Siddhartha Dhar
-
కొత్త జిహాదీ జాన్.. సిద్ధార్థ ధర్
వాషింగ్టన్/లండన్: బ్రిటన్‌కు చెందిన భారత సంతతి ఉగ్రవాది, ఐఎస్ సీనియర్ కమాండర్ సిద్ధార్థ ధర్ అలియాస్ అబూ రుమైసా(33)ను అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించింది. ఐఎస్‌లో బందీల గొంతుల్ని కిరాతకంగా కోసి హతమార్చే ‘జిహాదీ జాన్’ మొహమ్మద్ ఎజావీ మరణానంతరం అతని స్థానంలో ధర్ పనిచేస్తున్నట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. బ్రిటన్‌లో ఉన్నప్పుడే ఇస్లాం స్వీకరించిన ధర్.. ఓ కేసులో బెయిల్‌పై బయటికొచ్చిన అనంతరం 2014లో భార్యాపిల్లలతో కలిసి సిరియాకు వెళ్లి ఐఎస్‌లో చేరాడు. అమెరికాతో పాటు బ్రిటన్ కోసం గూఢచర్యానికి పాల్పడుతున్నారంటూ 2016లో పలువురిని ముసుగు ధరించి కాల్చిచంపింది ధరేనని నిఘా వర్గాలు తెలిపాయి. ఇతనితో పాటు బెల్జియన్–మొరాకో పౌరుడు అబ్దుల్లతిఫ్ గైనీని కూడా అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించినట్లు వెల్లడించాయి. దేశంలో వీరిద్దరి ఆస్తులుంటే స్తంభింపజేస్తామనీ, పౌరులెవరూ వీరితో ఆర్థిక సంబంధాలు పెట్టుకో వద్దని యూఎస్ విదేశాంగ శాఖ తెలిపింది. ఎవరీ కొత్త జిహాదీ జాన్?: లండన్‌లోని ఓ బెంగాలీ హిందూ కుటుంబంలో జన్మించిన సిద్ధార్థ ధర్ అక్కడే పెరిగాడు. టీనేజీలోనే ఇస్లాం లోకి మారి సైఫుల్ ఇస్లామ్‌గా పేరు మార్చుకున్నాడు. గతంలో బ్రిటిష్ తీవ్రవాద సంస్థ అల్–ముహజిరౌన్లో కీలక సభ్యుడిగా వ్యవహరించాడు. ఐఎస్‌లో చేరడానికి ముందు లండన్‌లో పలు తీవ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. ఒకచేతిలో ఏకే 47 తుపాకీ, మరో చేతిలో తన నాలుగో సంతానాన్ని పట్టుకున్న ఫొటోను ఆన్లైన్లో పోస్ట్ చేసి సిరియాలో తన ఉనికిని చాటుకున్నాడు. -
2015 నుంచి గొంతులు కోస్తున్నాడు..
న్యూయార్క్ : కేవలం కళ్లు మాత్రమే కనిపించేలాగ ముఖానికి నల్లటి ముసుగు. చేతిలో ఓ పదును తేలిన కత్తి.. చూసేందుకు ముసుగుదొంగలా కనిపించే ఆ వ్యక్తి ఉగ్రవాదుల్లోనే అతి క్రూరమైనవాడు. ఆదేశాలు అందుకున్నదే తడువుగా వీడియో కెమెరాకు పోజిస్తూ అతి దారుణంగా అమాయకుల పీకలను తెంపుతుంటాడు. అలా చేసే వ్యక్తిని 'జిహాదీ జాన్' అంటారు. ఇప్పుడు ఆ జిహాదీ జాన్ మారిపోయాడని సమాచారం. భారత సంతతికి చెందిన బ్రిటన్ పౌరుడు సిద్ధార్థ ధర్ ఇప్పుడు జిహాదీ జాన్‌గా మారిపోయాడని తెలుస్తోంది. బ్రిటన్‌కు చెందిన అతడు ఇస్లాం మతంలోకి మారి అనంతరం ఐసిస్‌లో చేరడంతో అమెరికా తాజాగా అతడిని గ్లోబల్ టెర్రరిస్టుగా గుర్తించింది. ప్రపంచవ్యాప్త ఉగ్రవాదుల జాబితాలో సిద్ధార్థను చేర్చింది. ప్రస్తుతం అతడే ఐసిస్‌లో జిహాదీ జాన్‌గా ఉంటూ అమాయకులను అతి దారుణంగా గొంతుకోసి చంపుతున్నాడట. ఇతడి గురించి సంక్షిప్త వివరాలు ఓసారి పరిశీలిస్తే.. సిద్ధార్థ తొలుత ఓ బ్రిటన్ హిందువు. ఇస్లాం మతంలోకి మారాక అతడి పేరును అబు రుమాయ్‌సాగా మార్చుకున్నాడు. ప్రస్తుతం బ్రిటన్ టెర్రరిస్టు ఆర్గనైజేషన్ అల్ ముహాజిరౌన్ అనే విభాగానికి నడిపిస్తున్న వారిలో కీలకంగా పనిచేస్తున్నాడు. బ్రిటన్‌లో ఓ కేసులో అరెస్టయి బెయిల్‌పై విడుదలైన అనంతరం సిరియాకు తన భార్య, పిల్లలతో కలిసి పారిపోయి ఐసిస్‌లో చేరాడు. 2015లో డ్రోన్ దాడిలో మహ్మద్ ఎమ్వాజీ(జిహాదీ జాన్) హతమవడంతో అతడి స్థానంలో సీనియర్ కమాండర్‌గా కొనసాగుతున్నాడు. 2016 నుంచి బందీలుగా ఉగ్రవాదులు పట్టుకున్న వారందరిని గొంతు కోసి చంపిన వ్యక్తి ఇతడే అని అమెరికా తాజాగా గుర్తించింది. -
హిట్లర్‌పై భారత జిహాదీ ప్రశంసలు
లండన్: భారత సంతతికి చెందిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది సిద్ధార్థ ధార్ జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. 'జిహాదీ సిద్'గా పేరుబడ్డ అతడు తాజాగా వెలుగుచూసిన ఓ వీడియోలో హిట్లర్‌ను కొనియాడాడు. తన స్వగతం చెప్పుకొంటున్నవిధంగా ఉన్న ఈ వీడియోను 2014లో అతను యూట్యూబ్‌లో అప్లోడ్ చేశాడు. ఇందులో యూదులు, యూదుమతవాదంపై తీవ్ర విద్వేషాన్ని వెళ్లగక్కాడు. 'వారి విషగ్రంథాలను ఇతర వ్యక్తులు సైతం పసిగట్టి.. వాటిని నిలువరించేందుకు ప్రయత్నించారు. అందులో హిట్లర్ కూడా ఉన్నారు' అంటూ జర్మనీ నియంతను అతను కొనియాడాడు. 1909 నాటి 'ప్రోటోకాల్స్ ఆఫ్ ద ఎల్డర్స్ ఆఫ్ జియాన్' గ్రంథం ప్రపంచవ్యాప్తంగా యూదుల ఆధిపత్యాన్ని ప్రబోధించిందని, మానవత్వంపై యుదులకున్న విద్వేషాన్ని ఇది చాటుతోందని అతను పేర్కోన్నాడు. 32 ఏళ్ల జిహాది సిద్ గతంలో బ్రిటన్‌లో సేల్స్ మన్‌గా పనిచేశాడు. బంధీల తలలు నరికిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల్లో ఇతడు కూడా ఉన్నట్టు అనుమానిస్తున్నారు.