అఫ్గాన్‌పై బిగుస్తున్న తాలిబన్ల పట్టు.. సగం దేశంపై ఆధిపత్యం  | Afghanistan: Taliban Continue Attacks On Three Major CIties | Sakshi
Sakshi News home page

అఫ్గాన్‌పై బిగుస్తున్న తాలిబన్ల పట్టు.. సగం దేశంపై ఆధిపత్యం 

Published Mon, Aug 2 2021 1:16 AM | Last Updated on Mon, Aug 2 2021 1:18 AM

Afghanistan: Taliban Continue Attacks On Three Major CIties - Sakshi

కాబూల్‌: అఫ్గానిస్తాన్‌ నుంచి అమెరికాతోపాటు యూరప్‌ దేశాల సైనిక బలగాల ఉపసంహరణ మొదలయ్యింది. ఆగస్టు చివరికల్లా తమ సైన్యాన్ని పూర్తిగా వెనక్కి తీసుకుంటామని ఆయా దేశాలు గతంలోనే ప్రకటించాయి. దీంతో అఫ్గానిస్తాన్‌ మరోసారి తాలిబన్‌ తీవ్రవాదుల గుప్పిట్లోకి వెళ్లిపోయే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే సగం దేశం వారి పెత్తనం కిందకు వచ్చింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో తీవ్రవాదులే అధికారం చెలాయిస్తున్నారు.

అత్యంత కీలకమైన ఇరాన్, పాకిస్తాన్‌ సరిహద్దు ప్రాంతాలపై పూర్తిస్థాయిలో పట్టు బిగించారు. ఇప్పుడు పెద్ద నగరాలపై వారి కన్ను పడింది. పశ్చిమ, దక్షిణ అఫ్గానిస్తాన్‌లోని హెరాత్, లష్కర్‌ ఘా, కాందçహార్‌ నగరాలపై ఆధిపత్యం సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. భద్రతా సిబ్బందితో హోరాహోరీగా పోరాడుతున్నారు. అయితే, అఫ్గాన్‌ భద్రతా సిబ్బంది ఈ మూడు నగరాలను ఇంకెంత కాలం కాపాడగలరన్నది ప్రశ్నార్థకంగా మారింది. త్వరలోనే హెరాత్, లష్కర్‌ ఘా, కాందçహార్‌ తాలిబన్ల వశం కావడం తథ్యమని స్థానికులు చెబుతున్నారు. 

పదుల సంఖ్యలో తాలిబన్లు హతం! 
హెరాత్, లష్కర్‌ ఘా, కాందహార్‌లో ఆదివారం భద్రతా బలగాలు, తాలిబన్ల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ కొనసాగింది. శనివారం లష్కర్‌ ఘాలోని ప్రభుత్వ కార్యాలయం సమీపంలోకి తీవ్రవాదులు దూసుకొచ్చారు. రాత్రి సమయంలో వెనక్కి మళ్లినట్లు తెలిసింది. తాలిబన్ల స్థావరాలను లక్ష్యంగా చేసుకొని అఫ్గాన్, అమెరికా సేనలు వైమానిక దాడులు కొనసాగిస్తున్నాయి. తాజాగా ఈ దాడుల్లో పదుల సంఖ్యలో తాలిబన్లు హతమైనట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

హెల్మాండ్‌ ప్రావిన్స్‌ రాజధాని లష్కర్‌ ఘాలో గతంలో తాలిబన్లతో జరిగిన పోరాటంలో పెద్ద సంఖ్యలో అమెరికా, బ్రిటిష్‌ సైనికులకు మరణించారు. ప్రస్తుతం ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. నగరంలో తీవ్రవాదులు ఆయుధాలతో సంచరిస్తున్న వీడియోలను తాలిబన్‌ అనుకూల వర్గాలు సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తున్నాయి. తాలిబన్లు కొన్ని ఇళ్లను ఆధీనంలోకి తెచ్చుకొని, అక్కడే మాటు వేశారని స్థానికులు చెబుతున్నారు. వారిని అక్కడి నుంచి తరిమికొట్టడం కష్టమేనని, అతిత్వరలో భారీ హింసాకాండ, రక్తపాతం జరిగే పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు. 

ఎయిర్‌పోర్టుపై రాకెట్ల దాడి 
కాందçహార్‌ ఎయిర్‌పోర్టుపై ఆదివారం తెల్లవారుజామున తాలిబన్లు రాకెట్లతో దాడికి దిగారు. దీంతో రన్‌వే దెబ్బతిన్నట్లు తెలిసింది. ఈ ఘటనతో విమానాల రాకపోకలను అధికారులు రద్దు చేశారు. భద్రతా బలగాలు, తాలిబన్ల మధ్య ఘర్షణతో ఇప్పటికే కాందహర్‌ నుంచి వేలాది మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. నగరంలో గంట గంటకూ పరిస్థితి దిగజారుతోందని గుల్‌ అహ్మద్‌ అనే స్థానికుడు చెప్పాడు. కాందçహార్‌లో గత 20 ఏళ్లలో ఈ స్థాయి ఘర్షణ జరుగుతుండడం ఇదే తొలిసారి అని వెల్లడించాడు. కాందహార్‌ను తాత్కాలిక రాజధానిగా మార్చుకోవాలని తీవ్రవాదులు భావిస్తున్నట్లు తెలిపాడు. 

హెరాత్‌లో పరిస్థితి అదుపులోనే..
అఫ్గాన్‌కు ఆర్థికంగా ఆయువుపట్టు లాంటి సిటీ హెరాత్‌. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి కొంత అదుపులోనే ఉంది. తీవ్రవాదులపై సైన్యం పైచే యి సాధిస్తోంది. తాలి బన్ల భరతం పట్టేం దుకు ప్రత్యేక బలగాలను రంగంలోకి దించారు. యాంటీ–తాలిబన్‌ కమాండర్‌ ఇస్మాయిల్‌ ఖాన్‌ హెరాత్‌లో విధుల్లో నిమగ్నమయ్యారు. తీవ్రవాదులను ఎదుర్కొనేందు కు ఆయన సాధారణ ప్రజల ను సమీకరిస్తున్నారు. నగరం వెలు పల ఉన్న తాలిబన్ల స్థావరాలపై సైన్యం వైమానిక దాడులు నిర్వహించింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement