జమ్మూ: మాజీ కేంద్ర మంత్రి, ఒకప్పటి కాంగ్రెస్ అగ్రనేత గులాంనబీ ఆజాద్ జమ్మూకాశ్మీర్‌లోని అనంత్‌నాగ్-రాజౌరీ సీటు నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగనున్నారు. ఈ విషయాన్ని ఆయన పార్టీ డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ ఆజాద్(డీపీఏపీ) మంగళవారం(ఏప్రిల్ 2) ఒక ప్రకటనలో తెలిపింది. డీపీఏపీ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆజాద్ పోటీపై నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ అధికార ప్రతినిధి సల్మాన్ నిజామీ ఎక్స్(ట్విటర్)లో ప్రకటించారు.
ఇదే నియోజకవర్గం నుంచి నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత మియాన్ అల్తాఫ్ అహ్మద్ పొత్తులో భాగంగా ఇండియా కూటమి తరపున పోటీ చేస్తున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆజాద్ ఉదంపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి జితేంద్రసింగ్ చేతిలో ఓటమి పాలయ్యారు. 50 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆజాద్ ఆ పార్టీకి రాజీనామా చేసి 2022లో డీపీఏపీ పార్టీని స్థాపించారు.
Comments
Please login to add a commentAdd a comment