హిట్లర్‌పై భారత జిహాదీ ప్రశంసలు
లండన్: భారత సంతతికి చెందిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది సిద్ధార్థ ధార్ జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. 'జిహాదీ సిద్'గా పేరుబడ్డ అతడు తాజాగా వెలుగుచూసిన ఓ వీడియోలో హిట్లర్‌ను కొనియాడాడు. తన స్వగతం చెప్పుకొంటున్నవిధంగా ఉన్న ఈ వీడియోను 2014లో అతను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు. ఇందులో యూదులు, యూదుమతవాదంపై తీవ్ర విద్వేషాన్ని వెళ్లగక్కాడు.
'వారి విషగ్రంథాలను ఇతర వ్యక్తులు సైతం పసిగట్టి.. వాటిని నిలువరించేందుకు ప్రయత్నించారు. అందులో హిట్లర్ కూడా ఉన్నారు' అంటూ జర్మనీ నియంతను అతను కొనియాడాడు. 1909 నాటి 'ప్రోటోకాల్స్ ఆఫ్ ద ఎల్డర్స్ ఆఫ్ జియాన్' గ్రంథం ప్రపంచవ్యాప్తంగా యూదుల ఆధిపత్యాన్ని ప్రబోధించిందని, మానవత్వంపై యుదులకున్న విద్వేషాన్ని ఇది చాటుతోందని అతను పేర్కోన్నాడు. 32 ఏళ్ల జిహాది సిద్ గతంలో బ్రిటన్‌లో సేల్స్ మన్‌గా పనిచేశాడు. బంధీల తలలు నరికిన ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదుల్లో ఇతడు కూడా ఉన్నట్టు అనుమానిస్తున్నారు.