బనిహాల్/జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో విషాద సంఘటన జరిగింది. ఖుని నల్లాహ్ దగ్గర్లో శనివారం ఓ ఎస్‌యూవీ అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారని అధికారులు తెలిపా రు. లోయలో పడేముందు ఎస్‌యూవీ ఓ కారును ఢీకొందని చెప్పారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సీఆర్‌పీఎఫ్ బలగాలు అక్కడికి చేరుకొని సహాయక కార్యక్రమాలు చేపట్టాయి.
లోయలోకి తాళ్ల సాయంతో బలగాలు దిగాయని రక్షణ శాఖ ప్రతినిధి చెప్పారు. ప్రమాద స్థలంలో ముగ్గురు, మరొకరు ఆస్పత్రికి తరలిస్తుం డగా మరణించారు. మరో మృతదేహాన్ని ఘటనా స్థలానికి కొంత దూరం లో కనుగొన్నారు. మృతులను సీఆర్‌పీఎఫ్ హెడ్‌కానిస్టేబుల్ షగుణ్ కుమార్, వనీత్ కౌర్, గారు రామ్, మహ్మద్ రఫీ, సంజీవ్‌కుమార్‌గా గుర్తించారు. గాయపడిన ఇండియన్ రిజర్వ్ పోలీస్ అజిత్‌కుమార్‌ను జమ్మూకు తరలించారు.
చదవండి: వైద్య సిబ్బంది సాహసం: వ్యాక్సిన్ కోసం నది దాటి
Comments
Please login to add a commentAdd a comment