
లండన్: మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్న ఓ కారు ఢీకొనడంతో భారత సంతతికి చెందిన ఇద్దరు మైనర్లు మృతిచెందిన ఘటన బ్రిటన్‌లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సంజయ్ (10), పవన్‌వీర్ సింగ్ (23 నెలలు) మృతిచెందారు. అన్నదమ్ములైన వీరిద్దరూ తల్లితో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో వోల్వర్‌హామ్టన్ వద్ద వారి కారును ఆడీ ఎస్3 కారు ఢీకొంది. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ బెంట్లీ కారు డ్రైవర్‌తో రేసింగ్‌లో పాల్గొన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. వీరిద్దరూ రేసింగ్‌లో ఉన్న సమయంలో ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పరారీలో ఉండగా.. బెంట్లీ కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆడీ, బెంట్లీ కార్లు మితిమీరిన వేగంతో వెళ్తుండగా చూశామని పలువురు ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment