జమ్మూ: మాజీ కేంద్ర మంత్రి, జమ్మూకాశ్మీర్ సీనియర్ రాజకీయ వేత్త గులాంనబీ ఆజాద్ రాజకీయ అస్త్ర సన్యాసం తీసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు ఆజాద్ బుధవారం(ఏప్రిల్17) ప్రకటన విడుదల చేశారు.
ఈ ఎన్నికల్లో తన పార్టీ డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ ఆజాద్ పార్టీ(డీపీఏపీ) తరపున జమ్మూకాశ్మీర్ అనంత్‌నాగ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనన్నట్లు ఆజాద్ ఇటీవల ప్రకటించారు. ఇంతలోనే పోటీ నుంచి తప్పుకున్నట్లు ఆయన ప్రకటించడం చర్చనీయాంశమైంది.
అనంత్‌నాగ్ నుంచి పీడీపీ పార్టీ తరపున మహబూబా ముఫ్తీ పోటీ చేస్తుండగా ఇండియా కూటమి తరపున నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత అల్తాఫ్ అహ్మద్ బరిలో ఉన్నారు.
ఇదీ చదవండి.. సెల్‌ఫోన్ బిల్లు నెలకు రూ.5 వేలు.. ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment