
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఆదివారం ఓ పోలీసు అధికారి క్రికెట్ ఆడుతుండగా ఉగ్రకాల్పులకు బారిన పడ్డారు. ఇన్‌స్పెక్టర్ మన్సూర్ అహ్మద్ వనీ శ్రీనగర్ శివార్లలో ఈద్గా క్రీడాస్థలంలో క్రికెడ్‌ఆడుతుండగా లష్కరే తొయిబా ఉగ్రవాది ఒకడు అతి సమీపం నుంచి మూడు రౌండ్లు కాల్పులకు దిగాడు.
కంట్లోకి, పొట్టలోకి, చేతిలోకి తూటాలు దూసుకెళ్లడంతో వని కుప్పకూలారు. ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ముష్కరుడిని బాసిత్ దార్‌గా గుర్తించినట్టు ఏడీజీ విజయ్ కుమార్ తెలిపారు. అతని కోసం ఆ ప్రాంతాన్నంతా పోలీసులు జల్లెడ పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment