
'పెషావర్' చిన్నారులకు అంత్యక్రియలు
పెషావర్ : పాకిస్తాన్ పెషావర్‌లో ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన చిన్నారులకు అంత్యక్రియలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఉగ్రవాదులు సాగించిన నరమేధంలో 132 మంది చిన్నారులతో సహా మొత్తం 141 మంది చనిపోయారు. ఈ దాడికి సూత్రధారులను కఠినంగా శిక్షిస్తామని ప్రధాని నవాజ్ షరీఫ్ స్పష్టం చేశారు. ఉగ్రవాదులను కట్టడి చేసేందుకు ఆఫ్ఘనిస్థాన్‌తో కలిసి పని చేస్తున్నామని తెలిపారు.
విద్యార్థుల మృతికి సంతాపంగా దేశంలో మూడు రోజులు సంతాప దినాలు ప్రకటించినట్లు వెల్లడించారు. అయితే పెషావర్ దాడి ఘటనపై భారత ప్రధాని మోదీ .... షరీఫ్‌తో ఫోన్లో మాట్లాడారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు చేపట్టిన పోరులో మీకు తోడుగా ఉంటామని మోదీ.. షరీఫ్కు భరోసా ఇచ్చారు.