శ్రీనగర్: సీఆర్‌పీఎఫ్ భద్రతా బలగాలు ఐదుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదులను శనివారం అరెస్ట్ చేశారు. అదే విధంగా బుద్గాం జిల్లాలో ఉన్న ఉగ్రవాద స్థావరాన్ని ఛేదించనట్లు జమ్మూ కశ్మీర్ పోలీసులు తెలిపారు. కశ్మీర్‌లోని ఖాన్సాయిబ్ పోలీసుస్టేషన్ పరిధిలోని అరిజల్ గ్రామంలో సీఆర్‌పీఎఫ్ భద్రతా దళాలు, బుద్గాం పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో టాప్ టెర్రరిస్ట్ జహూర్ వాని అతను ఏర్పాటు చేసుకున్న ఉగ్రవాద స్థావరంలో భద్రతా దళాలు అరెస్ట్ చేశారు.
One hideout busted in Arizal Khansaib,Budgam & a top Over Groud Wirker of LeT, namely Zahoor Wani was arrested. Arms and ammunition recovered from his possession.
— J&K Police (@JmuKmrPolice) May 16, 2020
More arrests and recoveries are expected. Case registered. pic.twitter.com/sFMfVft7Dh
అతని రహస్య ఉగ్రస్థావరంలో ఉన్న మారణాయుధాలు, మందుగుండు సామాగ్రిని భద్రత దళాలు స్వాధీనం చేసుకున్నాయి. మరో నలుగురు ఉగ్రవాదులు.. యునిస్ మిర్, అసలాం షేక్, పవైజ్ షేక్, రెహమాన్ లోన్‌లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీరంతా ఖాన్సాయిబ్ ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. అదేవిధంగా వీరు లష్కరే తోయిబా ఉగ్గవాదులకు సాయం అందిస్తూ.. ఆశ్రయం కల్పిస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. వీరిపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment