సరిహద్దులో అలజడి; వరుస ఎన్‌కౌంటర్లు.. | Militants Killed In Separate Encounters At Shopian And Anantnag | Sakshi
Sakshi News home page

సరిహద్దులో అలజడి; వరుస ఎన్‌కౌంటర్లు..

Published Sun, Apr 1 2018 9:53 AM | Last Updated on Sun, Apr 1 2018 12:05 PM

Militants Killed In Separate Encounters At Shopian And Anantnag - Sakshi

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో మళ్లీ అలజడి. పాక్‌ సరిహద్దు జిల్లాల్లో ఆదివారం తెల్లవారుజామున వరుస ఎన్‌కౌంటర్లు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు తెలిసిన సమాచారం ప్రకారం ఎన్‌కౌంటర్లలో ఎనిమిది మంది ఉగ్రవాదులు హతమయ్యారు. సోఫియాన్‌ జిల్లాలో రెండు చోట్ల, అనంతనాగ్‌ జిల్లాలో ఒకచోట ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి.  ఉగ్రవాదులకు భద్రతాదళాలకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.

సోఫియాన్‌ జిల్లా కచ్చాదోరా ఏరియా, ద్రాగాడ్‌ గ్రామాల్లోకి సాయుధులు చొరబడ్డారన్న సమాచారంతో భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో ఎదురుకాల్పులు చోటుచేసుకోగా ఏడుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. అటు అనంతనాగ్‌ జిల్లాలోని దైల్‌గావ్‌ ఏరియాలో.. ఉగ్రవాదులు, జమ్ముకశ్మీర్‌ పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒక మిలిటెంట్‌ హతం కాగా, ఇంకొకడు ప్రాణాలతో పట్టుబడ్డాడు. ఈ వార్తలకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement