వాషింగ్టన్/లండన్: బ్రిటన్‌కు చెందిన భారత సంతతి ఉగ్రవాది, ఐఎస్ సీనియర్ కమాండర్ సిద్ధార్థ ధర్ అలియాస్ అబూ రుమైసా(33)ను అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించింది. ఐఎస్‌లో బందీల గొంతుల్ని కిరాతకంగా కోసి హతమార్చే ‘జిహాదీ జాన్’ మొహమ్మద్ ఎజావీ మరణానంతరం అతని స్థానంలో ధర్ పనిచేస్తున్నట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. బ్రిటన్‌లో ఉన్నప్పుడే ఇస్లాం స్వీకరించిన ధర్.. ఓ కేసులో బెయిల్‌పై బయటికొచ్చిన అనంతరం 2014లో భార్యాపిల్లలతో కలిసి సిరియాకు వెళ్లి ఐఎస్‌లో చేరాడు.
అమెరికాతో పాటు బ్రిటన్ కోసం గూఢచర్యానికి పాల్పడుతున్నారంటూ 2016లో పలువురిని ముసుగు ధరించి కాల్చిచంపింది ధరేనని నిఘా వర్గాలు తెలిపాయి. ఇతనితో పాటు బెల్జియన్–మొరాకో పౌరుడు అబ్దుల్లతిఫ్ గైనీని కూడా అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించినట్లు వెల్లడించాయి. దేశంలో వీరిద్దరి ఆస్తులుంటే స్తంభింపజేస్తామనీ, పౌరులెవరూ వీరితో ఆర్థిక సంబంధాలు పెట్టుకో వద్దని యూఎస్ విదేశాంగ శాఖ తెలిపింది.
ఎవరీ కొత్త జిహాదీ జాన్?:
లండన్‌లోని ఓ బెంగాలీ హిందూ కుటుంబంలో జన్మించిన సిద్ధార్థ ధర్ అక్కడే పెరిగాడు. టీనేజీలోనే ఇస్లాం లోకి మారి సైఫుల్ ఇస్లామ్‌గా పేరు మార్చుకున్నాడు. గతంలో బ్రిటిష్ తీవ్రవాద సంస్థ అల్–ముహజిరౌన్‌లో కీలక సభ్యుడిగా వ్యవహరించాడు. ఐఎస్‌లో చేరడానికి ముందు లండన్‌లో పలు తీవ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. ఒకచేతిలో ఏకే 47 తుపాకీ, మరో చేతిలో తన నాలుగో సంతానాన్ని పట్టుకున్న ఫొటోను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసి సిరియాలో తన ఉనికిని చాటుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment