J&K: సీఎంగా ఒమర్‌ అబ్దుల్లా ప్రమాణం | jammu kashmir: omar abdullah cm oath ceremony updates | Sakshi
Sakshi News home page

J&K: సీఎంగా ఒమర్‌ అబ్దుల్లా ప్రమాణం

Published Wed, Oct 16 2024 9:53 AM | Last Updated on Wed, Oct 16 2024 3:19 PM

jammu kashmir: omar abdullah cm oath ceremony updates

Updates

 

  • కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌ తొలి ముఖ్యమంత్రిగా నేషనల్‌ కాన్ఫరెన్స్‌(ఎన్‌సీ) ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా ప్రమాణం చేశారు.

  • శ్రీనగర్‌లోని షేర్‌–ఇ–కశ్మీర్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌(ఎస్‌కేఐసీసీ)లో జరిగిన  ఈ కార్యక్రమంలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా సీఎంగా ఒమర్‌తో ప్రమాణం చేయించారు.

  • J&K: ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం

 

  • ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి..  కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ, ఇండియా కూటమి నేతలు.. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, డీఎంకే ఎంపీ కనిమొళి కరుణానిధి, ఎన్‌న్సీపీ-ఎస్‌స్పీ ఎంపీ సుప్రియా సూలే, సీపీఐ నేత డీ. రాజా  హాజరయ్యారు.
  • అంతకు ముందు.. జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే శ్రీనగర్ చేరుకున్నారు. 


     

  • ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ శ్రీనగర్ చేరుకున్నారు. 


     

  • జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు.. నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా బుధవారం మీడియాతో మాట్లాడారు. 

  • ‘‘ భారత ప్రభుత్వంతో సహకారంతో పనిచేయడానికి ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. అయితే ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి సీఎంగా స్వంత హక్కు ఉంది. నేను విచిత్రమైన సవాళ్లను కలిగి ఉన్నా. పూర్తి ఆరేళ్ల పదవీకాలం పూర్తి చేసిన చివరి ముఖ్యమంత్రిని నేను. ఇప్పుడు నేను జమ్ము కశ్మీర్‌ కేంద్ర పాలిత ప్రాంతానికి తొలి ముఖ్యమంత్రిని అవుతాను. జమ్ము కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించడం ద్వారా మా పాలన మొదలవుతుంది’’ అని అన్నారు.

  • ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి ఇప్పటికే ఇండియా కూటమి నేతలు.. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, డీఎంకే ఎంపీ కనిమొళి కరుణానిధి, ఎన్‌న్సీపీ-ఎస్‌స్పీ ఎంపీ సుప్రియా సూలే, సీపీఐ నేత డీ. రాజా చేరుకున్నారు. 
     

ఆర్టీకల్‌ 370 ఆర్టీకల్‌ రద్దు అనంతరం మొదటిసారిగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్‌సీ, కాంగ్రెస్‌ కూటమి విజయం సాధించడం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement