Ashoka Chakra
-
అశోక ధర్మచక్రం ప్రబోధించే విలువల ప్రతిజ్ఞ
సాక్షి, హైదరాబాద్: 76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ‘మేరా భారత్ మహాన్’ అనే కార్యక్రమం క్రింద.. విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ ఓ వైవిధ్యమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మన జాతీయ పతాకంలోని అశోక ధర్మచక్రంలో గల 24 ఆకులు సూచించే 24 ధార్మిక విలువలను పాటిస్తూ, దేశ పురోభివృద్ధికి పాటుపడుతూ ఆదర్శవంతమైన జీవితం గడుపుతాము అని విద్యార్థులచే సామూహిక ప్రతిజ్ఞ నిర్వహింపజేస్తోంది. ఆగస్టు 14వ తేదీ ఉదయం 9-10 గంటల మధ్య జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు పాల్గొనేలా తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సహకరిస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సంస్థ వెబ్ సైట్ www.viswaguruworldrecords.com లోని గూగుల్ ఫామ్ ను పూరించి సంబంధిత పాఠశాలలు, కళాశాలలు తదితర సంస్థలు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవలసి ఉంటుంది. ఈ సంస్థలన్నింటికీ పార్టిసిపేషన్ ఈ-సర్టిఫికెట్స్ ఉచితంగానే అందిస్తారు. ఈ ప్రతిజ్ఞ ద్వారా అశోక ధర్మ చక్రంలోని 24 ఆకులు సూచించే 24 విలువల ప్రాముఖ్యం గురించి తెలుసుకోవడంతో పాటు, ఆ గుణాలను అలవర్చుకొని జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి ఎంతగానో ఉపకరిస్తుందని విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ భావిస్తోంది. అలాగే మన రాష్ట్రం తో పాటు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమం లో అందరూ పాల్గొని ఇతరులూ పాల్గొనే విధంగా చైతన్య పరచి దేశభక్తి చాటాలని విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపక సిఈవో, ప్రముఖ నాసికా చిత్రకారుడు సత్యవోలు రాంబాబు కోరుతున్నారు. ఇదీ చదవండి: ఒక్కరోజే 50 లక్షలు?.. అదీ క్రేజ్ మరి! -
వారు నమ్మనివే... నేడు జీవనాడులు
స్వాతంత్య్రం వచ్చాక అత్యంత శక్తిమంతమైన నిరసన ప్రదర్శన ఇటీవలి రైతు ఉద్యమం! కేంద్రం మెడలు వంచి, మూడు రాక్షస వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునేలా చేసిన ఈ ఉద్యమం ప్రధానంగా జాతీయ జెండా నీడలోనే జరిగింది. నిజానికి, మూడు వర్ణాలతో, మధ్యలో నీలిరంగు అశోక చక్రంతో కూడిన జెండాను ఆర్ఎస్ఎస్ చాలాకాలం వ్యతిరేకించింది. సర్సంఘ్చాలక్ ఎంఎస్ గోల్వాల్కర్‌కు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ఆదర్శాలపై నమ్మకం లేదు. కానీ ఆ మూడు విషయాలే ఇప్పుడు శూద్ర, దళిత, ఆదివాసీలకు జీవనాడిగా మారాయి. అశోక చక్రంతో కూడిన మువ్వన్నెల జెండాను అంబేడ్కర్ ఆమోదిస్తే... వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు రైతులు దాన్ని తమ సొంతం చేసుకున్నారు. ► 75ఏళ్ళ స్వాతంత్య్ర మహోత్సవాలు జరుపుకొంటున్న ఈ తరుణంలో భారత జాతీయ పతాకం ప్రాముఖ్యంపై దేశవ్యాప్తంగా కీలకమైన చర్చ ఒకటి నడుస్తోంది. సామాజిక మాధ్యమ వేదిక ట్విట్టర్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోతో జాతీయ పతాకాన్ని ప్రదర్శించింది. కాంగ్రెస్ పార్టీ ఏమో దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చిత్రంతో కూడిన పతాకాన్ని ట్విట్టర్లో పంచుకుంది. కమ్యూనిస్టులు అసలు జాతీయ పతాకం తాలూకు చర్చ పట్టనట్టుగా వ్యవహరించారు. బహుశా వారికి త్రివర్ణ పతాకం కంటే తమ ఎర్రజెండానే ముద్దేమో మరి! ► బీజేపీ, కాంగ్రెస్‌లు తమ వాళ్ల చిత్రాలతో ప్రదర్శించుకునేందుకు వారికే సొంతమైన పార్టీ జెండాలు ఉండనే ఉన్నాయి. అవసరమైతే వారు వీటిని తమ ఇళ్లపై ఎగరేయడం ద్వారా తమ రాజకీయ ఉనికిని చాటుకోవచ్చు. అయితే ఈ దేశంలో ఉత్పాదక వర్గం దృష్టిలో జాతీయ పతాకం ప్రాముఖ్యం ఏమిటన్నది చూడాలి. కులాల ప్రాతిపదికన చూస్తే ఈ ఉత్పాదక వర్గం శూద్ర/ దళిత/ ఆదివాసీ వర్గాలతో కూడినదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమేమీ లేదు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. స్వాతంత్య్రం తరువాత ఈ దేశంలో నమోదైన అత్యంత శక్తిమంతమైన నిరసన ప్రదర్శన ఇటీవలే విజయవంతమైన రైతు ఉద్యమం! కేంద్రం మెడలు వంచి, మూడు రాక్షస వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునేలా చేసిన ఈ ఉద్యమం ప్రధానంగా జాతీయ జెండా నీడలోనే జరిగింది. రైతు నాయకులు తమ సంఘర్షణకు ప్రతీకగా జాతీయ పతాకం మినహా మరేదీ లేకుండా కట్టుదిట్టంగా వ్యవహరించారు. ఈ ఉద్యమం జాతీయ పతాకం అసలు వారసులు ఎవరో నిర్ణయించిన ఉద్యమం. జాతీయ పతాకం మాదే అన్న రైతుల ధీమా అసలైనది. సాధికారికమైనది కూడా! ► మూడు వర్ణాలతో, మధ్యలో నీలిరంగు అశోక చక్రంతో కూడిన మన జెండాను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చాలాకాలం పాటు వ్యతిరేకించిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. ఆర్ఎస్ఎస్ రెండో సర్సంఘ్చాలక్ అయిన ఎంఎస్ గోల్వాల్కర్ తన ‘బంచ్ ఆఫ్ థాట్స్’ పుస్తకంలో ‘‘మన నేతలు ఈ దేశానికి ఓ కొత్త జాతీయ జెండాను సిద్ధం చేశారు. ఎందుకిలా? కేవలం పక్కదోవ పట్టించేందుకు, ఇంకొకరిని అనుకరించేందుకు మాత్రమే! అసలీ జెండా ఉనికిలోకి ఎలా వచ్చింది? ఫ్రెంచ్ విప్లవ సమయంలో ‘‘స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వ’’ భావనలకు ప్రతీకలుగా ఫ్రెంచి వారు మూడు రంగుల జెండాను సిద్ధం చేసుకున్నారు. దాదాపు ఇవే సిద్ధాంతాలతో స్ఫూర్తి పొందిన అమెరికన్ విప్లవకారులూ కొన్ని మార్పులతో ఫ్రెంచి వారి మూడు వర్ణాల జెండాను తయారు చేసుకున్నారు. మన ఉద్యమకారులకూ ఈ మూడు వర్ణాలపై ఓ వ్యామోహం ఉందన్నమాట. దీన్నే కాంగ్రెస్ పార్టీ భుజానికెత్తుకుంది’’ అని రాసుకున్నారు. ► ఆర్ఎస్ఎస్ గురూజీకి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృ త్వం అనే ఆదర్శాలపై నమ్మకం లేదు. వీటితో కులం, వర్ణం, ధర్మ వ్యవస్థ కుప్పకూలిపోతుందన్నది ఆయన ఆలోచన. ఇస్లామిక్ జెండాలోని పచ్చదనం మాదిరిగానే కమ్యూనిస్టుల ఎర్రజెండాలోని ముదురు ఎరుపు రంగు ఉందని ఆర్ఎస్ఎస్ అనుకునేది. కమ్యూనిస్టులకు మొదటి నుంచి కూడా శ్రామిక విప్లవానికి ప్రతీకగా నిలిచే ఎర్రజెండా మినహా మరే జెండా పట్ల గౌరవం ఉండేది కాదు. ఎరుపు, తెలుపు, పచ్చదనాల మేళవింపుతో కూడిన జాతీయ పతాకాన్ని ఆమోదించిన తరువాత రాజ్యాంగ విధానసభ చర్చల్లో అంబేడ్కర్ ఆ పతాకం మధ్యలో గాంధీ ప్రతిపాదించిన చరఖాకు బదులు అశోకుడి చక్రం ఉండాలని కోరారు. అంబేడ్కర్ అప్పటికే బౌద్ధ మతం వైపు ఆకర్షితుడై ఉన్నారు. ► 1947 జూలై 22న జాతీయ పతాకం ప్రస్తుత రూపంలో ఆమోదం పొందగా, ఆగస్టు 15 అర్ధరాత్రి తొలిసారి దాన్ని ఎగురవేశారు. ఆర్ఎస్ఎస్/బీజేపీలు అప్పట్లో అధికారంలో ఉండివుంటే జెండా ఈ రూపంలో ఉండేది కాదు. కాషాయ ధ్వజం మన జెండా అయ్యుండేది. బహుశా దాని మధ్యలో ఓ స్వస్తిక్ చిహ్నం చేరి ఉండేదేమో! దేశవ్యాప్తంగా ముస్లిమ్‌లు ఉన్న విషయాన్ని గుర్తుంచుకుంటే విభజన సమయంలో ఎలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చేదో తెలిసేది కాదు. ద్విజుల ఆధిపత్యంలో హిందూ/హిందూత్వ వాతావరణం నిండుకున్న సమయంలో శూద్ర/దళిత/ఆదివాసీ సమూహాల పరిస్థితి ఏమిటో అర్థమయ్యేది కాదు. అయితే అంబేడ్కర్ తన సంస్థ జెండా కోసమూ నీలి వర్ణాన్నే ఎన్నుకున్నాడు. ఇప్పుడు బహుజన సమాజ్‌పార్టీ జెండాలోనూ కనిపిస్తుంది. నాకైతే 2021–22లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన చారిత్రక రైతు ఉద్యమంతోనే జాతీయ పతాకానికి కొత్త అర్థం లభించిందని అనిపిస్తుంది. ► 1947 ఆగస్టు 15న మువ్వన్నెల జెండాను ఎగురవేసింది మొదలు వర్ణధర్మం వల్ల ఇబ్బందులు పడ్డ శూద్రులు, దళితులు, ఆదివాసీల జీవితాల్లో ఒక కొత్త దశ మొదలైందని నా నమ్మకం. అందుకే ఈ వర్గాల వారు త్రివర్ణ పతాకంపై మరింత నమ్మకం పెంచుకోవాలని భావిస్తున్నా. అదృష్టవశాత్తూ రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ కూడా మువ్వన్నెల్లోని మూడు రంగులు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలకు ప్రతీకలుగా రాజ్యాంగ రచన సమయంలో పలు సందర్భాల్లో రూఢి చేయడం గమనార్హం. గోల్వాల్కర్ చేసిన ప్రకటనను పరిశీలిస్తే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి అంశాలపై అతడికి ఎంత ద్వేషం ఉందో మనకు ఇట్టే అర్థమైపోతుంది. కానీ ఈ మూడు విషయాలే ఇప్పుడు శూద్ర, దళిత, ఆదివాసీలకు జీవనాడిగా మారాయి. ► జాతీయ పతాకం పైభాగంలోని ఎరుపు లాంటి రంగు సూచించే విప్లవమే దేశంలోని ఉత్పాదక వర్గం కోరిక కూడా! తెలుపు రంగు శాంతిని సూచిస్తుంది. కులాధిపత్యం, శోషణ, అస్పృశ్యత, హింస వంటివాటికి ఫుల్స్టాప్ పెట్టి శాంతి నెలకొనాలని శూద్ర, దళిత, ఆదివాసీలూ కాంక్షించారు. ఆకుపచ్చదనం గురించి ఆర్ఎస్ఎస్ మేధావులు ఊహించినట్లు ఇస్లామ్‌ను సూచించలేదీ రంగు. పైరుపచ్చలు, పర్యావరణ హిత జీవనవిధానం, పాడి పశువుల వంటి వాటిని మాత్రమే సూచించింది. ఇప్పుడు ప్రపంచం మొత్తం కోరుకుంటున్న హరిత పర్యావరణ ఉద్యమాలే మన జాతీయ జెండాలోని పచ్చ రంగు అన్నమాట. ఈ పచ్చదనాన్ని సూచించేదెవరు? ఈ దేశపు రైతన్నలు! ► ఆధునిక చరిత్రలో రైతులకు అసలు సిసలైన ప్రతినిధి మహాత్మా జ్యోతీరావు ఫూలే. శూద్రులు, అతిశూద్రులుగా జ్యోతిరావు ఫూలే అభివర్ణించే రైతుల సమస్యల కేంద్రంగానే ఆయన రచనలన్నీ సాగాయి. దేశ చరిత్రలో మొదటిసారి ఇలాంటి రచనలు చేసిన వ్యక్తి జ్యోతిరావు ఫూలే. 1873లో ‘గులామ్‌గిరి’ పేరుతో ఆయన రాసిన తొలి పుస్తకం దేశంలోని ఉత్పాదక సమూహాలు ఆకాంక్షిస్తున్న స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను ప్రతిబింబించింది. అశోక చక్రంతో కూడిన జెండాను అంబేడ్కర్ ఆమోదిస్తే... వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు రైతులు దాన్ని తమ సొంతం చేసుకున్నారు. ► మన రాజ్యాంగం, జాతీయ జెండా, ప్రజాస్వామ్య సంస్థలన్నింటినీ కాపాడుకోవాల్సిన... కొనసాగించాల్సిన అవసరం ఎంతో ఉంది. భిన్నాభిప్రాయాలు, ఆకాంక్షలు కలిగి ఉన్నా స్వాతంత్య్ర ఉద్యమకారులు కలసికట్టుగా ఆధునిక భారతదేశాన్ని ఇప్పుడున్న ప్రజాస్వామ్య వ్యవస్థలు, ఆలోచనలు, రాజ్యాంగాలతో రూపొందించారు. పల్లెలు, పట్టణాలు, ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలపై జాతీయ జెండాను ఎగురవేసేటప్పుడు స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని, స్వాతంత్య్ర ఉద్యమకారుల త్యాగ గుణాలను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కంచె ఐలయ్య షెపర్డ్ – వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
బాబూరామ్‌కు అశోక చక్ర
న్యూఢిల్లీ: జమ్ము, కాశ్మీర్‌కు చెందిన పోలీసు అధికారి బాబూరామ్ మరణానంతరం అశోక చక్ర అవార్డుకు ఎంపికయ్యారు. గణతంత్ర వేడుకల్లో ఆయన భార్య రీనారాణి, కుమారుడు మాణిక్‌కు రాష్ట్రపతి కోవింద్ అవార్డును అందజేశారు. 2020 ఆగస్టులో శ్రీనగర్‌లో జరిగిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో అసిస్టెంట్ సబ్ ఇనస్పెక్టర్ బాబూరామ్ అమరుడయ్యారు. ఆరోజు ఆయన చాకచక్యంగా వ్యవహరించి ఉగ్రవాదులున్న ఇంటిపక్క పౌరులను కాపాడారు. అనంతరం ధైర్యంగా ఉగ్రవాదులను పట్టుకునేందుకు ప్రయత్నించి ఎదురు కాల్పుల్లో అమరుడయ్యారు. ఈ సాహసానికి ఆయనకు మరణానంతరం అత్యున్నత గాలెంటరీ పురస్కారం దక్కింది. శౌర్యచక్ర అవార్డు మరణానంతరం సుబేదార్ శ్రీజిత్, హవల్దార్ అనిల్ కుమార్, కాశీరాయ్, పింకు కుమార్, జశ్వంత్ కుమార్ రెడ్డికి దక్కింది. -
హాకీ ప్రపంచకప్ నిర్వాహాకులపై ఫ్యాన్స్ ఫైర్
లండన్ : మహిళల హాకీ ప్రపంచకప్ టోర్నీ నిర్వాహకులపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లండన్ వేదికగా శనివారం నుంచి ఆగస్టు 5 వరకు కొనసాగే ఈ టోర్నీలో రాణి రాంపాల్ నేతృత్వంలోని భారత్ జట్టు పాల్గొంటుంది. అయితే ఈ టోర్నీకి ముందు నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో నిర్వాహకులు ఘోర తప్పిదం చేశారు. భారత జాతీయ పతాకంలో అశోక చక్రాన్ని మరిచారు. దీంతో అభిమానులు టోర్నీ నిర్వహకులపై మండిపడుతున్నారు. టోర్నీ ప్రచారంలో భాగంగా నిర్వాహకులు ఏర్పాటు చేసిన ఫొటోషూట్‌లో 16 దేశాలకు చెందిన కెప్టెన్లు పాల్గొన్నారు. మిగతా సారథులతో కలిసి భారత కెప్టెన్ రాణి సైతం ఫొటోషూట్‌కు హాజరయ్యారు. ఇందులో భాగంగా ఆయా కెప్టెన్లు తమ దేశానికి సంబంధించిన జాతీయ పతాకాల పక్కన నిల్చొని ఫొటోలకు ఫోజులిచ్చారు. అయితే, నిర్వాహకులు భారత జాతీయ పతాకంలో అశోకచక్రాన్ని ఉంచడం మరిచారు. మన జాతీయ పతాకం పక్కన రాణి రాంపాల్ నిల్చున్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీంతో భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. ప్రతిష్టాత్మక ప్రపంచకప్ టోర్నీలో ఇలాంటి తప్పులు చేయడం ఏమిటని మండిపడుతున్నారు. ఇక పూల్-బిలో చోటు దక్కించుకున్న భారత్ శనివారం తొలి మ్యాచ్‌ను ఇంగ్లండ్‌తో తలపడనుంది. Ashok Chakra missing from the Indian flag. Is it a mistake or done intentionally? — Nilesh Tandon (@nileshtandon) July 19, 2018 -
హవల్దార్ హంగ్‌పాన్‌కు అశోక చక్ర
►82 మందికి సాహస పురస్కారాలు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ: అక్రమంగా భారత్‌లోకి చొరబడాలని చూసిన నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టి, దేశం కోసం ప్రాణాలర్పించిన హవల్దార్ హంగ్‌పాన్‌కు ఆర్మీ అత్యున్నత పీస్‌టైమ్ అవార్డు అశోక చక్ర ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పఠాన్‌కోట్ వీరులు లెఫ్టినెంట్ కల్నల్ నిరంజన్, కార్పోరల్ గురుసేవక్ సింగ్ తదితర 82 మంది రక్షణ, పారామిలిటరీ సిబ్బందికి సాహస పురస్కారాలు ఇచ్చేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. ఈ మేరకు కేంద్రం ఆదివారం ప్రకటించింది. ఒక అశోక చక్ర, 14 శౌర్య చక్ర, 63 సేన పతకాలు, రెండు నావికా సేన, రెండు వాయు సేన పతకాలు ఇవ్వనున్నట్లు తెలిపింది. సోమవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ పురస్కారాలు అందజేయనున్నారు. హంగ్‌పాన్‌కు సముచిత గౌరవం అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించి అమరుడైన హవల్దార్ హంగ్పాన్ దాదాకు ప్రతిష్టాత్మక అశోక చక్ర పురస్కారం లభించింది. ఆయన గత మే 27న కశ్మీర్లో 13 వేల అడుగుల ఎత్తులో శత్రువులతో వీరోచితంగా పోరాడారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి భారీగా ఆయుధాలతో భారత్‌లోకి చొరబడాలని చూసిన నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఆ తర్వాత శత్రుమూకల బుల్లెట్లకు నేలకొరిగారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని మారుమూల బోడురియా గ్రామానికి చెందిన హంగ్పాన్ను ఆయన టీమ్ సభ్యులు దాదా అని పిలుచుకునేవారు. కిందటేడాది చివర్లోనే ఆయన కశ్మీర్‌కు వెళ్లారు. ఉగ్రవాదాన్ని అణచివేయడానికి ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన 35 రైఫిల్ టీమ్స్‌లో హంగ్పాన్ విధులు నిర్వర్తించేవారు. హంగ్‌పాన్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పఠాన్‌కోట్ అమరవీరుడికి శౌర్య చక్ర పఠాన్‌కోట్ ఉగ్రదాడిలో మరణించిన ఎన్ఎస్ జీ బాంబు నిర్వీర్య దళం చీఫ్ లెఫ్టినెంట్ కల్నల్ నిరంజన్‌కు శౌర్య చక్ర పురస్కారం లభిం చింది. బాంబులను కనుగొనడంలో, నిర్వీర్యం చేయడంలో నిష్ణాతుడైన నిరంజన్ గత జనవరిలో పఠాన్‌కోట్ ఎయిర్ బేస్‌లో గ్రనేడ్లను నిర్వీర్యం చేస్తూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఏడుగురు భద్రతా సిబ్బంది, ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఐటీబీపీ కమాండోలకు పురస్కారాలు అఫ్గానిస్తాన్‌లోని భారత్ కాన్సులేట్ల వద్ద ఉగ్రదాడులను ఎదుర్కొన్న పదిమంది ఇండో-టిబెటిన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) కమాండోలకు అత్యున్నత పోలీసు సాహస పతకాలను ఇవ్వనున్నారు. వీరిలో క్షురకుడిగా విధులు నిర్వహిస్తున్న సతీశ్ కుమార్ కూడా ఉన్నారు. ఈ దాడులు జనవరి 3న మజారే షరీఫ్ వద్ద, మార్చి 3న జలాలాబాద్ వద్ద ఉన్న భారత కాన్సులేట్ల వద్ద జరిగాయి. మజారే షరీఫ్ కాన్సులేట్ వద్ద జరిగిన దాడుల్లో సతీశ్ రైఫిల్‌ను అందిపుచ్చుకుని అద్భుతంగా ఎదురు కాల్పులు జరిపారు. అలాగే 948 మంది కేంద్ర, రాష్ట్ర పోలీసులకూ సాహస పురస్కారాలు, సేవా పతకాలు ఇవ్వనున్నారు. -
హవిల్దార్ హాంగ్పాన్కు అశోకచక్ర పురస్కారం
న్యూఢిల్లీ: ఉగ్రవాదుల తూటాలకు వెరవకుండా యుద్ధక్షేత్రంలోకి చొచ్చుకుపోయి నలుగురు ముష్కరులను మట్టుపెట్టి, తానూ అమరుడైన హవిల్దార్ హాంగ్పాన్ దాదాకు సముచిత గౌరవం దక్కింది.. దేశ రక్షణ కోసం అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన ఆ వీర సైనికుడికి ప్రతిష్టాత్మక 'అశోకచక్ర' పురస్కారం లభించింది. ఈ మేరకు ఆదివారం కేంద్ర ప్రభుత్వం పురస్కారానికి ఎంపికైనవారి జాబితాను ప్రకటించింది. (నలుగురిని హతమార్చి.. ప్రాణాలు వదిలాడు) 35 రాష్ట్రీయ రైఫిల్స్‌లో జవాన్‌గా పనిచేసిన దాదా.. ఈ ఏడాది మేలో జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదులతో తలపడి ప్రాణాలు కోల్పోయాడు. తాను మరణించడానికి ముందు నలుగురు ఉగ్రవాదులను కాల్చిచంపాడు. అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన దాదాకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. సోమవారం జరిగే స్వాతంత్ర్య వేడుకల్లో రాషష్ట్రపతి ప్రణబ్.. దాదా కుటుంబసభ్యులకు పురస్కారాన్ని అందజేస్తారు. కాగా, సైనిక రంగంలో విశిష్టసేవలు అందించిన మరో 11 మందికి శౌర్యచక్ర పురస్కారాలు లభించాయి. వీరిలో పఠాన్ కోట్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన లెఫ్టినెంట్ కల్నల్ నిరంజన్ కూడా ఉన్నారు. 'సత్తర్ సాల్ ఆజాదీ.. యాద్ కరో ఖుర్బానీ' నినాదంతో 70వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకొంటున్నవేళ జాతియావత్తూ పోరాటయోధులు, సైనిక అమరవీరుల త్యాగాలను గుర్తుచేసుకుంటున్నది. (ఆర్మీ దుస్తులే ప్రాణంగా బతికాడు..) -
బ్యాంకుల్లో అశోక చక్ర పసిడి నాణేలు
ఆర్బీఐ అనుమతి ముంబై: అశోకచక్రతో కూడిన భారత పసిడి నాణేలను (ఐజీసీ) విక్రయించడానికి బ్యాంకులకు గురువారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అనుమతి ఇచ్చింది. ఎంఎంటీసీ తయారుచేసిన ఈ నాణేలను బ్యాంకులు తమ బ్రాంచీలలో విక్రయించవచ్చని ఒక నోటిఫికేషన్లో తెలిపింది. ఎంఎంటీసీ సంబంధిత బ్యాంక్ మధ్య కుదిరిన అవగాహన మేరకు విక్రయ విధివిధానాలు ఉండాలని సూచించింది. గోల్డ్ డిపాజిట్ స్కీమ్, గోల్డ్ మోనిటైజేషన్ స్కీమ్ కింద సమీకరించిన పసిడితో ఈ నాణేలు తయారుచేయడం జరుగుతుందని ఎంఎంటీసీ ఇప్పటికే వివరణ ఇచ్చింది. 5,10,20 గ్రాముల్లో ఈ నాణేలు లభ్యమవుతాయి. పెన్షనర్ల లావాదేవీలపై సూచనలు... పెన్షనర్ల అకౌంట్ల విషయంలో బ్యాంకులకు ఆర్బీఐ కీలక సూచనలు చేసింది. వారి అకౌంట్లలోకి పెన్షన్లకు సంబంధించిన క్రెడిట్ లావాదేవీలు(ఏరియర్స్ సహా) ఏడాదికి 14 మించరాదని స్పష్టం చేసింది. ఏజెన్సీ బ్యాంక్‌కు ఆ లావాదేవీకి ప్రస్తుతం రూ.65 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తున్నాయి. పసిడి పథకం నిబంధనలు సడలింపు .. పసిడి డిపాజిట్ పథకం వైపు ఇన్వెస్టర్లను ఆకర్షించే విధంగా ఆర్బీఐ నిబంధనలు సడలించింది. మధ్య కాలిక (5-7 ఏళ్లు), దీర్ఘకాలిక పసిడి డిపాజిట్లను (12-15 ఏళ్లు) కనీస లాకిన్ పీరియడ్ తర్వాత డిపాజిటర్లు ఉపసంహరించుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపింది. అయితే, వడ్డీ రేటును కొంత తగ్గించి చెల్లించడం రూపంలో దీనికి పెనాల్టీ ఉంటుంది. మధ్యకాలిక డిపాజిట్లకు మూడేళ్లు, దీర్ఘకాలికమైనవాటికి అయిదేళ్లు లాకిన్ వ్యవధి ఉంది. స్వల్పకాలిక డిపాజిట్లపై అసలు, వడ్డీని బంగారం రూపంలోనే చెల్లించడం జరుగుతుందని ఆర్బీఐ తెలిపింది. అదే మధ్యకాలిక, దీర్ఘకాలిక డిపాజిట్లపై మాత్రం అసలును పసిడి రూపంలోనూ, వడ్డీని రూపాయిల్లోను చెల్లిస్తారు. వడ్డీ లెక్కించడానికి మాత్రం డిపాజిట్ చేసినప్పటి బంగారం విలువను ప్రాతిపదికగా తీసుకుంటారు. మహిళా ఎస్‌హెచ్‌జీలకు 7 శాతానికే రుణం మహిళా స్వయం సహాయక బృందాలకు (ఎస్‌హెచ్‌జీ) 7 శాతానికే రుణాలు అందించాలని ఆర్బీఐ బ్యాంకులకు స్పష్టంచేసింది 2015-16లో నేషనల్ రూరల్ లైవ్లీవుడ్ మిషన్(ఎన్ఆర్ఎల్ఎం) ఆజీవికా స్కీమ్ కింద మహిళా ఎస్‌హెచ్‌జీలకు ఈ తక్కువ స్థాయి రేటుకు రుణం అందించాలని పేర్కొంది. వార్షికంగా 7 శాతం వడ్డీకి రూ.3 లక్షల వరకూ రుణంపై వడ్డీ రాయితీకి(ఇన్‌ట్రస్ట్ సబ్వెన్షన్) ఎస్‌హెచ్‌జీ మహిళలు అందరూ అర్హులేనని వివరించింది. -
మేజర్ ముకుంద్‌కు అశోకచక్ర
12 మందికి శౌర్యచక్ర మొత్తం 55 మందికి సాహస పతకాలను ప్రకటించిన కేంద్రం న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌లోని షోపియన్ జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులను ఎన్కౌంటర్లో హతమార్చి, అమరుడైన ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్(31)కు శాంతి సమయంలో ఇచ్చే అత్యున్నత శౌర్య పతకం అశోక చక్రను కేంద్రం ప్రకటించింది. అలాగే విధి నిర్వహణలో అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించిన మరో 12 మందికి దేశ మూడో అత్యున్నత శౌర్య పతకమైన శౌర్య చక్ర ప్రకటించింది. వీరిలో నలుగురు మరణానంతరం ఈ పతకానికి ఎంపికయ్యారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది సాయుధ బలగాల సిబ్బందికి మొత్తం 55 శౌర్య పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో ఒక అశోక చక్ర, 12 శౌర్య చక్ర, 39 సేనా పతకాలు, ఒక నవో సేనా పతకం, 2 వాయు సేనా పతకాలు ఉన్నాయి. కాగా, 44 రాష్ట్రీయ రైఫిల్స్‌కు నేతృత్వం వహించిన మేజర్ ముకుంద్ కాశ్మీర్‌లోని ఖాజీపత్రి గ్రామం వద్ద ఉగ్రవాదులతో హోరాహోరీ తలపడి ఇద్దరిని హతమార్చారు. రక్తమోడుతున్నా.. నేలపై పాకుతూ వెళ్లి వారిని కాల్చిచంపి, ఎన్నికల సిబ్బందిని కాపాడారు. ఈ సంఘటనలో మూడో ఉగ్రవాదిని చంపిన మరో వీర సైనికుడికీ మరణానంతరం శౌర్యచక్ర లభించింది.