కా పట్టణంలో ఇటీవల చోటుచేసుకున్న సంచలనాత్మక ఉదంతాన్ని రిబ్స్ సంస్థ వెలుగులోకి తెచ్చింది. లీనా అల్ ఖాసిం (45) రక్కాలోని పోస్ట్ ఆఫీస్ ఉద్యోగిని. విద్యావంతుల కుటుంబంలో పుట్టిన ఆమె.. పిల్లల్ని కూడా ఉన్నతంగా చదివించాలనుకుంది. కానీ విధి మరోలా ఎదురైంది. సిరియాలో ప్రారంభమైన రాజకీయ సంక్షోభం చివరికి ప్రపంచ దేశాల యుద్ధంగా మారి.. ఒక్క కొడుకు తప్ప దాడుల్లో కుటుంబం మొత్తాన్ని పోగొట్టుకుంది. ఇప్పుడు ఆమె కొడుకు అలీ సఖ్ర్ అల్ ఖాసీంకు 20 ఏళ్లు. కొద్ది రోజుల కిందటే అలీ ఐఎస్ఐఎస్ జీహాదీగా మారడం తల్లిని కలవరపర్చింది. ఐఎస్ ను వీడాలంటూ లీనా కొడుకుపై ఒత్తిడి తెచ్చింది. బయటిదేశాలకుపోయి ప్రశాంతంగా బతుకుదామని చెప్పింది. తల్లి తనతో పంచుకున్న విషయాల్ని సీనియర్లకు చేరవేశాడు అలీ. అంతే. లీనా ఇస్లామ్ కు ద్రోహం తలపెట్టిందని, వెంటనే ఆమెకు మరణ దండన అమలుచేయాలని ఆదేశాలు జారీఅయ్యాయి. పట్టపగలు, అందరూ చూస్తుండగా, ఆమె పనిచేసే పోస్టాఫీసు ఎదుటే లీనాను కాల్చిచంపారు ఐఎస్ ఉగ్రవాదులు. ఆమె తలకు గురిపెట్టి తుపాకి పేల్చింది మరెవరోకాదు ఆమె కొడుకు అలీయే. -
మహిళా జర్నలిస్టును చంపేసిన ఐఎస్ఐఎస్
సిరియాలోని రక్కా ప్రాంతంలో పౌర జర్నలిస్టుగా పనిచేస్తూ.. స్థానిక విషయాలను ప్రపంచానికి వెల్లడిస్తున్న ఓ మహిళను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద గ్రూపు అమానుషంగా ఉరి తీసింది. ఐఎస్ఐఎస్ చంపేసిన తొలి మహిళ ఆమెనని సిరియా మీడియా తెలిపింది. రుఖియా హసన్ మరణంతో గత అక్టోబర్ నుంచి ఐఎస్ఐఎస్ చేతిలో ప్రాణాలు కోల్పోయిన విలేకరుల సంఖ్య ఐదుకు చేరిందని సిరియన్ జర్నలిస్టు సంస్థ 'సిరియా డైరెక్ట్' తెలిపింది. ఇస్లామిక్ స్టేట్ అండ్ లెవాంట్ అధీనంలో ఉన్న రక్కా ప్రాంతంలో మానవ దైనందిన జీవితం గురించి రుఖియా హసన్ నిసాన్ ఇబ్రహీం పేరుతో ఫేస్బుక్లో నిత్యం వార్తలు అందించేది. స్వతంత్ర జర్నలిస్టుగా పనిచేస్తున్న ఆమెను ఉరితీయడాన్ని సిరియా మానవ హక్కుల సంస్థ (ఆర్బీఎస్ఎస్) ధ్రువీకరించింది. 'నేను రక్కాలో ఉన్నాను. నన్ను చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయి. ఐఎస్ఐఎస్ నన్ను అరెస్టుచేసి చేసి చంపేయవచ్చు. అయినా ఫర్వాలేదు. ఐఎస్ఐఎస్ అవమానాల మధ్య జీవించడం కంటే హుందాగా చనిపోవడం మేలు' అని ఆమె చివరి వ్యాక్యాలను ఆర్బీఎస్ఎస్ స్థాపకుడు అబు మహమ్మద్ శనివారం ట్విట్టర్లో వెల్లడించారు. రఖ్కా నగరంలో వై-ఫై హాట్స్పాట్లను ఐఎస్ఐఎస్ నిషేధించడాన్ని తన చివరి ఫేస్బుక్ పోస్టులో హసన్ తీవ్రంగా తప్పుబట్టింది. వై-ఫై, ఇంటర్నెట్ సేవలను ఇస్లామిక్ స్టేట్ నిలిపివేసినా.. తమ సందేశాలను మోసుకెళ్లే పావురాళ్లను ఏమీ చేయలేదని పేర్కొన్నారు. హసన్ గత ఏడాది జూలై 21 నుంచి కనిపించడం లేదు. గూఢచర్యం ఆరోపణలపై ఆమెను ఉరితీసినట్టు మూడురోజుల కిందట హసన్ కుటుంబసభ్యులకు ఐఎస్ఐఎస్ సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. -
కొనసాగుతున్న దాడులు: 32 మంది హతం
బీరట్: సిరియాపై.. యూఎస్ ఆధ్వర్యంలోని సంకీర్ణ దళాల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. సిరియాలోని ఇస్లామిక్ స్టేట్స్ ఉగ్రవాద సంస్థ స్థావరాలపై ఆదివారం జరిపిన భీకరదాడుల్లో 32 మందికి పైగా ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు హతమయ్యారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. సిరియాలో గత ఆరు రోజులుగా కొనసాగుతున్న వైమానికి దాడులు రఖ్వా ప్రావిన్స్‌లో భీతావహ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. సిరియాలో ఉత్తర, తూర్పు ప్రాంతాలలో తలదాచుకున్న జిహాదీలను మట్టుపెట్టే లక్ష్యంతో సంకీర్ణ దళాలు భీకరమైన పేలుళ్లకు పాల్పడుతోంది. ఉగ్రవాద సంస్థ స్థావరాలను ధ్వంసం చేస్తోంది. కాగా ఇటీవల దాడుల నేపథ్యలో ఐఎస్ఎస్ ఉగ్రవాదులు.. రఖా వైపుకు పారిపోతున్నట్టు వార్తల నేపథ్యంలో రఖా టార్గెట్‌గా దాడులకు దిగింది. ఇప్పటికే అమెరికా, రష్యా, ఫ్రాన్స్ దేశాలు సిరియాపై భీకరంగా వైమానిక దాడులు చేస్తున్నాయి. పారిస్ ఉగ్రదాడి ఘటన తర్వాత ఆ దాడులను మరింత ముమ్మరం చేశాయి. -
ప్యారిస్‌లో ప్రతీకార జ్వాల