కాబూల్ : ఆప్ఘనిస్తాన్ దక్షిణ ప్రావిన్స్‌లో శుక్రవారం జరిగిన పేలుడు ఘటనలో ముగ్గురు పోలీసు అధికారులు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ప్రావిన్సు పరిధిలోని కందహార్‌లో రోడ్‌సైడ్ బాంబును పోలీసు వాహనం ఢీ కొనడంతో ఈ సంఘటన జరిగింది. అయితే ఈ పేలుడు ఘటన వెనుక ఎవరున్నారన్న దానిపై ఆప్ఘనిస్తాన్ అధికారులు కానీ తాలిబన్ ఇస్టామిస్ట్ కానీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. దాదాపు రెండు దశాబ్దాల అనంతరం రాజకీయ పరిష్కార మార్గం దిశగా రెండు వైపులా చర్చలు కొనసాగుతున్నాయి. ఇకవైపు చర్చలు అంటూ శాంతియుతంగా మాట్లాడుతునే..మరోవైపు దేశ వ్యాప్తంగా తాలిబన్ దాడులు చేస్తోంది. దీంతో ఆప్ఘనిస్తాన్ వ్యాప్తంగా పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటుండంతో భద్రతా దళాలు నిఘా ఉంచారు. (కాబూల్:యూనివర్సిటీపై ఉగ్రదాడి: 19 మంది మృతి)
Comments
Please login to add a commentAdd a comment