న్యూఢిల్లీ: దేశంలో ఉగ్రకార్యకలపాలను ప్రోత్సహించేందుకు సిక్కు యువత పాకిస్తాన్‌లో ఐసీస్ సౌకర్యాలతో శిక్షణ పొందుతున్నట్టు కేంద్రహోం మంత్రిత్వశాఖ సీనియర్ బీజేపీ నేత మురళీ మనోహర్ జోషితో కూడిన పార్లమెంటరీ కమిటీకి ఓ నివేదికను సమర్పించింది. కెనడా, ఇతర దేశాల్లో నివసిస్తున్న సిక్కు మతానికి చెందిన యువతకు భారత్ పట్ల వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ, హానికర సంఘటనలకు ప్రేరణపొందేలా చేస్తున్నారని నివేదికలో పేర్కొన్నారు.
ఇంటర్నెట్ మరియు సోషల్ మీడియా దుర్వినియోగంతో యవత అత్యధికంగా త్రీవవాద గ్రూపులకు దగ్గరవుతుందన్నారు. సిక్కు మిలిటెంట్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేసుకుంటున్నట్లు తెలిపారు. ఐసీస్ కనుసన్నల్లో శిక్షణ పొందుతున్న కమాండర్స్ పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలతో కలిసి భారత్‌లో ఉగ్ర కార్యకలపాలకు ప్రయత్నిస్తున్నారని నివేదికలో ప్రస్తావించారు.
నిరుద్యోగులు, స్మగ్లర్లు, జైల్లో ఉన్న సిక్కు నేరస్తులను చేరదీసి పాకిస్తాన్‌లో ఐసిస్ సౌకర్యాలతో శిక్షణ ఇస్తున్నట్టు హోం మంత్రిత్వశాఖ నివేదికలో పేర్కొంది. దేశంలో గత కొద్ది రోజులుగా వామపక్ష తీవ్రవాదం పెరిగిపోతుందని, దీనివల్ల దేశ అంతర్గత భద్రతకు ముప్పుందని తెలిపంది. 2004లో ఏర్పడిన సీపీఐ మావోయిస్ట్ అత్యంత శక్తి వంతమైన వామపక్ష తీవ్రవాద సంస్థగా పేర్కొంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా, జైషే మహ్మాద్, ఇండియన్ ముజాహిద్దీన్, సిమీ లాంటి ఉగ్రవాద సంస్థల కదలికలపై భద్రతాధళాలు దృష్టిసారించాయి.
Comments
Please login to add a commentAdd a comment