
న్యూఢిల్లీ: జమ్ము, కాశ్మీర్‌కు చెందిన పోలీసు అధికారి బాబూరామ్ మరణానంతరం అశోక చక్ర అవార్డుకు ఎంపికయ్యారు. గణతంత్ర వేడుకల్లో ఆయన భార్య రీనారాణి, కుమారుడు మాణిక్‌కు రాష్ట్రపతి కోవింద్ అవార్డును అందజేశారు. 2020 ఆగస్టులో శ్రీనగర్‌లో జరిగిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో అసిస్టెంట్ సబ్ ఇనస్పెక్టర్ బాబూరామ్ అమరుడయ్యారు.
ఆరోజు ఆయన చాకచక్యంగా వ్యవహరించి ఉగ్రవాదులున్న ఇంటిపక్క పౌరులను కాపాడారు. అనంతరం ధైర్యంగా ఉగ్రవాదులను పట్టుకునేందుకు ప్రయత్నించి ఎదురు కాల్పుల్లో అమరుడయ్యారు. ఈ సాహసానికి ఆయనకు మరణానంతరం అత్యున్నత గాలెంటరీ పురస్కారం దక్కింది. శౌర్యచక్ర అవార్డు మరణానంతరం సుబేదార్ శ్రీజిత్, హవల్దార్ అనిల్ కుమార్, కాశీరాయ్, పింకు కుమార్, జశ్వంత్ కుమార్ రెడ్డికి దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment