
న్యూఢిల్లీ/హల్దా్వనీ: జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో 2019 ఫిబ్రవరి 14వ తేదీన జరిగిన ఉగ్రదాడిలో అమరులైన సీఆర్‌పీఎఫ్ జవాన్లకు ప్రధాని మోదీ శుక్రవారం నివాళులర్పించారు. దేశం పట్ల వారు అచంచలమైన విశ్వాసాన్ని కనబరిచారని కొనియాడారు. వారి త్యాగాలను భవిష్యత్తు తరాలు గుర్తుంచుకుంటాయని ప్రధాని మోదీ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఉగ్రవాదులను ఏరిపారేసేందుకు మోదీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు.
పుల్వామా ఉగ్ర ఘటనలో అసువులు బాసిన జవాన్లకు ఆయన ఘనంగా నివాళులర్పించారు. వీరి త్యాగాల వల్లే మన దేశ సరిహద్దులు భద్రంగా ఉన్నాయన్నారు. మానవీయతకే అతిపెద్ద శత్రువైన ఉగ్రవాదంపై పోరుకు నేడు ప్రపంచమే ఏకమైందని శుక్రవారం హోం మంత్రి అమిత్ షా ‘ఎక్స్’లో తెలిపారు. పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌ని ఆత్మాహుతి దళ బాంబర్ వాహనంతో ఢీకొట్టడంతో 40 మంది జవాన్లు అసువులు బాసిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు ప్రతీకారంగా వైమానికదళం యుద్ధ విమానాలు పీవోకేలోని బాలాకోట్ ఉగ్ర స్థావరాన్ని నేలమట్టం చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment