జిల్లాలో ఉగ్రజాడలకు ఆస్కారం లేదని, ప్రజలు ఎటువంటి భయందోళనకు గురికాకూడదని జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
-
ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్
ఆదిలాబాద్ క్రైం : జిల్లాలో ఉగ్రజాడలకు ఆస్కారం లేదని, ప్రజలు ఎటువంటి భయందోళనకు గురికాకూడదని జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ ఒక ప్రకటనలో వెల్లడించారు. జిల్లాలో శాంతిభద్రతలు పూర్తిస్థాయిలో అదుపులో ఉన్నాయని, ప్రజలు నిర్భయంగా ఉండాలని సూచించారు. జిల్లాలో ఎక్కడ ఉగ్రజాలు, మావోయిస్టు కార్యకలాపాలు ఉన్నా ముందస్తుగా తెలుసుకునేందుకు సాంకేతిక పరిజ్ఞానం పోలీసులకు అందుబాటులో ఉందని స్పష్టం చేశారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాణహిత పరివాహక అటవీ ప్రాంతాల నుంచి ఎటువంటి చొరబాట్లు లేకుండా నిరంతరం పోలీసు బలగాలు నిఘా పెడుతున్నాయన్నారు. జిల్లాలో ఉగ్రజాడలు ఉన్నట్లు వచ్చే పుకార్లు ప్రజలు నమ్మకూడదని సూచించారు. జిల్లా ప్రజల రక్షణకు పోలీసు వ్యవస్థ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.