అనంత్‌నాగ్‌లో 19 మంది పోలీసులకు సోకిన కరోనా
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో 19 మంది పోలీసులకు నిర్వహించిన కరోనా వైరస్ పరీక్షలో పాజిటివ్‌గా తేలింది. మొత్తం 103 మంది సాయుధ పోలీసు బలగాల శాంపిళ్లను పరీక్షించగా 19 మందికి పాజిటివ్ ఫలితం వచ్చింది. అనంత్‌నాగ్‌లోని జిల్లా పోలీస్ లైన్స్ ఆస్పత్రిలో వీరి శాంపిల్స్‌ను పరిశీలించారు. ఇక జమ్ముకశ్మీర్‌లో ఇప్పటివరకూ 1183 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవగా మహమ్మారి బారినపడి 13 మంది మరణించారు.
చదవండి : కరోనా : ఉద్యోగులపై వేటు, క్లౌడ్ కిచెన్స్‌కు బ్రేక్